కానుగు చెట్టు : నచ్చిన కథ

వ్యాస రచయిత: ఎ.ఎస్.శివశంకర్
*****

కథ : కానుగు చెట్టు
రచయిత : పానుగంటి లక్ష్మీ నరసింహారావు
రచనా కాలం : 1921

పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం ‘కవిశేఖరుడ’నీ, ‘అభినవ కాళిదాసు’ అనీ, ‘ఆంధ్ర అడిసన్’ అనీ, ‘ఆంధ్ర షేక్ స్పియర్’ అనీ బిరుదులతో అభినందించింది.ఈయన రాసిన సాక్షి వ్యాసములు చిక్కనైన గ్రాంథిక భాషలో వ్రాయబడినాయి వ్యాసాలన్నీ కూడ కొంత వినోదపూర్వక భావంతోనే వ్రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము చాల ప్రజాదరణ పొదబడినవి.

నేను మునుపెన్నడూ ఈయన రాసిన కథలు చదవలేదు. ఈ మధ్య “ఆంధ్రపత్రిక” పాత సంచికలను చదువుతున్నప్పుడు ఈ “కానుగుచెట్టు” కథ ను చదవటం జరిగినది. ఇదే నేను చదివిన ఈయన మొదటి కథ. కథ అంతా గ్రాంధిక భాషలో వ్రాయబడినా సులువు గానే అర్థము అయినది. “కానుగుచెట్టు” కథ అంతా సుబ్బరాజు గారనే సద్బ్రాహ్మణుడి జీవితము గురుంచి, ఆయనకి పోతన రాజుగారి భాగవతముపై గల అమిత భక్తిని తెలియపరుస్తుంది. అప్పటి సమాజిక పరిస్థితులను, మనుషుల మనో భావాలను కధలో వీలు దొరికినప్పుడల్లా చేర్చడం పానుగంటి గారి రచనా చాతుర్యానికి ఒక నిదర్శనం గా అనిపించింది. తిక్కన సోమయాజి గారి ప్రస్తావన, పింగళి సూరన్న గారి ప్రస్తావన, ఆ కాలం ఆడవాళ్ళ ఓపిక గురుంచి వ్యంగ్య ప్రస్తావన చాలా సరదాగ అనిపించింది. కథలో సుబ్బరాజు గారి జీవితం, ఆయన అనుభవించిన కష్టాలని పోతన భాగతం లో పద్యాలతో ముడి పెట్టడం నాకు బాగా నచ్చిన విషయము.

కథ చదువుతూన్నంతసేపూ పాఠకుడిలో ఉత్సాహాన్ని ఎక్కడా జారవిడువకుండా కథలో భక్తి రసాన్ని పానుగంటి గారు చాలా చక్కగా చిత్రీకరించారు. కథ చివరిలో మానవుల మనోభావలని చాలా సూటిగా పానుగంటి గారు విమర్శించడం కథకు మరింత వన్నె నిచ్చింది అని నేను అనుకుంటున్నాను. సుబ్బరాజు గారు లాంటి మహానుభావులు నిజంగా భారతదేశంలో ఉండి ఉండేవారా అని తప్పనిసరిగా మనకు కథ పూర్తి అయ్యాక అనిపిస్తుంది. తప్పకుండా ఉండేవుంటారు.

ఇటువంటి రచనలు ఈ కాలంలో అరుదు మరియూ పానుగంటి లాంటి వారి రచనలు దొరకడం కూడా అరుదే. అందుకనే ఈకథని పరిచయం చేయబడినది. మీరు కూడా చదివి ఆనందించగలరు.

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

You Might Also Like

4 Comments

  1. Siva

    The link for the article is not working. Please check

  2. varaprasad

    thanq mr sivasankat,pl try to barister parvateesam.

  3. VARAPRASAD

    panuganti varivi marinni rachanalu netlo unchandi

  4. sivasankar ayyalasomayajula

    This story available in Press Academy Archives website.. Yearly Magazine “Andhra Patrika” issue date 1921, Pages 207 to 211.
    http://www.pressacademyarchives.ap.nic.in/MagazineTil.asp

    Reg
    Siva

Leave a Reply