జీవితాన్నిమరింతగా ప్రేమించడం నేర్పిన…

ఈ పుస్తకం రాసినావిడ పేరు జిల్ బోల్టీ టేలర్. ఆవిడ ఓ neuro anatomist (నాడీ మండల నిర్మాణ శాస్త్రవేత్త అనాలా? బ్రెయిన్ సైంటిస్టు అనడం తేలికేమో).

జిల్ కన్నా ఓ ఏడాదిన్నర పెద్దవాడైన తన అన్నయ్య చిన్నప్పటినుంచీ సైకోసిస్ లక్షణాలను కనబరచేవాడట. చాలాకాలం తరువాత – ఆయన ముప్పయ్యొకటో యేట – ఆయనకి ష్కిజోఫ్రీనియా ఉన్నదని నిర్థారించారట వైద్యులు.

“ఒకే ప్రపంచాన్ని చూస్తున్న మా ఇద్దరి నడుమ ఎంత వ్యత్యాసం? నా కలలను నేను సాకారం ఎలా చేసుకోగలుగుతున్నాను? మా అన్నయ్య కలలు ఉత్తి భ్రాంతులుగా ఎందుకు మిగిలిపోతాయి? అసలు ఈ సంవేదనలు, అవగాహనలు, ఆలోచనలు ఎలా ఏర్పడతాయి?” అన్న ప్రశ్నలకు సమాధానం వెదుక్కుంటూ బ్రెయిన్ సైంటిస్టుగా పరిణమించింది జిల్.

ఇండియానా విశ్వవిద్యాలయంనుంచి న్యూరో -అనాటమీలో డాక్టరేటు పట్టాను పొంది, హార్వర్డ్ మెడికల్ స్కూల్లో న్యూరో సైన్స్, సైకియాట్రీ విభాగాల్లో పరిశోధకురాలిగా పని చేసింది. ష్కిజోఫ్రీనియాకి సంబంధించిన పరిశోధనల్లో పేరెన్నిక గన్న డాక్టర్ ఫ్రాన్సిన్ బెనిస్ (Francine Benes) ప్రయోగశాలలో ఉద్యోగం.

మానసిక రుగ్మతలతో అనునిత్యం పోరాడే రోగులకు, వారి కుటుంబాలకు, వైద్యులకు, శాస్త్రవేత్తలకు బాసటగా నిలిచే నేషనల్ అలయన్స్ ఆఫ్ మెంటల్ ఇల్‌నెస్ (NAMI / నామి) అనే సంస్థలో తను క్రియాశీలకమైన పాత్ర నిర్వహించేది.

జీవితం ఇలా ఇంటర్వెల్ కన్నా ముందు సినిమా కథలా సాగిపోతూ ఉండగా…
***

1996 డిసెంబర్ పదో తారీకు వచ్చేసింది. తనకప్పటికి 37 ఏళ్ళు.

జిల్ పుట్టినప్పటినుంచీ – తన మెదడులోని రక్తనాళాల ఏర్పాటులో ఆర్టెరియోవీనస్ మాల్‌ఫార్మేషన్ (Artereovenous malfarmation – AVM) అనే వైకల్యం ఉండేదిట. ఆ రోజున, ఈ వైకల్యం కారణంగా తన మెదడులోని ఎడమభాగంలో సిర ఒకటి చిట్లి భారీగా రక్తస్రావం జరిగింది. ఫలితం – బ్రెయిన్ స్ట్రోక్. ఎడమ మెదడు బాగా దెబ్బ తిన్నది.

ఎడమ మెదడు – మనిషిలోని విశ్లేషణాకేంద్రం. “డాటా”ని పోగేసి – అందులోని పాటర్న్‌లను కనిపెట్టి, ప్రాపర్టీలను గుర్తించి, కాటగరీల్లోకి విభజించి దాచుకుంటుంది. ఇదో పెద్ద క్యాలిక్యులేటరు -అట్టే మాట్లాడితే, సూపర్ కంప్యూటరు! వర్డ్ ప్రోసెసింగ్ జరిగేదీ ఇక్కడే. మన మనుగడకి ఎదురయ్యే ముప్పులను పసిగట్టి ప్రమాద ఘంటికలను మోగించేది ఇదే. మంచి-చెడులను వింగడించి చెప్పే న్యాయమూర్తి-కమ్-నియంత ఎడమ మెదడే! అన్నట్లు, “ఇది నేను, ఇది నా వెలుపలిది” అనే అస్తిత్వస్పృహ కూడా ఎడమ మెదడులోంచి వచ్చిందే!

(మరి కుడి మెదడో? అది మన అనుభూతులకు జన్మస్థానం. Now and hereతోనే దానికి ప్రమేయం. భూతభవిష్యద్వర్తమానాలనే విభజన కుడి మెదడుకి తెలియదు. కుడి మెదడుకి అర్థమయిన కాలం అనేక విడి క్షణాల సమాహారం. ఒకో క్షణానికి అచ్చంగా దానివే అయిన రంగూ, రుచీ, వాసనా, స్పర్శా, భావోద్వేగాలూ, ఆలోచనలూ, శారీరికమైన (physiological) సంస్పందనలు ఉంటాయి. కుడి మెదడు సృజనకు పుట్టినిల్లు. ఎప్పటికప్పుడూ కొత్తగా – “పెట్టెకి అవతల” – ఆలోచించగలగడం దీని ప్రత్యేకత. మనలోని sense of wonder, ప్రేమించగల స్వభావం, సృష్టితో ఏకాత్మతను అనుభవించగల ఔన్నత్యం ఇక్కడే పుడతాయి. ఎడమ మెదడు “కార్యకర్త” అయితే కుడి మెదడు “కవి”!)

ఎడమ మెదడులో సంభవించిన స్ట్రోక్ పర్యవసానంగా జిల్ ఆలోచనాశక్తి క్షీణించింది. కుడి చేయి చచ్చుపడింది. తన భాషా కేంద్రాలు దెబ్బ తిన్నాయి. తన జ్ఞానమూ, జ్ఞాపకాలూ చెరిగిపోయాయి. “నేను” అనే ఎరుక మాయమయింది.

‘స్ట్రోక్‌కి గురయ్యాను’ అని తనకి అర్థమయినప్పుడు భయపడలేదు, జిల్. పైపెచ్చు, విచిత్రంగా సంబరమే కలిగిందట తనకి…

“Wow, how many scientists have the opportunity to study their own brain function and mental deterioration from the inside out?”

చాలా అబ్బురం కలిగించే అనుభవాలను పొందింది తానారోజున.

“As the language centers in my left hemisphere grew increasingly silent and I became detached from the memories of my life, I was comforted by an expanding sense of grace. In this void of higher cognition and details pertaining to my normal life, my consciousness soared into an allknowingness, a “being at one” with the universe, if you will. In a compelling sort of way, it felt like the good road home and I liked it.”

“…my perception of my physical boundaries was no longer limited to where my skin met air. I felt like a genie liberated from its bottle. The energy of my spirit seemed to flow like a great whale gliding through a sea of silent euphoria. Finer than the finest of pleasures we can experience as physical beings, this absence of physical boundary was one of glorious bliss…”

నిర్వాణస్థితితో పోల్చదగ్గ ఆ అనుభవం తనని వివశం చేస్తున్న సమయంలోనే, అంతరాంతరాల్లోంచి జీవితేచ్ఛ పెల్లుబికింది. మగత, మరుపు, ప్రశాంతత, ప్రగాఢ నిశ్శబ్దంలోకి జారుకుంటూ, లేచి, మళ్ళీ జారుకోబోతూ…ఒకే ఆలోచనని గట్టిగా పట్టుకోవాలి ఇప్పుడు.

“What am I trying to do? Get help. I’m trying to make a plan and get help. What am I doing? I have to come up with a plan to get help. Okay. I have to get help.”

అపస్మృతి సముద్రానికీ స్పష్టతా తీరానికీ నడుమ తెప్పలా మునకలేస్తూ, తేలియాడుతూ, సాయంకోసం తన సహోద్యోగి మిత్రుడికి తన ఫామిలీ డాక్టర్‌కీ ఫోన్ కాల్స్ చేసేందుకు తను పడ్డ కష్టాన్ని గురించి చదువుతుంటే ఏకకాలంలో సంభ్రమమూ, గౌరవభావమూ కలిగాయి నాకు.

This is the stuff Heroes are made of:

“I felt tired. I felt vulnerable and completely fragmented as I sat there waiting. Although I was
consistently distracted by an enveloping sense of being at one with the universe, I was desperate to carry out my plan to get help. Within my mind, I rehearsed over and over again what I needed to do, and what I would say. But keeping my mind tuned in to what I was trying to do was like struggling to hang on to a slippery fish. Task one, hold the thought in mind; task two, execute the internal perception in the external world. Pay attention. Hold on to the fish. Hold on to the understanding that this is a phone. Hold on. Hold on for the next functional moment of clarity!”

ఆరోజు మధ్యాహ్నం “mission rescue” పూర్తయి ప్రాణాపాయాన్ని దాటేసి ఆస్పత్రిమంచం మీద పడుకొని ఉన్నప్పుడు – ఆరోజు ఉదయం దాకా తన ఆత్మకి అడ్రస్‌నిచ్చిన దేహానికీ, ఆ “ఇంట్లో నివసించిన” జిల్ బోల్టీ టేలర్ అనే పేరున్న వ్యక్తికీ తనకీ ఏ సంబంధమూ లేదనిపించిందిట తనకి.

స్ట్రోక్ తరువాత ఎనిమిదేళ్ళకి ఈపుస్తకం రాస్తూ,

“…I existed in some remote space that seemed to be far away from my normal information processing, and it was clear that the “I” whom I had grown up to be had not survived this neurological catastrophe. I understood that that Dr. Jill Bolte Taylor died that morning, and yet, with that said, who was left? Or, with my left hemisphere destroyed, perhaps I should now say, who was right?”

అని (నాటకీయంగా) విస్తుపోతుంది జిల్.
***

ఆ “దిగిరాను దిగిరాను దివినుండి భువికి” మనస్స్థితినుంచి మళ్ళీ మామూలు మనుషుల ప్రపంచంలోకి తిరిగిరావాలా వద్దా అన్నది ఓ గడ్డు సమస్య తనకి. అసలు తనకి ఆ విషయంలో ఎంచుకునే స్వేచ్ఛ ఉండిఉంటే తను మళ్ళీ మన లోకంలోకి ఎందుకొచ్చిందా అని ఇప్పటికీ ఆశ్చర్యపోతాను నేను.

నైపుణ్యమూ, కరుణా కలిగిన వైద్యులు, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న తల్లి “జి.జి.” అందించిన ఆసరాతో, వందలాది హితైషుల శుభాశంసనలతో పునస్స్వస్థతా ప్రయాణం ప్రారంభించింది జిల్. వీటన్నినింటికన్నా ముఖ్యమైనది అజేయమైన తన సంకల్పబలం!

స్ట్రోక్ వచ్చిన మరునాటినుంచే ప్రారంభమయ్యింది తన శరీరానికి వ్యాయామం. ఎవరి సహాయమూ లేకుండా లేచి కూర్చోగలగడం – తన “రిటర్న్ జర్నీ”లో మొదటి మైలురాయి. పరస్పరసంబంధం లేని మూడు పదాలను గుర్తుకు పెట్టుకొని ఒప్పజెప్పడం, వంద నుంచి మొదలు పెట్టి అవరోహణక్రమంలో ఏడుతో భాగించబడే సంఖ్యలను ఒప్పజెప్పడం, తనుండే వీథికి వెళితే తన ఇంటిని ఎలా గుర్తుపట్టాలో ఆలోచించడం – ఇవీ తన మెదడుకి డాక్టర్లు ఇచ్చిన ఎక్సర్‌సైజులలో కొన్ని.

క్రేనియాటమీ సర్జరీకి ముందు, ఓ పన్నెండు రోజుల “సెలవు” ఇచ్చారు తనకి. తల్లితో ఇంటికెళ్ళాక, ఆ కొద్ది రోజుల్లో తను నేర్చుకున్న విషయాల జాబితా చూస్తే – జిల్ మెదడు ఎంత శిథిలమయ్యిందో, ప్రేమతో, ఓరిమితో, నేర్పుతో ఆ తల్లి తన కూతురికి ఎంత మహోపకారం చేసిందో అర్థమవుతుంది. “అన్నిచోట్లలో తానుండలేడు కనుక తనకి ప్రతిరూపంగా భగవంతుడు అమ్మను మనకిచ్చాడు” అనే మాటకి అర్థం బోధపడుతుంది.

1996 డిసెంబర్ 27న జిల్‌కి క్రేనియాటమీ ఆపరేషన్ చేసి మెదడులోనున్న గోల్ఫ్ బాలంత పెద్ద క్లాట్‌నీ, స్ట్రోక్‌కి కారణమైన AVMనీ తొలగించారు. ఎడమ చెవికి ఎగువన తిరగేసిన ‘U’ ఆకారంలో తొమ్మిదంగుళాల పొడవున ఉన్న కుట్లతో తన ఫోటో అచ్చువేసారీ పుస్తకంలో.

సర్జరీ తరువాత జిల్ పూర్తిగా కోలుకునేందుకు ఎనిమిదేళ్ళ సమయం పట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో తన జీవితపు స్క్రిప్టును తిరగరాసుకుంది తను. ఆ కథంతా చదువుతుంటే – చాలా పర్సనలైజ్ చేసి, ఓ విభిన్నమైన దృక్కోణంనుంచి రాసిన వ్యక్తిత్వవికాస పుస్తకాన్ని చదివినట్లనిపిస్తుంది. మనం మారగలము, ప్రపంచాన్ని మరింత ప్రేమించగలము, మన జీవితంలో శాంతిని సాధించగలము అని నమ్మకం కలుగుతుంది.

చదివాక చాలాకాలం వెంటాడే పుస్తకం “My stroke of Insight”.
***
“To experience peace does not mean that your life is always blissful. It means that you are capable of tapping into a blissful state of mind amidst the normal chaos of a hectic life”
– Jill Bolte Taylor
***
మరికొన్ని వివరాలు:

1) కొనుగోలు వివరాలు: ఫ్లిప్‌కార్ట్ (Rs.297); అమెజాన్.కాం ($11.68)
2) జిల్ బోల్టీ టేలర్ TED ప్రసంగం

You Might Also Like

4 Comments

    1. Sitha rentala

      చాలాఅద్భుతం !కృషి వుంటే మనుషులు రుషులవుతారు .I వాంట్ to రీడ్ this బుక్.

  1. K.V.RAO

    మీ బ్లాగుని “పూదండ” తో అనుసంధానించండి.

    http://www.poodanda.blogspot.com

  2. జీవితాన్నిమరింతగా ప్రేమించడం నేర్పిన… | Bagunnaraa Blogs

    […] Srinivas Vuruputuri ఈ పుస్తకం రాసినావిడ పేరు జిల్ బోల్టీ […]

Leave a Reply