పుస్తకం
All about booksపుస్తకభాష

August 28, 2018

పుంజీడు పుస్తకాలు-1 : చలం ఉత్తరాలు

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: పాలపర్తి ఇంద్రాణి

*************

చలం ఉత్తరాలు (చింతా దీక్షితులు గారికి)

ఈ ఉత్తరాలన్నీ చలం గారు,చింతా దీక్షితులు గారికి ఇంగ్లీషులో  రాసినవి. వీటిని మళ్ళా చలం గారే తెలుగు చేశారు.
ఇతరులని గాయపరుస్తాయన్నవి, అధికార్లని పేరువరుసలుగా తిట్టిన తిట్లు, రెండు,మూడు బూతులు తప్ప తక్కినదంతా ఉన్నది ఉన్నట్లుగా తెలిగించాను- అని రాశారు చలం గారు.
 తన రచనల మీద పత్రికల్లో వస్తున్న వ్యాఖ్యల గురించి (పత్రికల్లో ఆయన కథల మీద వచ్చే వ్యాఖ్యలు ఆయనకు చాలా ఉల్లాసాన్ని కలిగిస్తాయట), చిల్లరమల్లర వ్యక్తిగత విషయాలు, బలమైన తన అభిప్రాయాలు, ఇష్టాఇష్టాలు, ఆయన తిరిగిన ఊళ్ళు,  ఆయన రోజువారీ జీవితం వగైరాలతో చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఉత్తరాలు.
కృష్ట శాస్త్రి ఊర్వశి గురించి:

దేశం ఇట్లానే గొడ్డు పోయి,ప్రస్తుతం వచ్చిన గ్రంధాలకన్నా  గొప్పవి రాకపోతే తప్ప,1900 సంవత్సరం తరువాత ప్రచురించిన పుస్తకాలలో ఒక్కటి కూడా నిలవదు– అని రాస్తారో చోట.
ఆనాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేకపోవడం గురించి:

చలం గారి మాటలకి నవ్వు రాక మానదు.  యోగి అయ్యి ఉద్ధరిస్తారట లోకాన్ని 🙂 :
మెదడు సరిగా తలలో ఉన్న మనిషి ఎవడూ ఆయనకు బహుమానం ఇయ్యాలనుకోడట!

ఇదిగో ఆయన జీవిత సమస్య. చాతనైతే మీరూ విప్పండి 🙂 :
నాకు చాలా చాలా నచ్చి,నవ్వులు పూయించిన మాటలు:
ఒకటే కథలు,వ్యాసాలు వ్రాయాలని జ్వరంలాగు పట్టుకుంది. నా నీరసమైన శరీరమే అభ్యంతరపరచకపోతే, ఎంత వ్రాద్దునో?  ఇట్లాంటి వ్రాత జ్వరం మీ అనుభవంలోనూ ఉండి ఉంటుంది. ఆ ఆవేశం మనని పట్టిందా,  ఆట,  వ్యాయామం, పిల్లలు, సౌఖ్యం, అన్నీ వదిలి, చమటోడ్చి పని చేసి, మన మనసు లోపలిదంతా బయటికి వెలిబుచ్చుతాము. పర్యవసానం? ఏ తుక్కు పత్రికాధిపతో  దాన్ని తప్పులతో ప్రచురించడానికి కటాక్షిస్తాడు. ఏ ఆవలించే పాఠకుడో అక్కడా, ఇక్కడా కొంచెం చూసి, పుస్తకం కింద పారేసి అటు తిరిగి నిద్రపోతాడు.      
చలంలాటి మనిషి ఈ తెనుగు దేశంలో పుట్టాడా,ఇలాంటి తేట తేట అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించాడా అంటే ఎన్నేళ్ళైనా నాకు తీరని ఆశ్చర్యం. చలాన్ని దగ్గరగా తెలుసుకోవాలని  భావించే అభిమానులకు తప్పక నచ్చుతుందీ చిన్ని పొత్తం.
****
(ఇలాంటిదే మరొకటి “చలం ఉత్తరాలు -వీరేశలింగం గారికి” గురించి గతంలో పుస్తకం.నెట్లో వచ్చిన Halley వ్యాసం ఇక్కడ చూడండి.


About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

చలం గారి ఉత్తరాలు వీరేశలింగం గారికి

వ్యాసకర్త: Halley ******* నేను చలం గారి రచనలు పెద్దగా చదివింది లేదు. “మైదానం” చదివాను ఎప్పు...
by అతిథి
8

 
 

అసాధారణ రచయిత – చలం గురించి నండూరి

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. చ...
by అతిథి
17

 
 

పురూరవుడూ, శారదా శ్రీనివాసన్ గారూ, చలం, నేనూ!

అనగనగా ఓరోజు ప్రొద్దుటూరులో పెళ్ళికెళ్ళి, బోరు కొట్టి, రోడ్లను సర్వే చేస్తూ ఉంటే, ఓ ప...
by సౌమ్య
14

 

 

ప్రేమలేఖలు – చలం

వ్యాసం రాసి పంపిన వారు: రమణి చలం గారి ప్రేమలేఖలు గురించి రాయడానికి కొంచం సాహసం చేసాన...
by అతిథి
13

 
 
శశిరేఖ – చలం

శశిరేఖ – చలం

రాసి పంపిన వారు: నరేష్ నందం, హైదరాబాదు గుడిపాటి వెంకటాచలం పేరు తెలియని తెలుగు భాషాభి...
by నరేష్ నందం
10

 
 

చం’చలం’-మైదానం

వ్యాసం రాసి పంపినవారు: సింధు “అక్కా, చలం ‘మైదానం’ movie గా వచ్చిందా?” అక్క : లేదనుకు...
by అతిథి