The 3 mistakes of my life
చేతన్ భగత్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటాను. రాసినవి మూడే పుస్తకాలైనా కూడా మూడూ విపరీతంగా అమ్ముడవడంతో ఓ మోస్తరుగా పుస్తకాలు చదివేవారు, అదీ ఈ తరంవారు ఎవరైనా ఆ పేరు వినగానే మనిషి గురించి ఎంతో కొంత చెప్పగలరు. మొదటి పుస్తకం – Five point someone నేను ఇంజినీరింగ్ లో ఉన్నప్పుడు చదివాను. నాకు బాగానే అనిపించింది. రెండో నవల – One night@call center అసలు చిరాకు పుట్టించింది. దానితో ఇతని మూడో నవల వచ్చి చాలారోజులు అయినా కూడా చదవాలనిపించలేదు. ఒడిస్సీలో చూసిన ప్రతిసారీ కొందామనుకోవడం, మళ్ళీ ఇదెలా ఉంటుందో అనుకుని ఆగడం, పోనీలే వందరూపాయలకే పుస్తకం అందిస్తున్నాడు కదా ఈ కాలంలో కూడా అనుకోడం – మళ్ళీ ఆ కాల్‍సెంటర్ నవల గుర్తొచ్చి భయపడడం – ఇలా చాలాసార్లు జరిగింది. ఇన్నాళ్ళకి మరో విధంగా ఈ పుస్తకం చదివే అవకాశం దొరికింది. విషయానికొస్తే, నాకు ఈ పుస్తకం బాగానే అనిపించింది. అదేదో కళాఖండం, చిరస్థాయిగా నిలిచిపోతుంది అని కాదు. కమర్షియల్ ఎంటర్‍టైనర్ లాగా అనమాట. చదివినంత సేపూ బాగుంటుంది. బానే లీనమవొచ్చు కథలో. ఎవరికన్నా దీని గురించి చెప్పాలంటే ఆట్టే చిరాకు పుట్టదు నాకు. భగత్ ఈసారికి నన్ను రక్షించాడు.
కథ విషయానికొస్తే, గోవింద్ అనే యువకుడు రచయితకి ఉత్తరం రాస్తాడు – నేను చనిపోబోతున్నాను, అదీ ఇదీ అంటూ. రచయితకి ఆందోళన ఎక్కువై గోవింద్ ని కలవడానికి ఇండియా వస్తాడు. ఇక్కడ గోవింద్ తను జీవితంలో చేసిన మూడు తప్పుల గురించి, ఎందుకు తాను ఆత్మహత్య చేసుకోబోయాడు అన్న విషయం గురించి చెప్పడం మొదలుపెడతాడు. గోవింద్, ఇషాన్, ఓమి – ముగ్గురు స్నేహితులు. క్రికెట్, గుజరాత్ భూకంప్, గోద్రా అల్లర్లు, గోవింద్ ప్రేమ వ్యవహారం – ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో, వాళ్ళు కలిసి చేసే వ్యాపారంలో కలిగించిన ఒడిదుడుకులే ఈ నవల కథాంశం. ఇందులో హిందూత్వ రాజకీయాలు సామాన్యుల్ని ఎలా ప్రభావితం చేస్తాయి, మత కలహాలప్పటి గుంపు మన:స్థితి ఎలా ఉంటుంది? – ఇలాంటి విషయాలను కూడా అలా పైపైన చర్చిస్తారు. ఆస్ట్రేలియా వ్యావహారికం కూడా కాస్త పట్టుబడుతుందేమో చూస్కోండి 🙂
అక్కడక్కడా కాస్త హాస్యం, కొన్ని కొన్ని చోట్ల ఆ వాక్యాలు బాగా కుదిరాయి. భాష బాగా సరళంగానే ఉంది. ఒక్కోచోట జీవిత సత్యాలు (తీపివీ, చేదువీనూ) బాగానే తగుల్తాయి. ఎటొచ్చీ, నాకీ చేతన్ భగత్ చిరాకు పుట్టించేది ఎక్కడంటే, ఆ నాటకీయత దగ్గర. కథ మామూలుగా గోవింద్ చెబుతున్నట్లే రాయొచ్చు కదా. అతను రచయిత కి ఈమెయిల్ చేయడం ఏంటో, ఆయన ఇండియాకి పరుగెత్తుకు రావడం ఏంటో, మళ్ళీ అక్కడికెళ్ళి ఆరాటం కొద్దీ ఇక్కడ్నుంచి కబుర్లు తెలుసుకుంటూ ఉండటం ఏమిటో – ఆ రెండో నవల కూడా ఇలాగే నాటకీయంగా రాసాడు. సరే, ఆ నవల మామూలుగా కూడా నాకు నచ్చలేదు కనుక ఈ విషయం మరింత ఇరిటేట్ చేసింది.
మొత్తానికి ఈ పుస్తకం పర్లేదు. చదవాలనుకుంటే చదవొచ్చు. చదివి తీరాల్సినది అని నేను అనలేను కానీ, కాలక్షేపానికి చదూకోడానికి బాగుంటుంది.
పుస్తకం వివరాలు:
The 3 mistakes of my life
రచయిత: చేతన్ భగత్
ISBN: 8129113724
పబ్లిషర్: రూపా & కొ, డిల్లీ
పేజీలు: 206
ప్రస్తుతం వేడి వేడిగా అమ్ముడౌతూనే ఉంది కనుక, అన్ని ప్రముఖ దుకాణాల్లోనూ దొరుకుతుంది.
గీతాచార్య
Chetan Bhagat. A very good joke on Indian English authors.
Five point Someone is as the name suggested a fifth rated dark comedy. Highly overestimated.
Hmm. This is another hell. But one thing. He makes u read the book. That’s all.
madhuri
nijame… eee novel lo naatakeeyatha baaga kanipistundi…edho novel time pass ki baagane anipinchinaa… commerical movie laagaa… action, fightings, love laantivi kaavaalani sardinatlu ga untundi… five point some one lo unnantha feel undadhu and one night at call center laaga head ache kooda raadu… time pass kosam chadavavacchu
someone
okasari chadavochu..nenukooda chala expect chesi ee book konna..
Chandritha
టైం పాస్ కి చదవచ్చు కాని గొప్ప పుస్తకమేమీ కాదు.
swathy
సౌమ్య గారు చెప్పినట్టు కాలక్షేపానికి చదవచ్చు …
భమిడిపాటి ఫణిబాబు
ఇదివరకు వచ్చిన ప్రాచుర్యం తో ఈ పుస్తకాన్ని మన మీదకు వదిలాడు.అందులో ఏమీ లేదు. ఒక్కసారి పేరు వస్తే చాలు, ఏచెత్త వ్రాసినా అమ్ముడు అయిపోతుందని వాళ్ళకి తెలుసు !!
రవి
నాకు ఇంగ్లీషు పుస్తకాలు అలవాటు లేదు. అయినా చేతన్ భగత్ పేరు కాస్త వినిపిస్తోంది చాలా మంది మిత్రుల దగ్గర. కనీసం ఆ సెవెన్ పాయింట్ సమ్ వన్ అయినా చదవాలి.
దైవానిక
పుస్తకం చదివి, ఎందుకు చదివానురా భగవంతుడా అని భాధపడ్డ పుస్తకం. ఈ పుస్తకం వల్ల నాకొక నీతి తెలిసింది. చీప్ గా పుస్తకాలొస్తున్నాయి అన్న ఒకే ఒక్క కండిషన్ పెట్టి పుస్తకాలు కొనకూడదు అని.
Arun
Even I didn’t liked the call center one. I like his subtle witticisms. I rate his “5 Point Some One” his master piece.
మేధ
హా.. అయితే చదవచ్చంటారా..? ఆ “కాల్ సెంటర్” దెబ్బకి నాకు చేతన్ భగత్ అంటేనే విరక్తి వచ్చేసింది.. అందుకే ఈ పుస్తకం ఇప్పటివరకు చదివే ధైర్యం చేయలేదు.. మీరు చెబుతున్నారు కదా, ఫర్లేదని! కుదిరితే ఓ లుక్కేస్తా… 🙂