నేనూ తయారుచేశానొక జాబితా….

నేనూ ఓ జాబితా తయారు చేయడం మొదలుపెట్టాను. ఒక సంఖ్య అని అనుకోలేదు కానీ, ఇప్పటిదాకా చదివినంతలో నాకు నచ్చినవి మాత్రం రాద్దామనుకుంటూ మొదలుపెట్టాను. అదే ఇది.

గమనిక: అనువాదాలను లిస్టుల్లో చేర్చలేదు.

వ్యాసాలు:

కొ.కు. వ్యాసాలు (అన్ని రకాలవీనూ) : విషయ పరిజ్ఞానానికి …
నండూరి రామ్మోహనరావు (నరావతారం, కొన్ని ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు) : అరటిపండు వొలిచి నోట్లో పెట్టినట్లుంటాయన్న బాపూ గారి కార్టూన్ ను గుర్తు తెచ్చుకుంటూన్నాను..
మహీధర నళినీమోహన్ రచనలు (దాదాపు అన్నీ) : ఇవి చదువుతూనే ఎన్నో ప్రశ్నల సమాధానాలు తెలుసుకున్నాను.
కాలరేఖ, రక్తరేఖగుంటూరు శేషేంద్రశర్మ : ఒక గొప్ప మేధావి, కవీ అయిన ఈయన రాసిన సాహిత్య వ్యాసాలు చదువడం అద్భుతమైన అనుభవం. ముఖ్యంగా రామాయణ భారతాలపై రాసిన వ్యాసాలు.
రామాయణ విషవృక్షం (వ్యాసాలనే లెక్కేద్దాం!) – రంగనాయకమ్మ : అదొక రకం వశీకరణం. నేను చెప్పేదే కరెక్టు అన్నా కూడా, అంత కన్విన్సింగ్గా చెప్పడం అందరికీ చేతనౌనా?
పోస్ట్ చేయని ఉత్తరాలు – గోపీచంద్: నా మనసుని చదువుతున్నట్లు అనిపించింది.
ప్రేమలేఖలు-చలం : మళ్ళీ, నా మనసుని చదువుతున్నట్లు అనిపించింది.
కొమ్మకొమ్మకో సన్నాయి -వేటూరి : ఎప్పుడు తీసి చదివినా బోరు కొట్టదు.
రారా -సారస్వత వివేచన : వ్యాసాలు చాలా వివరంగా, సమీక్షలైనా కూడా అకడమిక్ వాసన లేకుండా, హాయిగా ఉన్నాయి చదువుకునేందుకు.
మాలతి గారి ’వ్యాసమాలతి’ వ్యాసాలు : ఇక్కడ తగిలిన వ్యక్తులూ, వివరాలూ ఇప్పటిదాకా ఎక్కడా తగల్లేదు నాకు. కనుక, నా అజ్ఞాన తిమిరంలో లేడీ విద్ ది ఎస్సేస్ లా మాలతి గారు, ’ల్యాంప్’ లా వ్యాసాలు 😉

నవలలు:

అంతర్ముఖం – యండమూరి : పద్దెనిమిదేళ్ళప్పుడు చదివినందుకేమో కానీ, మహా నచ్చేసింది అప్పట్లో.
చదువు – కొ.కు. : చదివినది కొన్ని సార్లే ఐనా, ఎప్పుడూ తల్చుకుంటూ ఉండే నవల.
పురాణ వైర గ్రంథమాల (పన్నెండు భాగాలు) – విశ్వనాథ : మొత్తం పన్నెండూ చదవలేదు. చదివినవి మొత్తంగా నచ్చలేదు. అయితే, అద్భుతమైన ఊహాశక్తికి నాకివంటే ఇష్టం.
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా – దూరదర్శన్ ప్రభావంలో విపరీతంగా నచ్చింది. పుస్తకం టెలీఫిల్మ్ అంత నచ్చలేదు కానీ, అయినప్పటికీ నాకిష్టమే!
నవీన్ ట్రైలజీ – ’కాలరేఖలు’,’చెదిరిన స్వప్నాలు’,’బాంధవ్యాలు’ : చదివినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. ఏకబిగిన చదివాను. ’బాంధవ్యాలు’ కాస్త బోరు కొట్టించినా, మొత్తంగా ఈ ట్రైలజీ నాకిష్టం.
సలాం హైద్రాబాద్ – హైదరాబాదు కథ కనుక, ఇదంటే నాకిష్టం.

కథలు:

కొ.కు. కథలు : కథాంశాలకు, కథన రీతికి
శ్రీపాద కథలు, జరూక్ శాస్త్రి కథలు –
స్వచ్ఛమైన తెలుగుకు
కొడవటిగంటి కృష్ణమూర్తి కథలు, శ్రీశ్రీ కథలు -నాకు కనబడ్డ కొత్తదనానికి
అత్తగారి కథలు – భానుమతి రామకృష్ణ, కాంతం కథలు – మునిమాణిక్యం నరసింహారావు : హాయిగా నవ్వుకునే హాస్యానికి
విశాలాంధ్ర వారు వేసిన వందేళ్ళ తెలుగు కథ సంకలనం, తెలుగు కథ – 1960-80 -వాసిరెడ్డి నవీన్: తెలుగు కథలు ఎన్ని రకాలో! అని ఆశ్చర్యం కలిగించినందుకు

(ఇవీ కథా పద్ధతిలో సాగుతాయి కనుక…)
పడక్కుర్చీ కబుర్లు – ఎమ్బీయస్ ప్రసాద్ : ఈ సీరీస్ లో చదివినంతమటుకు అన్నీ బాగున్నాయ్!
తాంబూలం – మృణాళిని : ఆంధ్రజ్యోతిలో వచ్చినపుడు ఇంటిల్లిపాదీ చదివేవాళ్ళం. అలా చదివించిన కాలం మరోటి తగల్లా మళ్ళీ!
ఇల్లాలి ముచ్చట్లు – పురాణం సీత : సూటిగా తగిలే వ్యంగ్యాలకూ, హాస్యానికీ

ఆత్మకథలు:

కోతికొమ్మచ్చి – కొమ్మ,కొమ్మకీ ఎగురుతూ చెప్పే కబుర్లకి ..
నాలోనేను – భానుమతి రామకృష్ణ : వైవిధ్యభరితమైన వ్యక్తిత్వానికి
చిత్తూరు నాగయ్య ఆత్మకథ – నిష్కల్మషత్వానికి
అనంతం (శ్రీశ్రీ) – నిక్కచ్చితనానికి

కవిత్వం,పద్యాలు మొ.:

ఇస్మాయిల్ కవితలు – నా ప్రపంచంలోనే కొత్తబంగారు లోకాన్ని పరిచయం చేసినందుకు
కృష్ణపక్షము – భావుకత్వానికి
మహాప్రస్థానం – రేకెత్తించే ఆవేశానికి
స్వప్నలిపి (అజంతా) – వెంటాడే గుణానికి
వివిధ శతకాలు – తేలిగ్గా అర్థమయ్యేలా ఉన్న గ్రాంథికానికి
ఫిడేలు రాగాల డజను – లిపితో ఆడుకున్న తీరుకి
ఆలూరి బైరాగి కవితలు (అప్పుడోటీ ఇప్పుడోటీ చదివినంతలో) – కరెక్టుగా నాకేమనిపిస్తోందో అది రాసినందుకు

సాహిత్య సురభి – విశ్వనాథ : తెలుగు పద్యాల అందాన్ని పరిచయం చేసినందుకు

-నాకు నచ్చిన పుస్తకాలు.

You Might Also Like

4 Comments

  1. పుస్తకం » Blog Archive » మళ్ళీ మళ్ళీ చదివే పుస్తకాలు

    […] ఉండే నా జాబితాలోని కొన్ని పుస్తకాలు గత ఫోకస్ లో చెప్పాను. ఇప్పుడిక్కడ కొన్ని పేర్లు రిపీట్ […]

  2. suryam

    you have lot of variety in your list . surprised to find yandamuri’s writing in your list . tenneti suri’s ” chemgizh khan ” is my favorite .

  3. malathi

    అన్నట్టు మరిచాను. నీ చిట్టాలో వైవిధ్యం నాకు నచ్చింది. నిజానికి చదవడంలో అదొక ముఖ్యభాగం అనుకుంటా. అభిందనలు.

  4. మాలతి

    :)) నీజాబితా ఇంకా చాలా పెద్దదిగా ఉంటుందనుకున్నా… :p.

Leave a Reply