తప్పక చదవాల్సిన 150 అనువాద నవలలు
జాబితా తయారుచేసినది: అనిల్ బత్తుల (9676365115)
పాతపుస్తకాల షాపుల్లో అడుగుపెట్టినప్పుడు పుస్తకాల కుప్పల్లో పురావస్తు శిధిలాల్లాగా పాతకాలం నాటి తెలుగు అనువాదాలు కనిపించేవి. వివిధ ప్రపంచ దేశాల అనువాదాలు, భారతీయ భాషల అనువాదాలూ… ప్రాచీన కట్టడాల కింద కుండపెంకుల్లో దొరికిన బంగారు నాణాల్లా, మణులు, వజ్రాలు వైఢూర్యాల్లా వాటిని సేకరించి పెట్టుకున్నాను. తెలియనివారికి, చదవని వారికి అవి చిల్లపెంకులు. తెలిసినవారికి అమూల్య సంపద. మరి కొందరికి నోస్టాజియా. ఇంకొంత కాలం తరవాత అవేమీ ఎవరికీ దొరకకపోవచ్చు. ముందు తరాల కళ్ళలోకి రాకుండానే పేపరు మిల్లుల యంత్రాల్లో నలిగిపోవచ్చు.
కేవలం ఫిక్షన్ కే పరిమితమయ్యాను. ముఖ్యంగా గ్రాంధికం/ వ్యావహారికం ఒక సమస్య. ఇంతకంటే మంచి అనువాదాలు ఇంకా ఉండొచ్చు. నేను చదవకపోయుండొచ్చు. నా దృష్టికి రాకుండా ఉండొచ్చు. కింద ఇచ్చిన లిస్ట్ లో స్టార్ [*] గుర్తు వున్నవి మార్కట్ లో ప్రస్తుతం కొనటానికి దొరకవు. భవిష్యత్తులో రీ ప్రింట్ అవుతాయొ కావో తెలియదు. అవి చదవాలని ఆసక్తి వుంటే గ్రంధాలయల్లొ లేదా పాత పుస్తకాల షాపుల్లో ప్రయత్నించండి. వరస సంఖ్యకు ప్రాముఖ్యం లేదు. 1 వ పుస్తకం ఎంత విలువైనదో 150 వ పుస్తకం కూడా అంతే విలువైనది.
- * బనగర్ వాడి – వెంకటేష్ మడ్గూళ్కర్- అయాచితుల హనుమచ్హాస్త్రి
- * శ్రీకాంత్- శరత్ – బొందలపాటి శివరామక్రిష్ణ
- విశ్మృత యాత్రికుడు – రాహుల్ సాంకృతాయన్ – ఆలూరి భుజంగరావు
- ప్రకృతి పిలుపు – జాక్ లండన్ – కొడవటిగంటి కుటుంబరావు
- * మృతజీవులు – గొగోల్ – కొడవటిగంటి కుటుంబరావు
- * యాత్రికుడు – ప్రభోధ్ కుమార్ సన్యాల్- మోతుకూరు వెంకటేశ్వర్లు, సత్యప్రియా కాసుఖేల
- * మాబీడిక్ – హెర్మాన్ మెల్విల్లీ – పింగళి లక్ష్మీకాంతం
- * బీదలపాట్లు – విక్టర్ హ్యుగో – మరువూరు కోదండరామరెడ్డి
- బీళ్లు దున్నేరు – మైఖేల్ షొలోఖొవ్ – మహీధర క్రిష్ణమోహన్
- ఘంటారావం – ఎర్నెస్ట్ హెమింగ్వే – అమరేంద్ర[చతుర్వేదుల నరసింహశాస్త్రి]
- ఘంటారావం – విక్టర్ హ్యుగో – సూరంపూడి సీతారాం
- వనవాసి- భిభూతిభూషన్ బందొపాధ్యాయ- సూరంపూడి సీతారాం
- పథేర్ పాంచాలి- భిభూతిభూషన్ బందొపాధ్యాయ- మద్దిపట్ల సూరి
- అన్నా కరేనిన – లియో టాల్ స్టాయ్ – ఆర్వీయార్
- యుద్దము శాంతి – లియో టాల్ స్టాయ్ – రెంటాల గోపాలక్రిష్ణ, బెల్లంకొండ రామదాసు
- * మనకాలం వీరుడు – లెర్మంతోవ్ – ఆర్వీయార్
- * పేదజనం శ్వేతరాత్రులు – దోస్తాయేవిస్కీ – నిడమర్తి ఉమారాజేశ్వరరావు
- జమిల్యా – చింగిజ్ ఐతమాతొవ్ – వుప్పల లక్ష్మణరావు
- * తండ్రులు కొడుకులు – తుర్గనెవ్ -కొండేపూడి లక్ష్మీనారాయణ
- టాంసాయర్- మార్క్ ట్వైన్ – నండూరి రామమోహనరావు
- హకల్ బెరిఫిన్- మార్క్ ట్వైన్ – నండూరి రామమోహనరావు
- చెంఘీజ్ ఖాన్ – హెన్రి హెచ్. హోవర్త్ – తెన్నేటి సూరి
- నేరము శిక్ష- దోస్తాయేవిస్కీ – శివం
- రెండు మహానగరాలు – చార్లెస్ డికెన్స్ – తెన్నేటి సూరి
- ఏడు తరాలు- అలెక్స్ హేలీ- సహవాసి
- * ఎదురుదెబ్బలెన్ని తగిలినా -ఎ.జె. క్రానిన్ – మహిధర రామమోహనరావు
- * భూమి- ఎమిలి జోలా- సహవాసి
- నానా- ఎమిలి జోలా – బెల్లంకొండ రామదాసు
- * గజదొంగ నికోలా – ఇవాన్ ఒల్బ్రాహీట్ – రెంటాల గోపాలక్రిష్ణ
- సిద్ధార్థ – హెర్మన్ హెస్ – బెల్లంకొండ రాఘవరావు
- డోరియన్ గ్రే – ఆస్కార్ వైల్డ్ – బెల్లంకొండ రామదాసు
- * నేలను పిండిన ఉద్దండులు – ఓల్ ఏ రోల్ వాగ్ – బి. వి. సింగరాచార్య
- * చెదరిన సమాజం – చినువా అచెబె – కొలసాని సాంబశివరావు
- కొకొరో – సొసెకీ నట్సుమే – శ్రీనివాస చక్రవర్తి
- రక్తాశ్రువులు – టెడ్ ఆలెన్, సిడ్నీ గోర్డాన్ – సహవాసి
- విరాట్ -స్తెఫాన్ త్స్వైక్ – పొనుగోటి కృష్ణారెడ్డి
- * పర్వ -యెస్.యల్.భైరప్ప- గంగిశెట్టి లక్ష్మీనారాయణ
- * గృహ భంగం -యెస్.యల్.భైరప్ప- సంపత్
- అమృత సంతానం- గోపీనాథ మహాంతి – పురిపండా అప్పలస్వామి
- * గోరా- రవీంద్రనాథ ఠాగూర్- శివశంకరస్వామి
- మరల సేద్యానికి – శివరాం కారంత్ – తిరుమల రామచంద్ర
- * రొయ్యలు- తగళి శివశంకర పిళ్లై – గన్నవరపు సుబ్బరామయ్య
- యయాతి – విష్ణుసఖారాం ఖండేకార్ – యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
- * మా తాతయ్యకొక ఏనుగుండేది – వైకం మహమ్మద్ బషీర్- చల్లా రాధాక్రిష్ణశర్మ
- * రెండు శేర్లు- తగళి శివశంకర పిళ్లై – గన్నవరపు సుబ్బరామయ్య
- * సమిష్టి కుటుంబం – ఎం.టి వాసుదేవన్ నాయర్ – ఎస్ దక్షిణామూర్తి
- * జీవితం ఒక నాటకరంగం – పన్నాలాల్ పటేల్ – వేమూరి ఆంజనేయ శర్మ
- చిత్రసుందరి – అఖిలన్ – మధురాంతకం రాజారాం
- * గంగమ్మ తల్లి – భైరవప్రసాద్ గుప్తా – పురాణపండ రంగనాథ్
- * కొన్ని సమయల్లో కొందరు మనుషులు- జయకాంతన్ – మాలతీ చందూర్
- * జంట నగరాలు – అశొక మిత్రన్ – జి.సి. జీవి
- * మరణాంతరం – శివరాం కారంత్ – తిరుమల రామచంద్ర
- * చిక్కవీర రాజేంద్ర – శ్రీనివాస[మాస్తి వెంకటేశ అయ్యంగార్] – అయాచితుల హనుమచ్హాస్త్రి
- ఫౌంటెన్ హెడ్ – అయాన్ రాండ్ – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
- డ్రాకులా – బ్రాం స్టోకర్ – కొలను వేంకట దుర్గాప్రసాద్
- సూఫీ చెప్పిన కథ – కె.పి.రామసున్ని – యల్.ఆర్.స్వామి
- యమకూపం- కుప్రిన్- రెంటాల గోపాలక్రిష్ణ
- అమ్మ – మాక్సిం గోర్కి- క్రొవ్విడి లింగరాజు
- భయస్థుడు – మాక్సిం గోర్కి- రెంటాల గోపాలక్రిష్ణ
- ఎగిరే క్లాస్ రూం – ఎరిక్ కాస్ట్నర్ – బి.వి.సింగాచార్య
- కన్నీరు- మపాసా – బెల్లంకొండ రామదాసు
- నీలికళ్ళు- బాల్జాక్ – బెల్లంకొండ రామదాసు
- దివ్యా- యశ్ పాల్ – ప్రోలు శేషగిరిరావు
- చిత్రలేఖ- భగవతి చరణ్ వర్మ – లంక నారాయణరావు
- సింహ సేనాపతి – రాహుల్ సాంకృతాయన్ – ఆలూరి భుజంగరావు
- మనిషి రూపాలు – యశ్ పాల్ – దిట్టకవి రామేశం
- కల్యాణ మంజీరాలు- అమృతలాల్ నాగర్ – కావ్ ముది
- నేలకొరిగిన కోకిల – హార్పర్ లీ – కాత్యాయని
- గోదాన్ – ప్రేమ్ చంద్ – అట్లూరి పిచ్చేశ్వరరావు
- స్పార్టకస్- హొవార్డ్ ఫాస్ట్- ఆకెళ్ళ క్రిష్ణ మూర్తి
- రెక్కలు చాచిన పంజరం – హెన్రీ షారియర్ – యం.వి.రమణా రెడ్డి
- తిరస్కృతులు – దోస్తాయేవిస్కీ -సహవాసి
- ఒక రోజా కోసం – సెర్దర్ ఓజ్‌కాన్- కె. సురేష్
- పతిత – అల్బర్ట్ మొరావియా – బెల్లంకొండ రామదాసు
- మెటమార్ఫాసిస్- ఫ్రాంజ్ కాఫ్కా – మెహర్
- సుక్షేత్రం – పెరల్.యెస్.బక్ – పి.వి.రామారావు
- కవంట్ ఆఫ్ మాంటో క్రిస్టొ – అలెగ్జాండర్ డ్యుమా – సూరంపూడి సీతారాం
- సాగరగర్భంలో సాహసయాత్ర – జూల్స్ వెర్న్- వినాయక
- డాన్ క్విక్షొట్ – సెర్ వాన్ టెస్- జి.సి.కొండయ్య
- * కూలిన వంతెన – థారెంటన్ వైల్డర్- నండూరి విఠల్
- * విప్రదాసు, చరిత్ర హీనులు- శరత్ – బొందలపాటి శివరామక్రిష్ణ
- * ప్రియభాంధవి – ప్రభోధ్ కుమార్ సన్యాల్ – మద్దిపట్ల సూరి
- * జాటోపెక్ – ఆర్మర్ మెల్లీ – ?
- * కలికాలం- చార్లెస్ డికెన్స్- బెల్లంకొండ రామదాసు
- * ఆదర్శ జీవులు – అంతోనియా కొఫ్తాయెవా – అట్లూరి పిచ్చేశ్వరరావు
- * స్వామి స్నేహితులు – ఆర్.కె.నారాయణ్- శ్రీనివాస చక్రవర్తి
- * ఉచల్యా – లక్ష్మణ్ గాయ్‌క్వాడ్ – సి. వసంత
- * ఆ దీర్ఘ మౌనం – శశి దేశపాండే – ఘండికోట బ్రహ్మాజీరావు
- * కలకత్తాకి దగ్గిరలో – గజేంద్ర కుమార్ మిత్ర – మద్దిపట్ల సూరి
- * అనాథ బాలుడు – గోర్కి – శ్రీనివాస చక్రవర్తి
- * ప్రజల్ని వేటడే బెబ్బొలులు – జిం కార్బెట్- సూరాబత్తుల సుబ్రమణ్యం
- * కడలి మీద కోన్ టికి- థార్ హెయిర్డ్ హాల్ – దేవరకొండ చిన్ని క్రిష్ణ శర్మ
- * జీవన సమరం- బోరిస్ పోలెవాయ్- వి.ఆర్. శాస్త్రి
- * ఐవాన్ హో – వాల్టర్ స్కాట్ – కమలాకర వెంకటరావు
- * ప్రయొజకుడు – ఆర్.కె.నారాయణ్ – మల్లాది సూరిబాబు
- * మహా నగరంలో ఒక చిన్న బాలుడు – యం. కమ్రొవ్- యన్.ఆర్.చందూర్
- * ప్రతి గురువారము – జేన్. యెస్. మెక్లివీన్ – యన్.ఆర్.చందూర్
- * బాకు – అనటోల్ రైబకోవ్ – ప్రతాప రామసుబ్బయ్య
- * అల్లిబిల్లి లొకంలో అమ్మాయి కథ – లూయిస్ కరోల్ – దుర్గాప్రసాదరావు
- * దురాక్రమణ – స్టెయిన్ బెక్ – విధ్వాన్ విశ్వం
- వనసీమలలో – ఫెలిక్స్ జల్తేన్ – మహీధర నళినీ మోహనరావు
- * వోల్గా నుంచి గంగాతీరము – రాహుల్ సాంకృతాయన్ – అల్లూరి సత్యనారాయణరాజు
- * 80 రొజుల్లో భూప్రదక్షణం – జూల్స్ వెర్న్- ముళ్ళపూడి వెంకటరమణ
- * కూలి – ముల్క్ రాజ్ ఆనంద్ – అవసరాల సూర్యారావు
- పశువుల దివాణం – జార్జి ఆర్వెల్ – జనమంచి రామక్రిష్ణ
- జీవన పాశం – సోమర్సెట్ మాం – కాకాని చక్రపాణి
- *చోముని డప్పు- శివరామ కరంత్ – శర్వాణి
- *చో మానో ఆఠో గుంటో- ఫకీర్ మోహన సేనాపతి – పురిపండా అప్పలస్వామి
- రంగభూమి- ప్రేంచంద్ – సుంకర, ఆలూరి, కవ్ముది
- ప్రేమ జ్యొతి – అలెక్సాండర్ చకొవ్స్కి – రెంటాల గోపాలకృష్ణ
- అబలా జీవితము – హరినారాయణ్ ఆప్టే – పి.వి.నరసింహారావు
- రాజూ పేద – మార్క్ ట్వైన్ – నండూరి రామమోహనరావు
- చివరకు మిగిలింది? – మార్గరేట్ మిచెల్ – యం.వి.రమణారెడ్డి
- *అగ్నిధార – కురతులైన్ హైదర్ – వేమూరి రామక్రిష్ణమూర్తి
- *సంస్కార – యు.ఆర్.అనంతమూర్తి – యన్.యల్.శాస్త్రి
- మట్టి దీపం – యం.వరదరాజన్ – ఎన్.నరసింహులు నాయకర్
- గెంజిగాథ – మురాసఖి సతి – నండూరి రామకృష్ణమాచార్య
- ఇస్పేటు రాణి – పుష్కిన్ – రెంటాల గోపాలకృష్ణ
- కొడుకులు కూతుళ్ళు – యువాన్‌చింగ్, కుంగ్ చూయే – సి. మహేశ్
- రూడిన్ – టర్జనీవ్- అవసరాల సూర్యారావు
- మరణించని మహానగరం – రిచర్డ్ కోలర్ – ఇస్మాయిల్
- సాయం సంధ్యలు – గోగొల్ – శ్రీనివాస చక్రవర్తి
- ప్రతీకారం – గోగొల్ – శ్రీనివాస చక్రవర్తి
- వడ్డీవ్యాపారి భార్య – దోస్తాయేవిస్కీ – ఆలూరి భుజంగరావు
- తారాస్ బుల్బా – గోగొల్ – శ్రీనివాస చక్రవర్తి
- తమస్ – భీష్మ సహానీ – యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
- అయిలీత – అలెక్సేయ్ రొల్ స్తొయ్ – వుప్పల లక్ష్మణరావు
- *ఇకతియాండర్ – ఎ. బెల్యాయెవ్ – ఆర్వీయార్
- మానధనులు – హొవర్డ్ ఫాస్ట్ – కెవీఆర్
- ఆనంద మఠం – బంకించంద్ర చటర్జీ అక్కిరాజు రమాపతిరావు
- విషాద కామరూప – ఇందిరా గోస్వామి – గంగిశెట్టి లక్ష్మీనారాయణ
- సింగారవ్వ – చంద్రశేఖర కంబార – కె.సురేష్
- చితి – పెరుమాళ్ మురుగన్ – కె.సురేష్
- పెద్దపులి ఆత్మకథ – ఆర్.కె.నారాయణ్ – ఎం.వి.రమణారెడ్డి
- *దాటు – యెస్.యల్.భైరప్ప- పరిమి రామనరసింహం
- లజ్జ – తస్లిమా నస్రీన్ – వల్లంపాటి వెంకటసుబ్బయ్య
- *కాలగర్భంలో – రాహుల్ సాంకృతాయన్ – రావి సత్యనారాయణ, కారంచేటి రామయ్య
- ఒక మనిషి ఒక ఇల్లు ఒక ప్రపంచం – జయకాంతన్ – జిళ్ళేల్ల బాలాజీ
- ఒక తల్లి – మహాశ్వేతాదేవి – సూరంపూడి సీతారాం
- *సమరం లో కలిసిన గీతలు- వెరా పనోవ – ఆర్వీయార్
- *హాక్యూ – లూషన్ – కందికట్టు వెంకటేశ్వరరావు
- మానవుడి పాట్లు – మైఖెల్ షొలహొవ్ – శ్రీశ్రీ
- సముద్రతీర గ్రామం – అనితా దేశాయ్ – ఎం.వి.చలపతిరావు
- ఓవర్ కోటు – గొగొల్ – వుప్పల లక్ష్మణరావు
- ఉదయ గీతిక – యాంగ్ మో – యన్.వేణుగోపాల్
- *కంకార్డ్ దీవి మిలీషియా మహిళలు – లీ జు-చింగ్ – నవత
- నా బాల్యం- గోర్కి – వుప్పల లక్ష్మణరావు
- చైనాలో నా బాల్యం- చియాంగ్ ఈ – నోరి రామశర్మ
- చెట్లు – కాన్రడ్ రిచ్ టర్ – యన్.ఆర్.చందూర్
- *సాహస యాత్ర – రిచర్డ్ న్యూబెర్గర్ – యన్.ఆర్.చందూర్
V. Anil kumar
Great effort
P.srinivasarao
Book in devine
Samson
మంచి అనువాద పుస్తకాలను అందించినందుకు ధన్యవాదాలు.
ఎంతో కాలంగా నండూరి విఠల్ గారి నవలల కోసం చూస్తున్నాను కానీ ఎక్కడా లభించటం లేదు.
మీరు వాటిని వేతికిపెట్టగలరని ఆశిస్తున్నాను.
Eftha Narendra
అనిల్ గారూ, చాలా మంచి పుస్తకాలు పరిచయం చేశారు.ఇన్ని పుస్తకాలను పూలను ఒక దారంలో కూర్చినట్లు ఒక్క వ్యాసంలో కూర్చారు.మీ శ్రమ,కృషి మనస్పూర్తిగా అభినందిస్తున్నాము.మీకు ధన్యవాదములు.
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
P.Vijaylakshmi Pandit
A great effort and good collection of the tittles of popular navels of all the time.