అనేక : పదేళ్ళ కవిత్వం (2000-2009)
పంపిన వారు: వంశీ కృష్ణ
ప్రముఖ కవులు, విమర్శకులు అఫ్సర్, వంశీ కృష్ణ సంపాదకులుగా “సారంగ” బుక్స్ వారి తొలి ప్రచురణ “అనేక” పదేళ్ళ కవిత్వం ఇది. ముఖ్యంగా గ్లోబలైజేషన్ తరవాత తెలుగు కవిత్వంలో ఎలాంటి మార్పులు వచ్చాయో అక్షర సాక్షిగా నిలిచే కవితలతో ఈ సంకలనం వెలువడింది. సంపాదకులు వివరమయిన పీఠిక రాశారు. ఈ పదేళ్ళ కవిత్వాన్ని “అక్షరం” “అనుభవం” “అలజడి” “ఆందోళన” “అస్తిత్వం” “ఆవలి తీరం” “అనంతరం” అనే భావనలుగా వర్గీకరించి, ఆయా విభాగాలలో ఆ భావనలలో వొదిగే కవిత్వాన్ని ఎంపిక చేశారు.
“ఆవలి తీరం” ద్వారా ప్రవాస తెలుగు కవుల గొంతుకల్ని వినిపించడం మంచి ప్రయోగం. “అనంతరం” ద్వారా ఈ పదేళ్ళలో కన్ను మూసిన స్మైల్, జ్వాల ముఖి, కొత్తపల్లి, మద్దెల శాంతయ్య తదితరులకి నివాళిగా వారి కవితలని గుర్తు చేసుకోవడం సందర్భోచితంగా వుంది. అదే విధంగా, కేవలం అచ్చు పత్రికలలోనే కాకుండా, వివిధ అంతర్జాల పత్రికలలోనూ, బ్లాగులలోనూ వచ్చిన కవితలని ఎంపిక చెయ్యడం వల్ల సంకలనానికి ఒక నిండు దనం చేకూరింది.
“ప్రపంచీకరణ నీడలో పదేళ్ళు” అనే శీర్షికన సంపాదకులు రాసిన ముందు మాట అనేక కొత్త ఆలోచనల, భావనల కలయిక. సాధారణంగా కవిత్వాన్ని గురించి ఇంతకు ముందే ఏర్పడి వున్న నిర్వచనాల వెలుగులో కాకుండా, ఈ పదేళ్ళలో వెలువడిన కవిత్వాన్ని బట్టి కొత్త నిర్వచనలని వెతకాలన్న తపన ఈ ముందు మాటలో కనిపిస్తుంది. సాధారణంగా చాలా కవితల సంకలనాల్లో ప్రముఖులకి తప్పని సరి పెద్ద పీట వెయ్యడం జరుగుతుంది. కానీ, ఈ సంకలనంలో ప్రతి విభాగంలోనూ అనేక కొత్త స్వరాలు వినిపిస్తాయి. ఆ రకంగా సంకలనం ఒక తాజా పరిమళంలాగా, నిత్య నవీనంగా రూపు దిద్దుకుంది. తెలుగు సాహిత్య రంగంలో ఒక కొత్త పవనంలా వస్తున్న సారంగ బుక్స్ నించి మరిన్ని ఉత్తమ స్థాయి ప్రచురణలు వస్తాయన్న ఆశాభావాన్ని “అనేక” వాగ్దానం చేస్తోంది.
అనేక, పదేళ్ళ కవిత్వం
పుటలు: 404, వెల : రూ. 199.
డాలర్లలో : $ 9.99
సంపాదకులు: అఫ్సర్, వంశీ కృష్ణ
సారంగ సంపాదకులు: రాజ్ కారంచేడు
సారంగ బుక్స్ మిగిలిన వివరాలకు: www.saarangabooks.com
ఇండియాలో ప్రతులకు:
Palapitta Books
Flat No: 3, MIG -II
Block-6, A.P.H.B.
Baghlingampally,
Hyderabad-500 044 AP India
Direct: 040-27678430
Mobile Phone: 984 878 7284
Email: palapittabooks@gmail.com
బత్తుల వీ వీ అప్పారావు
how to post my poems/photos
పారదర్శి
ఈ పుస్తక సంపాదకుడే ఈ పుస్తక సమీక్ష చేస్తున్నారా? సరి కొత్త ప్రయోగం.