The Vegetarian – Han Kang

వ్యాసకర్త: Nagini Kandala
************
రచయితలు కూడా రకరకాలుగా ఉంటారు,కొందరు వాళ్ల మనసులో ఉన్నది ఇదీ అని అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు స్పష్టంగా చెప్పేస్తారు. Extroverts అంటారు కదా అలా అన్నమాట. మరి కొందరు Introverts,మనమే వాళ్ల మనసులోకి వెళ్ళిపోయి వాళ్ళేమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఇక ఈ మూడో రకం రచయితలు, వీళ్ళనేమంటారో తెలియదుగానీ, వీళ్ళు మనకి ఏదీ స్పష్టంగా చెప్పరు. అలా అని మనకి అర్థం అయ్యేలా తేలికగా క్లూలు వగైరాల్లాంటివి కూడా ఏమీ ఇవ్వరు. కానీ మనకి అర్థం చేసుకోడానికి బోల్డన్ని సంఘటనల్ని పొడుపు కథలుగా అల్లేసి ఆ చిక్కు ముడుల్ని విప్పుకోండి అని మనకి వదిలేస్తారు. సౌత్ కొరియన్ రచయిత్రి Han Kang ఈ మూడో రకం రచయితల్లోకి వస్తారు. The Vegetarian, తొలి ముద్రణ 2007 లో కొరియన్ భాషలో వెలువడినప్పటికీ Deborah Smith ఆంగ్ల అనువాదం 2016 సంవత్సరానికిగాను Man International Booker ప్రైజ్ గెలుచుకుంది. కొన్ని పుస్తకాలు చదివాక ఆలోచనలోపడతాం, కథలో ఇది ఇలా జరిగింది, అలా జరగడానికి కారణాలు ఇవీ అనీ, మరికొన్నిసార్లు రచయిత మనకి ఇలా చెప్పాలనుకుంటున్నారు ఏమో అనీ అనుకుంటాం. ఇంకొన్నిసార్లు సులభంగానే నిశ్చితాభిప్రాయాలకు వచ్చేస్తాం. .కానీ ఇవేవీ ఈ పుస్తకం చదివిన వారికి అంత సులభంగా అనుభవమయ్యే అంశాలు కాదు. కథ మొదలయ్యేసరికి అన్నీ చాలా సింపుల్ గా అనిపించే విషయాలు మధ్యలోకి వచ్చేసరికి మన ఆలోచనలకి అందని, అస్సలు కంట్రోల్ చెయ్యలేని క్లిష్టతరమైన సంఘటనలుగా రూపాంతరం చెందుతుంటాయి. ఏదీ మన ‘కంట్రోల్ లో ఉండదు/మన ఊహకి అందదు, సహజంగానే ఆ alien ఫీలింగ్ మనకి నచ్చదు. ఆ కారణంగా చదవడం పూర్తయ్యాక చాలా సేపటి వరకూ ఒక రకమైన స్తబ్దత ఆవహిస్తుంది.

సౌత్స కొరియన్ సంస్కృతి లో ఆమోదయోగ్యం కాని ‘వెజిటేరియనిజం’ను బేస్ చేసుకుని,మొత్తం మూడు భాగాల్లో, ముగ్గురు వ్యక్తుల దృష్టికోణం నుంచి Yeong-hye అనే ఒక సాధారణ గృహిణి కథని మనకి చెప్తారు రచయిత్రి Han Kang. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు ఆమె భర్త Mr.Cheong, రెండో వారు ఆమె అక్క భర్త (పేరు ప్రస్తావించలేదు), మూడో వారు ఆమె అక్క In -Hye. ఒక రోజు హఠాత్తుగా Yeong-hye మాంసం తినడం మానేస్తుంది, ఫ్రిజ్లో ఉన్న మాంసాహారం అంతటినీ తీసి బయట పడేస్తుంది. అదేమని అడిగిన భర్తకి “I had a dream” అని మాత్రం సమాధానం చెప్తుంది. ఆమె సంభాషణలు పెద్దగా ఉండకపోయినా మధ్య మధ్యలో ఆమె కలను గురించీ, కొన్నిసార్లు ఆమె మనసులో అనుకునే విషయాలు, మనకి ఒక monologue లా చిన్న చిన్న పారాల్లో చెప్తారు.

శాఖాహారులుగా మారడం అంత ఆశ్చర్యకరమైన విషయం కాని మన సంస్కృతిలో Yeong-Hye నిర్ణయంపై ఆమె కుటుంబం మరియు సమాజం నుంచి వచ్చే తీవ్రమైన వ్యతిరేకత, తిరస్కారం మనకి మొదట్లో చాలా అసహజంగా అనిపిస్తుంది కానీ క్రమేణా వారి ప్రవర్తన, సంఘటనలు ఆ సమాజంలో వారికి మాంసాహారం తినడం ఎంత ఆవశ్యకమో తెలుస్తుంది. ఒక official పార్టీలో Mr. Cheong సహోద్యోగులు Yeong-Hye నిర్ణయంపై వ్యక్తపరిచే అభిప్రాయాలు ఈ విధంగా ఉంటాయి.

“Do you remember those mummified human remains they discovered recently? Five hundred thousand years old, apparently, and even back then humans were hunting for meat—they could tell that from the skeletons. Meat eating is a fundamental human instinct, which means vegetarianism goes against human nature, right? It just isn’t natural.”

“Well, I must say, I’m glad I’ve still never sat down with a proper vegetarian. I’d hate to share a meal with someone who considers eating meat repulsive, just because that’s how they themselves personally feel…don’t you agree?”

“Imagine you were snatching up a wriggling baby octopus with your chopsticks and chomping it to death—and the woman across from you glared like you were some kind of animal. That must be how it feels to sit down and eat with a vegetarian!”

నవల మొదట్లో ఆమె భర్త ఆమె గురించి చెప్తూ,’అసలు ఏ ప్రత్యేకతా లేని ఒక అతి సాధారణ వ్యక్తి శాకాహారిగా మారిన తరువాత మాత్రమే ఆమె వ్యక్తిత్వం ఒక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది’ అంటాడు.

“I’d always liked my wife’s earthy vitality, the way she would catch cockroaches by smacking them with the palm of her hand. She really had been the most ordinary woman in the world.”

మొదటి భాగం ‘The Vegetarian’ లో ఆమె భర్త Mr.Cheong, తన అనుభవాలను చెప్తాడు. స్వార్థపరుడుగా, ఏ ప్రత్యేకతా లేని ఒక సాధారణ ఉద్యోగిగా, భార్య మానసిక స్థితి అర్థం చేసుకోలేని భర్తగా అతను కనపడతాడు. చివరకు Yeong-Hye మానసిక అసమతౌల్యం కారణంగా ఆమెనుండి విడిపోతాడు. రెండో భాగం Mongolian mark లో ఆమె బావ, కళ పట్ల,తన మరదలి పట్ల ఉండే వ్యామోహంతో తన భార్యాబిడ్డల జీవితాన్ని కూడా పణంగా పెట్టే ఒక restless, weird person గా పరిచయం అవుతాడు. ఇక మూడో భాగం అన్నిటికంటే ముఖ్యమైనది. అది ఆమె అక్క In-Hye దృష్టికోణంలో ఈ కథ. In-Hye ఒక బాధ్యతాయుతమైన తల్లిగా, భార్యగా, అక్కగా ఇలా అడుగడుక్కీ ఒక అసాధారణమైన strength ఉన్న పెర్ఫెక్ట్ వ్యక్తి గా కనిపిస్తుంది. Intellectual, ఆర్టిస్టిక్ passions తాలూకు కాల్పనిక ప్రపంచపు నీడలేవీ జీవితంపట్ల ఆమె ప్రాక్టికల్ approach పై ఏ ప్రభావం చూపించవు. కానీ తుదకు ఆమె వెనక్కి వెళ్లి చూసుకుంటే తన జీవితం ఖాళీగా, తన చెల్లెలు, భర్తల సంబంధం కారణంగా ఎంత insignificant గా మారిందో అనిపిస్తుంది. ఇక వీటన్నిటికీ కేంద్రం అయిన Yeong-Hye, జీవితంపై చిన్నతనంలో తండ్రి హింసాత్మక ప్రవృత్తి చాలా ప్రభావం కలిగి ఉంటుంది. మనిషి బ్రతకాలంటే ఎంతో కొంత హింస అనివార్యం అని భావించి (గ్రహించి) మనిషిగా తన ఉనికిని అసహ్యించుకుని, ఆ ఉనికినే వద్దనుకుని తానొక మొక్కగా మారానని భావించే ఆమె ప్రవర్తనలో నిహిలిజం ఛాయలు దర్శనమిస్తాయి. మానసిక అసమతౌల్యం ఉన్నవారికి ప్రతినిధిగా తన గళాన్ని వినిపిస్తుంది Yeong-Hye. ఒక సందర్భంలో ఆమె ఇలా అడుగుతుంది: “Why, is it such a bad thing to die?”

తన నిర్ణయం గురించి Yeong-Hye చూపించే తిరుగుబాటు ధోరణి, coldness, detachment లాంటివి తనను ఒక మనిషిగా కాకుండా ఒక చెట్టు అని అనుకునే ఆమె ఆలోచనలు ఒక Surrealistic వాతావరణాన్ని సృష్టిస్తాయి. తరువాత ఆమె తల్లితండ్రులు, భర్త ఇలా అందరూ ఆమె పట్ల చూపించే హింసాత్మక ధోరణి, ఆ వత్తిడికి ఆమె ఆత్మహత్యాయత్నం చెయ్యడం, వృత్తి-ప్రవృత్తి రీత్యా ఒక వీడియో ఆర్టిస్ట్ అయిన ఆమె బావ ఆమె శరీరం పై ఉండే మంగోలియన్ మార్క్ పట్ల అబ్సెషన్ తో ఆమెను తన కళాఖండానికి అభ్యంతరకరమైన రీతిలో మోడల్ గా వాడుకోవడం ఇలా ఒకదాని వెనుక ఒకటి జరిగే సంఘటనలు Han Kang ప్రతిభకు దర్పణం పడుతూ మనకు ఒక abstract పెయింటింగ్ లా అనిపిస్తాయి.

Yeong-Hye మానసిక స్థితి –
Intolerable loathing, so long suppressed. Loathing I’ve always tried to mask with affection. But now the mask is coming off.

That shuddering, sordid, gruesome, brutal feeling. Nothing else remains. Murderer or murdered, experience too vivid to not be real. Determined, disillusioned. Lukewarm, like slightly cooled blood. Everything starts to feel unfamiliar. As if I’ve come up to the back of something. Shut up behind a door without a handle. Perhaps I’m only now coming face-to-face with the thing that has always been here. It’s dark. Everything is being snuffed out in the pitch-black darkness.

Dreams of my hands around someone’s throat, throttling them, grabbing the swinging ends of their long hair and hacking it all off, sticking my finger into their slippery eyeball. Those drawn-out waking hours, a pigeon’s dull colors in the street and my resolve falters, my fingers flexing to kill. Next door’s cat, its bright tormenting eyes, my fingers that could squeeze that brightness out. My trembling legs, the cold sweat on my brow. I become a different person, a different person rises up inside me, devours me, those hours…

నా వరకూ, ఈ పుస్తకం ఒక అద్భుతం అని చెప్పను గానీ ఇందులో నాకు బాగా నచ్చిన అంశం narration. కథనమే ఇందులో హీరో. కథను overtake చేసి మనల్ని కట్టిపడేసి ఉంచేది narration ఒక్కటే. చాలా మాములు విషయాలను కూడా తన అక్షరాలతో హంగులద్ది తన అద్భుతమైన వర్ణనతో రక్తి కట్టించారు Han Kang.

You Might Also Like

Leave a Reply