2020లో నా పుస్తకాలు: హేలీ కళ్యాణ్
వ్యాసకర్త: హేలీ కళ్యాణ్
ముఖ్యగమనిక: ఈ పుస్తకాలన్నీ నేను “కొని” చదవలేదు . కొన్ని పుస్తకాలను కొన్నాను . కొన్ని పుస్తకాలను ఆర్కైవ్ డాట్ ఆర్గ్ నుంచో లేదా ఒకానొక వివాదాస్పదమైన ఆన్లైన్ గ్రంథాలయంలో నుంచో దిగుమతి చేసుకొని చదివాను .
ఇవి నాకు గుర్తున్నంతవరకు నేను చదివిన పుస్తకాలు . గుర్తులేనివి మరికొన్ని ఉండచ్చును . బొత్తిగా సినిమాలు చూడలేదు ఈ సంవత్సరం కరోనా మూలాన. బయట తిరుగుళ్ళు కూడా లేవు అందుకనే మాములు కంటే కొంత ఎక్కువగానే చదివాను . ఇది నా జాబితా .
- స్వామి కరపాత్రి రాసిన రామాయణ మీమాంస (హిందీ) – ఇది రామాయణం గురించిన హిందూ సనాతన ఆలోచనాధారను గురించి తెలుసుకోవాలని అనుకునే వారు తప్పక చదవవలసిన పుస్తకం
- వెండెల్ బెర్రీ – The Unsettling of America: Culture and Agriculture మరియు మరిన్ని ఇతర రచనలు . వెండెల్ బెర్రీ గత రెండు సంవత్సరాలలో నాకు పరిచయమైన ఒక అద్భుతం! సంప్రదాయం ఆధునికత గురించిన వైరుధ్యాలకు సంబందించిన ఎన్నో ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం ఇస్తాడు వెండెల్ బెర్రీ
- Developing a Church Planting Movement in India Daane Winstead Fowlkes (Thesis) అనబడే ఒక పీహెచ్డీ థీసిస్ . క్రైస్తవ మిషనరీల ఆలోచనా విధానం తెలుసుకోవాలని అనుకొనే వారికి బాగా ఉపయోగపడుతుంది . తెలుగు రాష్ట్రాల గురించి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి
- హిందూ లా కమిటీ రిపోర్టులు 1947: వందల పేజీల అభిప్రాయాల సంకలనం . అప్పటి సమాజ స్థితి గతులు ఆలోచనా విధానం గురించి చాలా తెలుసుకోవచ్చు .
- Mocko, Anne T – Demoting Vishnu _ ritual, politics, and the unraveling of Nepal’s Hindu monarchy: నాకు భలే నచ్చింది ఈ పుస్తకం. ఒకానొక కాలంలో నేపాల్ విహార యాత్ర చేసినందున కొన్ని విషయాలతో కనెక్ట్ అవగలిగాను . రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యానికి మారిన తరుణంలో నేపాల్లో జరిగిన మార్పుల గురించిన పుస్తకం ఇది.
- “అభినవ సరస్వతి” అనెడి పత్రిక తాలూకా ఎన్నో సంచికలు : ఇది ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లకు చెందిన పత్రిక . నాకు అర్థమైనంతవరకు అప్పటి కాలపు తెలుగు దేశపు సనాతన ఛాందస బ్రాహ్మణవాదానికి ప్రతీక. ఆ కాలం నాటి కొందరి బ్రాహ్మణుల ఆలోచనా ధోరణి తెలుసుకోవాలని అనుకునే వారు చదవచ్చు . ఉదా : కావ్యకంఠ గణపతిముని అస్పృశ్యత గురించి చేసిన సంస్కరణలను కూడా తప్పుపడతారు కొన్ని సంచికలలో . కాబట్టి ఇటువంటి విషయాల గురించి ఆసక్తి ఉంటే చదవచ్చు . తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదు తిట్టిపోసుకోవలసిన అవసరము లేదు. ఇదంతా అప్పటి వర్తమానం నేటి గతం ఆ వ్యక్తులంతా ఎపుడో పరమపదించారు .
- ఉపన్యాస పయోనిధి – కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి – ఇది కూడా ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్ళలోని తెలుగు దేశపు సాహిత్యం . దివ్యజ్ఞాన సమాజం , మిషనరీలు, బ్రహ్మ సమాజము , సంస్కరణ వాదుల ప్రచారాలతో కోలాహలంగా ఉన్న కాలం . మన పాఠాలలో వీరేశలింగం పంతులు గురించి చెప్పారే కానీ ఆయన సంస్కరణాభిలాషకు బ్రహ్మ సమాజ భావాలకు వ్యతిరేకంగా అపుడెవరు వాదించారు ? వారి వాదనలు ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారు లేరు . అటువంటి ప్రశ్నలు నాలాగా మీకు ఎప్పుడన్నా కలిగి ఉంటే ఈ పుస్తకం చదవచ్చు .
- eparlib సైటులో దొరికే రకరకాల అసెంబ్లీ డిబేట్లు: ఇంచు మించుగా 1875 నుంచి ఇప్పటి కాలం దాకా అప్పటి ప్రజానాయకులు చేసుకున్న వాదోపవాదాలకు సంబంధించిన సమాచారం చాలా దొరుకుతుంది ఈ పుస్తకంలో . నేను చాలా చట్టాల గురించిన చర్చలు చదివాను ఈ సంవత్సరం ఈ సైటు పుణ్యమా అని.
- భారత ధర్మ మహామండల్ వారి “ధర్మ కల్పద్రుమ” ఇతరత్రా ప్రచురణలు : ఇదికూడా ఇరవయ్యో శతాబ్దపు తొలి నాళ్ళలో ఒక వెలుగు వెలిగిన ఒక సనాతనిష్టు సంస్థ . అప్పటి కాలంలో హిందూ సాంప్రదాయ వాదులకు సంస్కరణ వాదులకు బ్రిటీషువారికి మధ్య జరిగిన సంఘర్షణలకు ప్రతీకలు ఈ పుస్తకాలు
- Jerry Mander – In the Absence of the Sacred_ The Failure of Technology and the Survival of the Indian Nations: ఈ రచయిత రచనలతో నాకు కొన్నేళ్ల పరిచయం. చాలా మంచి పుస్తకం. నేటివ్ అమెరికన్ల గురించిన కొన్ని కొత్త విషయాలను తెలుసుకున్నాను. ఆధునికత అమెరికాలో తెచ్చిన మార్పుల గురించి కూడా తెలుసుకున్నాను.
- స్వామీ కరపాత్రి హిందీలో రచించిన మార్క్సవాద్ ఔర్ రామరాజ్య, విచార్ పీయూష్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఔర్ హిందూ ధర్మ, వేద్ కా స్వరూప్ ఔర్ ప్రామాణ్య, కాల మీమాంస ఇతరత్రా రచనలు: హిందూ ధర్మం గురించిన విషయాల గురించి కుతూహలం ఉండేవాళ్ళు తప్పక చదవాల్సిన గ్రంథాలు. తెలుగులో హిందూ కోడ్ బిల్లు గురించి కరపాత్రి స్వామి ఆలోచనలకు సంబంధించిన పుస్తకం ఒకటి సాధన గ్రంథ మండలి వారు అనువదించినట్టుగా ఉన్నారు. ఇది తప్పించి దాదాపుగా ఈయన సాహిత్యం అంతా హిందీలోనే లభ్యం.
- Dialogues with the guru – Talks with his holiness – Sri Chandrasekhara Bharati Swaminah: ఒకప్పటి శృంగేరి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర భారతి స్వామి వారి ఎంపిక చేసిన కొన్ని సంభాషణల సారం. అద్భుతమైన పుస్తకం . సనాతన ధర్మము గురించిన లోతైన చర్చలు పుస్తకం నిండా . వీరి గురించి రాణిశివ శంకర శర్మ గారి లాస్ట్ బ్రాహ్మిన్ పుస్తకంలో మొదట చదివాను తర్వాత ఇదే చదవటం . భద్రంగా జీవితాంతం దాచుకోదగ్గ పుస్తకం
- “Eco-philosophy : designing new tactics for living” మరియు “Dharma, Ecology and Wisdom in theThird Millennium” by Skolimowski, Henryk : స్కోలిమవుస్కి పోలండుకు చెందిన తత్వవేత్త .పర్యావరణ పరిరక్షణ మరియు ఆధునిక అభివృద్ధి నమూనా గురించిన ప్రశ్నల గురించిన కొన్ని సమాధానాలు ఈయన పుస్తకాలలో దొరుకుతాయి.
- Kevin Scott – Reprogramming the American Dream_ From Rural America to Silicon Valley—Making AI Serve Us All : ఎక్కడికి ఈ పయనం అని ఆలోచించేవారికి ధైర్యం చెప్పే పుస్తకం
- Daniel Markovits రచించిన The Meritocracy Trap: How America’s Foundational Myth Feeds Inequality, Dismantles the Middle Class, and Devours the Elite మరియు Michael sandel రచించిన The Tyranny of Merit: What’s Become of the Common Good? – మెరిటోక్రసీ అనే విషయంపై నేను చదివిన రెండు మంచి పుస్తకాలు
- Confronting Capitalism: Real Solutions for a Troubled Economic System Book by Philip Kotler: బిజినెస్ స్కూళ్లలో కోట్లర్ పేరు తలుచుకోకుండా మార్కెటింగ్ తరగతులలో పూట గడవదు. ఆయన ఇలాంటి పుస్తకం రాయటం ఏమిటి అని కుతూహలం కలిగి చదివిన పుస్తకం. బాగుంది. ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావించాడు కదా అని చదివిన మరొక పుస్తకం The Capitalism Papers: Fatal Flaws of an Obsolete System Book by Jerry Mander .ఇది కూడా బాగానే ఉంది . ఈ రెండూ మాత్రమే కాక వీటి చందాన ఉన్న మరొక పుస్తకం చదివాను అది Less is More: How Degrowth Will Save the World Book by Jason Hickel. ఇది కూడా బాగానే ఉంది. ఇటువంటి ప్రశ్నలు మీకు కూడా తరచూ వస్తూ ఉంటే మీరు కూడా చదవవచ్చును.
- Apocalypse Never: Why Environmental Alarmism Hurts Us All Book by Michael Shellenberger: ఇది పర్యావరణ పరిరక్షణ గురించిన మేధో మధనం జరిగే సమూహాలలో పెద్ద దుమారం లేపిన పుస్తకం. కంగారేం లేదు.మన కష్ఠాలన్నిటిని అణు విద్యుత్తు తీర్చేస్తుంది అని వాదిస్తాడు రచయిత . అదొక వాదం!.
- A New Idea of India: Individual Rights in a Civilisational State : ప్రధాన మంత్రి ట్వీట్ చేసి మరీ చదవండయ్యా బాబూ అని అన్నాడు కదా అని ఆ రచయితల గురించి సదభిప్రాయం లేకపోయినా చదివాను. నచ్చలేదు. పేలవంగా ఉంది. ఐతే చాలా ప్రచారార్భాటం జరుగుతోంది. ఏమో చాలా మందికి నచ్చింది కామోసు!
- ఉప్పల నరసింహం రచించిన సబ్బండ వర్ణాల సారస్వతం – మంచి పుస్తకం. ఎందుకనో తెలుగులో మంచి పుస్తకాలు వచ్చినా ఇటువంటి విషయాల పైన ఆసక్తి ఉన్న నాబోటి పాఠకులకు ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి అని తెలియటానికి చాన్నాళ్లు పడుతుంది. మొత్తానికి తెల్సింది. తెలియగానే పుస్తకం కొని చదివాను. బాగుంది.
- Voice of God (Set of 7 Volumes): కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి ప్రవచనలు వివిధ సంభాషణల సంకలనం ఈ పుస్తకం . ఎప్పటి నుంచో చదవాలని అనుకున్న పుస్తకాలు ఇవి . సనాతన ధర్మం గురించిన అవగాహన కోసం తప్పక చదవాల్సిన పుస్తకాలు .
- From darkness to light : a story of the Telugu awakening. 1882 publication. క్రైస్తవ మిషనరీలు అప్పటి తెలుగుదేశంలో మతమార్పిడి గురించి వారు పడిన కష్టాల గురించి సాధించిన విజయాల గురించి రాసుకున్న పుస్తకాల పరంపరలో ఇది ఒకటి . చాలానే చదివాను ఈ సంవత్సరం ఇటువంటివి వాటిలో ఇది ఒకటి.
- “The Menace of the Herd: Or, Procrustes at Large” “Liberty Or Equality: The Challenge of Our Time” Book by Erik von Kuehnelt-Leddihn: యూరోపు అమెరికాలో పేరొందిన కన్సర్వేటివ్ మేధావి రాసిన రచనలు ఇవి. నాకు ఈ సాహిత్యంతో పెద్దగా పరిచయం లేదు. చదివినంత వరకు వాదనలో పదును ఉందని అనిపించింది.
- Neil Postman “The End of Education: Redefining the Value of School”: నేను బాగా అభిమానించే రచయిత. ఆయన ఏం చెప్పినా ఎలా చెప్పినా బానే చెప్పాడే ఏదో విషయం ఉందే అని అనిపిస్తుంది నాకు .
- Seyyed Hossein Nasr – సయ్యద్ హుస్సేన్ నాసర్ నేను బాగా అభిమానించే మేధావులలో ఒకరు. నేటి కాలపు ఆధునికతను అభివృద్ధిని సంప్రదాయ దృక్కోణంలో ముఖ్యంగా ఇస్లాం మత సంప్రదాయ దృక్కోణంలో ఆయన విపులంగా విశ్లేషిస్తారు వివిధ రచనలలో.
Halley
మర్చిపోకుండా ఉండాలంటే పుస్తకం.నెట్ లోనో మరేదైనా చోటో పరిచయ వ్యాసాలు రాసిపెట్టుకోవాలి. చాలా వరకు పుస్తకాలను మళ్ళీ మళ్ళీ రెఫెర్ చేసుకుంటూ ఉంటాను నేను. ఆవు నెమరు వేసినట్టు.
Srinivas Vuruputuri
దేవుడా! ఇన్నేసి పుస్తకాలా? ఎలా సమయం చిక్కించుకుంటారు?ఒక పుస్తకం చదివాక కొన్నాళ్ళకు అందులోని విషయం మరుపుకు రాదా?