ప్లెమింగో (విడిది పక్షుల దీర్ఘ కవిత)
కలత చెందిన నిద్ర
మెలకువై తట్టిలేపింది
నిదురకోసం నిరీక్షించిన కళ్ళూ, కాయం
అసహనంగానే విద్యుత్తుదీపాన్ని వెలిగించి చెతికందిన పుస్తకపేజిల్లోకి కళ్ళను, మనసును దూర్చింది. కాల ప్రభావమో, అక్షరాల మోహమో నాకు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడో తిప్పింది. ఏటి గట్టున నుంచి సర్స్సుల్లోకి, సరస్సుల్లోచి సముద్రాల్లోకి ఈదులాడచేసింది
బయట..
పిట్టచాపిన రెక్క తొలికోడయ్యింది ఇక నేనూ జీవనసమరానికి పక్షినవ్వాలి.
ఇది ప్లెమింగో చదివిన వెంటనే తక్షణ స్థితి.
ఇది పన్నెండు భాగాల దీర్ఘ కవిత.
ఫ్లెమింగో అని పేరుచూడగానే ఒక జాతి పక్షినిగూర్చిన సమగ్ర విషయాలు వివరాలు వుంటాయనుకున్నాను కానీ ఇందులో స్పూర్తినిచ్చిన పక్షి ప్రతీక. వాల్మీకి పక్షిని వేటాడినప్పుడు ఆ పక్షి విలవీలాడటం చూసి శోకించి శ్లోకం పలికాడు. ఇక్కడ నాకనిపిస్తుంది ఫ్లెమింగోయే రామకృష్న్ణను వెంటాడి వేటాడి ఇలా దీర్ఘ కవితై మనముందు వాలిందని.
కాలాన్ని ఎన్నికోణాలనుంచి చూడొచ్చో ఆ పార్శవాలన్నీ ఆవిష్కరిస్తూ మొదలౌతుంది ఈ దీర్ఘ కవిత. మనిషి జీవితం, పక్షి జీవితం, వలస జీవితం వీటిమద్యవుండే తాత్వికతని ఆవిష్కరిస్తూ పక్షిలో పరకాయ ప్రవేశం చేయాల్సిందే అంటూ ముగిస్తాడు.
కొన్ని పదాలకు నిఘంటువు సహాయాన్ని ఆశ్రయించవల్సిందే! పాఠకులు ఎంతవరకూ చేస్తారనేది వారి వారి అభిరుచులకు వదిలి పెట్టడటమే.
అక్కడక్కడా కనిపించే అంత్య ప్రాస, శబ్ద లయతో సాగే కొన్ని పదాలు ఆశాంతం చదివేలా చేస్తుంది.
పువ్వు ప్రయాణిస్తుంది
పరాగమై
పువ్వునుంచి పువ్వువరకు
అనురాగమై
పక్షి ప్రయాణిస్తుంది
సరాగమై
తీరంనుంచి తీరం వరకు
పరంపర రాగమై”
పక్షి లక్ష్యాన్ని తెల్పుతూనే ప్రాస, శబ్దలయల నడకల సోయగాన్ని చూపిస్తాడు
ఒక వేకువను స్వాగతిస్తూ
“సమాజాన్ని మేల్కొలిపేది పక్షి” అని పక్షి అవసరతను తెలియచేస్తాడు.
వలసవచ్చే ఫ్లెమింగోలతోపాటు మనమూ వలసపోవటం ఖాయం.
చదావాల్సిన పుస్తకం
*******************************************
ప్లెమింగో (విడిది పక్షుల దీర్ఘ కవిత)
కవి : శ్రీ పెరుగు రామకృష్ణ.
విడుదల ఫిబ్రవరి 2006, వెల రు. 30/-
దొరుకుచోట్లు : నెరసం ప్రచురణలు, 25-1-949, నేతాజీ నగర్, 5వ వీధి, ఎ.కె. నగర్, నెల్లూరు-524 004 9849230443
మరియు విశాలాంద్ర
perugu
John Hide gariki
Dhanyavaadaalu..
Spandanatho sameekshninanduku..
ramakrishna