మళ్ళీ మళ్ళీ చదివే పుస్తకాలు

“ఇలా ఏ సందర్భంలోనైనా అరలో ఉన్న పుస్తకాలన్నింట్లో మీ వేళ్ళు ఒక పుస్తకాన్ని ఎన్నుకుంటాయా?” – అని అడిగారు ఫోకస్ ప్రకటనలో…ఇక్కడ చెప్పాల్సిన సంగతేమిటంటే – నా వేళ్ళకి వైవిధ్యం ఆయువుపట్టు… మొనాటనీ గొడ్డలిపెట్టు. కనుక, అలాంటి ఒకేఒక పుస్తకం అంటే, వేళ్ళన్నీ ఒక్కసారిగా చేతుల్ని పైకెత్తేస్తాయి. కనుక, అన్నిపేజీలు తిరగేసినా..ఒకే పేజీ పదిసార్లు చదివినా…ఏం చేసినా… నాకో జాబితా ఉంటుంది. అదే అతిజాగ్రత్త అని కూడా అనుకోవచ్చును. ఒకటి – అది దొరక్కపోతే మరోటి…అదీ దొరక్కపోతే ఇంకోటి. అసలు దొరికినది అప్పుడు చదివే మూడ్ లేకపోతే జాబితాలోంచి ఇంకోటి..అదీ దొరక్కపోతే…..

సర్లెండి… కలగాపులగంగా, క్లాసిఫై చేయలేని విధంగా ఉండే నా జాబితాలోని కొన్ని పుస్తకాలు గత ఫోకస్ లో చెప్పాను. ఇప్పుడిక్కడ కొన్ని పేర్లు రిపీట్ అవుతాయి. కొన్ని తొలిసారి కనిపిస్తాయి. కొన్ని గుంపుల్లో మాత్రమే కనిపిస్తాయ్!

-చందమామలు,’బాలమిత్ర’లు,’యువ’లు, టింకిల్ లు, డిస్నీ కామిక్స్, టిన్‌టిన్ కామిక్స్ , కొన్ని ఇంద్రజల్ కామిక్స్- ఎప్పటికీ‌ బోరు కొట్టవు.

-షెర్లాక్ హోంస్ నవల్లు, బ్యోంకేశ్ బక్షీ కథలు, ఫెలూదా కథలు, ప్రొఫెసర్ శంకు కథలు (చివరి రెండూ -సత్యజిత్ రాయ్): ఇవీ అంతే. సస్పెంసులు తెలిసి చదివినా కూడా బోరు కొట్టవు.

-ఆర్కే నారాయణ్ : మాల్గుడీ‌డేస్, మైడేస్; ఆర్కే లక్ష్మణ్:ఐడిల్ అవర్స్; సత్యజిత్ రాయ్:ఫతిక్‌చంద్- చదవడం అబ్బినప్పట్నుంచీ మొన్నమొన్నటిదాకా తిరగేస్తూనే వస్తున్నా.

-భానుమతి : అత్తగారి కథలు, నాలోనేను; జరూక్ శాస్త్రి కథలు, శ్రీపాద కథలు, కుల్దీప్ నయ్యర్ – ‘తీర్పు’, ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’, పడక్కుర్చీ కబుర్లు, : హైదరాబాదులో ఉన్నన్నాళ్ళూ వీటిల్లో ఏదో ఒకటి బెడ్‌టైం లో పక్కనే ఉండేది.

-మహాప్రస్థానం – ఆంలైనో, ఆఫ్‌లైనో, మనసో, మెదడో :‌నన్ను వదలక వెంటాడుతుంది.

-సత్యజిత్ రాయ్ కథలు – ఎప్పుడు దొరికితే అప్పుడు కూర్చుని చదివేశేయడమే!

-లాస్ట్ లెక్చర్ – లెక్కలేనన్నిసార్లు చదువుకుని ఉంటా‌ఈ రెండేళ్ళలో!

ఆగ్డెన్ నాష్ కవిత్వం – ఇది అయితే, మొబైల్ ఫోను లో‌కూడా ఉంది కనుక, ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడే!

-ఎడ్వర్డ్ లియర్ కవిత్వం – “Nonsense is the breath of my nostril!” – Edward Lear. Nonsense is the nostril for my breath! – నేను! 🙂

కోతికొమ్మచ్చి – ఎన్నిసార్లు తిరగేసినా మళ్ళీ తిరగేయాలి అనిపిస్తుంది!

-The Emerging Mind – V.S.Ramachandran : ఇటీవలి కాలం లో…ఎప్పుడు తీసిన ఆపకుండా చదివించిన పుస్తకం

మళ్ళీ‌మళ్ళీ‌చదవాలన్నంత ఇష్టం ఉన్నా, నా వద్ద లేవు కనుక (అవి చదివినప్పుడు నేను కొనుక్కునే స్థితిలో లేను కనుక) చదవలేనివి:
-బెంగాలీ నవల్లు – పథేర్ దాబీ, శ్రీకాంత (శరత్), కలకత్తా కి దగ్గరిలో‌(రచయిత గుర్తులేదు), పథేర్ పాంచాలి, అపరాజితో‌(బిబూతి భూషణ్), ఛౌరింగీ (శంకర్);
-అశోకమిత్రన్ తమిళ నవలకు ఆంగ్లానువాదం – the eighteenth parallel (ఇదే తెలుగులో జంటనగరాలు అని వచ్చింది)
-ఇల్లాలి ముచ్చట్లు – పురాణం సీత
-టు సర్ విత్ లవ్ – ఈ.ఆర్.బ్రైత్వైట్
-The tenth rasa – an anthology of Indian nonsense.

నాకు తెలుసు మీరంతా మనసులో ఏమనుకుంటున్నారో‌ నా చాంతాడంత లిస్టు చూసి. మీరే అనుకుంటున్నారు కనుక, మీకు తెల్సు కనుక, నే బయటకు చెప్పను!

You Might Also Like

11 Comments

  1. భరద్వాజ

    బారిష్టర్ పార్వతీశం నీ కుడా ఎన్నిసార్లు చదివినా చదవాలి అనిపిస్తుంది. 10th క్లాసు నుంచి చదువుతున్నది అది. రాదుగా ప్రచురణాలయం వారి రుస్సియన్ కథల తెలుగు అనువాదాలు కుడా. కాని ఈమధ్య అవి దొరకడం లేదు విజయవాడ లో బెంగుళూరు లో ట్రై చెయ్యలేదు దొరకవు అనే వుద్దేశ్యం తో. లలిత గారి “నా వేళ్ళకి వైవిధ్యం ఆయువుపట్టు… మొనాటనీ గొడ్డలిపెట్టు” ప్రయోగం బాగుంది.

  2. Bharadwaja

    @శారద:
    Me too like Calvin cartoons, in fact whenever i feel bored, read them online for sometime :).

    Raduga Prachuranalayam vaari Russian anuvaada khadalu ante kuudaa naku chaala istam. school lo vunnappudu konni konukkunnanu, ippudu kondaam ante dorakadam ledu. Any Idea where we can get them?

  3. manosri

    nice. I too have that habbit. mostly i use to read mahaprasthaanam, chandamama, kandukuri rameshbabu’s lepensure, dontfeel bks.

  4. శారద

    మంచి లిస్టే!
    నా లిస్టులో ముందస్తుగా వుండేది కాల్విన్ ఎండ్ హాబ్స్! అవడానికదొక ఆరేళ్ళ కుర్రాడి వ్యాఖ్యానాలూ, పెర్స్పెక్టివే కానీ మనందరిలోనూ అలాటి ఆరేళ్ళ కొంటె కోణంగి వున్నాడని నా అనుమానం. ఎవరైనా ఇంత వరకూ చదివి ఉండకపోతే తప్పక చదవండి! నవ్విస్తూ మన జీవిన విధానాల గురించి ఆలోచింప జేస్తాయి కాల్విన్ కార్టూన్స్.

    శారద

    1. sanath

      saradha garu,how to become a member of pustakam.net?

    2. సౌమ్య

      Sanath garu: Please read “వ్యాసకర్తలకి సూచనలు” in this page.
      http://pustakam.net/?page_id=333

  5. gottipati

    adavi bapiraju gari Konagi, gopichand gari asamardhuni Jeevitha yatra, kommuri – penkutillu marala marala chadavinchevi

  6. ramnarismha

    Your article is very nice.

    Congratulations.

    My favourite books:-

    1)Gouthama Budha (any book)
    2)Geetanjali(Tagore)
    3)Abdulkalam`s autobiography.
    4)Mahathma Gandhi`s autobiography.
    5)Mind Power (Yandamuri)
    6)Jiduu Krishnamurthy (by Abburi Chayadevi gaaru)
    7)Satyagraha in South-Africa (M.K.Gandhi)
    8)Teaching Methods (by Chukka Ramaiah gaaru)
    9)Prardhana (Yandamuri)
    10)The kinddom of God is within you (Tolstoy)

    (ramuputluri@yahoo.in)

  7. సూర్యుడు

    పానుగంటి వారి సాక్షి ఎక్కడైనా ఆన్లైన్లో చదవడానికి దొరుకుతుందా?

    ~సూర్యుడు

  8. లలిత

    హమ్మయ్య, చందమామలు ఉన్నాయి కదా.
    అవి రాయవచ్చో కూడదో అని మొహమాటపడ్డాను 🙂
    అలాగే అమర చిత్ర కథలూ, రీడర్స్ దైజెస్టులు(బాగా పాతవి) కూడా.
    నిజానికి పాత పత్రికలేవైనానేమో. (ఇవన్నీ నా దగ్గర లేవు. ఉంటే, ఎక్కడైనా కనిపిస్తే, అని)
    మాల్గుడీ డేస్ కూడా, అవును. చిన్నప్పుడు చదవలేకపోయాను. అప్పుడైతే ఎక్కువ నచ్చేవేమో.
    ఇప్పుడు కేవలం నాస్టాల్జియా.
    టింటిన్లు కూడా చిన్నప్పటి ఇష్టంతో చదవలేకపోతున్నాను.
    Asterix మాత్రం ఎన్ని సార్లైనా చదవచ్చు, బొమ్మలు చూసి ఆనందించచ్చు, వ్యంగ్యాన్ని అర్థం చేసుకుని నవ్వుకోవచ్చు.

    షెర్లాక్ హోంస్ కథలా? చదివితే బానే ఉంటుంది.
    unabridged చదవడం కష్టం నాకు.
    ఇంక మిగిలిన వాటిలో ఏవీ నేను చదవలేదే 🙁
    ఎక్కడైనా దొరికితే పాత ఇంగ్లీషు,బహుశా పై తరగతి తెలుగు, పాఠ్యపుస్తకాలు – నా చిన్నప్పటివీ, అంతకంటే కొచెం ముందరివీ చదవాలని ఉంటుంది.
    ఇక్కడ దొరికే పిల్లల పుస్తకాలు (picture books) చదవడం నేర్చుకుంటున్న దశల్లో చదివేవి (చదివించేవి) ఎన్ని సార్లైనా తిరగేయచ్చు.

    Before I forget, “నా వేళ్ళకి వైవిధ్యం ఆయువుపట్టు… మొనాటనీ గొడ్డలిపెట్టు. “… Great expression!

Leave a Reply