అపరిచితుడి ఆంతరంగిక మథనం ‘The Stranger’ – By Albert Camus

వ్యాసకర్త: భవాని ఫణి
***************
సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన రెండో అతి చిన్న వయస్కుడు ఆల్బర్ట్ కామూ. అతడు ఫ్రెంచ్ భాషలో రాసిన ఈ నవల, బ్రిటిష్ ఇంగ్లీష్ లో రెండు సార్లూ, అమెరికన్ ఇంగ్లీష్ లో రెండు సార్లూ మొత్తం నాలుగుసార్లు ఇంగ్లీష్ లోకి అనువదించబడింది. నేను చదివింది మాత్రం 1988లో మాథ్యూస్ వార్డ్ చేసిన అమెరికన్ ఇంగ్లీష్ అనువాదం ‘ద స్ట్రేంజర్’ (The Stranger). బ్రిటిష్ ఇంగ్లీష్ అనువాదం పేరు ‘ది అవుట్ సైడర్’ (The Outsider).

ప్రతి మనిషిలోనూ మంచీ – చెడూ రెండూ ఉంటాయి. సామాన్యంగా మనం మన మంచి ముఖాన్ని మాత్రమే ఎదుటివారికి చూపడానికి ఇష్టపడతాం. ఇక్కడ ‘మంచి’ అనేది ఆయా సమూహాల చేత ఆమోదింపబడిన సూత్రాల ఆధారంగా నిర్వచింపబడుతుంది.సమూహపు అంగీకారం కోసం, ఒక్కోసారి మనం మనకు ఇష్టంలేని పనులు చేస్తుంటాం. చేయదలుచుకున్న వాటిని ఆపేస్తుంటాం. ఏ మనిషీ, ఎల్లవేళలా అందరికీ నచ్చేటట్టుగా ప్రవర్తించలేడు. ఒక్కోసారి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మెజారిటీ జనానికి అర్థరహితంగా అనిపించే అవకాశం ఉందని తోచినప్పుడు, అతను ఆ ఇష్టాన్ని అణిచిపెట్టి, ఎదుటివారికి ఏది నచ్చుతుందో అదే చేసే, లేదా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. దీన్నే ఇంకొంచెం ముందుకెళ్లి, మెటాఫరికల్ గా ‘స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్’ అని కూడా అనెయ్యచ్చేమో. కానీ ఈ నవలా నాయకుడు మీర్ సాల్ట్, అందుకు ఒప్పుకోలేదు. తనకి తోచినట్టుగా చేయడం, అలా చేయాలనిపించిందని చెప్పడం – ఎందుకు తప్పో అతనికి అర్థం కాలేదు. అందుకే అతడు సమూహం చేత అంగీకరింపబడలేదు. ఇంకా చెప్పాలంటే బహిష్కరించబడ్డాడు కూడా. అంతేకాక, జీవించే అర్హతను సైతం కోల్పోయాడు. వారికి ఒక స్ట్రేంజర్ గా, బయటి వ్యక్తిగా మిగిలిపోయాడు. నిజానికి సమూహమే అతడికి అర్థం కానంత కొత్తగా ఉండిపోయింది.

ఇక్కడ కథ, రెండు ప్రధానమైన అంశాలను కలుపుకుని సాగుతుంది. అవి రెండూ అతను చేసిన నేరాలు. ఒకటి చట్టపరమైనదైతే, రెండోది సమాజం దృష్టిలో నేరంగా భావించబడినది. నిజానికి మీర్ సాల్ట్ కు మానసికమైన స్పందనల కంటే, శారీరకమైన స్పందనల తీవ్రత ఎక్కువ. అది అతడి మనస్తత్వం. అతడు తన చుట్టూ ఉన్న మనుషుల్ని జడ్జ్ కూడా చెయ్యడు. తన జీవితం తనకి తోచినట్టుగా ఎలా గడుపుతాడో, మిగిలిన వాళ్ళు కూడా అలాగే గడుపుతారని భావిస్తాడు. కానీ అతను మాత్రం, చేసిన నేరానికి కాక, చెయ్యని నేరానికి శల్యపరీక్ష చేయబడి, శిక్షకు గురవుతాడు.

మీర్ సాల్ట్, అప్పటి ఫ్రెంచ్ అల్జీరియా దేశంలో నివసిస్తున్న ఫ్రెంచ్ కాలనిస్ట్, చిరుద్యోగి; పోషించే స్థోమత లేని కారణంగా తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించి, తన జీవితాన్ని తనకు తోచినట్టుగా గడుపుతుంటాడు. అతని తల్లి చనిపోయినట్టుగా, ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి టెలిగ్రామ్ రావడంతో కథ మొదలవుతుంది. నిజానికి ఆ విషయం తెలిసాకా మీర్ సాల్ట్ ఆలోచించింది తల్లిని గురించి కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్ ఎంత దూరంలో ఉంది? తనక్కడికి ఎలా వెళ్లాలి? ఎప్పుడు బయలుదేరాలి? బాస్ ను సెలవు ఎలా అడగాలి? వంటి ప్రాక్టికల్ విషయాలకు చెందిన ఆలోచనలే అతనికి కలుగుతాయి. అది మొదలుకుని, ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లినా, కేర్ టేకర్ తో కబుర్లు చెప్పినా, అతడితో కలిసి సిగరెట్ కాల్చి, టీ తాగినా, తల్లి భౌతిక కాయాన్ని ఉంచిన గదిలో, తల్లి స్నేహితులతో కలిసి రాత్రంతా గడిపినా, తరువాతి రోజు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నా – అతను గమనించింది కేవలం పరిసరాలనీ, అనుభవించింది వాతావరణంలోని మార్పుల్నీ మాత్రమే. తర్వాతి రోజు అతను మేరీ అనే అమ్మాయిని కలవడం, ఆమెకు దగ్గరకావడం కూడా అనుకోకుండా జరిగిపోతాయి. ఆ అమ్మాయితోనూ, మరికొందరు కొత్తా పాతా స్నేహితులతోనూ కలిసి, అతని జీవితం కొంతకాలం పాటు ఎటువంటి ఒడిదుడుకులూ లేకుండా సాఫీగానే సాగిపోతుంది.

కానీ ఓ దురదృష్టకరమైన రోజు, తన స్నేహితుడి శత్రువైన ఒక అరబ్ ను బీచ్ లో కాల్చి చంపేస్తాడు మీర్ సాల్ట్. తనపై దాడి చేయడంతో, ఎండా వేడీ కలిసిన ఉక్కబోత వాతావరణం వలన కలిగిన చికాకులో, తన దగ్గర ఉండిపోయిన స్నేహితుడి గన్ తో అతడు ఆ వ్యక్తిని కాలుస్తాడు. కానీ అతడు అరబ్ ను ఎందుకు చంపాడన్న విషయంలోని లాజిక్ ఎవరికీ పూర్తిగా అర్థం కాదు. మీర్ సాల్ట్, ఆ వ్యక్తిని హత్య చేయడానికి కారణం, అతనిలోని రాక్షసత్వమేననీ, తల్లి చనిపోయినప్పుడు కూడా ఏడవకపోవడమే అందుకు సాక్ష్యమనీ నిర్ధారింపబడుతుంది. ఏ మాత్రమూ మానవత్వం లేని కారణంగా, బ్రతికేందుకు అర్హత లేని మనిషిగా అతడు తీర్మానింపబడతాడు. కోర్టు అతనికి ఉరిశిక్ష విధిస్తుంది. ఇక్కడ మీర్ సాల్ట్ కు, తల్లి చనిపోయినప్పుడు బాధ కలగకపోవడం సహజం కాకపోవచ్చు; కానీ నేరం కాదు కదా. అలాగని అతడు నేరం చేయలేదని కాదు. అరబ్ ను చంపడం ఖచ్చితంగా అతను చేసిన నేరమే. కానీ, విచారణ ఆ కోణంలో కాకుండా, తల్లి మరణించినప్పుడు, అతడు ప్రవర్తించిన తీరును ఆధారంగా చేసుకుని సాగుతుంది.

కథాంశంతో పాటుగా, ఇందులో వాడిన వచనం కూడా ఈ నవలకు మరో ప్రధాన ఆకర్షణ. సూటిగా, సరళంగా సాగుతూనే, తీవ్రంగా మనసు పైన ముద్ర వేయగల సత్తా గల వచనం రచయితది. కథ, మీర్ సాల్ట్ కోణంలో నుండి చెప్పబడుతుంది. మీర్ సాల్ట్ వెంట మనల్ని తీసుకెళ్లి, అతని ద్వారా మనకు లోకాన్ని చూపిస్తాడు కామూ. మీర్ సాల్ట్ ఆలోచనల్లో, డిటాచ్ మెంటూ, తర్కం కోసం వెతకని సింప్లిసిటీ ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా అతని ప్రవర్తనలో నిజాయితీ ఉంటుంది. హత్య జరగక ముందు వరకూ, తన ప్రవర్తన సరైనదో కాదోనన్న కొద్దిపాటి సంకోచం అతని ఆలోచనల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ హత్యా నేరం మీద జైలుకు వెళ్ళిన తర్వాత నుండి మాత్రం, అతడు మరింతగా అంతర్ముఖుడైపోతాడు. హత్య , అనుకోకుండానే చేసినప్పటికీ, తన చేతుల మీదుగా ఒక మనిషి ప్రాణం పోయిందన్న భావన గానీ, ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి చెందిన ఆలోచనలు కానీ ఒక్కసారి కూడా మీర్ సాల్ట్ కు రావు. అతనికి ఉరి శిక్ష పడ్డాక, జైలుకు చెందిన మతగురువు, ‘నీ జీవితం మరోలా ఉంటే బావుంటుందని నీకెప్పుడూ అనిపించలేదా?’ అని అడిగినప్పుడు కూడా, మరింత ధనాన్నో, మరింత బాగా ఈత కొట్టే సామర్ద్యాన్నో, లేక మరింత అందమైన ముక్కు నో పొందడం కంటే పెద్ద ప్రత్యేకమైన జీవితమేమీ అక్కర్లేదని చెబుతాడు. తనను ఎంతగానో ప్రేమించానని చెప్పిన అమ్మాయి మేరీ నుండి కూడా, అతడు శారీరకమైన సౌఖ్యాన్నో లేక ఒంటరితనంలో కావాలనిపించే సాన్నిహిత్యాన్నో మాత్రమే కోరుకుంటాడు. జైలు గదిలో ఉన్న రోజుల్లో అతని ఆలోచనలు అల్లిబిల్లి దారాల్లా చిక్కులుపడి ఉన్నప్పటికీ, అతని మానసిక స్థితిలోని వైవిధ్యమైన పరిణితి మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. ఆ గజిబిజి ఆలోచనల్లోంచి, ఓ వింత అందం పుట్టుకొచ్చి, అంతటా పరుచుకుంటుంది. కథలోని ఆ భాగమే, నవల మొత్తాన్నీ మనం మరింతగా ఓన్ చేసుకునేలా చేస్తుంది. తత్వ పరంగా అబ్జర్దిటీని ఇష్టపడే కామూ, తన కథానాయకుడి నిజాయితీ ద్వారానూ, సహజత్వం ఉట్టిపడే తన వచనం ద్వారానూ, ఈ రచన నిండా వింత సౌందర్యాన్ని నింపాడు.

కామూ, ఈ పుస్తకం గురించి ఇలా చెప్పాడు: “తన తల్లి అంత్యక్రియలప్పుడు ఏడవని వ్యక్తికి, మరణ దండన ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నవలా నాయకుడు, అందరితో పాటుగా కలిసి సాగిపోవడానికి అంగీకరించకపోవడం వల్లనే శిక్షింపబడ్డాడు”

You Might Also Like

6 Comments

  1. Anil Kumar Srikanti

    దీనికి సమానమైన తెలుగు నవల పేరు చెప్పి పుణ్యం కట్టుకోండి…ఐ డోంట్ రీడ్ english

  2. Bhavani Phani

    Nice discussion Lalitha garu

  3. శిష్ట్లారామకృష్ణ

    యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన “అంతర్మిఖం” బహుశ కామూ The Outsider నవలకు అనుసరణేమో!!?

    1. Bhavani Phani

      అవునండీ

  4. Lalitha

    I feel like sharing a discussion I had on this book. My close friend introduced me to her friend and through her to some books. I might not have read ‘The Stragnger’ till end if I picked it myslef.
    I am going to present main thoughts in our discussion as my words (me) and my book friend’s (friend) words. I find her thoughts / explanations to my observations so apt.

    ME: As for the book itself, it was alright. It looked to me like this man could go on the way he went on because his life was relatively less complicated. No doubt it was mostly so because it was his choice to let it be so.
    But what if Marie had become his wife by the time the incident happened? What if he had children? He does really seem like a difficult man to be living with, if Marie did get married to him. She was not like him. As she said herself, the reason she was drawn to him could later become the reason she will want to run away from him later.
    From what I understand, this man is like Ram Gopal Varma.

    FRIEND: He seemed to me so sterile in his way of being that nothing mattered at all. Because of that he could be almost inert in any environment. And yes he could also therefore be “in the truth”. However the fact that he could kill on that slightest of provocation, whether it be the heat or the irritation of the moment, and the fact that he was disengaged from life itself, made him almost tip over to the side of evil. His truth, though truth, was far from the truth of the sages, which is an enlightened truth.
    Though he could see the truth it was with a brutality, unlike the truth seen with compassion. He was a completely unfeeling man though he was so articulate about his feelings.

    ME: Exactly my thoughts, only better expressed. One difference may be that I wouldn’t consider the word ‘truth’ for his view or lack of it. Inert and sterile seem to be accurate descriptions. But he didn’t seem to lack feelings, going by his frustration with prison chaplain. He insisted despite the man’s disliking. Then he reacted. He could adapt to his life being taken away because according to him it was a certainty. So I believe that if he lived long enough, he might have had to face occasions when he cannot be so certain and would have frustration and have to deal with consequences that are not so clear and certain.

    FRIEND: He didn’t ‘lack feelings’, he simply was ‘unfeeling’.

    And I don’t think there was certainty in his life at all, already. All the arguments he gave (to the reader) about it was simply one more instance of his worldview. So yes had he been cornered by life in the future, he may have broken, but he was already in many situations where others might already have done so, but he did not. I don’t think he might be broken that easily, even given future hypothetical situations with wife and children. But then that is another snapshot of something else. I think the author did a marvelous, absolutely marvelous, job of showing us a particular, thankfully much uncommon, worldview through him. It was almost an anarchic worldview to my mind. Would be frightening if it were not trapped within the pages of a book. Even evil, as we know it, is rosy comparatively! Because evil also needs companionship, to be able to be itself. He was so want-less. So disconnected as to be almost less than human.

    1. Anil Kumar Srikanti

      మీ దగ్గర వుందా బుక్?

Leave a Reply