My Name Is Lucy Barton – Elizabeth Strout

వ్యాసకర్త: Nagini Kandala
**********

గతం, వర్తమానం, భవిష్యత్తు … వీటి ప్రస్తావన వచ్చినప్పుడు వర్తమానంలో అంటే ఈ క్షణంలో బ్రతకడం అవసరం అని అనడం చూస్తూ ఉంటాం. కానీ గతం ఛాయలు ప్రతిఫలించకుండా వర్తమానంలో బ్రతకడం చెప్పినంత తేలికేనా ఆచరించడం? మనిషిని ఒక మట్టిముద్దనుంచి ఒక పరిపూర్ణమైన ఆకృతిలోకి తీసుకురావడంలో గతం పాత్ర చాలా కీలకమైనదీ, విస్మరించలేనిదీను. ఒక మనిషి గురించి పూర్తిగా తెలియాలంటే వారి గతం గురించి తెలియాలి. కానీ భావోద్వేగాల్ని బయటపెట్టడం అనాగరికత అనీ, అది ఒక మానసిక బలహీనత అనీ, సంతోషం, దుఃఖం, అభద్రత, భయాలూ లాంటివాటిని ఒక చిరునవ్వుతో నాగరికత ముసుగులో దాచుకోవాలని చెప్తున్న నేటి సంస్కృతిలో ఒక మనిషిని ఒక్కసారి చూసి, ఉపరితలం మీద వేసుకున్న సంస్కారం, నాగరికత ముసుగుల్లోనుంచి అంచనా వెయ్యడం అసలు సాధ్యమేనా? Olive Kitteridge అనే కథల సంకలనానికిగాను 2009 లో Pulitzer Prize గెలుచుకున్న అమెరికన్ రచయిత్రి ఇటీవలి రచన ‘My Name Is Lucy Barton’ ఆ సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తుంది. ఈ పుస్తకం 2016 Man Booker ప్రైజ్ లాంగ్ లిస్ట్ గా ప్రకటించిన 13 నవలల్లో ఒకటిగా నిలిచింది. ఈ పుస్తకం మనిషి అస్థిత్వం మీద ప్రాంతీయ, ఆర్థిక, సామాజిక, భాషాపరమైన అంశాలు చూపించే ప్రభావాన్ని గురించి విపులంగా చర్చిస్తుంది.

పేదరికం, ఒంటరితనం మధ్య అతి చేదైన బాల్యం గడిపిన లూసీ భర్త, ఇద్దరు పిల్లలతో (5ఏళ్ళు, 6 ఏళ్ళు) న్యూయార్క్ లో ఒక రచయిత్రిగా స్థిరపడుతుంది. లూసీ ఒక అంతుబట్టని ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్ లో ఉన్న సమయంలో ఆమె తల్లి ఐదు రోజులకుగాను ఆమెకు తోడుగా రావడం, ఆ సందర్భంలో తల్లి కూతుళ్ళ మధ్య జరిగే సంభాషణలతో narration మొదలవుతుంది. ఇందులో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు.. లూసీ అనుభవాల్ని చాలా వరకూ వారిద్దరి మధ్య జరిగే సంభాషణలు, ఆ తదుపరి సంఘటనలే చెప్తాయ. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న లూసీ తండ్రికి లూసీ జర్మన్ నేపథ్యం కలిగిన విలియం ను పెళ్లి చేసుకోవడం పట్ల కలిగిన విముఖత కారణంగా వారి మధ్య చాలా ఏళ్ళగా సత్సంబంధాలు ఉండవు. మళ్ళీ చాలా కాలానికి కలిసిన తల్లి-కూతుళ్ల ఆలోచనల్లో ఉండే వైరుధ్యం, తల్లి తన ప్రక్కనే ఉండటం వల్ల చాలా రోజులకి ప్రశాంతంగా నిద్రపోయానని లూసీ చెప్పడం, తల్లి ఆమెకు తెలిసిన కొందరు వ్యక్తుల పర్సనల్ లైఫ్ గూర్చి లూసీకి చెప్పడం.. ఇలా చాలా మాములుగా, కొన్ని చోట్లయితే ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకునే గాసిప్స్ వింటున్నట్లు ఉంటుంది.

మన సినిమాల్లో పల్లెటూరు నుంచి పట్టణం వెళ్లిన తొలినాళ్లలో మన హీరోలు, హీరోయిన్లు పడే ఇబ్బందులు, ఎదుర్కునే అవమానాలు,అక్కడ ఇమడలేక పడే బాధ ఇవన్నీ ఒక ఫన్నీ టోన్ లో చెప్పడం చూస్తుంటాం. కానీ నిజానికి ఆ అనుభవాలు హాస్యాస్పదంగానే ఉంటాయా? పంచె కట్టు, వేషభాషలు చూసి పట్టణ నాగరికులు చేసే ఛీత్కారాలు జీర్ణించుకోవడం సులభమేనా? గొప్ప గొప్ప విషయాలు చర్చించే నలుగురి మధ్య అజ్ఞానంతో మౌనంగా చూస్తూ ప్రేక్షకపాత్ర వహించేవారికి గౌరవం దక్కుతుందా? ఇలాంటి చాలా ప్రశ్నలు మనం ఈ పుస్తకం చదువుతుంటే మన మనసులో మెదులుతాయి.

“Looking back, I imagine that I was very odd, that I spoke too loudly, or that I said nothing when things of popular culture were mentioned; I think I responded strangely to ordinary types of humor that were unknown to me. I think I didn’t understand the concept of irony at all, and that confused people.”

అమెరికన్స్ అంటే ఆధునికతకి మారుపేరు అని భావించేవారికి అమెరికా అయినా, ఇండియా అయినా, మరో దేశం అయినా గ్రామీణ ప్రాంతాల వారు అన్ని చోట్లా ఉంటారనీ, వారు కూడా మహానగరాల్లో నివసించవలసి వచ్చినప్పుడు ఒక సగటు మనిషిలాగే ఆలోచిస్తారనీ లూసీ ఆలోచనలు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది.

“And a look went across his face—so fast, so involuntary—that was a look of real distaste. I had not yet learned the depth of disgust city people feel for the truly provincial.”

“I have said before: It interests me how we find ways to feel superior to another person, another group of people. It happens everywhere, and all the time. Whatever we call it, I think it’s the lowest part of who we are, this need to find someone else to put down.”

ఈ నవలలో ప్రత్యేకత ఏంటంటే కథ, కథనం రెండూ కూడా అమెరికన్ వ్యావహారిక శైలికి చాలా విరుద్ధంగా అనిపించాయి. కొన్ని చోట్ల భావోద్వేగాలు, సున్నితత్వం పాళ్ళు పరిధికి మించి ఉన్నాయేమో అనిపించింది. అడుగడుగునా లూసీ మనసులో ఒంటరితనం, పూరించలేని ఖాళీ మనకి అవగతమవుతుంటుంది. ఆమె వ్యక్తిత్వం పై ఆమె కఠినమైన బాల్యం చూపించిన ప్రభావాన్ని అధిగమించడంలో ఆమె ఓటమి (మానసికంగా) స్పష్టంగా కనిపిస్తుంది. కానీ నేను ఈ ప్రపంచానికి చెందను అనే భావన ఎదురైన ప్రతిసారీ లూసీ Belongingness కోసం పడే తపన, ఆ సంఘర్షణ లూసీది మాత్రమేనా అనే అనుమానం మనకి కలగకపోదు. జీవితంలో ఏదో ఒక స్టేజ్ లో ప్రతి మనిషి తన వర్తమానాన్ని, గతానికి ముడిపెట్టాలని చేసే విఫలయత్నం తాలూకు సంఘర్షణ అందరికీ అనుభవమే కదా అనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలనుంచి వచ్చి మహానగరాల్లో, పెద్ద ప్రపంచంలో తమ అస్థిత్వాన్ని చాటుకున్న అనుభవం ఉన్నవారూ, లేదా ప్రయత్నిస్తున్న వారూ ఈ నవలకి బాగా కనక్ట్ అవుతారు.

మొదట్నుంచీ పల్లెల అనుభవం లేని నాకు కొన్ని చోట్ల ఏంటి మరీ ఈ పిరికితనం అనీ, కొన్ని చోట్ల సాగదీతగా అనిపించిన మాట వాస్తవం. లూసీ బాల్యం ఇటీవల చదివిన ‘The Glass Castle‘ ను గుర్తుకు తెచ్చినా, Jeannette Walls లో ఉండే పోరాడేతత్వం లూసీ లో అణుమాత్రమైనా కనిపించదు. కొన్ని చోట్ల లూసీ తనకి వైద్యం చేసిన Jewish డాక్టర్, neighbour Jeremy, writer Sarah Payne లాంటి కొందరు అపరిచితుల్లో స్నేహం, సాన్నిహిత్యం వెతుక్కోవడంలో ఐడెంటిటీ క్రైసిస్ కనిపిస్తుంది.

“I have sometimes been sad that Tennessee Williams wrote that line for Blanche DuBois, “I have always depended on the kindness of strangers.” Many of us have been saved many times by the kindness of strangers, but after a while it sounds trite, like a bumper sticker. And that’s what makes me sad, that a beautiful and true line comes to be used so often that it takes on the superficial sound of a bumper sticker.”

రచయిత్రి అవ్వాలంటే కరుకుదనం ఉండాలనీ, సున్నితత్వం, compassion లాంటివి పనికి రావనే కొందరి అభిప్రాయం లూసీకి వింతగా అనిపిస్తుంది.

Jeremy sat down beside me on the stoop. “Artists are different from other people”
“No. They’re not.” My face flushed. I had always been different; I did not want to be any more different.
“But they are.” He tapped my knee. “You must be ruthless, Lucy.”

He spoke of her work, saying that she was a good writer, but that she could not stop herself from a “softness of compassion” that revolted him, that, he felt, weakened her work.

మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యం, సెన్సిటివ్ గా ఉండకూడదు, ఎమోషనల్ అవ్వకూడదు, ఇలా కొన్ని నిర్దిష్టాభిప్రాయాలు ఉన్నవారు ఈ నవల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ నవల్లో మనల్ని ఉత్తేజింపజేసే అంశాలు దాదాపు ఏమీ ఉండవు. గెలుపోటములు అసలే ఉండవు. ఉపన్యాసాలు ఉండవు. కేవలం ఒక మామూలు వ్యక్తి మన ప్రక్కన కూర్చుని మనతో తన భయాలు, బాధలు, అవమానాలు, చిన్న చిన్న ఆనందాలు పంచుకుంటున్నట్లుంటుంది. హాస్పిటల్ కిటికీ లోంచి దేదీప్యమానంగా మెరుస్తున్న Chrysler Building ను చూస్తూ, ఇంత పెద్ద ప్రపంచంలో తన ఉనికిని మనకి చెప్పాలని చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఆమె ‘నా పేరు లూసీ బార్టన్’ అని మనకి తనని తాను పరిచయం చేసుకుంటుంది.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన లైన్స్,
In spite of my plenitude, I was lonely. Lonely was the first flavor I had tasted in my life, and it was always there, hidden inside the crevices of my mouth, reminding me. He saw this that day, I think. And he was kind.

The Puritanism of my ancestors has not made use of conversation as a source of pleasure, the way I have seen other cultures do.

It’s not my job to make readers know what’s a narrative voice and not the private view of the author,”

He said, “What is your job as a writer of fiction?” And she said that her job as a writer of fiction was to report on the human condition, to tell us who we are and what we think and what we do.

“He was famous.”“He was. He was so famous, he died from it.”“He died from drugs, Lucy.”“But that would be the loneliness thing, Mom. From being so famous. Think about it: He couldn’t go anywhere.

Sarah Payne said, If there is a weakness in your story, address it head-on, take it in your teeth and address it, before the reader really knows. This is where you will get your authority, she said, during one of those classes when her face was filled with fatigue from teaching. I feel that people may not understand that my mother could never say the words I love you. I feel that people may not understand: It was all right.
Sarah Payne had said at the writing class in Arizona. “You will have only one story,” she had said. “You’ll write your one story many ways. Don’t ever worry about story. You have only one.”


At our small wedding reception she said to a friend of hers, “This is Lucy.” She added, almost playfully, “Lucy comes from nothing.”I took no offense, and really, I take none now. But I think: No one in this world comes from nothing.

But I know that money is a big thing, in a marriage, in a life, money is power, I do know that. No matter what I say, or what anyone says, money is power.

My more tenderhearted daughter, Becka, said to me during this time, “Mom, when you write a novel you get to rewrite it, but when you live with someone for twenty years, that is the novel, and you can never write that novel with anyone again!”

You Might Also Like

Leave a Reply