నాకు నచ్చిన కధ – ఆలిండియా రేడియో
అనగనగా అంటూ ఎన్నో కథలు వస్తాయి. కథలు అంటే ఊహించి రాసినవే కాదు. మనం నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు కథలుగా చెప్పుకుంటాము. కొన్ని కధలు ఎప్పటికీ మర్చిపోలేము కూడా. ముఖ్యంగా చిన్ననాటి ముచ్చట్లు. అలాంటి మధురమైన చిన్ననాటి అనుభవాలను “హాస్య కథలు” పేరిట ఎమెస్కో వారు ప్రచురించారు. రాసినవారు పొత్తూరి విజయలక్ష్మి.
ఇందులో నాకు బాగా నచ్చింది అనడంకంటే హృదయానికి హత్తుకున్నది “ఆలిండియా రేడియో” అనే కథ. అప్పటిరోజులే వేరు. ఊర్లలో అందరూ కలిసి మెలిసి ఉండేవారు. ప్రేమ, ఆప్యాయత అనురాగాలు వెల్లివిరిసేవి. పట్నం షోకులు, అలవాట్లు ఇంకా అంటని ఒక ఊర్లో రేడియో సృష్టించిన అలజడి ఇందులో సరదాగా చెప్పబడింది. రచయిత్రి చిన్నప్పుడు వాళ్ల నాన్నగారికి ఉద్యోగం బదిలీ ఐనప్పుడు రేడియోని మాత్రం అమ్మమ్మగారింటికి తరలించారు. “అయ్యో నాయనా! అలుడి వస్తువులు ఎలా వాడుకోము. అప్రదిష్ట కదా” అని వారించినా అది వారింటికి చేర్చక తప్పలేదు. ఆ రేడియో ఎలా వాడాలో చెప్తూ , అందులో వచ్చే అన్ని స్టేషన్ల గురించి చెప్తుంటే ” అలా ఊరూర్లు తిరిగితే బాగోదు. విజయవాడలోనే ఉండనివ్వండి” అన్నారట. హైదరాబాదు ఎక్కడ?, విజయవాడ ఎక్కడ? అని ఆశ్చర్యపోయారు కూడా. తప్పనిసరై రేడియో ముల్లుని విజయవాడ వద్దే ఉండేలా సవరించి పెట్టారు.
ఇక ఆ రేడియోని రోజూ ఉదయం ఆరుగంటలకు ఆన్ చేసి పెడితే అది ప్రసార సమాప్తి అయ్యేవరకు నడుస్తూనే ఉండేది. ఆ రేడియోలోని కార్యక్రమాలు వినడానికి మరి కొందరు చేరేవారు . అలా మందల కొద్ది జనాలు రేడియో వింటె దాని శక్తి తగ్గిపోతుందని అమ్మమ్మ అనుకుంది. పైగా ఒకరోజు అందరూ అలా గుంపులుగా చేరి వినడం వల్ల రేడియో నీరసంతో శోష వచ్చి, గరగరలాడి మాట పడిపోయింది అని బాధపడిపోతూ కూతురికి ,అల్లుడికి ఉత్తరం రాయించింది. (రేడియో పని చేయలేదన్నమాట). తర్వాత దాన్ని రిపేర్ చేసారు.
ఒకరోజు వాళ్లింట్లో కరెంట్ పోయింది. మళ్లీ కరెంట్ రాగానే రేడియో మోగింది. వంట ప్రయత్నంలో ఉన్న అమ్మమ్మ కంగారుగా “వచ్చే! వచ్చే!!” అంటూ పరిగెత్తుకు వెళ్లి రేడియో ముందు నిలబడి విన్నది. అక్కడినుండి కదిలితే రేడియో చిన్నబుచ్చుకుంటుంది అని ఆరాటం. ఇంట్లో వంట కాలేదు. మనవరాలికి చెప్తే వినలేదు. పక్కింటి భ్రమరాంబ వస్తే ఆమెను రేడియో ముందు కూచోమని బ్రతిమిలాడుతుంది. అప్పటికి గండం తీరుతుంది. ఇంతకీ ఆవిడ బాధ ఏంటంటే “” అల్లుడు అంత అభిమానంగా ఇచ్చిన వస్తువు. జాగ్రత్తగా చూసుకోవద్దూ. మనం వినాలనుకున్నప్పుడు చెవులు నిక్కబెట్టుకుని విని తీరుబడి లేదని దాన్ని వదిలేసి వెళ్లిపోతే అది మనసు కష్టపెట్టుకుని చెడిపోదా? అని.. ఇక పక్కింటి పిన్నిగారు, అమ్మమ్మ కలిసి రేడియో ముందు కూర్చుని ప్రతీ మాట కూడ కార్తీక పురాణం విన్నంత శ్రద్ధగా వింటారు. మార్కెట్ ధరవరలు వచ్చినప్పుడు పప్పులు, ఉప్పులు , కూరగాయల ధరలు చెప్పినప్పుడు బానే వింటారు కాని చేపలు, మట్టగుడిసెలు, బొచ్చెలు అని ధరలు చెప్తుంటే ముక్కు మూసుకుని, మొహం మాడ్చుకుని కంపరంగా ఉందని వెళ్లి స్నానం చేస్తారు ఆ అమాయకపు మహిళలు.
ఇలా ఆ రేడియోని ఒక యంత్రం లా కాకుండా ఒక ప్రాణమున్న మనిషిలా భావిస్తారు ఆ అమాయక ఊరి ప్రజలు. రేడియో మనకు ఎన్నో విషయాలు చెప్తుంది. అలుపన్నదే ఎరుగదు. ఎంత మంచిదో కదా. దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నీ వినాలి అని రోజూ శ్రద్ధగా దాని ముందు కూర్చుంటారు. అది ఎక్కడ బాధపడుతుందో అని.. సాటి మనుష్యుల పట్ల కాస్త కూడా సానుభూతి, గౌరవం లేని ఈ రోజుల్లో ఈ కథ అపురూపమే కదా..
పుస్తకం » Blog Archive » 2009 లో నేను చదివిన పుస్తకాలు
[…] రచించిన ఈ పుస్తకంలో ఆవిడ చిన్ననాటి జ్ఞాపకాలెన్నో ఏర్చి కూర్చారు. ప్రతి కథలోనూ ఆనాటి […]
SIVARAMAPRASAD KAPPAGANTU
Good piece of writing. I became quite nostalgic reading this. Really, there were used to be one small programme in AIR Vijayawada on Market rates and in that they were used to tell about Fish and other Non veg rates also.
The person/artist who was reading those rates was having a very distinct voice. I do not know his name but it was great listening to him. I presume he is also a Brahmin and he was made to recite the rates of various fishes. In his tone he was used to sound his distaste for them.
If anybody knows that gentleman or preferably anybody has a recording of that programme on Market Rates (late 60s and early 1970s), kindly upload into the net for posterity.
చలపతిరావు
మార్కెట్ధరలు ఏ.వి.స్.కుటుంబయ్యగారు చదివేవారు.ఆయనఆకాశవాణిసంగీతవిభాగంలో తంబూరా పై సహకారం అందించేవారు. నిలయకళాకారులు
msrmurty
ee kadha chadivinappudu ammamma patralo maa ammagaru gnapakamochaaru
ame kooda ee ammammala maa bavagaru us vedutu [1970] maa intilo
vunchina vari vostuvulanu ee rojuku kooda alane vunnai[even appati
readers digest books to saha] .up course maa ammagaru eemadyane
kalamchesaru[6 months back at the age of 85yr].thanks for remembaring
once agin my mother to me through your story.
msrmurty