జలార్గళ శాస్త్రము – ఒక పరిచయం
జలార్గళ శాస్త్రము
రచన: వరాహ మిహిరుడు
వ్యాఖ్యాత: బి.ఎ.వి.స్వామి
ప్రకాశకులు: లక్ష్మీనారాయణ బుక్ డిపో, ఆకుల సూర్యనారాయణ అండ్ బ్రదర్సు, రాజమండ్రి, 1985
వెల: రెండున్నర రూపాయలు
పేజీలు: నలభై ఎనిమిది
ఈ పుస్తకం భూమ్మీద ఎక్కడెక్కడ నీరు దొరుతుందో తెలిపే శాస్త్రం గురించిన తెలుగు వ్యాఖ్యానం. ఇది రాసినది వరహమిహిరుడు. జ్యోతిష శాస్త్రం లో విశేష కృషి చేసిన మహా పండితుడు. ఆయన రాసిన ‘బృహత్సంహిత’ లో ఈ జలార్గళ శాస్త్రం ఒక అధ్యాయమట. అసలు తటాకాలు/బావులు వగైరాలు ఎన్ని రకాలు? ఎలాంటి ‘ఫీచర్స్’ ఉంటే తటాకం అంటారు? ఎలాంటివి ఉంటే ‘పుష్కరిణి’ అంటారు? ‘కూపం’ అని ఎప్పుడంటారు? ఇలాంటివి చెప్పాక, నీరు ఎలా ఉన్నా కూడా ‘వంకమద్ది చెట్టు పట్టతుంగగడ్డలు, వట్టివేళ్ళు ఎండబెట్టి చూర్ణము చేసి అట్టి జలాశయములలో వైచిన అవి మధురజలంబులగును’ ట. అంటే ఏమిటని అడక్కండి. నాకు ఆ మొదటి భాగం ఏమిటో అర్థం కాలేదు!
మానవుల శరీరంలో రక్త ప్రసరణకు రక్తనాడులు ఉన్నట్లే భూగర్భంలో నీటి ప్రవహం కోసం జలనాడులుంటాయనీ, అవి గుర్తించడానికి మామూలు మనుషులకి ఉపయుక్తమౌతుందని ఈ పుస్తకం రాసానని వరహమిహురుడు చెప్పాడు ఒక శ్లోకంలో. (అని వ్యాఖ్యాత వివరిస్తేనే నాకు అర్థమయ్యింది లెండి!) భూమ్మీదకి పడే నీరు ఒకే రంగు, రుచి కలదైనా, ఎక్కడ పడింది? అన్నదాన్ని బట్టి దాని రంగూ,రుచీ మారతాయి. కనుక, భూవిశేషముల గురించిన ఎరుకతో బావులు తవ్వాలి అని మిహిరుడి అభిప్రాయం. ఇక, జలనాడులు ఏవో, వాటిలో ప్రధానమైనవి, అధిక జలాలు కలిగేవీ ఏవో చెప్పారు.
తరువాత నుండి, ఎక్కువ నీరు ఉండే ప్రాంతాన్ని గుర్తించే సూచనలతో నిండింది పుస్తకం. ఉదాహరణకు:
శ్లో: “జంబూవృక్షస్య ప్రాగల్మీకో యధి భవేత్సమీవస్థః,
త్స్మాద్ధక్షిణపార్శ్వే సలిలం పురుష్వయే సాధు” (తొమ్మిదో శ్లోకం)
-అంటే నిర్జల ప్రదేశంలో ఉన్న నేరేడు చెట్టుకు తూర్పు దిక్కులో పుట్ట ఉంటే, దానికి దగ్గర్లో దక్షిణాన రెండు పురుష ప్రమాణములలోతు తవ్వితే అక్కడ అతి మధురమైన జలనాడి ఉంటుందట. (పురుష ప్రమాణము అంటే దాదాపు పది అడుగులంట)
ఇలా ఇతర చెట్ల కింద, లేదంటే ఇతర సందర్భాల్లో, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో వివిధ శ్లోకాల్లో చెప్పారు. సగం పైగా ముగిశాక, ‘ఇప్పటి దాకా సారస్వత మహాముని చే చెప్పబడిన జలార్గళ శాస్త్రమును చెప్పితిని. ఇప్పుడు మనువుచే చెప్పబడిన జలార్గళ శాస్త్రమును చెప్తాను అని చెప్పి, మరి కొన్ని సూచనలు ఇచ్చారు. అలాగే, బావులు గట్రా తవ్వుతున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు అడ్డం పడొచ్చు. వాటిని ఎలా పగులగొట్టాలో కూడా ఈ పుస్తకంలో చెప్పారు. అలాగే, చివరగా, చెరువులు ఎలా నిర్మిస్తే ఎక్కువ కాలం మన్నుతాయో, చెరువుల చుట్టూ ఎలాంటి వృక్షాలు పెంచాలో కూడా చెప్పారు. బావి తవ్వడానికి ఏ నక్షత్రాలు అనుకూలమో, ఏ దిక్కుల్లో తవ్వాలో కూడా చెప్పి ముగించారు. చివర్లో తవ్వడానికి ఉపయోగించవలసిన ‘జువ్వి పంగల పుల్ల’ ఎలాంటిది ఉండాలో చెప్పారు. (దీని బొమ్మే పుస్తకం కవర్ పేజీ పై కనబడుతుంది.)
అసలు ఆ భాష నాకర్థం కాదు అన్న సంగతి అటు పెట్టేస్తే, ఈ అంశం మీద ‘శాస్త్రం’ అనే స్థాయిలో పరిశోధించారా? అని అవాక్కయ్యాను. అదేమాట ఒకరితో అంటే – ’సివిల్ ఇంజినీరింగ్ లో భాగం అనుకోవచ్చుగా’ అని ఎదురుప్రశ్న వేశారు. నిజమేకదా, అనుకున్నాను. అయినా, ఈ లెక్కలన్నీ ఎలా వేశారో! ఈ చిన్ని పుస్తకంలో అంత వివరంగా రాయలేదు. అసలు లెక్కలేవీ చూపలేదు కానీ, మొత్తానికి నన్ను మాత్రం ఆశ్చర్యం వదలడం లేదు. ఇంతకీ, మరి ఈ కాంక్రీట్ జంగల్ లోకంలో ఈ లెక్కలు నిజమైనా కాకున్నా, ఆ ఫలానా చెట్లెక్కడి నుండి వెదుకుతారో! అసలు ఈ లెక్కన నేను ఈ పుస్తకం చదివి ఆ తరువాత ఫలానా ప్రాంతంలో నాకు నీరు లభ్యమవ్వాలంటే ఫలానా చోట ఒక చెట్టు ఉండాలనమాట అని అనుకుని, వెళ్ళి చెట్టు నాటితే కూడా ఇది నిజమౌతుందా?
ఏమైనా కూడా, ఆసక్తికరమైన సంగతి తెలిసింది ఈ పుస్తకం మూలాన! కనుక, నా మట్టుకు నేను ఇది నాకు దొరకడం వల్ల మంచి జరిగిందనే అనుకుంటున్నా. ఇంతకీ, బావులూ, చెరువులూ తవ్వేవాళ్ళు నిజంగా దీన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారా? మాలతి గారితో ఈ పుస్తకం గురించి చెబుతూ ఉంటే బావులు తవ్వేందుకు వాళ్ళ చిన్నప్పుడు ఏవో లెక్కలు వేసేవారని చెప్పారు. ఒకట్రెండు చందమామ కథల్లో ఇలా ఒక జ్యోతిష్యుడు స్థలం చూపించి ఇక్కడ బావి తవ్వమని చెప్పడం చూసి క్రియేటివిటీ! అనుకున్నా. అయితే, ఆ కథాంశాల వెనుక అసలు కథ ఇదన్నమాట!!
చివరగా: ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. ఇందకే నాకు తెలిసిన వివరాలు ఇచ్చేసా. చివరి వివరం -ఈ పుస్తకం ముద్రణాదారులు: విజయశ్రీ ప్రింటింగ్ ప్రెస్, కందకం వీథి, రాజమండ్రి-1.
V. Purushottam
Jalargala sastram copy okati naku kavali
Bonala Nagaraju
సౌమ్య గారికి నమస్కారాలు నా పేరు నాగరాజు జోషి జలార్గళ శాస్త్రం పుస్తకం లేదా పిడిఎఫ్ దయచేసి పంపగలరు అని ఆశిస్తున్నాను
Nagendra Prasad
నమస్కారము సౌమ్య గారు,
నాపేరు నాగేంద్ర ప్రసాద్ దైవజ్ఞ . జ్యోతిషాగమవాస్తు పరిశోధకులు.
– నెల్లూరు .9848569630
ఈ పుస్తకము మీవద్ద ఇప్పటికి ఉన్నట్లయితే నాకు దీని ప్రతి ఒకటి కావలెను. దయచేసి పంపగలరు.
దీనిని స్కాన్ చేసి పంపిన నాకు ఎంతో సహాయము చేయువారు అగుదురు. మీరి సహాయము చేయగలరని ఆశిస్తున్నాను.నా దగర మయvaasthu old copy ఉంది మీకు పంప గలను .
నా ఈమెయిల్ : astrotellernagendra@gmail.com
ప్రసాదం
సౌమ్య గారు,
వట్టివేళ్ళు సంగతి నాకు తెలుసు.
ప్లాస్టిక్ భూతం మనల్ని కబళించక ముందు రోజుల్లో, ఏర్ కూలర్ల (ఏర్ కండీషనర్ కాదు) తయారీలోవట్టివేళ్ళు ఒక ముఖ్యమైన భాగం. ఆ తరం ఏర్ కూలర్లలో కూలర్ ఫాన్ చూట్టూ మూడు వైపులా తేమను అట్టిపెట్టే పాడ్లను తాయారు చేయడానికి వట్టి వేళ్ళను ఉపయోగించేవారు. (ఆ వేళ్ళు దొరకడం మృగ్యమై ఇప్పుడు ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు లెండి.)
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ప్లాస్టిక్ పాడ్స్ బిగించివున్న కూలర్ ఒక వారం పాటు వాడకుండా వుంచి ఆపై వాడితే, గది మొత్తం నిలువ నీళ్ళ తాలూకూ నాచు మొక్కల దుర్గంధం వ్యాపిస్తుంది. అదే వట్టి వేళ్ళ ప్యాడ్ బిగించిన కూలర్ అయితే నెల తర్వాత అయినా (కొండోకచో, ఏడాది అయినా) చక్కటి సుగంధం వెదజల్లుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.., తొలకరి వానల సమయంలో అక్కడెక్కడో వర్షం పడుతుంటే, మనసు తడిసేలా కమ్మటి మట్టి వాసన వస్తుంది చూసారూ, అదిగో ఆ సుగంధం; ఉహూ, అంతకన్నా అద్భుతంగా,… కూలర్ పనిచేస్తున్నంతసేపూ వచ్చేది.
ఎలాంటి నీటినైనా, అహ్లాదంగా వట్టి వేళ్ళు మార్చగలవని, నేను స్వానుభవంతో చెప్పగలను .
* * * *
ఇదిగో ఎవరక్కడ, అర్జంటుగా నా చాతీ కొలత తీసుకోండి. భావి తరాలకు వట్టి వేళ్ళ జ్ఞానం అందించినందుకు నా చాతీ రెండు అంగుళాలు ఉప్పొంగింది.
-ప్రసాదం
kusuma kumari
మళ్ళీ రెండో జవాబు ;- నేను కూడా ౧౨ ఏళ్ళ నుండి ట్రై చేస్తున్నాను …………. జలార్గళ శాస్త్రం ; వరాహమిహిర ;- సౌమ్య గారూ, మీ సమీక్షా వ్యాసాన్ని చూడగానే నాకు ఎంతో ఆనందం కలిగింది,
12 ఏళ్ళ నుండీ ప్రయత్నిస్తున్నా – ……
రెండు వస్తువుల కోసం ….
1. జలార్గళ శాస్త్రం ; వరాహమిహిరుడు ;
2. పచ్చబొట్టు కోసం సోదె చెప్పే వాళ్ళు – ఏ చెట్టు ఆకు పసరును వాడుతున్నారు!?
అతి సులభంగా దొరుకుతాయనే అనుకున్నాను, కానీ చిత్రమేమిటంటే ఆ రెండూ ఇప్పటికీ దొరకనే లేదు …….
Sudhir
నమస్కారము సౌమ్య గారు,
నాపేరు సుదీర్ ఈ పుస్తకము మీవద్ద ఇప్పటికి ఉన్నట్లయితే నాకు దీని ప్రతి ఒకటి కావలెను. దయచేసి పంపగలరు.
దీనిని స్కాన్ చేసి పంపిన నాకు ఎంతో సహాయము చేయువారు అగుదురు. దీనికొరకు నేను గత 4 సంవస్సరముల నుండి ప్రయత్నిస్తున్నాను. మీరి సహాయము చేయగలరని ఆశిస్తున్నాను.
నా ఈమెయిల్ : dheera18@gmail.com
kusumaamba1955
నేను కూడా ౧౨ నుండి ట్రై చేస్తున్నాను ………….
gaddeswarup
This may be a part of Brhat Samhita of Varahamihira. Pl. check page 501 available in preview:
http://books.google.com.au/books?id=y_c7atbRFDQC&printsec=frontcover&dq=Brhat+Samhita+of+Varahamihira&source=bl&ots=PcWK8shJQI&sig=kaKyub7r-UAbH0etUuK2CSoVhQ4&hl=en&ei=O_QzTbnYCYaMvQPYxPDuCw&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CBUQ6AEwAA#v=onepage&q&f=false
Potikuchi balasundaram
ilanti pustakam pkti umdi ani kudaa teliyadu i pstakaani i krimdichirunaamaki vpp lo pampagalara
తేజస్వి
సౌమ్యగారూ, కాదంబరిగారూ ఒక కొత్త సబ్జెక్టును గురించి తెలిపినందుకు అభినందనలు, కృతజ్ఞతలు.
kadambari
హమ్మయ్య! ఒక మంచి పుస్తకం ఆనవాళ్ళు ఐనా చెప్పారు.
పాట్నీ దగ్గర బండి మీద బుల్లి పుస్తకం, పద్య రూపంలో దొరికితే, కొన్నాను.
ఒక స్నేహితురాలికి ఇచ్చాను, అంతే! అది కాస్తా, “పర హస్త గతం ఐంది. ఎంత బతిమాలినా “నాకు అసలు ఇవ్వ లేదు.” అని జవాబు.
మార్కెట్టును గాలిస్తున్నాను, ఊహూ! దొరకలేదు.
మళ్ళీ ఏ పబ్లిషర్సు ఐనా మన విపణి వీధికి తెస్తే బాగుణ్ణు!
నేను నా బ్లాగులో , Essay రాసాను.
akhilavanitha- April 23, 2009 ,
Please, see and give your opinions!
వ్యాస రచయిత్రీ!సోదరి సౌమ్య గారూ!
అందుకోండి మా సంక్రాంతి శుభాకాంక్షలు.