India Partitioned: The Other Face of Freedom – Vol 1
మొన్నీమధ్యే గూగుల్‍వాళ్ళు భారత-పాక్ విభజన నేపథ్యంలో తీసిన ఒక ఆడ్, వయస్సుతో నిమిత్తం లేకుండా అందరిని ఆకట్టుకుంది. దేశవిభజన వల్ల విడిపోయిన స్నేహితులిద్దరిని వారి మనవలు తిరిగి కల్సుకునేలా చేయడం ఈ మూడు నిమిషాల నిడివి గల ఆడ్ లోని కథ. గూగుల్ సెర్చ్ ప్రాముఖ్యాన్ని హైలైట్ చేస్తూనే, ఇద్దరి స్నేహితుల అపురూప కలయికకు పెద్ద పీటను వేయడంతో ఈ ఆడ్ అందరి మన్ననలను చూరగొంది.
తన మనవరాలికి చిన్ననాటి స్నేహితుని గురించి చెప్పేటప్పుడు ఓ డైరీలో పెట్టుకున్న ఫోటో చూపిస్తాడా ముసలాయన ఆ ఆడ్‍లో. అందులో ఏం రాసి ఉండచ్చు? భారత-పాక్ విభజన గురించి తెల్సి, రాత్రికి రాత్రే లాహోర్ నుండి వచ్చేశామని చెప్తాడా అమ్మాయికి. ఆ రాత్రి ఎంతటి కఠినమైనది? ’నేను ఫలనా, మీ చిన్ననాటి స్నేహితుని మనవరాలిని..’ అని చెప్పగానే లాహోర్‍లో ఉన్న ముసలాయన కళ్ళు.. అవేం కథలు, కలలు దాచుకున్నాయి? ఢిల్లీనుండి లాహోర్‍కు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మైళ్ళ లెక్కన దూరం ఒకటే. కానీ అవి ఒకరినొకరు చేరుకోలేనంత దూరమెలా అయ్యాయి?
అసలీ ప్రశ్నలన్నీ అవసరమా? జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని తిరిగి తవ్వి శిధిలాలనూ, అస్థిపంజరాలను బయటకు తీయటంలోనూ, బెదిరిపోవడంలోనూ లాభమేముంది? ఈ ఆడ్‍లోనే, ఒకవేళ భారత్ రావడానికి ఆయనకి వీసా దొరక్కపోతే, గూగుల్ హాంగ్-అవుట్‍లో ఒకరినొకరు చూసుకునేవాళ్ళు. మాట్లాడుకునేవాళ్ళు. “All is well” అనుకోవడం చేతనవ్వాలేగానీ, isn’t everything well? అని అంటే, నేను వాదించను. అలా కాక, పైన లేవదీసిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడం ఎంతో కొంత అవసరమనిపించినవారి కోసం ఓ పుస్తకాన్ని రెకమెండ్ చేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
“India Partitioned: The Other Face of Freedom” అన్న పేరిట రెండు సంకలనాలు వెలువడ్డాయి, ముషిరుల్ హసన్ సంపాదకత్వాన. వీటిలో మొదటి సంపుటిలో దేశవిభజన నేపథ్యంలో వచ్చిన కవితలు, కథలు, నవలల సంకలనం. రెండోది, జీవితచరిత్రలు, డైరీలు, వార్తాకథలు మున్నగు వాటిని ఒకచోట పెట్టే ప్రయత్నం. ఉర్దూ, హిందిల నుండి అనువదించబడ్డ ఆంగ్ల రచనలూ ఉన్నాయిందులో. పేరెన్నికగల ఎందరో రచయితలు, కవులు, విద్యావేత్తలను పరిచయం చేసుకునే వీలు కలిగించే పుస్తకాలవి. విభజననాటి దేశరాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే చరిత్రకు సంబంధించిన పుస్తకాలను చదువుకోవచ్చు. కానీ అప్పటి సగటు మనిషికి పడ్డ అవమానులూ, కలిగిన అనుమానాలు, అతడి అగత్యం అన్నీ తెల్సుకోవాలంటే, ఈ సంపుటాలు చాలా అక్కరకు వస్తాయి. వాటిలో మొదటి భాగాన్ని పరిచయం చేయబోతున్నాను.
భీష్మ్ సహ్నీ రాసిన “We have arrived in Amritsar” అనే కథలో భారత స్వాతంత్ర్య వేడుకులను చూడ్డానికి ఢిల్లీ వెళ్తున్న ఒకడిని తోటి ప్రయాణికుడు అడిగిన ఓ ప్రశ్న:
“The Sardarji sitting in front of me repeatedly asked me whether I thought Mr. Jinnah would continue to live in Bombay after the creation of Pakistan or whether he would resettle in Pakistan. Each time my answer would be the same, ‘why should he leave Bombay?’ I think he’ll continue to live in Bombay and keep visiting Pakistan.”
ఈ కథలోని అంశం జిన్నా ఎక్కడ నుండి పాలిస్తాడని కాదు. ఒక రైలు కంపార్ట్మెంట్ లో భయం-బెదురు లేకుండా ఓ హిందూ, సిక్కూ, పఠానూ ప్రయాణించలేని పరిస్థితులు వివరిస్తుంది ఈ కథ. అయినా, కథ మొత్తంలో ఆ పై వాక్యాలు నన్ను బాగా ఆకర్షించాయి. పాకిస్థాన్ ఎందుకు అవసరమో అర్థంకాని వారు చాలామంది. దాన్ని వద్దనుకున్నవారికి, కావాలనుకున్నవారికి కూడా అదేంటో తెలీదు. ఇక్కడ లేనిది అక్కడేముంటుందో తెలీదు. జిన్నా బాంబే నుండి పాకిస్థాన్‍ను పాలించటం సాధ్యమే అనుకునే పరిస్థితులూ ఉన్నాయన్న మాట. ఈయన రాసిన తమస్ నవలపై నా వ్యాసం ఇక్కడ.
అఖండ భారతాన్ని మతం ఆధారంగా విభజించాలనుకున్నప్పుడు, హిందు-ముస్లిమ్ మధ్యగల వ్యత్యాసాల గురించీ చర్చ అవసరమయ్యింది. ఈ పుస్తకం ఆ వ్యత్యాసాల చిట్టాతో మొదలవుతుంది. హుమాయున్ అఖ్తర్ వేయించిన బెంగాలీ పాంఫ్లెట్ ను ఆంగ్లంలోకి అనువదించారు – “How much is the difference?” పేరిట. బెంగాల్ ప్రొవెన్షియల్ లీగ్ లో దాదాపు యాభైవేల కాపీలు ప్రచురించారట. అయితే ఇది ఫిక్షన్ కింద ఎందుకు కేటాయించారో నాకు అర్థం కాలేదు.
విష్ణు ప్రభాకర్ రాసిన “My Native Land” అనే కథలో లాహోర్‍కు దూరమై, మతిస్థిమితం పోగట్టుకున్న ఒక ఆసామి rant ఇలా నడుస్తుంది:
“One’s country, earth, love — what small, inconsequential things these are. The most important thing is religion, one’s faith, one’s faith in God. The earth on which God’s human creation lives, the earth on which they chant God’s name. That is my country, my earth, my love — love for God and man. ”
బైదియుజ్జమాన్ “The last wish” కథలో పాకిస్థాన్ పట్ల విరుద్ధభావాలున్న ఇద్దరి ముస్లిమ్ స్నేహితుల మధ్య సంభాషణను ఇలా చెప్పుకొచ్చారు. ఇందులోని “గాంధీ భాయ్” అసలు పేరు అది కాదు. పాకిస్థాన్ అంటే విముఖత చూపిస్తున్నందుకు అతడికి స్నేహితులు పెట్టిన పేరు అది.
“Gandhi bhai’s and Kamal bhai’s conversations generally revolved round one point. Kamal bhai maintained that the Muslim way of life was radically different from that of the Hindus. Their culture, language, mode of dress, food habits, religion, customs and traditions were very dissimilar. The Muslims were a separate nation. Their culture could not remain safe in undivided India.
Gandhi bhai countered his arguments by contending that except for their religions, there was no difference between the Hindus and Muslims. The difference, if any, was superficial. There were far greater differences between the numerous Hindu sects. The same was true of Muslims. ‘Have you ever considered that the life of an average Muslim, right from his birth to his death, runs through the same gamut of customs and rites, which are akin to those of an average Hindu,’ Gandhi bhai would ask. Celebration of birthdays, bridal songs, even death rites had strong similarities in both the communities. The two-nation theory was nothing but a web of illusions in which innocent Muslims were being trapped. It would result in wholesale disaster.”
ఎంత చెప్పినా కమల్ భాయ్ వినిపించుకోడు. పాకిస్థాన్నే ఆశ్రయిస్తాడు. అక్కడే దిక్కూ, మొక్కూ లేక చనిపోతాడు. ఈయనే రాసిన మరో కథ “The Alien”లో తూర్పు దిశలో కూడా జరుగుతున్న తూర్పు బెంగాల్ నేపథ్యంలో కథ నడుస్తుంది.
కమలేశ్వర్ రాసిన “How many Pakistans?” లో విభజన వల్ల ప్రేయసికి దూరమై అక్కడ-ఇక్కడా తిరిగే యువకుని కథ.
“Why should Pakistan come between us again and again? Pakistan conveys nothing to me or to you. It is a mere appellation given to a dreadful reality. What a reality! A reality that sets us apart and then draws a wedge of silence between us. A reality that makes people insensitive to the families, communities and religions of others. They have no feelings for the suffering of others, their joys and sorrows.”
అని వాపోతాడు. కొన్నాళ్ళకు తన ప్రియురాలిని దయనీయమైన పరిస్థితుల్లో కలుస్తాడు. రచయిత ఎంత హృద్యంగా చెప్పుకొచ్చారంటే కథను చివరకంటా చదవగలిగితే కళ్ళు తడి అవుతాయి. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెల్సుకునే లోపు జీవితాలు చిధ్రమైపోయాయి. కొందరు దారుణ మారణహోమంలో అల్పాయుష్షుతో పైకి వెళ్ళిపోతే, ఆయుష్షు మిగిలి ఉన్నవారి జీవితాలు ఈ కథలోలా ఎవరి ఆటలోనో పావులైపోయాయి.
విభజన నేపథ్యంలో స్త్రీల స్థితిగతులను కాస్తో, కూస్తో తెలిపే కథ కమలేశ్వర్‍ది అయితే, కృష్ణ సోబ్తి రాసిన “The New Regime”లో కొత్త ప్రభుత్వ హయాంలో తన హవేలీని విడిచిపెట్టి, వేరే ప్రదేశానికి వెళ్ళవలసిన అగత్యం కలిగిన ఒక జమిందారిని కథ. అదే, రజిందర్ సింగ్ బేడి రాసిన “Lajwanti” కథలో గొడవల్లో అదృశ్యమైన స్త్రీలను వెతికే కార్యక్రమాన్ని చేపడతాడో కార్యకర్త. అతడి భార్యకూడా అల్లర్ల తర్వాత కనిపించకుండా పోయింది. కొన్నాళ్ళకు ఆమె మళ్ళీ కనిపిస్తుంది. ఆమె సాదరంగా తన ఇంట్లోకి, తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. కానీ మునిపటిలా ప్రేమాదరాలతో కాకుండా, ఆమెనో దేవతగా చూస్తాడు. ఎంత దగ్గరున్నా, వారిద్దరి మధ్యా దూరం పెరుగుతూనే ఉంటుంది.
రామానంద్ సాగర్ (అవును! ఆ రామానందే!) కథ “Pimps”లో ఒక యువతిని వేరే వర్గం వాళ్ళు ఇతర మహిళలతోపాటు లేవదీసుకొనిపోతారు. ఆమె ఎలాగోలాగ తప్పించుకొని మళ్ళీ ఇంటికి చేరుకుంటుంది, ఏకంగా రావి నదిని ఈదుకుంటూ వస్తుంది. కానీ ఆమె భర్త, మామగారు చెడిపోయిన ఆమెను స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. దిక్కులేక ఈదుకుంటూ వచ్చిన నదిలోనే మునగటానికి ప్రయత్నిస్తోంది. తనలో ప్రవిత్రత మిగలనందుకు నదీతల్లి కూడా నన్ను ఆదరించలేదని వాపోతుంది.
మొహన్ రాకేశ్ రాసిన “His Heap of Rouble” కథలో శిధిలైమైపోయిన తన ఇంటిని కొన్నాళ్ళ తర్వాత చూసుకోవడానికి వచ్చిన ఒక మనిషిని అక్కడివారి ఆదరించిన(?) వైనం తెలుస్తుంది. సంవత్సరాలు గడిచినా వారి మధ్య వివాదాలు ఇంకా అలానే ఉన్నాయని తెలుస్తుంది.
Fikr Taunsvi వి మూడు రచనలు ఉన్నాయి ఇందులో. రెండూ వాస్తవిక ధోరణిలో ఉండవు. Satirical pieces. “The Book of Divine Knowledge” లో వెటకారంగానే చెప్పినా, శరణార్థుల దీనావస్థను కళ్ళకు గట్టిన చూపిస్తారు. ఇందులో అప్పటి నాయకులు దేవుడుగారు నియమించిన దేవదూతలు. వాళ్ళు ఏదంటే అదే! ఎంతంటే అంత! వాళ్ళకి ఎదురు చెప్పడానికి లేని సామాన్య ప్రజలు ఎన్ని కష్టనష్టాలకు ఓర్చుకోవాల్సి వచ్చిందో తెల్సుకునే అవకాశం కల్పిస్తుంది. అంత మంది జీవితాలతో చెలగాటం ఆడడానికి నిజంగానే ఎవరిచ్చారో అంతటి అధికారం. రెఫ్యూజీలలో రిచ్ రెఫ్యూజిలు వేరయా! అన్న చందం వలస వచ్చిన హై-క్లాస్ వారికి ఒక విధమైన ఏర్పాట్లు, తక్కినవారికి మరోలా! ఆ వ్యత్యాసాన్నంతా కడిగి ఆరేసారు ఈ రచయిత. శరణార్థుల అవస్థలనే మరో కథ “So the Witnesses Stated”లో చూపిస్తారు, సెటైరికల్‍గా. ఈయనదే “The Wagah Canal” కూడా భలే ఉంటుంది. విభజనకు పూర్వం, విభజన సమయంలో, ఆ తర్వాత వాఘా ఎలా ఉందన్నది చూపిస్తారు.
పైవన్నీ కథలుకాగా, రాహీ మాసూమ్ రజా రచించిన “Aadhaa Gaon” ఒక్కటీ ఈ సంపుటిలో ఉన్న నవల. అయితే, నవల పూర్తి పాఠం ఇవ్వకుండా కేవలం కొన్ని excerpts మాత్రమే ఇచ్చారు. ఇది కొంచెం అసంతృప్తి కలిగించే విషయం. నవల చదవని వారికి ఇలా ముక్కలు ముక్కలు చదవడం ఇబ్బిందిగా ఉంటుంది. అయితే, అప్పటి సామాన్యుల మధ్య జరిగిన తర్కవితర్కాలనూ, వాదవివాదాలను అర్థం చేసుకునే వీలు కలిపిస్తుంది ఈ నవల. విభజన అనగానే జిన్నా, నెహ్రూ, గాంధీ, మౌంట్బాటెన్ లాంటి కొన్ని పేర్లు వినిపిస్తాయి. వీరి నిర్ణయాల వల్లే విభజన జరిగింది. అది జరగకపోయున్నా, అప్పటికే grass-root levelలో హిందూ-ముస్లిముల మధ్య రాజుకున్న విభేదాలు ఎలా ఏర్పడ్డాయి? వారి మధ్య విద్వేషాలను ఎవరు నాటారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఈ నవలలో దొరుకుతాయి. చదువుకున్నవారు చేసిన తర్కాలతో, చదువురాకపోయినా లోకాన్ని చూసిన అనుభవమున్న వారు ఎలా విభేధించారో తెలుపుతుందీ పుస్తకం. తప్పక చదవాల్సిన రచన, దేశవిభజన నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలంటే.
ఇహ, విభజన రచనలంటే తప్పక గుర్తు రావాల్సిన పేరు సాదత్ హసన్ మంటో. ఆయన రాసినవాటిలో “టోబా టేక్ సింగ్” గొప్ప కథ అని నా ఉద్దేశ్యం. ఈ సంకలనంలో మాత్రం, ఆయన రాసిన “Siyah Hashiye”ను పొందుపరిచారు. ఓ రకంగా అదే మెరుగైన ఎన్నిక ఈ పుస్తకానికి. ఎందుకంటే, ఆ చిన్న స్కెచ్‍లలో మంటో చూపించినన్ని కోణాలు మరెవరూ చూపలేరు. ఇవి కాక, మరికొన్ని కథలు, కవితలూ కూడా ఉన్నాయి పుస్తకంలో. సియా హాషియె పై నేను ఇదివరకు రాసిన వ్యాసం ఇక్కడ.
ఈ పుస్తకానికి పరిచయ వ్యాసంలో ఇలా రాసుకొచ్చారు.
For Intizar Husain partition was ‘a complex and convoluted human tragedy’. He tried to comprehend, in the light of India’s rich ancient and medieval history, how the ‘new man — cruel, violent and ruthless — appeared on the scene of 1947. ‘How and why did this occur? What historical process gave rise to it? And what has happened to that history which, for example, had produced the Buddha? What new era of history had ushered in? Or is it that mankind is such a creature who can build a moment over centuries, can construct diverse philosophies, but when the crisis comes, when some critical moment occurs, his animal emerges from within to overwhelm him?’
ఇలాంటి ప్రశ్నలకు ఈ కథల్లోనే ఒకానొక చోట ఓ సమాధానం దొరికింది. ఆగ్నేయ రాసిన “Asylum” అనే కథలో అల్లర్లు చెలరేగటంతో ఒక హిందువును అతడి ముస్లిమ్ స్నేహితుడు, మరొక ముస్లిమ్ ఇంట్లో తలదాచుకునేందుకు వీలు కలిపిస్తాడు. ఆ ముస్లిమ్ ఇంట్లో ఒక చిన్న పాడుబడిన గదిలో ఉంటాడు కొన్నాళ్ళ పాటు. అతడిని హతమార్చేందుకు అతడికి పంపించే అన్నంలో విషం కలిపారన్న సంగతి తెల్సుకున్నప్పుడు అతడి మదిలో మెదిలిన ఆలోచనలు:
“It dawned upon Davinderlal that the real danger in this world was not the power of the evil minded but the feeblemindedness of the virtuous. The ingrained timorousness of the virtuous wrought the greatest evil. Dark clouds did not usher in the night. Night came when the sun faded.”
అదీ సంగతి! కొన్ని దశాబ్దాలబాటు తెల్సిన మనిషిని ఎలా చంపుతారు? అన్న ప్రశ్నకు అంతకు మించిన జవాబు దొరకదేమో. మనిషిలో ఆ పిరికితనం అప్పటివారికి ప్రత్యేకమైనది కాదు. ఇప్పటికీ మతం పేరిట అనేకానేక విధ్వంసాలు జరగడానికి బహుశా అదే కారణమేమో. సరైన ప్రశ్నలు అడగడానికి, వాటి సమాధానాలు వెతుక్కోడానికి ఈ పుస్తకం చాలా దోహదపడుతుంది.
Roli Books
1995
Paperback
298
దేశవిభజన కాలరాత్రిని కళ్ళకుగట్టే “తమస్” | పుస్తకం
[…] హాసన్ ఎడిటర్‍గా వ్యవహరించిన “India Partitioned.” మొదటి సంపుటి వల్ల తెలిసింది. అందులో సాహనీ రాసిన “We […]