Select book shop లో కాసేపు
నిన్న నేను అనుకోకుండా బెంగళూరులోని ‘సెలెక్ట్ బుక్ షాప్’ కి వెళ్ళాను. పప్పు నాగరాజు గారు నన్ను అక్కడికి తీసుకెళుతూ, “this is like a temple of books, in bangalore” అన్నారు, అక్కడ Bangalore theatre jam గ్రూపు ఒకటి సెలెక్ట్ యజమాని మూర్తి గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉండింది. పరిచయాలు ఔతున్నంత సేపు – ఈ మూర్తి గారిని ఎక్కడ చూశానబ్బా? అని ఆలోచిస్తూ ఉన్నాను. చివర్లో ఆయన, “నేను బెంగలూరు మిర్రర్ అన్న లోకల్ టాబ్లాయిడ్ కి అప్పుడప్పుడూ రాస్తూ ఉంటాను” అన్నారు. “ఆహా…నేను చదివేదాన్ని దాన్ని రోజూ, నెలక్రితం వరకూ….” అంటూ ఆలోచనలలో పడ్డాను – ఈయన్నెక్కడ చూశానబ్బా అని. తర్వాత టాపిక్ మారింది. ఓ రెండు నిముషాల తరువాత – “మీ ఫొటో ఉంటుంది కదూ, ఆ బెంగలూరు మిర్రర్ కాలం లో?” అడిగాను. అరిచానేమో. ఆయన కొంచెం ఆశ్చర్యపడ్డట్లు ఉన్నారు – “అవును” అన్నారు. “అదీ! ఆ కాలం నేను చదివాను. అక్కడ ఫొటో చూశాను…” – హమ్మయ్య! ఆత్మారాముడి క్యూరియాసిటీ కి తృప్తి కలిగింది.
‘సెలెక్ట్’ నలభైల నుంచీ ఉందట బెంగలూరులో. మూర్తిగారు వాళ్ళ నాన్న గారికి పుస్తకాల ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. అక్కడ్నుంచి, తను ఇందులోకి ఎలా వచ్చిందీ చెప్పారు. ఇంకా అక్కడ ఇంటర్వ్యూ జరుగుతూ ఉండింది కానీ, సమయాభావంవల్ల మేము బయటకి కదిలాము.
మూర్తిగారి సంగతి కాసేపు పక్కన పెడతా. ఆయన చెప్పిన కథలు వింటూ ఉంటే, వాళ్ళ నాన్న నాకు చాలా ఆసక్తికరమైన వ్యక్తి అనిపిస్తున్నారు. ఆయనకు పుస్తకాలపై ఉన్న ప్రేమ చూస్తే, ఆశ్చర్యం కలుగుతోంది. ఆయన మొదట చెన్నై లో చదువుకునేరోజుల్లో రాజాజీ (చక్రవర్తి రాజగోపాలాచారి) ఈయన వ్యక్తిగత లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించుకునేవారట. తరువాత మజిస్ట్రేటుగా కర్నూలు చేరారు. అక్కడ తగిలింది నాకు తొలి షాకు – ఈయన కర్నూల్ నుండి బెంగళూరు వెళ్ళి – అక్కడ బ్రిటీషు వారు ఎవరన్నా దేశం వదిలేస్తున్నప్పుడు సామాన్లతో పాటు పుస్తకాల కలెక్షన్ కూడా వేలం వేస్తూ ఉంటే, కొనుక్కుని, మొత్తాన్ని కర్నూలు కు తెచ్చేవారట!! కొన్నాల్టికి, వ్యక్తిగత కారణాల వల్ల బెంగలూరు కు వచ్చేశాక, పుస్తకాల దుకాణం తెరిచారట.
రెండో షాకు : నేను మూర్తిగారు కూడా మొదట్నుంచీ ఈ వ్యాపారంలో ఉన్నారు అనుకుంటున్నా అప్పటిదాకా. ఆయన ఏరోనాటికల్ ఇంజినీరనీ, Institute of science (బహుశా IISc ని అలా అన్నారనుకుంటాను) లో పీజీ చేసాననీ, తరువాత HAL లో దాదాపు ఇరవైయేళ్ళు పని చేసి, యూరోప్ లో కూడా కొన్నాళ్ళున్నానని చెప్పాక ఆశ్చర్యపోయాను. అంతేకాదు, అక్కడ్నుంచి వెనక్కొచ్చాను, అంటూ ఉంటే, అప్పుడొచ్చారేమో ఈ వ్యాపారంలోకి అనుకున్నా. కాదట. మళ్ళీ నాలుగైదేళ్ళు అమెరికాలో పని చేశారట. ఆ తరువాత – ఇక్కడికి.. ప్రస్తుతం సెలెక్ట్ బుక్ షాపు బాధ్యతలను ఈయన కొడుకు సంజయ్ కూడా పంచుకుంటున్నారు.
ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పుడు పుస్తకాలు కొనడం, ఆ టన్నుల కొద్దీ పుస్తకాలు ఇంటికి నాన్నగారికి పంపడం – చేసేవారట. అలా ఫ్రాన్సులోని ఓ సెకండ్ హాండ్ పుస్తకాల షాపులో – జయచామ రాజేంద్ర వడయార్ ముఖచిత్రం ఉన్న పుస్తకాన్ని కనిపెట్టి, దాన్ని తన తండ్రికి పంపడం గురించి చెప్పిన కథ చాలా ఆసక్తికరంగా ఉండింది. సీ.వీ.రామన్ తో తన తండ్రికున్న అనుబంధం, చివరి రోజుల్లో కూడా వాళ్ళ నాన్న గారు తిరుచ్చి లోని పుస్తకాల కొట్ల వీథికి వెళ్ళాలని పట్టుబట్టి వెళ్ళి కొన్ని అపురూపమైన పుస్తకాలను అక్కద వెలికితీయడం, ఇలాంట్వన్నీ వింటూ ఉంటే, అయన్ని కలిసి ఉండాల్సింది కదా అసలు, అనిపించింది (ఈయనే చాలా పెద్దాయన. 70 పైనే ఉంటాయి. ఇక వీళ్ళ నాన్నని నేను కలిసి ఉండాలంటే – నేనెప్పుడు పుట్టి ఉండాల్సిందో!!)
ఇంతకీ, ఈ అనుభవంలో బెంగలూరు లో పుస్తకాల కొట్ల చరిత్ర గురించి కొంత తెలిసింది. 40లలో ఇక్కడ పుస్తకాల కొట్ల గురించి ఆయన అలవోకగా ఫలనా వీథిలో ఫలానా మనిషి, ఫలానా మార్కెట్ వెనుక ఏదో సంఘం – ఇలా చెప్పేస్తూ పోతూ ఉంటే, అబ్బురంగా చూస్తూ అలా ఉన్నా వీలైనంత సేపు 🙂
చెప్పడానికైతే చాలా ఉంది కానీ, మరోసారి ఆయన్ని కలిసి, అవి కూడా కలుపుకుని మరిన్ని విశేషాలు చెబుతా 🙂
____________________________________________________________________________________
Address:
No. 71, Brigade Road, Cross, Brigade Road
Bengaluru, Karnataka 560001
080 25580770
పుస్తకం » Blog Archive » పారిస్ నగరం – కొన్ని పుస్తకాల షాపులు
[…] లోపలికి వెళ్ళగానే, నాకు ఎందుకోగానీ, సెలెక్ట్ బుక్ షాప్ గుర్తు వచ్చింది. ఎందుకూ? అంటే సమాధానం […]
పుస్తకం » Blog Archive » బెంగళూరులో పుస్తకాల కొనుగోలు అనుభవాలు
[…] అనుకుంటాను. ఆరోజుటి అనుభవం గురించి ఇక్కడ రాసాను. సెలెక్ట్ బుక్ షాప్ కి అరవై […]
sheeya
hello i am enquiring for old M&B books for pass time reads…these are exceptionally old…one by roberta leigh called unwilling bridegroom, the other temporary mariage by kay thorpe and lastly one by penny jordan called substitute…please let me know if these books are avail…
విజయవర్ధన్
Strand Book Stall వారి వార్షిక పుస్తక ప్రదర్శన బెంగుళూరులోని బసవ భవన్ (రాజ్ భవన్ దగ్గర) జరుగుతోంది. 20% నుంచి 80% వరకు రాయితీ వుంది. ఈ ప్రదర్శన వివరాలు మరియు Strand book stall అధినేత విద్య వీర్కర్ తో వీడియో ఇంటర్వ్యూ ఇక్కడ చూడొచ్చు:
http://chittaruvu.wordpress.com/2009/12/08/strand-book-fest/
తప్పక వెళ్ళాల్సిన ప్రదర్శన.
విజయవర్ధన్
కార్టూనిస్ట్ జయదేవ్ గారు వ్రాసుకున్న స్వగతం (దాదాపు 120 personal stories) “గ్లాచ్చు మీచ్యూ – నా పర్సనల్ స్టోరీలు” అను పుస్తకంగా త్వరలో విడుదల కాబోతున్నది. వివరాలు ఇక్కడ చూడొచ్చు:
http://chittaruvu.wordpress.com/2009/11/19/glachu-meechyu/
విజయవర్ధన్
Bangalore Palace Grounds లో జరుగుతున్న Bangalore Book Festival Nov 15 దాకా వుంటుంది. కొన్ని తెలుగు పుస్తకాల దుకణాలు కూడా వున్నాయట. ఆసక్తి కలవారు రేపు (అంటే చివరి రోజు) సందర్శించవచ్చు.
పుస్తకం » Blog Archive » శివరాజు సుబ్బలక్ష్మి గారితో…
[…] రోజులనుంచి అనుకుంటున్నాను. ఆ మధ్య “సెలెక్ట్” కి వెళ్ళి వచ్చాక, ఎందుకోగానీ […]
విజయవర్ధన్
నాకు Select కన్నా “Blossoms” మరియు “Strand” బాగా నచ్చుతాయి. ఆ రెండు దుకాణాల్లో:
1. కనీసం 20% రాయితీ ఇస్తారు
2. బాగా సర్దిన పుస్తకాలు, అన్ని విషయాలపైన పుస్తకాలు దొరుకుతాయి
Blossomsలో ఐతే used books కూడా లభ్యం. ఇక Landmark అని ఇంకో దుకాణం Forum, కోరమంగళలో వుంది. అక్కడ రాయితీ అంటూ వుండదు కాని అన్నీ విషయాలపైన పుస్తకాలు కనిపిస్తాయి.
అలాగే online store http://www.flipkart.com కూడా చాలా బాగుంది (service, discounts are good).
uma maheeswari
maadi bangalore ee nenu tappakundaa velataanu brigade road daggare maaku
కొత్తపాళీ
హమ్మ్ ఐతే, నాక్కూడా ఇంకా హోప్ ఉందన్న మాట, ఒక పాత పుస్తకాల కొట్టు పెట్టుకోడానికి!
G
I must go for it. When I’m at Bang. Looks like it bangs… 😀
Rajasekhar
ఇది బ్రిగేడ్‌రోడ్లోనే కదా ఉంది ? ఒక ఫైన్ ఆదివారపు మధ్యాహ్నం ఈ షాపుదాకా వెళ్ళి లోపలికి వెళ్ళకుండా తిరిగివచ్చేశాను. ఈ వీకెండ్ ఖచ్చితంగా వెళ్ళాలి (Affirmative sir :))
jatardamal
ఇంత రాసి మీరు సెలెక్ట్ షాప్ చిరునామా ఇవ్వలేదే ? దయచేసి ఇవ్వగలరు.
రవి
ఆ షాపు గురించి వినడమే తప్ప, చూడలేదు ఇంతవరకు. ఆ షాపుకు ఎదురుగానే ఒకప్పుడు నేను పని చేసే ఆఫీసు ఏడ్చి చచ్చినప్పటికీ వెళ్ళలేదు (అప్పుడు నాకు దాని గురించి తెలియదు లెండి). ఈ సారి ఆ షాపుకు వెళుతుంటే నాకు తెలియబర్చగలరా? నేను ఊళ్ళో ఉంటే, తప్పక కలుస్తాను.