పుస్తకం
All about booksపుస్తకభాష

June 27, 2016

The Glass Castle

More articles by »
Written by: అతిథి
Tags: ,
వ్యాసకర్త: Nagini Kandala
**********
మనిషి మనుగడకి అవసరమైనవి ఏమిటి అని ఎవరైనా అడిగితే ముందుగా రోటీ,కపడా ఔర్ మకాన్ అంటాము. మరి కడుపు నిండాకే కళలైనా,కలలైనా అనేవాళ్ళు నూటికి తొంభై. ఉహూ తొంభై తొమ్మిది మందైతే, ఆ రెండింటి తరువాతే మిగిలినవి అనే ఆ అరుదైన ఒక్క శాతంలోకి వస్తారు రెక్స్, మేరీ లు. నలుగురు సంతానానికి తల్లి అయినా ఆ బాధ్యతను తీసుకోడానికి ఇష్టపడని మేరీ ఒక పెయింటర్ గా self-absorbed జీవితాన్ని గడుపుతుంటుంది. అలాగే ఒక అద్దాల మేడ కట్టాలనే కలని సాకారం చేసుకోవాలని ఒక్క చోట కూడా స్థిరమైన ఉద్యోగం చెయ్యకుండా, తెలివితేటలు ఎన్నున్నప్పటికీ వైవిధ్యమైన పనులు చేస్తూ మద్యం వ్యసనం బారినపడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాడు రెక్స్. Conformity,Commitment కి పూర్తిగా వ్యతిరేక మార్గంలో వైపు ప్రయాణిస్తూ, సమాజం కట్టుబాట్లు, అథారిటీ ని ఒప్పుకోని ఇద్దరు misfits, Rex Walls మరియు Rose Mary దంపతుల రెండో సంతానం Jeannette Walls రాసిన memoir ఈ ‘Glass Castle’ లివింగ్ కీ సర్వైవింగ్ కీ ఉన్న తేడాని, అందులో సాధక బాధకాల్నీ స్పష్టంగా చూపిస్తుంది. ఇది వాల్స్ నలుగురు పిల్లలు వరుసగా Lori, Jeannette, Brian, Maureen ల దుర్భరమైన బాల్యాన్ని మనకు కళ్లకుకట్టినట్లు వర్ణిస్తుంది.

సహజంగా సృజనాత్మకత కలవారు నిజజీవితంలో చాలా సంక్లిష్టమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. అలాగే బాల్యంలో అతి చేదైన అనుభవాలు చవిచూసినవారు పెరిగి పెద్దయ్యాక తీవ్ర మనస్తత్వం కలిగి ఉంటారు అంటుంటారు. మరి అటువంటి ఎక్స్ట్రీమ్ మనస్తత్వాలున్న ఇద్దరు వ్యక్తులు తల్లితండ్రులుగా కలిగిన సంతానం పరిస్థితి ఏంటి? చాలామంది విషయంలో సర్వసాధారణ కారణాలైన అవిద్య, పేదరికం లాంటివి Rex, Maryల జీవనశైలిని ప్రభావితం చేసే అంశాలు కాకపోవడం, ఇద్దరూ కూడా విద్యావంతులు, వివిధ విషయాలపై లోతైన పరిజ్ఞానం కలిగినవాళ్లు కావడం ఇక్కడ విశేషం. Maryకి తల్లి వదలిన ఇల్లు, కొన్ని మిలియన్ డాలర్ల విలువ చేసే స్థలాలు ఉన్నా కూడా వాటిని కాదని కాలిఫోర్నియా, వెస్ట్ వర్జీనియా, లాస్ ఏంజెల్స్, ఫీనిక్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ పర్వతాల్లో, ఎడారుల్లో నివాసం ఏర్పరుచుకుంటూ బంజారా జీవితం గడుపుతుంటారు. మనిషి మనుగడ అంటే పెద్ద పెద్ద భవనాల్లో, ఏసీ గదుల్లో గడిపే జీవితం కాదనీ, అది అణువణువూ ప్రకృతితో ముడిపడి ఉండాలని మనసావాచా నమ్మేవారు Walls దంపతులు. వారి దృష్టిలో స్థిరత్వం అంటే మరణంతో సమానం.. చేతికి దొరికింది తిని, కనిపించిన పనిచేసి, ఆ క్షణంలో బ్రతకడం వారికిష్టం. కానీ సమాజాన్ని కాదని, కుటుంబం ఏర్పడ్డాకా కూడా అదే శైలిలో బ్రతికితే? ఆ జీవనశైలి పిల్లల మీద చూపించిన ప్రభావం, ఆ క్రమంలో వాళ్ళు అనుభవించిన కటిక దారిద్య్రం, దుర్భరమైన జీవితం Jeanette మనకు కథగా చెప్తుంది. ఇక్కడ కథ చెప్పేది Jeannette అయినా మన ఆలోచనలు, కథాగమనం మొత్తం Rex,Mary ల చుట్టూనే తిరుగుతుంటాయి. మనిషి మనుగడను గురించి ఎన్నోసమాధానాల్లేని ప్రశ్నల్ని మన ముందుంచుతాయి.

“Dad missed the wilderness. He needed to be roaming free in open country and living among untamed animals. He felt it was good for your soul to have buzzards and coyotes and snakes around. That was the way man was meant to live, he’d say, in harmony with the wild, like the Indians, not this lords-of-the-earth crap, trying to rule the entire goddamn planet, cutting down all the forests and killing every creature you couldn’t bring to heel.

Life is a bowl of cherries, with a few nuts thrown in”which she’d titled. “R. M. Walls’s Philosophy of Life.”

స్కూళ్ళ లో చదువు ఎందుకూ కొరగాదని నమ్మే Rex ఇంట్లోనే పిల్లలకు జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్ నేర్పించడం, బ్రతకడానికి అవసరమైన ప్లమ్బింగ్, కార్పెంటరీ మొదలు షూటింగ్, స్విమ్మింగ్ లాంటి వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వడం మనల్ని అబ్బుర పరుస్తుంది. ఎడారిలో నివాసం ఉంటున్నప్పుడు ఒక సారి క్రిస్టమస్ కు పిల్లలకు గిఫ్టులు కూడా కొనలేని పరిస్థితుల్లో రాత్రి వారిని ఒక్కొక్కరినీ తీసుకెళ్లి ఆకాశంలో నక్షత్రాలని బహుమతిగా ఇవ్వడం Rex లోని మరో మనిషిని మనకు పరిచయం చేస్తుంది. Betelgeuse, Rigel స్టార్స్ ని లోరీ, బ్రియాన్ ఎంచుకోగా Jeannette Venus ని బహుమతిగా ఎంచుకుంటుంది.

“Those shining stars, he liked to point out, were one of the special treats for people like us who lived out in the wilderness. Rich city folks, he’d say, lived in fancy apartments, but their air was so polluted they couldn’t even see the stars. We’d have to be out of our minds to want to trade places with any of them.

“That’s right,” Dad said. “No one else owns them. You just have to claim it before anyone else does, like that dago fellow Columbus claimed America for Queen Isabella. Claiming a star as your own has every bit as much logic to it.”

Dad kept telling me that he loved me, that he never would have let me drown, but you can’t cling to the side your whole life, that one lesson every parent needs to teach a child is. “If you don’t want to sink, you better figure out how to swim.””

స్వతహాగా ఆర్టిస్ట్ అయిన కారణంగా తనని తాను ‘Excitement addict’ గా అభివర్ణించుకునే తల్లి మేరీ పిల్లల్ని ఇండిపెండెంట్ గా పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. Joshua చెట్టు గురించిన ప్రస్తావనలో మేరీ, కూతురు Jeannette తో అనే ఈ మాటలు మేరీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

“While we were in Midland, Mom painted dozens of variations and studies of the Joshua tree. We’d go with her and she’d give us art lessons. One time I saw a tiny Joshua tree sapling growing not too far from the old tree. I wanted to dig it up and replant it near our house. I told Mom that I would protect it from the wind and water it every day so that it could grow nice and tall and straight. Mom frowned at me. “You’d be destroying what makes it special,” she said. “It’s the Joshua tree’s struggle that gives it its beauty.”

ఈ రచన,అమ్మ-నాన్న అంటే సజహంగా మనకుండే ఒక ‘Ideal image’ చట్రం లోనుంచి బయటకి వచ్చి ఆలోచించేలా చేస్తుంది. ఇందులో రెక్స్,మేరీలలో ఒక ఆదర్శవాద తల్లితండ్రులు కాక, తమ ఐడెంటిటీని విషయంలో అస్సలు రాజీపడనీ, స్వార్థంతో, అనేక లోపాలతో కూడిన సాధారణమైన ఇద్దరు individuals కనిపిస్తారు.

“Mom always said people worried too much about their children. Suffering when you’re young is good for you, she said. It immunized your body and your soul, and that was why she ignored us kids when we cried. Fussing over children who cry only encourages them, she told us. That’s positive reinforcement for negative behavior.

Dad was fed up with civilization. He and Mom decided we should move back to the desert and resume our hunt for gold without our starter money. “These cities will kill you,” he said.”

మొదట్లో వైవిధ్యమైన జీవనశైలిగా అనిపించే వారి ప్రయాణం పోను పోనూ Rex తాగుడు మరియు Mary డిప్రెషన్ తో పూర్తిగా గాడితప్పుతుంది. ఒక సందర్భంలో Rex టీనేజ్ లో ఉన్న Jeannette ను గ్యాంబ్లింగ్ కి బార్ కు తీసుకువెళ్లడం, ఇంటిల్లిపాదీ ఆకలితో ఉండగా Mary పిల్లలకు కూడా పెట్టకుండా దొంగచాటుగా చాకోలెట్ బార్ తినడం లాంటి కొన్ని అంశాలు మనల్నివిస్మయ పరుస్తాయి. ఇలా మనం మంచి చెడుల తూకాలు బేరీజు వేసుకుంటూ ఉండగా, కథ చివరకి వచ్చేసరికి Jeannette తల్లిదండ్రులు మన అంచనాలకు అందని వ్యక్తులుగా, ఒక ప్రశ్నర్థకంగా మిగిలిపోతారు. వారు మంచివారా లేక చెడ్డవారా అనేది పాఠకుల విశ్లేషణకే వదిలేస్తుంది Jeannette. సాహిత్యపరమైన అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఇది ఒక ఉత్తమ రచన కాకపోవచ్చునేమో గానీ సాహిత్యం ముఖ్యోద్దేశ్యం వాస్తవాల్ని ప్రతిబింబించడమే అయితే ఇది ఖచ్చితంగా ఒక ఉత్తమ రచన అని చెప్పవచ్చు.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన అంశాలు..
But what I did know was that I lived in a world that at any moment could erupt into fire. It was the sort of knowledge that kept you on your toes.
You know if it’s humanly possible, I’ll get it for you. And if it ain’t humanly possible, I’ll die trying.

“Do something!” I yelled at her. “You’ve got to do something to help Dad!” “Your father’s the only one who can help himself,” Mom said. “Only he knows how to fight his own demons.”

“Everyone has something good about them,” she said. “You have to find the redeeming quality and love the person for that.”
“Oh yeah?” I said. “How about Hitler? What was his redeeming quality?”
“Hitler loved dogs,” Mom said without hesitation.

Life’s too short to worry about what other people think,” Mom said. “Anyway, they should accept us for who we are.”

Mary : What doesn’t kill you will make you stronger……
Lori : “If that was true, I’d be Hercules by now,”

Mom wouldn’t hear of it. Welfare, she said, would cause irreparable psychological damage to us kids. “You can be hungry every now and then, but once you eat, you’re okay,” she said. “And you can get cold for a while, but you always warm up. Once you go on welfare, it changes you. Even if you get off welfare, you never escape the stigma that you were a charity case. You’re scarred for life.”

Dad,” I said, “as soon as I finish classes, I’m getting on the next bus out of here. If the buses stop running, I’ll hitchhike. I’ll walk if I have to. Go ahead and build the Glass Castle, but don’t do it for me.”
The Glass Castle

Jeannette Walls
About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Unforbidden Pleasures – Adam Phillips

వ్యాసకర్త: Nagini Kandala ************* ఆ మధ్య ఇంతియాజ్ అలీ సినిమా ‘తమాషా’ అని ఒకటొచ్చింది. ఎంత త్వర...
by అతిథి
0

 
 

We Are What We Pretend To Be – Kurt Vonnegut

వ్యాసకర్త: Naagini Kandala ********************** ఒక ప్రక్కన వేరే పుస్తకాలు చదువుతున్నా,’మరి నేను రాసిన కథల...
by అతిథి
0

 
 

Uncommon Type: Some Stories – Tom Hanks

వ్యాసకర్త:Naagini Kandala *************** టామ్ హాంక్స్.. సుమారు పదేళ్ళ క్రిందట ఎప్పుడో చూసిన Cast Away సినిమాత...
by అతిథి
1

 

 

Hillbilly Elegy: A Memoir of a Family and Culture in Crisis – J.D.Vance

వ్యాసకర్త: Naagini Kandala ***************** అమెరికాలోని మారుమూల Appalachia ప్రాంతాలకు చెందిన వారిని హిల్ల్బిల...
by అతిథి
0

 
 

Stiff: The Curious Lives of Human Cadavers – Mary Roach

వ్యాసకర్త: Naagini Kandala ****************** Stiff: The Curious Lives of Human Cadavers, అమెరికన్ రచయిత్రి మేరీ రోచ్ 2003లో రాసిన పుస్త...
by అతిథి
1

 
 

Fantastic night and other stories – Stefan Zweig

వ్యాసకర్త: Nagini Kandala ********* Stefan Zweig.. ఈ మధ్యే మొదలైన కొత్త ప్రేమ. అసలీ పుస్తకం కళ్ళపడే వరకూ ఈయన గు...
by అతిథి
0