తనికెళ్ళ భరణి సాహితీ పురస్కారం 2013 ప్రదానోత్సవం
తనికెళ్ళ భరణి సాహితీ పురస్కారం 2013 ప్రదానోత్సవం ఈ వారాంతంలో జరుగనుంది. పురస్కార స్వీకర్త నగ్నముని. ప్రదానోత్సవ సభ ఆహ్వానం, వివరాలు ఇవి:
తేదీ: 14 జులై 2013, ఆదివారం.
సమయం: సాయంత్రం 6 గంటలకు
వేదిక: శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ
“నగ్నమునిది మెదడు చితికి
కవితంతా నెత్తురు
దిగంబరపు అంబరాలు
గుబాళించు అత్తరు!”
-తనికెళ్ళ భరణి.
A.Surya Prakash
తనికెళ్ళ భరణి సాహితీ పురస్కారం ౨౦౧౩ నగ్నముని సాహిత్య సేవకు ఇవ్వబోవడం అత్యంత సమంజసం!ఉదయించని ఉదయాలు తో కవితాలోకంలోకి పాదం మోపారు!దిగంబరకవిత్వం manifesto ను రూపకల్పన చేసినవారు నగ్నముని అను మానేపల్లి హృషీకేశవరావు అంటారు!విలోమకధలు రాసి కొత్తదారి వేశారు!ఉన్నవ మాలపల్లిని నాటకీకరణ చేయగా A .R.క్రిష్ణ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు!కొయ్యగుర్రం కావ్యంతో ప్రభుత్వ పని సంస్క్రతిని దుయ్యబట్టారు! మంచిసరుకు,విషయం,అధ్యయనం,అవగాహన ఉన్నవారు నగ్నముని!ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉంటూ తమ స్వతంత్రాభిప్రాయాల వ్యక్తీకరణ వల్ల అత్యవసర పరిస్థితిలో అరెస్ట్ చేయబడి ఉద్యోగంనుండి తొలగించబడి ఆనక మళ్ళీ reinstate చేయబడడానికి ఎంతో దమ్ము ఉండాలి!అంతటి నగ్నమునికి భరణి కవనప్రేమతో పెట్టిన అవార్డు రావడం ఆనందదాయకం!
తనికెళ్ళ భరణి సాహితీ పురస్కారం 2013 ప్రదానోత్సవం | Bagunnaraa Blogs
[…] పుస్తకం.నెట్ తనికెళ్ళ భరణి సాహితీ పురస్కారం 2013 […]