మధుపం – పూడూరి రాజిరెడ్డి
రాసి పంపిన వారు: బొల్లోజు బాబా
****************************
వచనానికి కవిత్వం తోడయితే అది సుగంధాల్ని మోసుకుతిరిగే మలయమారుతమై మారి చదువరికెంతో హాయి గొలుపుతుంది. ప్రేమని తిరస్కరించలేని అనివార్యతలాంటిదేదో అలాంటి వాక్యాల్ని హృదయానికి హత్తుకొనేలా చేస్తుంది.
” ఉత్తమ క్రమంలో పేర్చబడ్డ పదాలు, ఉత్తమ క్రమంలో పేర్చబడ్డ ఉత్తమ పదాలు” అంటూ వచనాన్నీ, కవిత్వాన్నీ విడదీస్తాడు కోల్రిడ్జ్. కానీ ఒక్కోసారి ఈ రెంటిమధ్యా సరిహద్దు రేఖను గుర్తించటం చాలా చాలా కష్టం. సరిగ్గా అలాంటి అనుభవమే “మధుపం” అనే పుస్తకం చదివేటపుడు కలిగింది. పుస్తక రచయిత పేరు పూడూరి రాజిరెడ్డి. సాక్షి పత్రికోద్యోగి.
వచనం వ్రాసినా సరే కవి లానే వ్రాయాలన్న నియమం ఏమన్నా పెట్టుకొన్నాడేమో ఈ రచయిత, చక్కటి కవిత్వం పేజీ పేజీనా హాయిగా మొహానికి తగుల్తూ మోహపరుస్తుంది.
ఈ పుస్తకంలో మొత్తం ఇరవై అయిదు వ్యాసాలున్నాయి. దాదాపు ఇవన్నీ సాక్షి పత్రికలో జెంటిల్మేన్ శీర్షికన ధారావాహికంగా వచ్చినవే.
ఒక రచన చేసేపుడు, నీవద్ద ఒక ఖాళీ కాగితం, ఒక పెన్సిలు, సత్యాల్ని పరమసత్యాలుగా ఆవిష్కరించవలసిన బాధ్యతా ఉంటాయి. పచ్చిపచ్చిగా ఉండే వాటిని తీసుకొని, వాటిని పూర్తిగా మాగిన వాటిలా మార్చాలి. ఆ పని సహజంగా జరిగినట్లనిపించాలి. . అప్పుడు మాత్రమే ఆ రచన చదువరి అనుభవంతో మమేకం కాగలదు.
—- హెమ్మింగ్వే.
పై వాక్యాలు ఈ రచయిత తీసుకొన్న వస్తువుకి చక్కగా సరిపోతాయి. ఈ వ్యాసాలన్నీ స్త్రీ పురుషుల సంబంధాలకు సంబందించినవే. అలాంటి వస్తువుని తీసుకొని, ఒక పురుషుని కోణాన్ని ఎంత సున్నితంగా ఆవిష్కరించినా, ఎమ్.సీ.పీ. అన్న బిరుదు రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి వస్తువు పచ్చి పచ్చిగా ఉంటుంది. దాన్నిఈ రచయిత తర్కంతోనూ, కవిత్వంతోనూ పండించగలిగాడు. ఇదంతా సహజమేనని చదువరిని నమ్మించగలిగాడు. ఈ వ్యాసాలు చదువరి ఆలోచనలతో మమేకం అయ్యాయి అన్న విషయం రాజిరెడ్డి గారి మాటల్లోనే …..” ఈ పుస్తకంలో నేను ఎంత ఉన్నాను, జనరలైజేషన్ ఎంత? అంటే చెప్పటం కష్టం. ఇది రాస్తున్న వారాలన్నీ ‘మీరు మా ఇంట్లో రహస్యంగా ఉండి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారా?’ అని అడిగిన మగవాళ్లున్నారు. అంటే, చాలామంది వీటితో ఐడెంటిఫై అయ్యారు. ఆ లెక్కన ఇందులో పెళ్లయిన ప్రతీ మగాడున్నాడు.”
ఈ పుస్తకంలో ఎందరో జెంటిల్మెన్ లు మనసు విప్పిమాట్లాడుతూంటారు. ఆఫీసులో ఆరునెలలక్రితం పరిచయమైన అమ్మాయి ప్రెజెన్స్ కోసం శలవురోజుకూడా ఆఫీసుకొచ్చే ఓ జెంటిల్మెన్ – మర్యాదకు రిఫైన్డ్ వెర్షనే షివల్రీ అని గొప్ప రహస్యాన్ని విప్పి చెప్పే మర్యాదస్తులు – పొద్దున్న లేవగానే నల్ల నీళ్ల కోసం లుంగీ ఎత్తికట్టి, మళ్లీ నీళ్ళు ఎప్పుడొస్తాయో అని ఆలోచిస్తూ లుంగీ దించి పడుకొనే దాకా సంసార సాగరాన్ని ఈదే మధ్యతరగతి ఉద్యోగులు – లేని గుర్రాన్ని కట్టి, ఊహా ఖడ్గాన్ని సవరించి, కష్టాల కళ్లాన్ని నియంత్రించి, మీసం మెలేసుకొంటూ అలా జాలీగా సంసార రధాన్ని నడుపుకొంటూ పోయే మగసిరి సింహాలూ – భార్యను చిన్న చిన్న విషయాలలో మాయచేయటంలో కూడా ఓ అందం, ఓ ఆకర్షణ, ఏదోలా కాపురాన్ని సౌఖ్యంగా మలచుకోవాలన్న తహతహ ఉందనే జెంటిల్ భర్తలూ – దు:ఖాన్ని గుండెల్లోనే దాచుకోవక్కరలేదనీ, తృప్తిగా జీవితానికి సరిపడా ఏడుద్దామనీ, ఏడిచే మగవాడిని నమ్మొచ్చని చాటిచెపుదామనే జెంటిల్మెన్లు – మా అటెన్షన్ నీ అందానికి సర్టిఫికేట్, నేను చూస్తున్నానో లేదో అని నువ్వు నా వైపు చూస్తుంటావు. నేను చూడగానే ఎందుకు చూసావన్నట్లు కెళ్లెగరేస్తావు, ఇదెక్కడి మోసమని వాపోయే జెంటిల్మెన్ – అమ్మపెట్టే కాకర చారు, అత్తమ్మ చేసే సాంబారు, అక్కచేసే ఉప్పిడి పిండి, వదిన చేతి చికన్ తిండి…. అవి కాదా బతికిన క్షణాలు. ఇంటికి వెళ్లడానికో కారణంగా కనిపించే నీ ఒంటి విరుపు, ఇంట్లోంచి బయటకి వచ్చేపుడు టాటా చెప్పే చిన్న కూతురు కళ్ళ మెరుపు …. వీటి కోసం మళ్లీ పుడితేనేం? అనుకొనే సగటు జీవులు —- ఇలా ఎంతో మంది “మనవాళ్లు” కనపడతారు. వాళ్లు చెప్పే ఆనందాలు, బాధలు, సమస్యలూ వింటూంటే ఇవన్నీ మనవే కదా అని అనిపిస్తుంది.
అలాగని ఈ రచయితను స్త్రీ ద్వేషిగానో, పురుషాహంకారిగానో పరిగణించలేం. కోపం తాపం, వాంఛ, వాత్సల్యం, అక్కసు, అభిమానం …. పురుషునికి సంబందించిన ఎన్నో ఎమోషన్స్ కు స్త్రీ కారణమౌతుందన్న ఎరుక కలిగే ఇలాగంటాడు “బహుసా ఒకరినొకరం భరించటానికే మనం పుట్టామేమో, అదే మన జన్మల రహస్యం కాబోలు” అని.
భార్యాభర్తలమధ్య చిన్నిచిన్ని గొడవలు ప్రతీ సంసారంలోనూ సహజమే. కలహానంతర కలయికలు ఈ జీవనయంత్రానికి కందెన వంటివి. దాదాపు అన్నిసందర్భాలలోనూ స్త్రీ యే క్షమయాధరిత్రి అన్న చందాన పురుషుణ్ణి కాపాడుతూంటుంది. ఇదే విషయాన్ని రచయిత ఇలా వర్ణిస్తాడు “ఒక్కోసారి అనిపిస్తుంది, ఒంటరిగా ఎక్కడికైనా పారిపోదామని, కానీ పోలేను. మౌనంలోకి వెళ్లిపోతాను. నీతో ఉంటూనే ఒంటరినౌతాను. కొన్ని క్షణాలు గంటలు పూటలు మనమధ్య నిశ్శబ్దం…. దాన్ని బద్దలు కొట్టే శక్తి నాకైతే లేదు. నువ్వే చొరవ తీసుకుంటావు. మళ్లీ చొరవ తీసుకున్నందుకు నన్ను దెప్పి పొడుస్తావు. నేను అలా చేయనందుకు పొగరంటావు”
“సంపాదించేది నేను … కాణీ లేదు” అనే వ్యాసం చాలా బావుంది. మరీ ముఖ్యంగా ఆ వ్యాసానికిచ్చిన ముగింపు. “నాన్న రాయని లేఖ” అనే వ్యాసంలోని ఆర్ధ్రత చదువరుల హ్రుదయాలను మెలిపెడుతుంది. దాన్ని వ్యాసమనాలో లేక ఒక మంచి కధ అనుకోవాలో తెలియదు కానీ, ఒక మంచి కధకుండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. (ఇదే కాదు ఈ సంకలనంలోని చాలా వ్యాసాలకి కూడా)
నీకు గాజులు – నాకు సంకెళ్లు అనే వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు పట్ల స్త్రీవాదులు ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది. దానిపై అరణ్య గారు భూమిక పత్రికలో వ్రాసిన స్పందనా వ్యాసాన్ని కూడా పుస్తకంలో జతపరచటం జరిగింది.
రచయిత కొటేషన్లనే ప్రతీ వ్యాసానికి హెడర్, ఫుటర్ లు గా ఉంచటం నచ్చింది. మచ్చుకు కొన్ని
“స్త్రీ, పురుషుడు సమానం అనే భావనే నాన్సెన్స్. మల్లెపూవు, గులాబీ… దేని ప్రత్యేకత దానిదే. వాటిని సమానం అనాల్సిన అవసరం ఏముంది?
“స్త్రీతో అటు ఉద్యోగమూ చేయించి, ఇటు ఇల్లూ చూసుకోవలనడం డబుల్ హింసించడమే”
“భర్త జుట్టులోకి ఆమె చేతులు జొనిపి, ఒక్కో వెంట్రుకను తట్టుతూ అలా వదిలేస్తుంటే, ఆమె వేళ్ళలోంచి కురుల కుదుళ్లలోకి జీవశక్తి ఏదో ప్రవహిస్తూంటుంది” —— ఇలా ఎన్నెన్నో.
ఈ పుస్తకంలోని వ్యాసాలు మంచి ఫ్రెష్ నెస్ తో బరువెక్కి ఉంటాయి. శైలిలో ఏదో గమ్మత్తు ఉండి వాక్యాల వెంబడి కళ్లను పరుగులెత్తిస్తుంది. వాక్యాల వెనుక తారాడే చిలిపితనం, ప్రేమ, ఆరాధన, విరహం, నిరసనా, పెంకితనం మంచి పఠనానుభవాన్ని మిగుల్చుతుంది.
చివరగా మహిళా దినోత్సవం సందర్భంగా వ్రాసిన “మీరు దేవతలు” అనే వ్యాసంలో ” మీరు ప్రేమించినంతగా మిమ్మల్ని ప్రేమించలేని మా బలహీనతను క్షమించండి” అన్న వాక్యాలు ప్రతి మగవాని అంతరంగాన్ని ఇముడ్చుకుందనిపిస్తుంది.
కాపీల కొరకు
మధుపం (ఓ మగవాడి ఫీలింగ్స్)
వెల: 45/-
పాలపిట్ట
16-11-20/6/1/1
403 విజయసాయి రెసిడెన్సీ
సలీం నగర్, మలక్ పేట్
హైదరాబాద్ – 500036
రచయిత మెయిల్: rajireddypoodoori@yahoo.co.in
subhani sk
Rajireddy garu namaste, mee rachanalu chala baguntayi, nenu mundu mee peru kanipinchina tarvata mee rachanalu chaduvutanu, naku correct ga date gurtuledu,oka funday book lo mee oka kavita lo “Nuvvu vunnav kabatti ee prapanchanni Kshaminchesanu” ani rasaru, aa line naku chala istam, appati nunde nenu mee fan ni andi, meeru yeppatiki ilage manchi manchi rachanalu cheyali.
kaasi raaju
Madhupam chaalaa baagundhi పూడూరి రాజిరెడ్డి annagaaru! ……….. mimmalni klavadam koodaa santhosamgaane undi!
inta chakkani sameekshaku Bolluju baabaa gaariki Dhanyavaadaalu
M V Prasad Reddy
Hai sir, Ur Reality check is super. What is Ur next Article in Saashi.
anusha
i am the fan of puduri rajareddy
Naresh
rajireddy garu namaste.mee rachanalu chala chala istam.meerante entho abhimanam.rachanalu vastavaniki daggaraga,andhanga,aasakthiga,vuntayi.mimmalni jivitantham gurtupettukunta.bye..!
Sadipirala Ravindra
డియర్ సర్ ఐ అం ఫాలోయింగ్ యువర్ సత్వం ఇన్ సాక్షి వీక్లీ ఫున్దాయ్ బుక్ రెగులర్ల్య్. రియల్లీ యువర్ ప్రెసెన్తతిఒన్ ఇస్ ఫెంటాస్టిక్. ప్లీజ్ కంటిన్యూ ది సమె .
santhosh
reddy gaaru……. please mimmalni kalavaali……. anumathinchandi
పూడూరి రాజిరెడ్డి
అయ్యో దానికేమి!
తప్పకుండా కలుద్దాం.
నేను హైదరాబాద్లో ఉంటాను. మీరు ఎక్కడ ఉన్నారు?
నరసింహారావు మల్లిన
తప్పకుండా కొని చదవాల్సిన పుస్తకాల లిస్టులో మధుపాన్ని చేర్చుకున్నాను.ఎప్పటికి వీలవుతుందో ఏమో?
rajireddy
‘కొత్తపాళీ’ గారు,
మా తోటలోకి వచ్చారా? అక్కడ కనబడలేదే!
కొత్తపాళీ
ఎలాగో ఈ పరిచయం మిస్సయ్యాను. యాదృఛ్ఛీకంగా ఇప్పుడు కళ్ళబడింది. పనిలో పనిగా రాజిరెడ్డిగారి ఫుకుయోకా తోట కూడా కళ్ళబడింది. బాబాజీ, పరిచయం చాలా బావుంది. తహిరో, అఫ్సర్ల వ్యాఖ్యలు బహు భేషు.
ఇక పుస్తకం సంపాయించాలి.
పుస్తకం » Blog Archive » 2009 – పుస్తక నామ సంవత్సరం
[…] పరిచయస్తులైనవాళ్లు రాసినవాటిలో పూడూరి రాజిరెడ్డి ‘మధుపం’, కృష్ణసాయిరాం ‘చూస్తునే ఉండండి’ […]
KumarN
Wow..I think I am missing out on good books.
That was a nice introduction baba garu
laxmi
పరిచయం బాగుంది, కొని చదవాలసిందే ఐతే
దీపసభ
హెచ్చార్కెగారూ,
//కొందరు స్త్రీవాదులు నెత్తికెత్తుకున్న ‘విశృంఖల ప్రణయం’ భావనను//
ఎక్కడ ఎవరు ఎత్తుకున్నారో చెప్పగలరా?
హెచ్చార్కె
డియర్ రాజిరెడ్డి, పుస్తకాన్ని ఇష్టంగా చదివాను. బాబా పరిచయం కూడా చాల బాగుంది. రచనలలోని కొన్ని అబిప్రాయాలతో విబేధించడం వేరు, రచనను ఇష్టపడడం వేరు… అని నేను భావిస్తాను. వ్యాసం అనే పదానికి సింగిల్ కోట్స్ పెట్టడం… వాటిని మీరు ‘వ్యాసాలు’గా కాకుండ ‘కాలమ్స్’గా రాశారని సూచించడానికి మాత్రమే. కాలమ్ కు మంచి తెలుగు మాట పుట్టినట్టు లేదు గాని, కాలమ్ కూ వ్యాసానికీ తేడా వుంది.
‘మధుపం’ అంటే తుమ్మెద. తుమ్మెదకూ పువ్వులకు మనం వూహించే సంబంధం తెలిసిందే. అది స్త్రీ మీద పురుషుడి ఆకర్షణనే కాక బహు భార్వత్వాన్ని (పాలీగమీని) కూడా సూచిస్తుంది. అందరం ‘బహు భర్తృత్వాన్ని’ (పాలియాండ్రీని) సైతం ఇష్టపడే రోజులు వచ్చిన తరువాత ‘బహు భార్వత్వం’ తప్పు కాదు. కాని , అది ఇప్పుడు మాత్రమ తప్పే. సరిగ్గా ఈ కారణంగానే కొందరు స్త్రీవాదులు నెత్తికెత్తుకున్న ‘విశృంఖల ప్రణయం’ భావనను వ్యతిరేకించాలి. అదంతా చాల రొమాంటిక్‍గా కనిపిస్తుంది గాని, డిజడ్వాంటేజ్డ్’ బృందాలకు… చాల ఎక్కువ మంది స్త్రీలకు… అది వ్యతిరేకంగా పని చేస్తుంది. దీని వెనుక తమ హీనత్వాన్ని దాచుకునే పురుష పుంగవులకు ఈనాడు కొదువ లేదు. అందుకే ఈ పదం వెనుక బయాస్ వుందని అన్నాను.
మీరన్నట్లు మిగతా మరి కొన్ని చోట్ల కూడా అలాంటి బయాస్ వుంది. అది అవాంఛనీయమే. ఏ మనిషికైనా ఆరోగ్యకర స్థాయిలో అహం అవసరమే. కాని ప్రత్యేకించి ‘మగ అహం’… అదీ స్త్రీల పట్ల ‘మన’కు… ఎందుకుండాలో, దానిలో వున్న అందమేమిటో నాకు తెలియదు. అలాంటిది ‘అనారోగ్యమే’ అనుకుంటాను. సింహానికి జూలుంది, కోడి పుంజుకు ‘కిరీటం’ వుంది; మరి, అలా ప్రత్యేకించదగినది, మనుషుల్లో మగవాళ్లకేముంది? ఈ సాదృశ్యం మీరైనా నేనైనా సరదాగా తీసుకొస్తన్నదే. సీరియస్ కాదనుకుంటాను. ఇలా మమ్మల్ని కలుసుకున్నందుకు చాల సంతోషంగా వుంది. థాంక్యూ.
rajireddy
హెచ్హార్కె గారికి,
ముందుగా నమస్తే.
ఫుస్తకం మీకు నచ్హినందుకు సంతోషం.
అయితే, మధుపం అని పేరు పెట్టదంలొ బయాస్ ఏముంది? మగ ప్రతీక అని నేనే చెబుతున్నానుగా!
ఇక వ్యాసాల్లో (మీరు సింగిల్ కోట్ పెట్టారు. వాటిని అలా అనకూడదనేగా) మీరు అన్నట్లు ఒకట్రెండు చోట్ల మగ అహం కనిపిస్తుంది. నిజమే. ఆ ‘ఎరిక’ నాకుంది. అందుకే, ఇది అతిశయమే, నిజం కాదు అన్నట్టుగా ఓ చోట వివరణ ఇచ్చాను, సింహం జూలు ఉదాహరణగా. ఆ అతిశాయాన్ని నేను తప్పు అని కూడా అనుకోవట్లేదు.
Another Post to Mr HRK in this link
http://raji-fukuoka.blogspot.com/2008/10/criticising-article-on-my-article.html
కామెంట్స్ రాసిన వారందరికీ థాంక్స్. అఫ్సర్ గారు నేను ఇలా రాయడం ఎలా సాధ్య పడిందో చెప్పమన్నారు. అదే ఆలోచిస్తూ ఉన్నా.
బొల్లోజు బాబా
hrk గారికి
నమస్తె,
ఆ వ్యాస విమర్శ పై నా అభిప్రాయాన్ని కావాలనే ప్రస్తావించలేదు. మీరన్నట్లు చెపితే, నా స్టాండ్ కొంత బహిర్గతమయ్యేదేమో. థాంక్యూ సర్
ఆ వ్యాసం పై వచ్చిన విమర్స గురించి నా అభిప్రాయాల్ని ఈ క్రింది లింకులో చూడవచ్చు ఒక కామెంటు రూపంలో …
http://raji-fukuoka.blogspot.com/2008/10/criticising-article-on-my-article.html
భవదీయుడు
బొల్లోజు
హెచ్చార్కె
బాబా సమీక్ష బాగుంది. రాజిరెడ్డి పుస్తకం కూడా బాగుంటుంది. కొన్ని చోట్ల బరువైన భావాలకు, సరదా రచనకు మధ్య సమతూకం ముచ్చట గొల్పుతుంది. స్త్రీవాదుల నుంచి వచ్చిన విమర్శను బాబా ప్రస్తావించారు. అందులో ఏముందో, తను ఏంనుకుంటున్నాడో (టూకీగానైనా) చెప్పాల్సింది. మధుపం అని శీర్షిక పెట్టడంలోనూ, ‘వ్యాసాల్లో’నే కొన్ని చోట్ల కూడా రచయిత బయాస్ కనిపించే మాట నిజమే.
vamseekrishna
పూదూరి రాజీ రెడ్డి “మధుపమ్” పుస్తకం మీద సమీక్ష చదివాను. బావుంది. స్త్రీ పురుష సంబంధాలను ఎక్కడికక్కడ నిర్వచించుకుంటూ జీవితాన్ని గడపడం నిజంగా ఒక అసిధార వ్రతమే. ఆ అసిధార వ్రతాన్ని మధూపం లాంటి పుస్తకాలు కాస్త తేలిక చేస్తాయి. మన అంతరంగంలో మనల్ని మనం
పోస్ట్ మార్టం చేసుకుంటూ వదిలివెయ వలసిన అవశేషాలను వదిలి వేస్తూ, సరికొత్త వూహలకి రెక్కలు ఇస్తూ జీవితాన్ని నిత్యం రసవంతం గా గడపటం
జీవన సౌరభాన్ని కోల్పోకుండా జీవితం గడపడం పురుషుడు ఇంకా నేర్చుకోవల్సే ఉంది. నిజంగా ఈ పుస్తకం చదవడం ఒక మార్చిపోలేని అనుభవమ్.
వంశీకృష్ణ
అఫ్సర్
ఇటీవలి నా ఇన్స్పిరేషన్ రాజి రెడ్డి. ఆకు మీద నీటి బిందువు జారుతున్నంత మెత్తగా, చలికాలపు బవిరి గడ్డాన్ని కోస్తూ మొండి బ్లేడు రాల్చిన నెత్తుటి గీరలా- రెండు రకాలా పదును రాజి రెడ్డి వాక్యం. ఎప్పుడు మెత్తదనం తాకుతుందో, ఎప్పుడు నెత్తుటి గీర ఆశ్చర్యంగా ఎర్రగా మెరుస్తుందో తెలీదు. ఇతని వాక్యాలు చదివాక వొక రహస్యం అర్ధం అయ్యింది: బహుశా మనం పత్రికా భాషా పెత్తనంలో అసలు తెలుగు మరచిపోయాము. ఇతను పత్రిక నీడలో వుండి కూడా తెలుగు పల్లెదనాన్ని, అసలు తెలుగు వాక్యపు ‘కత్తిలోతు ‘ (ఈ మాట మా వూరి మంగలిది, అతనికి థాంక్సు) దనాన్ని కాపాడుకుంటున్నాడు.లేకపోతే, అధిక రక్తస్రావంతో తీసుకుంటున్న నాగరీక తెలుగు కథల రాచపుండ్ల బారిన పడకుండా ఏ నాటు వైద్యం చేయించుకుంటున్నాడో!
రోజూ ఆ టీవీల సంకరత్వం చూస్తూ వింటూ కూడా చిన్నప్పుడు తన వూళ్ళో ఆ పసి చెవుల్లో పడిన అమృతం ఆవిరైపోకుండా జాగ్రత్త పడుతున్నాడు.
ఇది ఎట్లా సాధ్య పడిందో రాజిరెడ్డి ఎప్పుడయినా చెప్పాలి, ఈ “పుస్తకం” లోనో , మరెక్కడో!
చాలా కాలంగా రాజిరెడ్డి వాక్యాల గురించి నా కడుపులో పొగులుతున్న ఈ నాలుగు మాటలు చెప్పించిన బాబా సమీక్షకి ధన్యవాదాలు.
bandla madhavarao
samiiksha chalaa baadundi. ippuDE pustakam tecchukoni chadavaalanipincheelaa undi.
tahiro
ఈ మధ్యనే ‘మ«ధుపం’ నా దగ్గరకు వచ్చింది. చదవటం ప్రారంభించాను … ముందుమాటలో మాధవ్ శింగరాజు రాసిన “మీసాలొచ్చినవాడి తొలి డ్రస్’ చదవగానే ‘క్వాటర్’ కైపెక్కింది. తూలుతూ తూలుతూ లోపలికి వెళ్తున్నాను. ప్రస్తుతం ‘ఆఫ్’ మత్తులో ఉన్నాను … చివరికేమవుతుందనేది మాత్రం చెప్పలేను.
– తహిరో
దుప్పల రవికుమార్
నిజంగా చక్కటి పుస్తక పరిచయం. పుస్తక పరిచయం పరమార్థాన్ని వందశతమూ నెరవేర్చిన వ్యాసమిది.
సౌమ్య
“మీరు ప్రేమించినంతగా మిమ్మల్ని ప్రేమించలేని మా బలహీనతను క్షమించండి” – Interesting! 🙂
Maha Nagarjuna
Very good review. I am going to buy a copy.