పుస్తకం
All about booksపుస్తకభాష

May 6, 2014

To Kill a Mockingbird: Harper Lee

More articles by »
Written by: Purnima
Tags:

క్లాసురూమ్‍లోనో, ఆఫీసులోనో రోజూ చూసే మొహమే అయినా, తప్పనిసరైనప్పుడు మొక్కుబడిగా పలకరించి, ఆ అవసరమూ లేనప్పుడు “నజర్ అందాజ్” చేసేస్తూ కాలం గడిపినట్టు, ఈ నవల గురించి ఆరేడేళ్ళ కిందే తెల్సినా, అప్పుడే పుస్తకం కొనిపెట్టుకున్నా మొన్నటి వరకూ చదవలేదు. నేను కొన్న కాపీలో పేజీలు yellowishగా అయిపోయాయి. అప్పట్లో ఒకట్రెండు సార్లు చదవడానికి ప్రయత్నించాను నిద్ర నిండిన కళ్ళతో. ఐదారు పేజీలకు మించి దాటలేకపోయాను. “ప్రపంచమంతా పొగిడినా ఇది నాకు ఎక్కని పుస్తకం కాబోలు.” అని పక్కకు పడేశాను.

 ఆ జరిగిన ఆలస్యం కూడా ఒకందుకు మంచిదే అయింది. గత ఏడాది coursera.com పుణ్యమా అని Faulkner రాసిన “Light in August”, Toni Morrison రాసిన “Beloved” నవలలు చదివాను. అవి చాలా రకాలుగా tough nuts to crack. పందొమ్మిది, ఇరవైవ శతాబ్దాలలో దక్షిణ అమెరికాలో నల్ల జాతీయులకి, తెల్ల జాతీయులకి మధ్య ఉన్న equationsను కళ్ళకు కట్టినట్టే కాకుండా, ఒకసారి బొమ్మ కట్టాక అది పాఠకుడిని ఎప్పుడూ వెంటాడే విధంగా చిత్రీకరించారు అందులోని పాత్రలను, సంఘటనలు, పరిస్థితులను. Faulkner శైలి కొరుకుడుపడాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఆ కోర్సులో ప్రొఫెసర్‍గారు, తోటి విద్యార్థులు లేకపోయుంటే, ఆ నవలను నేను పూర్తిచేయలేక పోయేదాన్నేమో. Morrison వచనమే పెద్ద అడ్డుకాకపోయినా, ఆవిడ మాటలతో కట్టే బొమ్మలు ఊహించుకోడానికి కూడా బోలెడంత ధైర్యం కావాలి. అప్పటి నల్లజాతీయుల దాస్యం, దైన్యం; అంతటి విపరీత పరిస్థితుల్లో కూడా వారు చూపించే (బహుశా, వారు మాత్రమే చూపగల) తెగింపును ఆవిడ మలచిన తీరు పాఠకుడిని వెంటాడుతూనే ఉంటుంది.

అసలు ఆ కోర్సులో అన్నీ ఇలాంటి dark, broody నవలలే ఎందుకు ఎంపిక చేశారని కొంతమంది విద్యార్థులు గోలచేశారు. ఇలాంటి ఏడిపించే రచనల గురించి మాత్రమే (చదివేవారి/) మాట్లాడేవారి మానసిక పరిస్థితిపై అనుమానాలు పెట్టుకోవడం తప్పేమి కాదని కొందరు అభిప్రాయపడ్డారు కూడా! కొంచెం నవ్వు తెప్పించే రచనలే లేవా, అని వాపోయినవారు కూడా ఉన్నారు.

“To kill a mockingbird” కూడా దక్షిణ అమెరికాలోని నల్ల-తెల్ల జాతీయుల మధ్య  ఘర్షణనే చిత్రీకరించారు. ఘర్షణ అంటే కత్తులతో దాడులకి దిగారని కాదు. ఎంతగా గీతలు గీసుకున్నా, ఒక చోట బతకడమంటూ మొదలయ్యాక మనుషుల మధ్య తప్పని ఘర్షణను చూపించారు. ఒక నల్లజాతీయుడి చేయని నేరానికి ఎలా బలైపోయాడో, అతడి తరఫున వాదించి అతడి కాపాడ్డానికి శాయశక్తులా పోరాడి ఓ తెల్లజాతీయుడైన లాయర్ ఏం ఓడిపోయాడో, ఏం గెలిచాడో, తప్పు తమదని తెల్సినా అండగా నిలిచే చట్టాన్ని వాడుకోవాలని చూసినవాళ్ళ సంగతేమైయ్యిందో ఈ కథలోని ముఖ్యమైన అంశాలు. అసలు తెలుపూ, నలుపూ అనే ప్రధాన విభజనే కాకుండా, తెలుపునలుపులలో అంతర్గతంగా మళ్ళీ ఎన్ని విభజనలున్నాయో, వీటి అన్నింటి మధ్య మనుషులెలా నలిగిపోయారో అంతర్లీనంగా చూపిస్తుంది ఈ నవల.  ఏ రకంగా చూసినా, ఇదో సీరియస్ నవల. ఇందులోని ఏ ఒక్క అంశమూ నవ్విపారేసేది కాదు.

అయినా, ఈ నవలను గురించి పరిచయ వాక్యాల్లో “humour”, “funny” లాంటి పదాలు తప్పక కనిపిస్తాయి. అదెలా సాధ్యం? మానవ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన వాటిలో తప్పక నిలిచే “racism” గురించి ఎవరైనా నవ్వు తెప్పించేలా రాయడం ఎలా సాధ్యం?

సాధ్యమే! 

ఈ నవలలో మూడేళ్ళపాటు జరిగే కథను ఆరేళ్ళ చిన్నారి “Scout” చెప్పుకొస్తుంది మనకి. దానికో అన్నయ్య – జెమ్, నాలుగేళ్ళ పెద్దవాడు. వీళ్ళద్దరికీ ఓ ఫ్రెండ్, వేసవిలో వచ్చిపోయే డిల్ల్. వాళ్ళుండే ఊరిలో జరుగుతుంది కథ మొత్తం. వాళ్ళ నాన్నే, తెల్లవాడైనా నల్లవాడి తరఫున కేసు వాదిస్తాడు. అందుకు ఆ ఊర్లోవాళ్ళు వీళ్ళని పెట్టాల్సిన ఇబ్బందులు పెడతారు. కారణముంటే చాలు కలబడి, తగువులాడే ఈ స్కౌట్ తన మాటల్లో, ఒక్కోచోట అమాయకంగా, మరోచోట ఉడుకుమోతుతనంతో, ఇంకోచోట అయోమయంగా కథను మొత్తం చెప్పుకొస్తుంది. చదువుతున్న మన పెదవులపై నవ్వు చెరిగిపోకుండా చూస్తుంది.

లోకమెంత చీకటిదైనా, పిల్లల దృష్టికి మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేకమైన వెలుగులో కరిగిపోతుందనుకుంటాను. మనిషి తన మేధనీ, సంస్కారాన్నీ తాకట్టు పెట్టి మరీ గీసుక్కూర్చున్న గీతలు చూసి వెక్కిరించగలిగింది పిల్లలు మాత్రమే! పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలని లోకమందుకే తెగ తొందరపెడుతుంది అనుకుంటాను. 

“Fiction of Relationship” అనే కోర్సులోనే చదివిన మరో రచన “The Ice Palace”.(నేను రాసిన పరిచయాల్లో రచనకు పూర్తిగా అన్యాయం చేశాననిపించేవాటిలో ఇది ఒకటి.) ఆ నవలను చర్చిస్తూ, మా ప్రొఫెసర్‍గారు ఓ ఆసక్తికరమైన ప్రశ్న లేవనెత్తారు:

“When I was much, much younger, one of the comedians whose work we thoroughly enjoyed was this brilliant man named Tom Lehrer. And he had a series of satirical songs and ditties about American culture in the 60s and 70s. And one that stays in my mind was called “The New Math”, and in that song we had a line like this about the new math, “It’s so simple, only a child can do it.” And I thought a lot about that line in the years passed, it’s so simple that only a child can do it. Which is to say, yes, it’s a form of math but it’s a form of math that adults can’t do and children can. And what does that mean? The things that we think of, children as being at the point where they need to know things, so that they can then grasp and comprehend the world as adults do but, what if it goes the other way? That the things that children understand that adults don’t.”

అదే విషయమై మాట్లాడుతూ, ఆయన అడిగిన మరో ప్రశ్న:

“Does our world increase or decrease as we grow young?”

“మీలాంటి పిల్లలే పోలీసులైతే? మీలాంటి పిల్లలే జ్యూరీలైతే..” అన్న అర్థంలో స్కౌట్ వాళ్ళ నాన్న కొన్ని చోట్ల వాపోతాడు. బహుశా ఆయన, a law that can be maintained only by children గురించి మాట్లాడుతున్నాడేమో! Or that, if only children are made to be the law-makers. ఆసక్తికరంగా, ఈ నవల మొదట్లో “Lawyers, I suppose, were children once.” అనే Charles Lamb quote ఉంటుంది. 

 వాళ్ళ నాన్న కోర్టులో వాదిస్తుండగా, అన్నాచెల్లెల మధ్య జరిగిన సంభాషణ ఒకటి, ఇలా నడుస్తుంది:

“Jem”, I asked, “what’s a mixed child?”

“Half white, half coloured. You’ve seen ’em, Scout. You know that red-kinky-headed one that delivers for the drugstore. He’s half white. They’re real sad.”

“Sad, how come?”

“They don’t belong anywhere. Colored folks won’t have ’em because they’re half white; white folks won’t have ’em because they’re colored, so they’re just in-betweens, don’t belong anywhere. ”

….
….

“How can you tell?” asked Dill, “He looked black to me.”

“You can’t sometimes, not unless you know who they are. But he’s half Raymond, all right.”

….

….

“That’s what I thought,” said Jem, “but around here once you have a drop of Negro blood, that makes you all black….”

ఇంత సింపుల్‍గా పిల్లలే పిల్లలకి చెప్పగలరేమో. తన ఒంటి రంగు తెలుపైనా, తాను నల్లజాతీయుణ్ణి అనుకునేవాడి జీవితగాధను Faulkner అత్యద్భుతంగా చెప్పుకొస్తాడు, Light in Augustలో. కాకపోతే అదంతా పెద్దవాళ్ళ లోకం. అక్కడ బైనరీ కుదరదు. అందులో Faulkner అంతటి రచయితే కథ చెప్తున్నప్పుడు.

ఈ నవలలో స్కౌట్, జెమ్‍ల ప్రయాణం ఉంటుంది, చిన్నపిల్లలుగా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నుండి (ఎప్పుడూ కనిపించని మనిషి, ఏవో ఊహాగానాలు విని, దెయ్యంగా ఊహించుకోవడం) పెద్దవాళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకునే (దెయ్యంగా ఊహించుకున్న మనిషితో సఖ్యంగా ఉండగలడం) దిశగా. ఈ ప్రయాణంలో వాళ్ళని సరైన మార్గంలో ఉండేలా చూసినది మాత్రం, వాళ్ళ నాన్న.  ఇదో గొప్ప పాత్ర. Howard Roark గురించి ఊగిపోయేవాళ్ళు చాలామందే ఉంటారుగానీ, అతడికీ తల్లి,తండ్రి, అన్నా, చెల్లి, భార్యా, బిడ్డా అన్న ముళ్ళు వేస్తే, ఎంత Roark మిగులుతాడు? అన్నది విస్మరించలేని ప్రశ్న. తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే, తన పిల్లలపై దాన్ని రుద్దినట్టు కాకుండా ఓర్పుగా, నేర్పుగా వివరిస్తూ, వాళ్ళు అర్థంచేసుకోకుండా ఆవేశపడినప్పుడల్లా అర్థంచేసుకుంటూ, వాళ్ళకే హాని జరగకుండా చూసుకుంటూ ఒక గొప్ప తండ్రిగా, అదే విధంగా వృత్తిపరంగా కూడా ఏ మాత్రం compromise అవ్వని వ్యక్తిత్వంతో “Atticus Finch” మరుపురాని పాత్రగా మిగిలిపోతాడు.

కోర్టులో వాదోపవాదాలు జరిగినంత సేపు స్కౌట్ నరేషన్ నాకు ఎబ్బెట్టుగా, అతకనట్టుగా అనిపించింది. తొమ్మిదేళ్ళ పిల్లకి చట్టం గురించి, దాని పనితీరు గురించి అంతలా తెలిసి ఉంటుందా అని ఒక అనుమానం. రేప్ లాంటి విషయాలను కోర్టులో చర్చిస్తుండగా పిల్లలు అక్కడే ఉండడాన్ని రచయిత్రి ఏదోలా సమర్థించుకొచ్చినా, నాకు మాత్రం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. (బహుశా, నేను దాన్ని ఇంకో విధంగా అర్థంచేసుకోడానికి ప్రయత్నించాలేమో.)

మనిషి మనుగడ అంత తేలికైనదేం కాదు. తెలిసో, తెలియకో తనచుట్టూ ఉన్న, తనలో ఉన్న mockingbirdsని చంపుతూనే ఉన్నాడు. చంపుతూనే ఉంటాడు. ఆ విషయాన్ని గ్రహిస్తూనే singing birdsను కాపాడుకోడానికి చేసే ప్రతి ప్రయత్నం, చివరకు విఫలమే అయినా, మనిషులుగా మనం చేయాల్సిన పని అని గుర్తుచేసే రచన ఇది. తప్పక చదవాల్సిన రచన ఇది.

 
To Kill a Mockingbird

Harper Lee

Fiction
arrow books
1989
Paperback
309About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..4 Comments


 1. YRH

  అభివందనాలు. ఈ పుస్తకం చాల ప్రసిద్ది చెందినది. కొన్ని స్కూల్స్ లో పిల్లలికి ప్రవేసపెదతారు .
  మీరు అక్కడ ఉన్నారో నాకు తెలెయదు. నేను కొంతకాలం అలబామా లో నివసించను. అది 40 సంవస్తరాల క్రితం. ఈ నవలలో చెప్పినది చాల వస్త్వికం గ అనిపిస్తుంది. మీరు కొంచం శ్రద్ధ తీసుకునివుంటే బాగుండేది. నవల లో అసలు విషయం గురించి కాకుండా పిల్లల గురించి రేసు ప్రభావం అక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. దీనికి అనుగుణంగా అరుంధతి రాయ్ నావల కు కూడా పుల్తిశైరె బహుమానం వచ్చింది. మీరు తిరిగి మరో సరి ఈ నవల చదవండి. అవసరమైతే మీరు వ్రాసిన సమీక్ష రివ్యూ చేయండి.
  ధన్యవాదములు
  తప్పులుంటే మన్నిచండి. ఈఎ నవల మరియు సినిమా 50 సంవస్తరాల నాడు ఇండియా లో చూడటం జరిగింది.


 2. Thanks for introducing it. I too tried few times before and left in the middle for various reasons. Only last year I read it completely. Sure Atticus Finch is one of the memorable factious characters, probably an unsung hero (in literature world) in my opinion. As you aptly said Mr. Roark stole the show. Boo Radley is another impressive character.

  The ebook version and audio version are about to come very soon.
  http://larasbookclub.wordpress.com/2014/05/02/e-book-version-of-to-kill-a-mockingbird-coming-soon/


 3. మొదటిసారి కాలక్షేపంగా అలా చదివేశాను. చదివినంత సేపు నచ్చింది. చదివిన వెంటనే ఎవరికో ఇచ్చేశాను. ఇప్పుడు నాన్నని కాబట్టి మళ్లీ ఇంకోసారి చదవాలనిపిస్తుంది. 🙂

  Roark గురించి మంచి పరిశీలన. మొన్ననే మళ్లా ఆ నవల కంటపడితే తిరగేసాను. (దగ్గర్లో చదవటానికేమీ లేక టిఫిన్ పొట్లాం విప్పి చదివే దుర్భల సందర్భాలుంటాయే, అలాంటప్పుడు.) ఈసారి ఆ నవల అస్థి నిర్మాణం అంతా పేలవంగా వెల్లడైపోయింది. అతను ఎలివేట్ అయ్యేలా చుట్టూ పాత్రల్ని సందర్భాల్ని సృష్టించినందువల్ల అతనలా కన్పిస్తాడని అర్థమైంది. His character is supported by negation. He is basically an overgrown teenager, and that novel is a glorified pulp.


 4. Jampala Chowdary

  Thank you Purnima for introducing an important book. I am surprised that you initially found it hard to get t going. That Scout drew me in right away. Was this book part of your course too? Was there any discussion about the characterization of Boo Radley?

  This was one of the books first introduced to me by Malathiచందూర్. (Malathi Chandur; I have no idea how my android phone got this in Telugu). Read the original a few times since, and am impressed every time. The book was made into a very fine film, with Gregory Peck doing a memorable Atticus Finch and Brock Peters as Tom Robinson. I believe Peck won an academy award for his portrayal.

  I encourage everyone to read the book and see the film, preferably in that order.
  .  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1