నా జీవిత ప్రస్థానం – నాదెండ్ల భాస్కర రావు ఆత్మకథ
నాదెండ్ల భాస్కర రావు ఎవరూ? అని ఎవరన్నా నన్ను అడుగుతారు అని నేను ఊహించలేదు కానీ, నేనీ పుస్తకం చదివిన రోజు ముగ్గురి దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తే, అందులో ఇద్దరడిగారు ఆయనెవరు? అని. దానితో ఆయన గురించి కాస్త పరిచయం రాయడం అవసరమేమో అనిపిస్తోంది ఇప్పుడు.
నాదెండ్ల భాస్కర రావు కాంగ్రెస్ పార్టీ నేత. తెలుగుదేశం స్థాపన లో కీలక పాత్ర వహించిన వ్యక్తి. అంతకు ముందు వృత్తి రిత్యా న్యాయవాది. ఇవన్నీ అటు పెడితే, ఈయన చాలామందికి గుర్తుండి పోడానికి కారణం – 1984 లో ఎన్‌టీఆర్ ను గద్దె దించి నెలరోజులపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి అయారు. తరువాత, మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు కూడా – స్థూలంగా ఇదీ చరిత్ర.
నిజానికి, ఈ ఉదంతం గురించి నేను విన్నానంతే. TDP ఏర్పడడం వంటివి నేను పుట్టకముందు జరిగిన పరిణామాలు. వీటి గురించి ఇంక వినడమో, చదవడమో తప్ప వేరే మార్గాలేముంటాయి తెలుసుకోడానికి? ఈ పుస్తకం కంటపడటంతో, ఓహో, ఈయన ఈ చరిత్రని ఏ విధంగా చెబుతాడో చూద్దాం అనిపించి చదవడం మొదలుపెట్టాను. నిజం చెప్పొద్దూ… ఆపకుండా చదివించింది. అక్కడికి ఆయన శైలి చాలా ఆకర్షణీయంగా ఉంది అని నేను అనను. పర్వాలేదనిపించేలా అనిపించింది నాకు. కానీ, అక్కడి చర్చా విషయం అటువంటిది మరి … ఎలా రాసినా ఉత్కంఠభరితంగానే ఉంటుంది.
ఈ పుస్తకం చదివాక నాకు ఒక విషయం అర్థమైంది. ప్రతి ఒక్కరూ తమ కోణం నుండి కరెక్టే అని. ప్రతి ఒక్కరూ తాము చేసింది ఆ సమయంలో తమ పరిస్థితులకి తగినదనే చేసామని అంటారని. నేనేమీ నాదెండ్ల గారిని తప్పు పట్టట్లేదు కానీ, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న కథొకటి, ఆయన పుస్తకంలో ఉన్న కథొకటి. రెండూ చూశాక అనిపించింది. ఎవరిమటుకు వారు తామే కరెక్టనే అంటారు. నిజం అన్నది కేవలం మిథ్య అని. ఒకదాన్ని నిజం అనాలంటే, అది మనకి నిజం అనిపిస్తే అంటామే తప్ప, అన్ని సందర్భాల్లోనూ అదే నిజం కానక్కరలేదేమో… అనిపించింది.
పుస్తకం మొదటి భాగంలో ఆనాటి గ్రామీణ జీవితంలోని విశేషాలు బాగా చెప్పారు. పుస్తకంలో చాలావరకు నేతల పేర్లు యధాతథంగా వాడేసినప్పుడు – డిల్లీ ఆగంతకుడు, పత్రికల యజమాని అంటూ ఒకట్రెండు పేర్లను మాత్రం ఆద్యంతమూ గోప్యంగా ఉంచడంలోని ఆంతర్యం అర్థం కాలేదు. ఇందాకన్నట్లు, ఏకబిగిన చదివించే పుస్తకం. అయితే, చదివి తీరాల్సినది అని నేనేమీ గ్యారంటీ ఇవ్వలేను.
పుస్తకం వివరాలు:
నా జీవిత ప్రస్థానం
నాదెండ్ల భాస్కర రావు
తొలిముద్రణ: ఆగస్టు 2008
ప్రచురణ: సర్వధర్మ నిలయం, జుబ్లీ హిల్స్, హైదరాబాద్.
ఫోను: 040-23608885
వెల: 200/-
varaprasad
rachayitako dannam,maameeda ilantivi ruddakandi,edo accha tenugu pustakalakosam pustakamnet kani,ilanti sonta ratalagurinchikadu.
Doubty
What do you mean sir? Aren’t autobiographies supposed to be written about? or… do you think Asooryampasya is Nadella Bhaskara Rao in disguise?
P.Venkatesh
ఈతని జిగ్రీ దోస్త్ రావణ్ లాల్ (అదే రాంలాల్ అప్పా) అట్లే కాంగిరేసు మామ్లా వల్ల ఈతడు పొలిటికల్ జిందగీ బద్మాష్ చేసుకున్నడు.
S.R.Raju
భాస్కర రావుగారు రాసింది నమ్మశక్యంగాలేదు.
kvrn
నాదెండ్ల భాస్కరరావు గారు తెలుగు రాజకీయాలను ఒక కుదుపు కుదుపిన వ్యక్తి. వారి సొంత కథ చదవాల్సినదే. శైలి ( బహు) బాగున్న్నదని పుస్తకం పరిచయం చెసారు.
రమణా రెడ్డి.
1984 ఆగష్ట్ సంక్షోభ సమయం లో నేను ఇంజనీరింగ్ విధ్యార్థిని, అప్పట్లో నాదేండ్ల చేసిన వెన్నుపాటు అంతా ఇంతా కాదు, కేవలం అహం వలన ఆధిపత్యపోరులో ఒక దుర్మార్గానికి పాల్పడ్డాడు, అదీను పార్టి నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెల్లి తిరిగి రాష్ట్రానికి వచ్చిన సమయం లో ప్రజల కేవలం ప్రజాస్వామ్య పద్దతిలో ముఖ్యమంత్రిగా ఎన్నుకోపడ్డ ఒక ప్రజాభిమానం ఉన్న వ్యక్తిని పదవి నుండి కేవలం కాంగ్రెస్స్ వారి సహాయం తో అతి కొద్ది మంది తమ పార్టీ ఎం.ఎల్.ఏ.లను తనవెంట తిప్పుకొని ఎలా అధికారం చేపడతాడు..? అది ఒక వెన్నుపోటు కాక..! తన పాయంట్ ఆఫ్ వ్యూ లో అది ఒక సద్గుణం అవుతుందా..? ఎప్పటికీ నాదేండ్ల ఒక నీచుడి కిందనే జమకడ్తారు మనుషులు..కాలం తో పాటు అన్ని మరిచిపోయినంత మాత్రాన భావాలు మారుతాయా..? బహుశ కొన్ని విషయాల్లో అది జరగక పోవచ్చు, ఇప్పటికి కూడ తను చేసింది పాపమని ప్రాయశ్చత్యపడట్లేదు అంటే ..! ఇంకా అతనిలో దుర్మార్గపు ఆలోచనలే ఉన్నాయని అర్థం అవుతుంది.
అబ్రకదబ్ర
నాదెండ్ల పుస్తకంలో ఏమి రాసుకున్నా, ఎన్టీయార్ పదవిలోకొచ్చి రెండేళ్లయ్యీ కాకుండానే, ఆయన ప్రభ ఇంకా దివ్యంగా వెలుగుతుండగానే తొందరపడి వెన్నుపోటుకి సాహసించటం తన గొయ్యి తానే తవ్వుకోటమే. జరిగిందదే కూడా. మీడియా ప్రాబల్యం ఇంతగా లేని అ రోజుల్లో – ఎవరూ రెచ్చగొట్టకున్నా, పదవీచ్యుతుడైన ఓ ముఖ్యమంత్రి కోసం ప్రజలు ఎవరంతవారే రోడ్లెక్కి ఉద్యమాలు చెయ్యటం అంటే నాదెండ్ల చేసిన పనిపై వాళ్లలో ఎంత ఆగ్రహావేశాలు రగిలాయో అర్ధమవటం లేదా.
srinu
నాదెండ్ల భాస్కర రావు గారికి నా విన్నపము
ఎమనగా సార్ మి గురించి న పూర్తి విషయాలు ఆందరికి తెలియాలంటె నా జీవిత ప్రస్థానం – నాదెండ్ల భాస్కర రావు ఆత్మకథ ను అందరికి అందుబాటులొ inter net లొ free గా ఉంచండి. ఎందుకంటే ఆందరరికి పుస్తకం అందు బాటు లొ ఉంటే మీ గురించి జరుగుతున్న విషప్రచారాన్ని సమర్దవంతముగా ఎదుర్కొని నిజాలను అందరికి చెప్పిన వాళ్ళు అవుతారు.
రామ
ఎవరి దృక్కోణం లోంచి చూసినప్పుడు వారి వాదన కరెక్ట్ అని అనిపిస్తుంది. (ఈ పుస్తకం నేను చదవలేదు). ఇదివరలో ఒక సారి లక్ష్మిపార్వతి గారు వ్రాసిన ఒక పుస్తకం చదివాను ఎన్టీఆర్ తో తన అనుబంధం etc గురించి – అది చదివాక “అయ్యో” అనిపించింది. నిజాలు మనకి తెలియవు కాని, అవి వ్రాసే వారి టాలెంట్ మీద తప్పక ఆధారపడి ఉంటాయి.
mohanrazz
last time hyd vellinapudu panigaTTukuni ee pustakam kosam vetikaanu..dorakaledu..ee sari choodaali..!!!