The Death of Ivan Ilyich – Leo Tolstoy
వ్యాసకర్త: Nagini Kandala
*****
ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో,జీవన్మ్రుత్యువుల గురించి ఆలోచనలతో ఒక సందిగ్ధావస్థ తప్పక ఎదురవుతుంది… దానినే మనం వైరాగ్యం అని అంటుంటాం.. రష్యన్ రచయిత టాల్స్టాయ్ కి కూడా ఇటువంటి దశ ఎదురైంది..’వార్ అండ్ పీస్’ రచించిన తరువాత అతను పూర్తి మానసిక పరిపక్వతతో సంపూర్ణమైన వ్యక్తిగా ఎదిగారు.. కానీ విచిత్రంగా ఆ విజయాలూ,పేరు ప్రఖ్యాతులూ ఆయన్ను సంతోష పెట్టలేదు.. అప్పటికే ఒక జర్మన్ ఫిలాసఫర్ Arthur Schopenhauer రాసిన పూర్తి స్థాయి చీకటి కోణాలతో కూడిన నిరాశావాద రచన ఆయన్ను చాలా ప్రభావితం చేసింది.. ఆ తరువాత,ఒక సందర్భం లో మృత్యువుని అతి దగ్గరగా అనుభవించిన ఆయన ఒక రకమైన ఆధ్యాత్మిక సంక్షోభం లో పడిపోయారు.. అప్పటి ఆయన మనోభావాలకు ఈ రచన, ‘The death of Ivan Ilyich’ అద్దం పడుతుంది..
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని సార్లు మన అంతర్గత ఆలోచనలు ఏ దారిలో సాగుతాయో మనకి బాహ్య ప్రపంచంలో కనిపించేవీ,ఎదురయ్యేవీ అన్నీ ఆ విషయ సంబంధితమైనవే అయ్యి ఉంటాయి.. జిడ్డు కృష్ణ మూర్తి గారి ‘స్వేఛ్చ’ నా సాధారణ జీవన గమనపు స్వేచ్చను ఎంతో కొంత ప్రభావితం చేసిందనే చెప్పాలి.. ఆ ప్రభావం నుంచి బయట పడి మళ్ళీ బాహ్య ప్రపంచాన్ని అతి సహజ దృష్టి తో చూద్దామనుకున్నా, అన్నిటిలో ఆయన ఆలోచనా సరళి నాకు తెలీకుండానే నా కంటే ముందే తను చూడాలనుకున్నది చూడటం మొదలు పెట్టింది.. ఒక రకమైన ఇదీ అని చెప్పలేని క్రైసిస్ లో ఉంటూ అతి కష్టం మీద వేరే పుస్తకం చదువుదామనుకుంటున్న సమయం లో లియో టాల్స్టాయ్ ‘The death of Ivan Ilyich’ చదవడం తటస్థించింది.. మరణానికి అతి చేరువలో ఉన్న నలభై ఐదేళ్ళ జడ్జ్, ఇవాన్ తన జీవిత చరమాంకం లో ఎదుర్కొన్న మానసిక సంక్షోభమే ఈ నవల.. బహుశా ప్రతి మనిషి తన జీవితపు చివరి క్షణాల్లో తప్పక ఇటువంటి ప్రశ్నలతో అంతర్యుద్ధం చేస్తాడేమో..
ఆ మధ్య ఎప్పుడో ఒక క్షణం లో ఇలా అనిపించింది, There comes a moment in life when we really feel that all we learnt till this moment is nothing but pure lies….
మనిషి సహజం గా తను చూడగలిగింది మాత్రమే యదార్థమనీ,తనకు తెలియనిదీ/చూడలేనిదీ/నిరూపించలేనిదీ అసత్యమనే భ్రమలో ఉంటాడు… మృత్యువు ఆలింగనం చేసుకోవడానికి వచ్చే క్షణం వరకూ ఇవాన్ కు తన అశాశ్వతమైన ఉనికిని గూర్చిన స్పృహ లేకపోవడం వలన ఆ నిముషం వరకూ గడిపిన జీవితమంతా పచ్చి అబద్ధం అని అనిపిస్తుంది.. సామాజిక నిచ్చెనల్ని అధిరోహించే క్రమంలో వృత్తి, సంసారం, ధనార్జన, పరువు ప్రతిష్టలనే భౌతిక విషయాలపై వ్యామోహంలో ఊపిరి సలపని జీవితం అనుభవిస్తున్ననలభై ఐదేళ్ళ ఇవాన్, అకస్మాత్తు గా మూత్రపిండాలకు సంబంధిచిన అనారోగ్యం బారిన పడి మంచాన పడతాడు.. భరించలేని నొప్పితో బాధపడుతుంటాడు.. కానీ అతన్ని అనారోగ్యం కంటే మృత్యువు చేరువవుతోందనే మానసిక వేదనే అధికంగా బాధిస్తుంది.. ఆనాటి నుండీ ఎంత మంది వైద్యుల్ని మార్చినా ఫలితం కనపడదు.. ఎంత ప్రయత్నించినా, మరణం ఉనికిని మైమరపింప జేసే ప్రాపంచిక విషయాలేవీ అతనికి ఆనాడు జ్ఞప్తికి రావు.. అన్ని అసత్యాలనూ తేటతెల్లం చేస్తూ మృత్యువు అనే ఒకే ఒక్క నిజం అతని కళ్ళ ముందు నిరంతరం సంచరిస్తూ ఉంటుంది..
“What is this torture for?” And the voice would reply, “It’s just there.It’s not for any thing. ‘Above and beyond this there was nothing.
It’s like the pain getting worse and worse-all of my life has been getting worse and worse’, he thought. There was one point of light back there at the beginning of life, but after that every thing had been getting blacker and blacker.’In inverse proportion to the square of the distance from death’, he thought.
ఇవాన్ మృతి అనివార్యం అని తలపోసిన అతని కుటుంబ సభ్యుల, స్నేహితుల ప్రవర్తన అతనికి బాధ తో పాటు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.. ఈరోజు ఇలా నిర్దయులుగా ఉన్నా రేపు మీకు కూడా అదే గతి పడుతుంది అని మనసులోనే వారిని శపిస్తూ ఉంటాడు.. అంత వరకూ సమాజం లో అత్యున్నత పదవులలో కొనసాగి, అతి విలాసవంతమైన జీవితం గడిపిన తను ఈరోజు ఒక పనికిరాని వస్తువుగా, బరువుగా మారానని క్షోభతో, ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి లో ఒకే గదికి పరిమితమవుతాడు.. అతని భార్య,పిల్లలు కూడా తమ సంతోషకరమైన జీవనానికి అతన్ని అడ్డంకి గా పరిగణిస్తున్నట్లు అతనికి తోస్తుంది.. కానీ తను కూడా ఒకప్పుడు అదే విధమైన స్వార్ధపూరిత జీవితాన్ని జీవించానని, పరుల కొరకు కాక తన కోసం మాత్రమే బ్రతికానని అర్థం చేసుకున్న ఇవాన్ కు చివరగా తన వారి పట్ల సానుభూతి కలుగుతుంది… ఎప్పుడైతే స్వార్థ చింతన పోతుందో అతనికి అంతవరకూ ఓర్చుకోలేని నెప్పి నుండి విచిత్రం గా ఉపశమనం కలుగుతుంది.. తన మరణం తన వారిని ఈ బరువు బాధ్యతల నుండి బంధ విముక్తుల్ని చేస్తుందని, వారికి తన మనసులోనే క్షమాపణలు చెప్పుకుని,ప్రశాంతం గా కన్ను మూస్తాడు..
“At school he had done things which had formerly seemed to him very horrid and made him feel disgusted with himself when he did them; but when later on he saw that such actions were done by people of good position and that they did not regard them as wrong, he was able not exactly to regard them as right, but to forget about them entirely or not be at all troubled at remembering them.
Ivan Ilych’s life had been most simple and most ordinary and therefore most terrible.
And he has to live like this on the edge of destruction, alone, with nobody at all to understand or pity him
“Can it be that I have not lived as one ought?” suddenly came into his head. “But how not so, when I’ve done everything as it should be done?”
He was much changed and grown even thinner since Pyotr Ivanovich had last seen him, but, as is always the case with the dead, his face was handsomer and above all more dignified than than when he was alive.”
ఈ చిన్ననవల్లో, చాలా సులభమైన పదాల్లో మృత్యువుకీ-జీవితానికి ఉన్న క్లిష్టమైన సంబంధాన్ని మలచడం, కాల్పనిక నేపధ్య రచనల్లో టాల్స్టాయ్ నైపుణ్యానికి అద్దం పడుతుంది.. ‘అన్నా కరేనిన’ నవలలో లెవిన్ అనే యుక్త వయస్కుని పాత్ర ద్వారా తన స్వయం అనుభూతులను, వివేకవంతమైన దృష్టి కోణాన్ని మనకు పరిచయం చేసిన టాల్స్టాయ్, ఈ నవలలో దానికి కొనసాగింపు గా ఒక నడి వయస్కుడి పాత్ర ఇవాన్ కు మరికొంత పరిపక్వతని ఆపాదించాడు అనిపిస్తుంది. అందమైన భార్య ఉన్నప్పటికీ ఆమెతో విభేదాలను, ఇంట్లో అశాంతినీ తప్పించుకోడానికి తన వృత్తి మీద ఏకాగ్రత పెడతాడు ఇవాన్.. తన అసంతృప్తి నుండి బయట పడటానికి ప్రాపంచిక సౌఖ్యాలలో, విలాసాలలో తల మునకలై జీవిస్తాడు.. కానీ అతని పరిశోధన, పరిశీలనా కిరణాలు బాహ్య ప్రపంచంలో విస్తరించినంతగా అతని అంతర్ ప్రపంచం లో ప్రసరించలేదు.. ఏ ఒక్క రోజూ తన జీవన విధానం పట్ల ఇవాన్ ఆత్మావలోకనం చేసుకోలేదు.. తన దుర్భర అనారోగ్యంలో సపర్యలు చేసి, సానుభూతి చూపించిన జెరాసిమ్ (Gerasim) ను చూసి తన గత జీవితం గూర్చి ఆత్మపరిశీలన చేసుకుంటాడు.. కానీ అతని అంతర్మథనం చదువుతున్న వారికి ఆశ్చర్యం కలిగించే విధంగా నిజానికి ఇవాన్ చాలా మెటీరియలిస్టిక్ జీవితాన్ని జీవించినప్పటికీ, అతను నిజంగా పశ్చాత్తాప పడవలసిన నేరాలు గానీ ఘోరాలు గానీ అతని జీవితం లో చేసింది లేదు.. మరి ఎందుకంత వ్యథతో పశ్చాత్తాపపడతాడు అనేది అర్థం కాదు.. బహుశా ‘జీవితం’ అనేది ఒకే ఒక్క అవకాశం గనుక, దానిని ఎలా జీవించినప్పటికీ, చివరి ఘడియల్లో మరో రకంగా జీవించి ఉంటే బాగుండేదేమో అని అనిపించడం సహజమేమో అనిపిస్తుంది.. ఈ కథలో నిజా-నిజాలూ,విశ్లేషణలూ ప్రక్కన పెడితే ఇదొక సైకాలజీ సంబంధిత అంశంగా అనిపిస్తుంది.. టాల్స్టాయ్ లోని వేదాంతికి ఇవాన్ పాత్ర రూపకల్పన ఒక పరాకాష్ట అని చెప్పవచ్చు..
varaprasaad.k
PUSTAKAM చదవాలనిపించేలా సమీక్షా రాసారు,మీరు రాసిన విధానం బావుంది. మరిన్ని మంచి బుక్స్ పరిచయం చెయ్యండి నాగిని గారు.
నిషిగంధ
“ఎప్పుడైతే స్వార్థ చింతన పోతుందో అతనికి అంతవరకూ ఓర్చుకోలేని నెప్పి నుండి విచిత్రం గా ఉపశమనం కలుగుతుంది..” — మనఃశ్శాంతికి అసలైన మంత్రం!!
చాలా బావుందండీ రివ్యూ! తృష్ణ గారి వ్యాఖ్యతో ఏకీభవిస్తాను. 🙂
Nagini
“మనశ్శాంతి కి అసలైన మంత్రం” కరక్ట్ గా చెప్పారు 🙂
థాంక్ యు సో మచ్ నిషి గారు 🙂
Sowmya
మీ వ్యాసం చదువుతున్నంతసేపు నాకు జపనీస్ చిత్ర దర్శకుడు అకిరా కురొసవా తీసిన “ఇకిరు” అన్న 1952 చిత్రం గుర్తు వచ్చింది. ఇవ్వాళే తెలిసింది ఇకిరు కి స్పూర్తి ఈ రచనేనని!
Nagini
అవునా..అయితే ఒక సారి చూడాలి…థాంక్స్ ఫర్ ది ఇన్ఫో సౌమ్య గారు.
The Death of Ivan Ilyich – Leo Tolstoy | Bagunnaraa Blogs
[…] అతిథి వ్యాసకర్త: Nagini Kandala ***** ప్రతి మనిషి […]
patnala eswararao
death is true.Everyone must realises it.
చాణక్య
టాల్‌స్టాయ్‌ని అర్థం చేసుకోవాలంటే చాల పరిశ్రమ, పరిణతి కావాలి. మీకు ఆ రెండూ సులభంగా అలవడ్డాయేమో అనిపిస్తోంది. నేను ప్రస్తుతం ‘అన్నా కరెనీనా’ చదువుతూఊఊఊఊ.. ఉన్నాను. మీ సమీక్ష చాలా బాగుంది. 🙂
Nagini
థాంక్ యు సో మచ్ చాణక్య.:-)
అన్నా కరేనిన చదువుతున్నారా..అయితే మీకు ఈ పాటికే లెవిన్ బాగా దగ్గరి నేస్తమైపోయి ఉండాలే 🙂 నాకు ఆ నవలని తలచుకుంటే అతను తప్ప మరో వ్యక్తీ గుర్తుకురాడు :-)
Anil reddy
Good review…
Nagini
Thank you Anil garu.
తృష్ణ
“బహుశా ‘జీవితం’ అనేది ఒకే ఒక్క అవకాశం గనుక, దానిని ఎలా జీవించినప్పటికీ, చివరి ఘడియల్లో మరో రకంగా జీవించి ఉంటే బాగుండేదేమో అని అనిపించడం సహజమేమో అనిపిస్తుంది..well said!
nice intro!
nagini, మీ రచనా శైలిలో మంచి పరిపక్వత కనిపిస్తోంది.. అది మీలోని అంతర్మధనంలోంచి పుట్టుకొచ్చి ఉంటుందని నా అభిప్పిరాయమ్ 🙂
Nagini
Thank you so much Trushna garu..:-)
varaprasaad.k
“బహుశా జీవితం అనేది ఒకే ఒక్క ” చాలా బావుంది మేడం మీ రిప్లై.సింపుల్గా ఒక్క ముక్కలో చేప్పాల్సింది చెప్పేసారు.