పుస్తకం
All about booksఅనువాదాలు

July 29, 2014

Invitation to a Beheading: Vladimir Nabokov

More articles by »
Written by: Purnima
Tags: ,
నాకిష్టమైన రచయితలు ఎవరని అడగ్గానే, నేను మొదటగా చెప్పే పేర్లలో ఉండని పేరు నబొకొవ్. మరుక్షణం, నాలుక కర్చుకొని చెప్పే పేర్లలో ఖచ్చితంగా ఉండే పేరు అదే. నబొకొవ్ రచనలను ఇష్టపడ్డానా, లేదా అన్నది సెకండరి అయిపోతుంది. నచ్చాయని అనిపించినా, అనిపించకపోయినా ఆయన రచనలు, అందులోని అంశాలు, వాటిని ఆయన చెప్పే తీరు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఆయన రాసిన “లోలిత” నవల నన్ను ఎక్కువగా ఆలోచింపచేసిన నవలలో ఒకటి. దాన్ని అనేక మంది అనేక విధాలుగా విశ్లేషించి ఉండచ్చగాక! కానీ, నేను దాన్నిఅర్థం చేసుకున్న తీరు నాకే సొంతం. అలానే, ఆయన రాసిన “Sounds” అనే కథ ఒకటి నాకు ఊరికూరికే గుర్తొచ్చే కథ. అందులో వెలుతురుని, శబ్ధాలని ఆయన వర్ణించిన తీరు మర్చిపోవడం కష్టం.

ఓ రెండేళ్ళ బ్రేక్ తర్వాత మొన్నీ మధ్యే నబొకొవ్ నవల మరొకటి చదివాను. పేరు ఆసక్తికరంగా ఉందికదా అని చూస్తే, అది నబొకొవ్ రాసిందని తెల్సింది. ఆయన రష్యన్‍లో రాస్తే, దాన్ని వాళ్ళ అబ్బాయే ఇంగ్లీషులోకి అనువదించాడు. నబొకొవ్ ఇంగ్లీషు ఎంత అందంగా ఉంటుందంటే, అంత అందంగా ఉంటుంది. ఒక్కో వాక్యాన్ని మనసులో చదువుకోవడమే కాకుండా, వివిధ స్థాయిలో బయటకు చదవాలనిపించేంతగా ఆ వాక్యాలలో రిథమ్ ఉంటుంది. ఆ రిథమ్‍కి తగ్గట్టు అంతే గాఢమైన భావం ఉంటుంది. అసలు నబొకొవ్‍ను చదివేదే అందుకు. అయితే, ఇలా నవల అనువాదం కావడంతో భాష కొంచెం మామూలుగానే అనిపించింది.

దానికి తోడు ఈ కథ ఎక్కడ జరుగుతుందో, అందులోని పాత్రలూ, పరిస్థితులూ అలానే ఎందుకు ఉన్నాయో పాఠకునికి క్లియర్‍గా చెప్పేది ఉండదు. అందుకని నవలంతా ఒక కలలా, ఒక ట్రాన్స్ లా అనిపిస్తుంది. ఒక ఘటనకీ మరో ఘటనకీ సంబంధం ఉన్నట్టే అనిపిస్తుందిగానీ అదేమిటో ఖచ్చితంగా అర్థంకాదు. తెలిసీ అయోమయం. అయోమయంలో తెల్సుకోవడం. ఇలా సాగుతుంది కథంతా. కాఫ్కా ఒకట్రెండు రచనలు కూడా ఇలానే ఉంటాయి. ఏదీ ఎందుకు జరుగుతుందో, ఏమీ తెలీకుండా. అయినా మధ్యలో వదల బుద్ధివేయదు. కలో, మాయో మొత్తం అనుభవించాల్సిందే అనిపిస్తుంది. నవల మొత్తం అయిపోయాక కూడా అంతా గజిబిజిగా ఉన్నా, ఒక మంచి రచన చదివిన భావన మిగులుతుంది. మళ్ళీ చదవాలని అనిపిస్తుంది.

ఈ కథలో, ఒకడికి ఉరిశిక్ష వేస్తారు. వాడి నేరం ఏంటన్నది మనకి స్పష్టంగా తెలీదు. అందరిలా లేనందుకు వాడికా శిక్ష. శిక్ష పడ్డాక, వాణ్ణి ఒక ఎత్తైన జైలులో ఉంచుతారు. ఎప్పుడు ఉరి తీసేది, వాడికి చెప్పరు. ఎన్నిసార్లు అడిగినా చెప్పరు. తనని ఎప్పుడు ఉరి తీస్తారో చెప్తే, ఆ లోపు తన ఆత్మకథను రాసుకోవచ్చు కదా అని అతడి ఆశ. పైగా ఓ తారీఖంటూ తెల్సిపోతే మరణానికి బాగా ప్రిపేర్ అవ్వచ్చు కదా అని ఆలోచన కూడా. కానీ ఎవ్వరూ చెప్పరు. ఇంతలో వాడిని పలకరించడానికో, పరామర్శించడానికో వచ్చిపోయే  వాళ్ళు, వారితో ముడిపడిన కథలు. జైలర్లు, ఇతర జైలు సిబ్బందితో జరిగే సంభాషణలు. జైలులోంచి తప్పించుకోవాలనే ప్రయత్నాలు. వీడిని కాపాడతానంటూ ముందుకొచ్చే ఒక చిన్నపాప. అవి సఫలమైనాయో, విఫలమైనాయో చెప్పలేని పరిస్థితి. తనని ఎప్పుడు ఉరి తీస్తారో, ఆ ఉరి తీసేది ఎవరో అన్న ప్రశ్నలు వాడిని వేటాడుతూనే ఉంటాయి. వాటికి సమాధానాలు వాడిని ఉరి తీసే క్షణం వరకూ తెలీదు.

వాడు ఉన్నది నిజంగానే మనలాంటి ప్రపంచమా? లేక వాడి మెదడులో పుట్టుకొచ్చిన మరో ప్రపంచమా? అన్న దానికి సమాధానం దొరకడం కష్టం. ఈ కథలో ఉన్న irrationality, weirdness, uncertainty అన్నీ మన చుట్టూ కూడా ఉండేవే! బహుశా, అవి అంతటి తీవ్ర స్థాయిలో ఉండవేమో. ఉన్నా మనం గమనించుకోమేమో. ఉదాహరణకి, ప్రతి మనిషి ఏదో ఒకప్పుడు చనిపోవాల్సిందే అని తెల్సినా, దాన్ని అంతగా పట్టించుకోము కదా! ఒకవేళ, మరణానికి సంబంధించిన స్పృహ మనల్ని పదేపదే వేటాడితే, మనం మొదలెట్టే ప్రతి పని ముందు, “ఇంకెంత సమయం ఉంది?” అని లెక్కలు వేసుకోవాల్సి వస్తే, అప్పుడు మన పరిస్థితీ ఈ కథలోని వాడి పరిస్థితిలానే ఉంటుందని నా అభిప్రాయం. ఒక పద్ధతిగా, అంతా స్పష్టంగా చెప్పని ఈ కథలలోని గొప్పతనం అదే అనుకుంటాను. చెప్పీచెప్పకుండా మనల్ని చాలా ఆలోచింపచేస్తాయి. ఈ నవలలోనే ఒకచోట ఇలా ఉంటుంది:

“But then I have long since grown accustomed to the thought that what we call dreams is semi-reality, the promise of reality, a fore glimpse and a whiff of it; that is they contain, in a very vague, diluted state, more genuine reality than our vaunted waking life which, in its turn, is semi-sleep, an evil drowsiness into which penetrate in grotesque disguise the sounds and sights of the real world, flowing beyond the periphery of the mind—as when you hear during sleep a dreadful insidious tale because a branch is scraping on the pane, or see yourself sinking into snow because your blanket is sliding off.”

తన ప్రపంచం గురించి ఇలా అంటాడు:

“It exists, my dream world, it must exist since sure there must be an original of the clumsy copy.”

ఓపిగ్గా చదుకోవాల్సిన పుస్తకం. పూర్తిచేయగలిగితే గొప్పగా అనిపించే అవకాశమున్న పుస్తకం.
Invitation to a Beheading

Vladimir Nabokov

Fiction
PaperbackAbout the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..2 Comments


 1. సౌమ్య

  ఈ కథ ఏదో ఆసక్తికరంగా ఉంది. శివరామప్రసాద్ గారి వ్యాఖ్యలో రాసిన అంశాలు కూడానూ. Should check out sometime. Thanks.


 2. SIVARAMAPRASAD KAPPAGANTU

  ఇన్విటేషన్ టు బిహెడింగ్ ఒక జైలులో జరిగే కథ, అది కూడా ఒక ఖైదీ చివరి ఇరవైరోజుల కథ. ఒక ఊహాజనిత దేశపు పౌరుడు, మిగిలిన అందరిలాగా లేడని, మిగిలిన ప్రజలు అతని సమక్షంలో అతనొక మామూలు మనిషి కాదని భయపడుతూ ఇబ్బంది పడుతున్నారని ఆరోపణ. అక్కడ అప్పుడున్న పౌర సమాజంలో భాగం కాలేకపోయినందున అతనికి మరణ శిక్ష వేసి ఉండవచ్చు. ఇదేదో కొద్దిగా రష్యాలో విప్లవానంతరం జరిగిన అనేక అకృత్యాలను చూపించటానికి వ్రాసినట్టున్నది.

  నబకోవ్ వ్రాసినదే మరొక నవల బెండ్ సినిస్టర్. ఇందులో కథ అంతా కూడా యూరప్ లో ఉన్న ఒక ఊహాజనిత దేశంలో జరుగుతుంది. ఆ ఊహాజనిత దేశపు పేరు “Ekvilisam”. యాడం కృగ్ అనే ప్రొఫెసర్ కథ. ఈ ఈక్విలిసం దేశపు, పార్టీ అఫ్ అవెరగె మెన్ నాయకుడు పడుక్ అనేవాడు ఈ క్రుగ్ చుట్టూ ఉండేవాళ్ళను అనేకమందిని అరెస్ట్ చేసి, ఆయన్ను తన తరఫున ప్రచారం చేయించుకోవాలని చూస్తాడు.

  మీరు వ్రాసిన పరిచయం చూసినాక వెబ్ లో వెతుకుతుంటే ఒకచోట నబకోవ్ వ్రాసిన కొన్ని నవలల సంక్షిప్త సమాచారం దొరికింది అదే పైన వ్రాశాను. అవి చూసినాక నాకు కలిగిన అభిప్రాయం, ఈ రచనలు అప్పటి సమకాలీన రాజకీయ పరిణామాల మీద వ్రాసిన వ్యంగ్య రచనలు అనిపించింది.

  నేను చూసిన లింక్ ఇది:
  http://forum.mobilism.org/viewtopic.php?t=387924

  నబకోవ్ రచనలు పదింటికి పైనున్న లింకులో సంక్షిప్త సమాచారం ఉన్నది. ఆసక్తి ఉన్నవారు చదువుకుని అసలు నవల కొనుక్కోవచ్చు. అక్కడే డౌన్లోడ్ కు లింకులు ఉన్నాయి కాని పనిచేస్తున్నాయో లేదో చూడలేదు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Despair: Nabokov

గత నెలరోజుల్లో చదివిన నబొకొవ్ పుస్తకాలు, “Laughter in the dark”, “Invitation to Beheading” చదువుతున్నప్ప...
by Purnima
1

 
 

Laughter in the dark: Nabokov

నబొకవ్ రాసిన మరో నవల “Laughter in the dark”. పోయన వారం పరిచయం చేసిన నవల గురించి ఏదో చదువుతుంటే, ...
by Purnima
0

 
 
Lolita – Nabokov

Lolita – Nabokov

ఈ వ్యాసంతో పుస్తకం.నెట్‍లో ప్రచురిత వ్యాసాల సంఖ్య ఏడొందలకు చేరుకుంది. పుస్తకం.నెట్ ...
by Purnima
1

 

 

వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 3)

(ముందు భాగం) ఈ నవల గురించి చెప్పాలనుకున్నదంతా దాదాపు పైన కథా సంక్షిప్తంలోనూ, దానికిచ...
by మెహెర్
6

 
 
వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 2)

వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 2)

(ముందు భాగం) సరే ఇప్పటి వరకూ పుస్తకం గురించి చెప్పుకున్నాం గనుక, ఇప్పుడు కాస్త రచయిత ...
by మెహెర్
1

 
 
వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 1)

వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 1)

(నబొకొవ్ నవల – The Gift గురించిన పరిచయ వ్యాసం మూడు భాగాల్లో ఇది మొదటిది) దాదాపు నూటనలభయ్య...
by మెహెర్
0