ప్రాచీనాంధ్ర గ్రంధమాల – వ్యాస సంకలనానికి ఆహ్వానం

మిత్రులారా! ఈ నెల లోపు గడువు అనుకున్నాం.. మీ వ్యాసాలను ఎంత త్వరగా పంపితే అంత మంచిది.
బహుశా కరోనా లేకపోతే ఈ పుస్తకం ఈ పాటికి వెలుగు చూసేది.

నర్రా.జగన్మోహన్ రావు. బహుశా ఈ పేరు ఎవరికి పరిచయం లేకపోవచ్చు కానీ , ప్రాచీనాంధ్ర గ్రంధమాల అంటే మాత్రం టక్కున విజయవాడ, లెనిన్ సెంటర్, పాత పుస్తకాల షాపు గుర్తుకు వస్తాయి.రచయితలో పాఠకులో లేక ఉపాధ్యాయులో ఎవరైనా సరే కాస్త చదివే గుణం ఉన్నవాళ్లకి ఈయనతో అనుబంధం ఉంటుంది.వాళ్ళ పుస్తకాలు అమ్మడానికో లేక పాత పుస్తకాలు కొనడానికో ఒక్కసారైనా ఆయన్ని కలిసి ఉంటారు. ఈ తరం లో పుస్తకాన్ని అమితంగా ఇష్టపడే చివరి వ్యక్తుల్లో ఆయన ఒకరు. పేపర్ ని పట్టుకుని దాని చరిత్ర చెప్పగలరు, అట్ట చూసి పబ్లికేషన్ పేరు చెప్పగలరు.ఏ పుస్తకం ఎవరిదగ్గర దొరుకుతుంది అనే సమగ్ర సమాచారం ఆయన దగ్గర ఉంది ఉంటుంది.అలాంటి వ్యక్తి మన తెలుగు వాడు కావడం మనకి కాస్త గర్వ కారణం. ఆయన శ్రమని అలాగే పోనివ్వకుండా ఆయన తో మనకున్న అనుబంధాలని చెరిగి పోనివ్వకుండా ఉండడం కోసం ఆయన మీద వ్యాస సంపుటి తీసుకు వద్దామని నేను మిత్రుడు అనిల్ బత్తుల నిర్ణయం చేశాం. ఆయనతో మీకున్న అనుబంధాన్ని, ఆయన మీకు ఇచ్చిన పుస్తకాలని గుర్తుచేసుకుంటు ఒక వ్యాసాన్ని మాకు పంపండి. వీలైనన్ని ఎక్కువ వ్యాసాలు రావాలని కోరుకుంటున్నాం. ఎంత త్వరగా పంపితే అంత త్వరగా పని పూర్తి చేయాలని అనుకుంటున్నాం
పుస్తకాలని ,రచయితలు ని ప్రేమిద్దాం సరే…వాటిని కాపాడే వాళ్ళని కూడా మనం గుర్తు చేసుకుందాం.

వ్యాసాలు పంపవలసిన మెయిల్ ఐడీ
anildyani@gmail.com

You Might Also Like

2 Comments

  1. Anil battula

    K.Phani Kishore Reddy gaaru@ మీ పై కామెంట్ ని “ప్రాచీనాంధ్ర గ్రంధమాల – వ్యాస సంకలనం” లో ప్రచురణకు స్వీకరిస్తున్నాము. ధన్యవాదాలు.

  2. K.Phani Kishore Reddy

    sir na Peru Phani.madi Vijayawada. Nenu postgraduate ni.prastutam hetero labs lo work chestannanu.naku pracheenagrandamala tho 15 years nunchi parichayam.jaganmohan Rao Garu naku baga parichayam.aayana naku konni arudina pustakalanu dachi vunchi maree echevaru.nenu aayana vadha nundi 300 pustakalanu konivuntanu.chala varaku unpublished. Konni 100 years back books kuda aayana nunchi sekarinchanu.jaganmohan Rao Garu money kante manishi abhiruchiki pradhanyatanistaru.oka sari kasiyatra charitra publish lo lekamundu aayana naa kosam dachivuncharu.vere vyakti chala amount esta Anna evaledu.manchi subject vunna vyakti.nenu abhimaninche goppa vyakti.last week kuda Vijayawada vellinapudu shop ki velli vachanu.3 goppa pustakalanu aayana nanudi 50rs tesukunnaru.thank u sir.

Leave a Reply