కాపీరైట్స్:

 • ‘పుస్తకం’లో ప్రచురించిన రచనలపై సర్వ హక్కులూ ఆయా రచయితలకే చెందుతాయి.
 • ఇదివరకే ఆయా రచయితల బ్లాగుల్లోనో, ఇతర అంతర్జాల సైట్లలోనో ప్రచురింపబడ్డ వ్యాసాలు తిరిగి పుస్తకంలో ప్రచురించడానికి పంపవద్దు.
 • ఇంతకు ముందు ప్రింటు పత్రికల్లో ప్రచురించబడిన రచనలను ‘పుస్తకం’లో ప్రచురించేటపుడు, అందుకు అవసరమైన అనుమతులను రచయితలు, రచయిత్రులు పొందాలి. అలా పొందినట్లుగా వారు పుస్తకానికి సమాచారం అందించాలి.
 • ‘పుస్తకం’లో ప్రచురించబడ్డ రచనలను రచయితలు తమ తమ స్వంత బ్లాగులలో రెండు వారాల తరువాత ప్రచురించుకోవచ్చు.
 • ‘పుస్తకం’లో ప్రచురితమైన తమ రచనలను (అవి మొదటిసారిగా పుస్తకంలోనే ప్రచురితమైన పక్షంలో) రచయితలు తమ బ్లాగుల్లో కాక, అంతర్జాలంలో ఇతర చోట్ల మళ్ళీ ప్రచురించదలిస్తే, రచననంతటినీ కాకుండా, అందులో కొన్ని భాగాలను మాత్రమే ఉటంకిస్తూ, ‘పుస్తకం’లోని పూర్తి రచనకి లింకు ఇవ్వాలి.
 • ‘పుస్తకం’లో ప్రచురించబడిన తమ రచనలను అచ్చు పత్రికలకు పంపదలచుకొంటే, ఆ రచన ‘పుస్తకం’లో ముందుగా ప్రచురించబడిందని ఆయా ‌పత్రికల సంపాదకులకు రచయితలే తెలియజేయాలి. వేరే పత్రికకి ‘పుస్తకం’లో ప్రచురించబడిన రచనలని పంపేముందు – ఆయా పత్రికల ప్రచురణ విధానాలను తెలుసుకోవలసిన బాధ్యత పూర్తిగా రచయితలదే. ‘పుస్తకం’లో తమ రచన ప్రచురించబడిన సంగతి వేరే పత్రికలకు తెలియజేయకపోయినట్లైతే – తదనంతర పరిణామాలన్నిటికీ ఆ రచయితే బాధ్యత వహించాలి. ‘పుస్తకం’ వారు తాము పంపిన, తమకు అందిన ఆన్ని ఈమెయిళ్లనీ, రచయితలతో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలనీ భద్రపరిచి ఉంచుతారు.
 • తమ రచనలలో ఫొటోలుగాని, ఆడియోగాని, వీడియోగాని, మరేదైనా తమకి సొంతం కాని సమాచారాన్ని వాడినట్టైతే, ఆ సమాచారపు కాపీహక్కుల వివరాలను, హక్కుదారుని నుండి పొందిన అనుమతి వివరాలను రచయితలు ‘పుస్తకం’ సంపాదక వర్గానికి తెలియజేయాలి. కాపీహక్కులు కలిగిన కంటెటుని తగిన అనుమతులు లేకుండా వాడుకొన్న రచనలు ‘పుస్తకం’లో ప్రచురణార్హం కావు.
 • ‘పుస్తకం’లో ప్రచురించే రచనలలో చిత్రాలు, ఫొటోలు, ఆడియోలు, వీడియోలు, లేదా ఇతర సమాచారం వంటి సందర్భోచితమైన అదనపు కంటెంటును ‘పుస్తకం’ సమకూర్చుకొని, తగు అనుమతులు పొంది ఆయా రచనలలో ఉపయోగిస్తుంది. అటువంటి కంటెంటుని వాడుకోవడానికి అవసరమైన అన్ని అనుమతులూ ‘పుస్తకం’ వారు ‘పుస్తకం’ కోసం మాత్ర్రమే పొందుతారు. సదరు రచనలను రచయితలు ఎక్కడైనా మళ్ళీ ప్రచురించదలిస్తే, అదనపు కంటెంటు అనుమతుల విషయమై రచయితలు ‘పుస్తకం’ వారిని సంప్రదించవలసి ఉంటుంది.
 • ఆయా వ్యాసాల రచయితలు కాక, వేరెవ్వరూ ‘పుస్తకం’లో ప్రచురితమైన రచనలను ముందుగా ‘పుస్తకం’ అనుమతి పొందకుండా అంతర్జాలంలోగాని, వేరెక్కడైనాగానీ వాడుకోరాదు. రచయితలు కాక, వేరే పత్రికలుగాని, సంస్థలుగాని – ‘పుస్తకం’లో ప్రచురించబడిన రచనలని తిరిగి ప్రచురించదలచుకొన్నా, లేదా వేరే రకంగా ఉపయోగించదలచినా – ‘పుస్తకం’ వారికి తెలియజేస్తే, అయా రచయితలని సంప్రదించి ‘పుస్తకం’ వారికి రచయిత నిర్ణయాన్ని తెలియజేస్తుంది.
 • కాపీహక్కులు, అనుమతులకు సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను editor@pustakam.net అనే ఈమెయిలైడీకి ఈమెయిలు పంపడం ద్వారానే చెయ్యాలి. ఈ విషయమై ‘పుస్తకం’ లోని వివిధ పేజీలకు వ్యాఖ్యల ద్వారా పంపే సందేశాలను ‘పుస్తకం’ పరిశీలించదు. ఇతర పద్ధతుల ద్వారా పంపే ఉత్తరాలను, ఇతర ఈమెయిలైడీలకు పంపే ఈమెయిళ్ళను కూడా ‘పుస్తకం’ పరిశీలించదు.

వ్యాసకర్తలకి సూచనలు:

 1. మీ వ్యాసాలకూ, వాటికి వచ్చే స్పందనలకూ మీదే భాద్యత. పుస్తకం.నెట్ కీ సంబంధం ఉండదని గమనించగలరు. ప్రచురణ విషయంలో మాదే తుది నిర్ణయం.
 2. తెలుగులో రాసే వ్యాసాలు తప్పనిసరియై యూనికోడులోనే ఉండాలి.
 3. మీ వ్యాసాన్ని అర్థం చేసుకోడానికి ఉపకరిస్తాయనుకుంటే యధేచ్ఛగా బయటి సైట్లకి లింకులు ఇవ్వవచ్చు. కానీ, వీలైనంత వరకు మీ బ్లాగులకి లింకు ఇవ్వడం తగ్గించండి, ఇక్కడి వ్యాసం అర్థం చేసుకోడానికి అక్కడి వ్యాసం దోహదపడుతుందని మీరు భావిస్తే తప్ప.
 4. వీలైనంత వరకు సరళమైన, గౌరవమైన భాషను వాడేందుకు ప్రయత్నించండి.
 5. వ్యాసం నిడివి పై ఎలాంటి ఆంక్షలూ లేవు.
 6. ఏ భాషా పుస్తకం గురించైనా ఇక్కడ రాయవచ్చు. వీలైనంత వరకూ వ్యాసం తెలుగులో ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంగ్లీషు భాషా వ్యాసాలు కూడా పంపవచ్చు. (ఉదా: తెలుగు రచనల అనువాదాల గురించి ఇంగ్లీషులో చెప్తే ఎక్కువ మంది చేరే అవకాశం ఉందనిపిస్తే, అలానే రాయచ్చు)
 7. మీ వ్యాసాలను పంపవలసిన చిరునామా: editor@pustakam.net