అందమైన జీవితం – మల్లాది వెంకట కృష్ణమూర్తి
వ్యాసం రాసిపంపినవారు: రమణి
THERE ARE THREE FORTUNES
TO A WOMAN, A GOOD HUSBAND
READY MONEY AND A GOOD FRIEND
THE FOURTH ONE, IF THERE BE AN,
OFCOURSE IS AGAIN A GOOD FRIENDCHINESE PROVERB.
“ప్రతి వాళ్ళకి ఓ ఫిలాసఫీ లేదా ఓ నమ్మకం ఉంటుంది, దాన్ని బట్టే వాళ్ళ జీవితం నడుస్తుంది. ’చక్కగా జీవించడం ’ అన్నది మా ఫిలాసఫి. ”
“ప్రతిరోజు కనీసం ఒక్క ఆనందమయిన అనుభూతి అయినా పొందాలన్నది మా ధ్యేయం. ఆనందం అంటే బ్యాంక్ బాలన్స్ కాదు, ఆస్తులు కాదు. మంచి ఉద్యోగం లేదా కారు కాదు. ఆనందం అంటే సింపుల్ ప్లెషర్స్. సాధారణమయినవి, చిన్నవి, అతి చిన్నవి కూడా, మనకిష్టమైన పాట వినడమో, ఉదయమే వెచ్చని నీరెండలో చేతులు పట్టుకొని అయిదు నిముషాలు నడవడమో, చకటి పుస్తకంలోని కొన్ని పేజీలు చదవడమో, వసంతకాలంలో కోకిల గానం వినడమో, ఆ సంవత్సరంలో ఆరోజు మొదటిసారి మామిడిపండు తినడమో, పూర్తిగా విచ్చుకొన్న గులాబి పువ్వుని కోసి మనకి పరిచయంలేని చిన్నపిల్లకి ఇచ్చి ఆ పాప మొహంలో చిరునవ్వు చూడడమో … ఇలాంటి ఆనందమయిన అనుభూతులని వెదుక్కోడం వాటితో జీవించడం ఎంత చక్కటి ఆనందరకమైన జీవితమో కదా.”
అతను చెప్పేది ఆసక్తితో కూడిన శ్రద్ధ తో వింటోంది ఆమె. అతను అకస్మాత్తుగా చెప్పటం ఆపేసి ఆమె వంక చూసి..
“సారి మీకు విసుగేసే మాటలు చెప్పా కదా! ఒకోసారి ఎదుటివాళ్ళని గమనించకుండా మాట్లాడుతాను.” అన్నాడు.
“నాదీ మీ స్వభావమే, కాని మనలాంటివారిని చాలా మంది పిచ్చివాళ్ళు , సెంటిమెంటల్ ఫూల్స్, అనుకుంటారు, వాటిల్లో ఆనందం అందరికీ అర్థం కాదు”.
నిజమే ప్రస్తుత యాంత్రిక జీవితాలకి, ఉరుకుల పరుగుల సంపాదన జీవితాలకి కొన్ని ఆనందాలు అర్థం కావు. చెప్పేవాళ్ళని పిచ్చివాళ్ళనుకొంటారు.
పైన అతను – ప్రియతమ్, ఆమె – శాంతి. వీరిద్దరికి ఏ రక్త సంబంధంలేదు. ఏ బీరకాయ పీచు చుట్టరికంలేదు. కాలేజ్ లో కాని, స్కూల్లో కాని కలిసి చదువుకోలేదు. ఒక లోకల్ రైల్ లోని యాదృచ్ఛికంగా పరిచయమయిన ఒక ఆడ – మగ, ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కాని ఆ పెళ్ళి వాళ్ళ స్నేహానికి అడ్డురాలేదు.
GETTING MARRIED IS EASY. STAYING MARRIED IS DIFFICULT. STAYING HAPPILY MARRIED FOR A LIFETIME SHOULD RANK AMONG THE FINE ARTS. – ROBERTA FLACK
స్నేహం ..
సృష్టిలోని అలౌకికమయిన తీయదనాల్లో స్నేహం ముఖ్యమైంది. అది అనుభవించినవారికే దాని ప్రాముఖ్యత అర్థం అవుతుంది. అది ఇద్దరి మగవాళ్ళ మధ్య కావచ్చు, ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కావచ్చు, లేదా ఒక మగ ఒక ఆడా మధ్య కావచ్చు.
అంతే కాదు వివాహితుడైన ఆడ, మగ మధ్య కూడా కావచ్చు, వాళ్ళు ఆడ, మగ అవడం యాదృచ్ఛికం. శృంగారపరమయిన భావాలకి లోనుకాకుండా స్నేహం చేయగలగడం ఆడ, మగకి సాధ్యం కాదా? (ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పటికి సాధ్యమే అని చెప్పలేరు ఇటు వివాహితులైన ఆడవాళ్ళు, అటు మగవాళ్ళూ.. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అన్న బంధాలు పెట్టుకొంటే తప్ప ఆత్మ రక్షణో, మంచితనం ముసుగో మరి) .
ఆ స్నేహంలోని మాధుర్యాన్ని నిష్కల్మషంగా చవిచూడగలగడం అనుభవంలోకి రాకూడదా?
*****
ప్రియతమ్, శాంతిలకి చక్కటి ఫిలాసఫిని అమర్చి, స్నేహం గురించి అంతకన్నా చక్కటి అర్థం చెప్పి, ఇద్దరి వివాహితులకు నిష్కల్మషమైన స్నేహాన్ని అనుభవంలోకి తీసుకొనివస్తూ, మధ్యతరగతి జీవితాల ఆనందాలను, మామూలు అందం ఆభరణంగా గల అతివ అతి సాధారణ ఆలోచనలను, భార్యని ఎంత గొప్పగా చూసుకోవచ్చో, చిన్న చిన్న ఆనందాలను ఎలా సొంతం చేసుకోవచ్చో, పిల్లల చిన్న చిన్న సరదా ఆటలు … భార్యాభర్తల అన్యోన్యత ఇవన్నీ మనకోసం పొందుపరిచి రాసిన పుస్తకం “అందమైన జీవితం”.
మన గ్రంధాలయంలో ఉండతగిన పుస్తకం, మన మిత్రులకి కానుకగా ఇవ్వగలిగే పుస్తకం మల్లాది వెంకటకృష్ణమూర్తిగారు రాసిన “అందమైన జీవితం”.
ప్రియతమ్ తనకి 50 రూపాయల చిల్లర కావాలంటూ.. చెల్లెలి కాన్పు కోసం హైదరాబాదు వచ్చిన శాంతి దగ్గర్నుండి తీసుకొని మిగిలిన డబ్బులతో పిల్లలికి చాక్లేట్స్ కొనమనడంతో పరిచయమైన ఆ పరిచయం, ఎన్నో ఆలోచనలను, ఎన్నో అభిరుచులను పంచుకొని సృష్టిలోని స్నేహ మధురిమ అంతా చవిచూసిన వారయ్యారు.
బ్రతికుండగా వెళ్ళలేనిది తరువాత తప్పనిసరి వెళ్ళాల్సినది అంటూ శాంతిని శ్మశానానికి తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో జరిగే ప్రతీ కార్యాన్నిచూసి, అక్కడే స్నానం చేసి రావడం .. అప్పుడు చదివిన దానికన్నా చివర్లో ఇలా ఎందుకు తీసుకేళ్ళాడో తెలిస్తే మటుకు ఎంతటి మొండివాళ్ళకైనా మనసు చలించక మానదు.
ఇవికాక వారిద్దరు పంచుకొన్న ఆలోచనలు కొన్ని ఇక్కడ…
“నా చిన్నప్పటినుండి నెలనెలా చందమామ చదువుతున్నాను. చాలామంది, కోట్లమంది తెలుగ్వాళ్ళు తమ బాల్యంలో చదివే పుస్తకం ఇదే! పాతికేళ్ళ క్రితంవి ఎప్పుడైనా తీసి చూస్తుంటే ఒక్కసారిగా చదివైనా ఆ కాలం గుర్తుకువచ్చి ఓ అనిర్వచనీయమయిన అనుభూతి కలుగుతుంది. ” అంటూ చందమామ ఆవశ్యకతని ఆ అనుభూతిని పాత్ర చేత చెప్పిస్తారు రచయిత. అలాగే రకరకాల భంగిమల ఫోటోలు, అత్యంత సహజంగా వర్షంలో తడుస్తూ, రైలు పక్కన ఇలా తీసే ఫోటోలు ఆ తరువాత చూసుకోంటున్నప్పుడు కలిగే అనుభూతిని వివరిస్తారు ఇందులో.
ఫొటోలు, ఆటలు కన్నా అభిమానం మనసులో దాచుకోమని, దానిని బయటకి వెలువరుస్తే ఎదురయ్యే కష్టనష్టాల గురించి చెప్తూ…”నువ్వు అభిమానించే రచయితని కలుసుకోకు” అని ఒకవేళ కలిస్తే జరిగే పర్యవసానం ఆద్యంతం ఆసక్తిగా హాస్యం కురిపిస్తుంది.
మరోచోట స్పర్శ గురించి చెప్తూ .. స్పర్శ మనిషికి ఎంతో ముఖ్యం. ఓ వారంరోజుల పాటు ఎవరినీ ముట్టుకోనివ్వకుండా ఉంటే మనమేదో జైల్లో ఉన్నామన్న్న భ్రమ కలుగుతుందని అంటారు. స్పర్శ ఎలా ఉన్నా.. a wise man is he who prepares his wife for widowhood. వినడానికి ఎవరికన్నా కోపంవస్తుంది. కాని తెలివైన భర్త బార్యని వైధవ్యానికి సిద్దంగా ఉంచాలి. అంటే, ఆర్థికంగా భర్త భార్యకోసం చేసే ఏర్పాట్లు ఆమెకి తెలియజేయాలి. తరువాత వాళ్ళు అకౌంట్ నంబర్లు , LIC లు వాటి నంబర్లు, లాకర్ల నంబర్లు, ఇవన్ని ఒక పుస్తకంలో రాసి ఉంచాలి. తరువాత వారు ఇబ్బందికి గురి అవకుండా.. అది ఒక ఫ్యామిలి పుస్తకంలా ఉండాలి అని ఒక గొప్ప సందేశాన్ని ఇస్తారు ఇందులో.
౩౦ ఏళ్ళు దాటిన మహిళ తన వన్నె తగ్గిందోమో, అందంగా లేనేమో అని మదనపడ్తూ.. ఉంటే మీరెంత అందంగా ఉన్నారో అంటూ అజ్ఞాతగా తనే ఒక లవ్ లెటర్ రాసి ఆమెనా ఆలోచనలనుండి దూరం చేసే అర్థం చేసుకోగలిగే భర్త కనిపిస్తాడిందులో.
అదే ౩౦ ఏళ్ళు దాటిన మరో స్త్రీ ఇతనేంటబ్బా తననుండి ఏమి ఆశిస్తున్నాడు, ఒకసారి కూడా కనీసం తనవైపు కూడా చూడడేంటి? తను అందంగాలేదా అని తనని తను ప్రశ్నించుకొనే ఒక సాధారణ యువతి కూడా కనిపిస్తుంది.
మాములు విషయాలు పంచుకొంటూ తన భార్య మృదుల గురించి పదే పదే చెప్తూ.. పిల్లలపెంపకం గురించి చెప్తూ, స్నేహితురాలి ఆలోచనలను పంచుకొనే మంచి స్నేహితుడు ఉంటాడు ఈ నవల్లో.
ఇంత చక్కగా అనుభూతుల్ని, ఆలోచనలని , పిల్లల ముచ్చట్లని పంచుకొంటున్న ఈ స్నేహ జంటకి అంతం లేదు కాని, ఈ నవలకి మటుకు విషాదమైన ముగింపు ఉంది.
******
శ్మశానంలో తన బార్య , తన ఇద్దరు పిల్లలకి ఏ విధంగా దహనసంస్కారాలు జరిగి ఉంటాయో తెలుసుకోలేకపోయినా … వేరొకరి దహన సంస్కారలను ప్రత్యక్షంగా తన స్నేహితురాలితో వెళ్ళి, ఆమెకి చూపిస్తున్నట్లుగా చెప్పి బాధని పెదాల మద్య బిగబట్టి చూడడం కంటనీరు తెప్పిస్తుంది.
ప్రియతమ్ భార్య మృదుల బెంగాలి అమ్మాయి, ఎక్సిడెంట్లో, భార్యా పిల్లలు కనీసం కడచూపుకూడా దొరకుండా చనిపోతారు. అక్కడినుండి వస్తుంటేనే శాంతి చిల్లర కోసం అంటూ పరిచయమవుతుంది.
శాంతి ఊహల్లో.. తన భార్యని బతికించుకొన్నాడు ప్రియతమ్. భార్యతో కలిసి ఉన్న ప్రతి ఒక్క తీపి అనుభూతిని ఆమెకి చెప్తాడు, పిల్లలతో గడిపిన క్షణాలు, వారి సరదా జీవితం అన్నీ ఆమెకి చెప్తూ ఆమె ఊహల్లోనే తన భార్యని చూసుకొంటాడు “మృదల ఈరోజు మిమ్మల్ని తీసుకురమ్మంది” అంటూ.. “మీకు తెలుసా ఈరోజు మృదులకి అస్సలు బాలేదు”, “మృదుల వంట చాలా బాగా చేస్తుంది” అంటూ ఆమె బతికున్నట్లుగానే బాధని మనసులో దాచుకొని ఆమె ఉహల్లో ఆమె జ్ఞాపకాలని పదిలపరిచే ప్రయత్నం చేస్తాడు.
చివర్లో శాంతికి ఈ విషయం తెలిసినప్పుడు కూడా.. “అసలెందుకు తెలుసుకొన్నారు? తెలుసుకొని నా కలని ఎందుకు ధ్వసంచేసారు? ” తన ఆవేదనని వ్యక్తపరుస్తాడు. అతను ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళేప్పుడు కూడా మృదుల , పిల్లలు మిమ్మల్ని అడిగారని చెప్పమన్నారని ఒక ఉత్తరం రాస్తాడు. “చివరిచూపుకి కూడా నోచుకోలేదు నేను, వారిని మీ ఊహల్లో బ్రతికించుకోవాలనుకొన్నాను. వాళ్ళ గురించి మీతో చెప్పే సమయం కోసం మిగతా సమయమంతా వేచి ఉండేవాడిని. వాళ్ళగురించి మీకు చెప్తూ కనీసం ఒక్కరి ఊహల్లోనయినా వారిని బ్రతికించుకొన్నాననే తృప్తిని నాకు మిగల్చల్లేదు మీరు” అంటూ బాధ పడ్తాడు.
*****
తన జీవించిన కొద్దిపాటి అందమైన జీవితాన్ని తన స్నేహితురాలితో చెప్తూ ఆమె ఊహల్లో తన భార్యని పిల్లల్ని చూసుకొంటూ , జీవితం అంటే కార్లు , డబ్బు కాదు చిన్న చిన్న ఆనందాలు అంటూ వెల్లడించే అరుదైన పుస్తకం ఈ అందమైన జీవితం.
రచయిత : మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు.
లిపి పబ్లిషర్స్, గాంధినగర్, హైదరాబాదు.
D. N.malleswararao
1990 lo I read this novel still I fallow how to live with small things with more happyness , Nd I said to malladi garu a great novelist to Telugu people Nd I definitely appreciate you
help with our lives
madhavi
నావెల్స్ అంటే ఏంటో తెలీని రోజుల్లో అమ్మ ..,అక్కయ్యవాళ్లు చదువుతుంటే చూసి చదివిన సీరియల్ ..అర్ధం అయ్యేంత వయసులేకపోయినా అప్పటినుండి గుర్తున్న …నచ్చిన కథ అందమైన జీవితం
sarath
హాట్స్ ఆఫ్ రమణి గారు,బట్ క్లైమాక్స్ చెప్పకుండా ఉంటె బాగుందేమో,ఏమో తెలియట్లేదు.చాలా చాలా మంచి విశ్లేషణ.నవల చదివిన అనుభూతి కలిగించారు…థంక్ యు సో much..
Kamesh
Visleshana chala bagundi. Malladi Venkata Krishna Murthy gari Navalalu chadivinchevi, gurthunchukonevi enno vunnayi.
PADAMATI SANDHYARAGAM novel kuda chadavandi.
– kamesh
varaprasad
my favorite writer malladi venkata krishnamurty,chala kalam tarvata maa rachayitanu parichayam chesinananduku chala santosham,amma inka patavallu chalamandi unnaru,varnikooda jnapakam unchukondi,,,,prasad
madhavi
Ramani Garu,
namashe vayasam chala bhaga rasinar nenu tappka e book chadhvtanu. na abhimana rachanalu malladi garive. tappka koni chadhuvtanu.
Thank you,
Madhavi K.
dvenkat
‘స్రవంతి ‘ నవల కూడా బావుంటుంది. మన అలవాట్లలో చిన్న చిన్న మార్పులతో జీవితం ఎలా ఆనంద మయం చేసుకోవచ్చో మల్లాది నవలల్లో చెప్తారు.
GOPARAJU SUBRAHMANYA SRINIVASA RAO
NENU NAA SCHOOL AGE LONE EE BOOK CHADIVI WRITER CHEPPINATLU DHANIYALU NELAPI POSI NAA KISHTAMAINA PERU TEPPINCHANU. EEROJU MEE ANDARI SPANDANA CHUSTUNTE PATA SNEHITULUNI KALASINATLU ANIPISTONDI . MAA VILLAGE ATKURU GURTUKUVASTONDI
Arun
బాగా రాసారు.నేనిప్పటివరకూ చదవలేదండి.ఇది చదివాకా కొని చదవాలనిపిస్తోంది.
chavakiran
ఈ పుస్తకం ఈ-పుస్తకంగా ఇప్పుడు కినిగె పై లభిస్తుంది. నేడే చదవండి, మీకు కంప్యూటర్ దూరంలో మల్లాది వెంకట కృష్ణమూర్తి – అందమైన జీవితం నవల.
అందమైన జీవితం On Kinige
కినిగె బ్లాగు: అందమైన జీవితం–మల్లాది వెంకట కృష్ణమూర్తి
[…] […]
yamijala jagadish
nenu malladigari abhimaanini
nenu motta modatisaariga ayana rachana addeku aarugru ammaayilu chadivenu
appatinunchi aayana rachanalu chaduvuthunnaanu
aayana saili, amuduloni baahavam nannnu amithmgaa aakattukumtaayi.
alaage ee amdamaina jeevitham koodaa nannu chadivimchindi
yours
yamijala jagadish
సోమశేఖర్
నేను ఇంతకు ముందు “ఆందమైన జీవితం” సీరియల్ గా వచ్చినపుడు
చదివాను. ఆ తర్వాత కొన్నాళ్ల క్రితం సాక్షి లో యండమూరి, మల్లాది ల ఇంటర్య్వూ లో యండమూరి గారు తనకి నచ్చిన మల్లాది పుస్తకం గా “ఆందమైన జీవితం” అని చెప్పారు.
ఆ నవల కొని మరీ చదివాను.చాలా బావుంది.మంచి పుస్తకం.చదువుకున్న రోజుల్లో ఉన్న నా మానసిక పరిణితి కి ఇప్పటికి తేడా కనపడింది.ఒకే పుస్తకాన్ని రెండోసారి కొన్నాళ్ళ తర్వాత చదివితే ఇంక బాగా ఆస్వాదించవచ్చు అనిపించింది.
ranga rao
ee navala nenu chalasarlu chadivanu,naku nachina navalalo deeniki modati place endukante, stree purushula madya snehanni chala andamuga rasaru.induloni anubhavalu nenu naa bharyato cheste baguntundi ani ennisarlu anukunnano cheppalenu
vidi
KumarN గారు వ్రాసింది చదివాను,ఎస్, ఆ బెడ్ రూమ్ సన్నివేశం నేను కూడా చదివాను,
అది కేవలం ధారావాహికగా వచ్చే రోజులలోనే కాదు,ఆ తరువాత అందమైన జీవితం మొదటి ముద్రణలో కూడా వుంది,కాని ఇటీవలి ముద్రణలలో అది తొలగించినట్టు ఉన్నారు,కాని నా ఉద్దేశం… శాంతి అలా ఊహించుకున్నంత మాత్రాన అదేమంత ఘోరమైన తప్పు అని అనుకోడానికి వీల్లేదు,ఎందుకంటే శృంగారం కేవలం ప్రత్యుత్పత్తి కోసం మానవులు చేసే ఒక తప్పని సరి క్రియగా లేదు,అది అనేక ఊహలతో, అనుభూతులతో, కల్పనలతో ఉంటుంది,మల్లాది అలా వ్రాసి దాన్ని తొలగించడానికి కారణం ఏమిటో తెలియదు గాని తొలగించకుండా ఉంటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను.పవిత్ర స్నేహం, పవిత్ర బంధం, పవిత్ర జీవితం… ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడికి పోతామో అర్ధం కాదు,వాటి పట్ల ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది,ఒక వేళ శాంతి తన ఊహలలో కాకుండా ప్రియతమ్ తో నిజంగా అలా చేసి వుంటే,నవల అంతా వర్ణించిన అందమైన అనుభవాలు (ప్రియతమ్ శాంతిల మధ్య నడిచిన స్నేహం) ఒక్క సారిగా చేదు అనుభవాలుగా మారి పోతాయా? మల్లాదిగారు స్త్రీ పురుషుల స్నేహాన్ని అంతకన్నా ఎక్కువ దూరం తీసుకు వెళ్ళడానికి ధైర్యం చేయకపోవడానికి కారణం, బహుశా ఈ కథ అయన అనుకున్న ముగింపుకు కాకుండా వేరొక దారి పడుతుంది అని ఏమో! – విది.
PRAVEEN
ANDHAMINA GIVITHAM CHALA ANDHAM GA UNDI…HATSOF 2 MALLADHI…
vidi
అందమైన జీవితం!!!
ఎప్పటి పుస్తకం అది…ఎప్పుడో నవలలు చదవడం మొదలు పెట్టిన కొత్త రోజులలో చదివిన నవల,
ఎన్ని సంవత్సరాలు గడిచాయో కూడా గుర్తు లేదు,
ఇప్పుడెవరైనా మల్లాది వేంకట కృష్ణ మూర్తి రచనలలో ఏది నీకిష్టం అనడిగితే గుర్తుకొచ్చే
ఒకే ఒక పుస్తకం అందమైన జీవితం!
నాకా నవలలో బాగా నచ్చింది ఏమిటి అంటే…
నిజానికి ప్రియతమ్, శాంతిల మధ్య స్నేహం కన్నా వాళ్ళు పంచుకున్న అందమైన భావాలు!
జీవితం అంతా ఎప్పుడు అందంగా ఆనందంగా ఉండక పోవచ్చు, కాని అందరికి కొన్ని అందమైన జ్ఞాపకాలు,
తలచుకోగానే పెదవుల మీద చిరునవ్వు (ఏ స్థితిలో ఉన్నా సరే) తెచ్చి పెట్టె అపురూప జ్ఞాపకాలు ఉంటాయి.
అలాంటి ఒక అందమైన జీవితమే ఆ నవల, ఆ నవల కోసం ఇక్కడ ఎక్కువ వివరించదలచుకో లేదు,
ఎందుకంటే అది ఎవరికీ వాళ్ళు చదివి అనుభవించవలసిందే,
ఇంకో విషయం ఏమిటంటే మనకి అందమైనవి, అపురూపమైనవి అనిపించే జ్ఞాపకాలు లేక అనుభవాలు ఇతరులకి ఉత్త స్టుపిడిటి,
ఇంకా లేకి మనుషుల మనసుల ఆలోచనలను బట్టీ చెప్పాలి అంటే చాలా అధమంగా ఉంటుంది.
అటువంటి వారికి ఈ పుస్తకం ఏ అనుభూతిని మిగల్చదు.
సో…ఆ అందమైన జీవితం చదివాక ఎవరికైనా అందంగా అనిపిస్తే ఆ అందం అంతా వారి మనసులదే,
ఏమీ అనిపించకపోతే వారిలో ఏదో మిస్ అయింది,
బహుశా మెదడులో అనుభూతిని కలిగించే యంత్రాంగం అయి ఉండొచ్చు.
-విది.
Tamaswini
ఇటీవలే అందమైన జీవితం రీప్రింట్ చదివాను. మల్లాది అక్కడక్కడ కొంత మేటర్ జత చేసి తిరగరాశారు. చిన్న విషయాలే ఐయినా అవి జీవితానికి సంబంధించినవి. కాబట్టి దాన్ని మళ్లి ఆ నవలని అభిమానించేవారు చదవచ్చని ఈ సమాచారం రాస్తున్నాను. ఈ సారి వాడిన కాగితం క్వాలిటీగా కూడా వుంది. డి టి పి చెయ్యడం వాళ్ళ చదవడం సులభం. మల్లాది తనదైన శైలిలో ఈ విషయాలు చెప్పకుండా నిశ్సబ్దంగా వున్నారు.
తమస్విని హైదరాబాద్
srinivasa chary
A very good novel.
Thanks.
MRS.G.V.RAMANA
e rachana gurinchi chaduvutunte hrudayam spandistondi.Koni chadavalani undi. THANKYOU VERY MUCH FOR THIS WEBSITE TOINTRODUCE GREAT WRITERS.
rajagopal
chala roju la taravata(years taravata) telugulo kathalu vuntayani-poorvam anxious ga wait cheyinche yilanti serials vachevani-aa thrill mundu t_20 lu digadudupe ani-madhuramaina gatanni gurthu chesaru-malladi antene-manchi saili-comedy-madhyalo saichology- ela jeevitanni rakarakalu ga chupinchina- goppa writer-thanks for making us remember the past and beauty of malladi’s writing style
essemCHELLURU
jeevithaana prathi kshanaanni elaa aaswaadinchalo ee book chadivithe telustundi
naresh
ee samjam lo nitika velavalu marugana padina samayam lo me lanti rachanalu chadivinappudu kontha manssu swanthana chendutundi. me sahithya kavi lu ki na joharalu
madhavi
ramanigaaru mundugaa meeku naa dhanyavaadaalu.yendukante ee navala serialgaa vachche rojullo nenu sagam chadivaaka miss ayyaanu. taruvaata chaalaasaarlu yenno shopslo prayatnichinaa dorakaledu.gata naalugellugaa book exhibitionlo kuda try chesi dorakaka badhapadtunnaanu evala mee parichaya vyaasam dwara publishers peru telusukogaliganu.maromaru ee pustakam gurinchi prayatninchadaaniki oka aadhaaram dorikindi.inka mugimpu telisipoyindi ani badhapadanu yendukante naaku ee mugimpu gurinchina suspence ivaltidi kaadu naa chinnappatidi appati navalakada.pustakam dorikite santosham anta malli chadavachchu lekapote kanisam naaku mugimpu gurinchina suspence poyindi.bhavukatha unna pratimanishi chadavatagina pustakam andamaina jeevitam ani naa abhipraayam.
suresh
వడ్డెనవీన్,సంగీత,ఆంజన నటించిన ‘నా వూపిరి చిత్రం’ కి ఈ నవల ప్రేరణ కావొచ్చు. నేను ఈ నవల 8th లో వున్నప్పుడు చదివాను. మరలా గతం గురుతు చేసిన పుస్తకం.net కి ధన్యవాదములు.అలాగే రమణి గారికి కూడా!
ramani
తృష్ణ గారు : థాంక్స్ అండీ..
@కుమార్ గారు: మీ వ్యాఖ్య ఆలోచింపజేసింది సమాధానం ఇక్కడో పోస్ట్ అంత అవుతుందని ఆగాను. కాని నాలో రేగిన ఆలోచనలు తప్పక చెప్తాను తరువాత.
@ అబ్రకదబ్రగారు @ శ్రీనివాస్ పప్పు గారు : మీరు చెప్పేదాక నాకు తెలియలేదు అంటే అసలు ఆలోచించలేదు అన్నది కరెక్టేమో నేను ముగింపు చెప్పేస్తున్నాను అని.. మొదటిసారి సమీక్ష అందుకే ఆలోచించలేకపోయి ఉండోచ్చు. ఇకముందు మీ సూచనలు పాటిస్తాను. నెనర్లు
sreenivas pappu
నాది కూడా అబ్రకదబ్ర గారి కామెంటే…
అబ్రకదబ్ర
పరిచయం చాలా బాగుంది. కానీ ముగింపు చెప్పేయటం బాగోలేదు. పుస్తకం మొదటిసారి చదివేవాళ్లకి ముగింపు ముందే తెలిసిపోవటం వల్ల కొంత అనుభూతి కోల్పోతారు. క్లైమాక్స్ గురించిన ప్రస్తావన ఎటూ విడిగా ఓ సెక్షన్లో పెట్టేశారు కదా, దానిపైన ప్రముఖంగా కనిపించేటట్లు స్పాయిలర్ అలర్ట్ లాంటిదొకటి పెట్టేస్తే బాగుంటుంది.
KumarN
బాగా రాసారు. ఈ నవల చాలా మందికి నచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సునిశితమైన పరిశీలనా దృష్టిలో మల్లాది ని బీట్ చేసే తెలుగు ఫిక్షన్ నవలా రచయితలు లేరనే చెప్పొచ్చు.
ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఈ రివ్యూ కనవసరమేమో కాని, మీరు ఆడా, మగా స్నేహం గురించి రెండు వ్యాక్యాలు రాసారు కాబట్టి, గుర్తుంది కూడా కాబట్టి రాస్తున్నాను.
ఈ నవల సీరియల్ గా వచ్చే రోజుల్లో(నవల రాక ముందు), సీరియల్ చివర్లో ఒకటో, రెండో భాగాల్లో, శాంతి తన భర్తతో లవ్ మేకింగ్ లో ఉన్నప్పుడు, ప్రియతం ను ఊహించుకుంటుంది. ఇన్ ఫాక్ట్ మల్లాది శాంతి తో ఒన్ మోర్ టైం ప్లీజ్ అని అడిగిస్తాడు తన భర్తని అదే నైట్, తన భర్త ఆశ్చర్య పొయేలా.
నేనూ, నా రూమ్మేట్ ఆ సీరియల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళం కాబట్టి, చివర్లో ఇద్దరికీ చివుక్కుమని అనిపించింది. ఎంట్రా ఇలా పాడు చేసాడేంటి అనుకున్నం.
ఆ కామన్ సైకాలజీ వల్లేనేమో ఆ పార్ట్ తర్వాత మల్లాది మర్చేసాడు.
కాని ఇన్ని రోజుల తర్వాత చూస్తే, తాను మొదట రాసిందే నిజాయితీగా రాసాడనిపిస్తుంది.
సారీ, మొత్తం నవలలో ఉన్న పాయింట్ వేరు. ఎక్కడొ చివర్లో తాను రాసిందాని గురించి నేనిక్కడ ఎక్కువభాగం రాయడం పద్దతి కాదు, కాని మీరే కాదు, వేరే వాళ్ళు కూడా ఈ నవల గురించి, ఆడా, మగా, స్వచ్చమయిన స్నేహం అని చాలా సార్లు విన్నాను కాబట్టి..నాకు గుర్తుంది కాబట్టి రాసాను.
రివ్యూ రాసినందుకు చాలా థాంక్స్.
తృష్ణ.
బాగా రాసారు.నేనిప్పటివరకూ చదవలేదండి.ఇది చదివాకా కొని చదవాలనిపిస్తోంది.