Stray Birds పై Stray Thoughts
ఓ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు.. హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. “ఓయ్.. నన్ను వదిలేసి మీరూ మీరూ మాట్లాడేసుకుంటున్నారా?” అని నిష్ఠూరమాడుతూనే మధ్యన వచ్చి తిష్ఠ వేసే ఆత్మీయులు మనకి ఉండనే ఉంటారు. కాకపొతే కొన్ని సందర్భాలలో అలా మాటల మధ్య దూరి, మాటల్లో మాటలా కలిసిపోయేవి – ఓ మంచి రచన కావచ్చు. మెచ్చిన పాట కావచ్చు. అబ్బురపరిచే ఏ కళ అయినా కావచ్చు. మా మాటల తోటలోకి ఎగిరి వచ్చిన “Stray Birds” కబుర్లు ఇక్కడ మీ కోసం.
-పూర్ణిమ, సౌమ్య.
********************************************************************
సౌమ్య: that i come online despite all..is a perpetual surprise of my life 😛
పూర్ణిమ: హహహ.. టాగోర్ భాష మాట్లాడుతున్నావే!
సౌమ్య: 🙂 “That I exist is a perpetual surprise which is life” అన్న స్ట్రే బర్డ్స్ వాక్యం గుర్తొస్తేనూ..
పూర్ణిమ: అర్థమవుతోంది.
సౌమ్య: నీకేమనిపిస్తోంది దాన్ని తల్చుకుంటే..
పూర్ణిమ: మనసుకి దగ్గరైన వారి చిరునవ్వులనో, కన్నీటి చుక్కలనో తల్చుకున్నప్పుడు ఏమనిపిస్తుందో, అదే అనిపిస్తుంది. అవ్యక్త భావాలుంటాయి, వాటిని మాటల్లో పెట్టడం అసంభవం అన్న నిశ్చితాభిప్రాయం మార్చుకోవాలనిపిస్తుంది. భాషలోనో, భావనలోనో ఖాళీలను పూరించలేక, “మాటలకందని భావం” అనిపిస్తాయే కానీ, మానవ మేధస్సు చెప్పలేనిది లేవు అనిపిస్తుంది.
సౌమ్య: హమ్మ్.. నేనూ వాటిని పదాల్లో పెట్టలేను. కానీ వాటిని మళ్ళీ, మళ్ళీ చదవడం అంటే ఇష్టం. అలతి పదాల్లా అనిపిస్తాయి కానీ అనంత ఆలోచనల్ని రేకెత్తిస్తాయి.
పూర్ణిమ: నిజం..
సౌమ్య: LIFE లేదూ వీటిలో? 😛
పూర్ణిమ: “the bird wishes it were a cloud. cloud wishes it were a bird…”
సౌమ్య: అదృష్టం ఎవరిది?
పూర్ణిమ: ఎంత సాధించినా, ఏం సాధించినా, మనలోని అసంతృప్తి. ప్రకృతి సహజంగా వచ్చిన గుణాలకన్నా, ప్రకృతిలో ఉన్న అన్నీ నావైతే బాగుణ్ణు అని. నేనయితే.. man wishes he were a cloud and a bird as well అని దానికి కొనసాగింపు ఇస్తాను.
సౌమ్య: అవును. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు 🙂 well, పొరుగింటి పుల్లకూర రుచి అనే టాగోర్ ఇలా చెప్తున్నాడు ఏమో అయితే.
అందుకే ఆయనే అన్నాడు మళ్ళీ, ఇందులోనే : “if u shed tears when u miss the sun, u willl also miss the stars” అని.
పూర్ణిమ: “Sorrow is hushed into peace in my heart like the evening among the silent trees.”
సౌమ్య: “That love can ever lose is a fact that we cannot accept as truth. ” అందుకే sorrow కాబోలు! 😛 టాగోర్ ఏ వరుసలో రాస్కున్నాడో తెలీదు కానీ!
ఇక్కడ ప్రతేకత ఏమిటీ అంటే, ప్రతి వాక్యానికి continuation కూడా అదే సంకలనం లో దొరుకుతుంది 🙂
పూర్ణిమ: హుం…ఇదీ నాకు అన్నింటి కన్నా ఎక్కువ నచ్చింది: “Once we dreamt that we were strangers. We wake up to find that we were dear to each other.”
సౌమ్య: 🙂
పూర్ణిమ: ‘there are no strangers.. only friends who haven’t met’ అన్న కోట్ గుర్తొస్తోంది 🙂
సౌమ్య: నాకు ఈ పుస్తకంలోవే రెండు వాక్యాలు వెంటవెంటనే తడుతున్నాయి. “That I exist is a perpetual surprise which is life” అన్నది, దాని వెంటనే : “His own mornings are new surprises to god” అన్నదీ.
పూర్ణిమ: హమ్మ్..
సౌమ్య: వెంట వెంటనే ఈ రెండూ చదువుతూ ఉంటే ఏమనిపిస్తోంది? అహం బ్రహ్మాస్మి?
పూర్ణిమ: అవును. చాలా నిజం.. “These little thoughts are the rustle of leaves; they have their whisper of joy in my mind.”
సౌమ్య: “O troupe of little vagrants of the world, leave your footprints in my words”
పూర్ణిమ: అహం బ్రహ్మాస్మి కూడా ఓ ఆనందమే 🙂
పూర్ణిమ: You smiled and talked to me of nothing and I felt that for this I had been waiting long. 😉
సౌమ్య: 🙂 నువ్వేమనుకుని అన్నావో గానీ, నాకిక్కడ నిజంగానే ఎవరో ఫోన్ చేసి, నవ్వుతూ మాట్లాడారు…:))
“”The light that plays, like a naked child, among the green leaves happily knows not that man can lie.” this always intrigued me…..
పూర్ణిమ: ఏ ఉద్దేశ్యంలో?
సౌమ్య: అలా ఎలా రాసాడో..ఆ ఆలోచన ఎలా వచ్చిందో… వెలుగును నేకెడ్ చైల్డ్ తో పోల్చడం… 🙂
“”What language is thine, O sea?”
“The language of eternal question.”
“What language is thy answer, O sky?
“The language of eternal silence.””
ఇదికూడా…
పూర్ణిమ: ఇది చూస్తూ ఉంటే, నాకు ఇందులోదే ఇంకోటి గుర్తొస్తోంది.. మనిషిలో మౌనమే కాదు, మిగితావి కూడా ఉన్నాయి అని. “The fish in the water is silent, the animal on the earth is noisy, the bird in the air is singing,But Man has in him the silence of the sea, the noise of the earth and the music of the air.”
మనిషిని పూర్తిగా నిర్వచిస్తుంది ఇది. మనషులని ఒక కాటగరీలో పెట్టేయాలనుకుంటూ ఉంటాం.. కోపిష్ఠి అనో, శాంతపరుడనో.. ఇలా. కానీ ప్రతీ మనిషిలోనూ అన్ని భావాలూ ఉంటాయి. వాటిలో ఏది బయటపడేది ఆ సమయంలోనే తెలుస్తుంది.
సౌమ్య: wow!
టాగోర్ ఫిలో కూడా చాలా మామూలు పదాల్లో రాసేస్తాడుగా 🙂
“I cannot tell why this heart languishes in silence.
It is for small needs it never asks, or knows or remembers” మనసుని తాకుతోంది.
పూర్ణిమ: హమ్మ్..
సౌమ్య: “I sit at my window this morning where the world like a passer-by stops for a moment, nods to me and goes. ” – ఫిలో!!!
primarily, నాకు ఇవి వాటికున్న simplicity వల్ల ఇష్టం. ఏవరికైనా అర్థమవుతాయి. భాషలో సంక్లిష్టత లేనందువల్ల ఆస్వాదించడంలో హాయి పెరుగుతుంది. అనవసరపు ఆర్భాటాలు లేవు.
మూడు వందల పై చిలుకున్నాయ్ కదా… అన్ని రకాల “మూడ్స్” కవర్ చేసినట్టు ఉంటుంది.
పూర్ణిమ: సరళతకి నేనూ పడిపోయానూ అనుకోవచ్చు. ఇది చూడు.. “Like the meeting of the seagulls and the waves we meet and come near. The seagulls fly off, the waves roll away and we depart. ”
సౌమ్య: Hmm…. బాగుంది… “God finds himself by creating” ఇందాకటి “perpetual surprise” సిరీస్ లో ఇది తరువాతది ఏమో…
పూర్ణిమ: అయ్యుండొచ్చు..
” The sparrow is sorry for the peacock at the burden of its tail.” – funny!
సౌమ్య: హహహాహ..
“Every child comes with the message that God is not yet discouraged of man” – 🙂 భలే రాసాడుగా.
ఇది కూడ ఫన్నీయే: “Tiny grass, your steps are small, but you possess the earth under your tread”
అంటే, ఫన్నీ అనుకోవచ్చు, తాత్విక చింతన అని కూడా అనుకోవచ్చు లే 😉
“”I give my whole water in joy,” sings the waterfall, “though little of it is enough for the thirsty.”” – :))
పూర్ణిమ: భలే ఉంది..
The infant flower opens its bud and cries, “Dear World, please do not fade.”
అది మనమేనేమో… అప్పుడే విరిసిన పువ్వు.
సౌమ్య: 🙂
“The woodcutter’s axe begged for its handle from the tree. The tree gave it”
పూర్ణిమ:చెట్టు తెలీని అమాయకత్వం అనుకోవచ్చు, తెలిసీ చేసే దాన గుణం అనుకోవచ్చు..
సౌమ్య: 🙂 హమ్మ్
“The mist, like love, plays upon the heart of the hills and brings out surprises of beauty”
ఇమాజిన్ చేస్కో దీన్ని… దీన్ని కూడా : “The grass seeks her crowd in the earth. The tree seeks his solitude of the sky”… “Religion will be one when God is dead” -అట! అబ్బ!!! wonderful!
పూర్ణిమ: దీన్నే సున్నితంగా చెంప చెల్లుమనిపించటం అంటారు.
పూర్ణిమ: The noise of the moment scoffs at the music of the Eternal.- చిన్ని చిన్ని అపార్థాల వల్ల, అప్పటి దాకా పంచుకున్న అనుబంధాన్ని క్షణాల్లో తెంచుకుపోతామే!
సౌమ్య: ఎందుకు టాగోర్ కి గడ్డి అంటే అంత ఇష్టం…ఎన్ని కవితలున్నాయి చూడు..గడ్డి..గడ్డి అని. గ్రాస్ కెవ్వు, గ్రాస్ కేక అనుకుంటూ..
“The great earth makes herself hospitable with the help of the grass.” – మళ్ళీ ఇంకోటీ!
పూర్ణిమ: హిహిహి… గడ్డి మరీ గడ్డిలా చూడకు! టాగోర్ కళ్ళు అరువు తెచ్చుకో!
సౌమ్య: :)) ఇది చూడు: Roots are the branches down in the earth. Branches are roots in the air.
పూర్ణిమ: “Death’s stamp gives value to the coin of life; making it possible to buy with life what is truly precious.” – తప్పని మృత్యువుని మచ్చిక చేసుకోడానికి చేసే ప్రయత్నంలోనో, లేక వాళ్ళింటికి అన్ని సార్లు వచ్చి, వచ్చి ప్రతీ సారీ ఓ అత్మీయాన్ని దూరం చేయడం వల్ల పెరిగిన చనువో తెలీకుండా ఉంటాయి.
సౌమ్య: ఊ..
పూర్ణిమ: “The echo mocks her origin to prove she is the original”. – అబద్ధానికే పాపం, సాక్ష్యాలు కావాలి.
సౌమ్య: అంటే…ఇప్పుడు నేను “కెవ్” అంటే… వచ్చే ఎకో నన్ను వెక్కిరిస్తుందనమాట.. 😛
పూర్ణిమ: That which ends in exhaustion is death, but the perfect ending is in the endless.
దీని అర్థం చెప్పు?
సౌమ్య: “..that which ends in exhaustion is death”
ఈ తీపి బాధగా..ఈ బాధ తీయగా…జీవితం అలా సాగిపోవాలి అన్న బాపతేమో..
పూర్ణిమ:The road is lonely in its crowd for it is not loved. – పాపం కదూ! :((
“Dream is a wife who must talk.
Sleep is a husband who silently suffers.”
సౌమ్య: అంటే ఏంటన్నట్లు.. సూర్యకాంతం, రమణారెడ్డి లా ఉంది 😛
పూర్ణిమ: ఊహు.. dream and sleep are together.. తప్పని స్నేహం వాళ్ళది.. అందుకే భార్యా భర్తలు!
సౌమ్య: అంటే..husband suffers wife talks అన్నాడు కదా…
పూర్ణిమ: కల వల్ల ఎప్పుడూ నిద్రా భంగమే కదా!
సౌమ్య: నాకు ఈమధ్య ఫెమినిజం ఎక్కువ ఐనట్లు ఉందిలే…
పూర్ణిమ: హిహిహి
I carry in my world that flourishes the worlds that have failed.
సౌమ్య: worlds..or words? 🙂
పూర్ణిమ: The bird thinks it is an act of kindness to give the fish a lift in the air. – LOL!
సౌమ్య: :)) @ bird-fish
నవరసాల శ్రీశ్రీ లాగా..straybirds లో నవరసాల టాగోర్ ఉన్నాడు కదా!
పూర్ణిమ: ఊ.. 🙂 నవరసాలు టాగోర్ లో లేవు. మనలో ఉండాలి. మనలో ఏది ఉంటే అలాగే కనిపిస్తాడు టాగోర్.
సౌమ్య: భలే చెప్పావ్…
పూర్ణిమ: ఇందాక నువ్వు అన్నావ్ కదా… ఎవరికైనా అర్థమవుతుందనీ? అది ఎందుకంటే ఏ వాక్యాన్నీ నువ్వు విస్మరించలేవు. అది నీలోని ఏదో ఒక భావనని కదిలించగలదు.
సౌమ్య: హమ్మ్.. ఎవరికైనా ఎలా అయినా అర్థమవుతుందంటావా? 🙂
సౌమ్య: ‘Asks the Possible to the Impossible, “Where is your dwelling place?”
“In the dreams of the impotent,” comes the answer.”
నాకేదోలా ఉంది ఇది చదువుతూ ఉంటే…. 🙁
పూర్ణిమ: హమ్మ్..
“”I am ashamed of my emptiness,” said the Word to the Work.
“I know how poor I am when I see you,” said the Work to the Word. ”
– ఇదో మళ్ళీ పొరుగింటి పుల్లకూర 😛
పూర్ణిమ: hehehehe.. yes 🙂
సౌమ్య: “Gaps are left in life through which comes the sad music of death. ”
పూర్ణిమ: నేను ఆలోచించలేను.
సౌమ్య: “”Who is there to take up my duties?” asked the setting sun.
“I shall do what I can, my Master,” said the earthen lamp.”
:))
ఒక్కోసారి ఎంత అమాయకంగా అనిపిస్తాయో.. కానీ… అంత డీప్ గా టచ్ చేస్తాయి…
పూర్ణిమ: ఏం చెప్పను? yes.. innocent questions kill you 🙂
సౌమ్య: Tagore’s concept of GOD ఏంటో అర్థం చేస్కోడం..might be an interesting mental exercise. ఈ stray birds లోనే ఎన్ని చోట్ల GOD ని గురించి చెప్తాడో..అదే, తన దృక్కోణంలో.
పూర్ణిమ: yes..
సౌమ్య: “Thoughts pass in my mind like flocks of ducks in the sky.
I hear the voice of their wings. ” -చదువుతూ ఉంటే మన పరిస్థితి కూడా ఇదే కదూ?
పూర్ణిమ: ఊ…అవును.
” Silence will carry your voice like the nest that holds the sleeping birds.”
సౌమ్య: టాగోరూ… సైలెంట్ గా ఇవ్వన్నీ రాసేసి వెళ్ళిపోయి… మా మనసుల నిశ్శబ్దాన్ని బద్దలగొడుతున్నావోయీ 😛
పూర్ణిమ: నాకు వేరుగా అనిపిస్తోంది.. మాటలన్నీ మూగబోయి..
సౌమ్య: మనసులోని అలజడిని ఇన్నాళ్ళు నిశ్శబ్దంగానే, నిశ్శబ్ద విప్లవం లా ఉండింది. ఇప్పుడు టాగోర్ వాటికి మాటలు నేర్పిస్తున్నాడు అనుకోవచ్చు కదా!
పూర్ణిమ: టాగోర్ నా మాటలన్నీ ముందే చెప్పేస్తే.. ఇక నేనేం చెప్పను?
సౌమ్య: “A mind all logic is like a knife all blade.
It makes the hand bleed that uses it. ”
పూర్ణిమ: నాలాంటి బుర్ర లే.. 😛 నన్నే తిట్టాడు అక్కడ!
సౌమ్య:“By touching you may kill, by keeping away you may possess. ”
పూర్ణిమ: హమ్మ్..
సౌమ్య: “My sad thoughts tease me asking me their own names”
sadism of our own మనసు.
masochism…at the same time.
పూర్ణిమ: నామకరణ మహోత్సవం పెడదాం వాటికి..
సౌమ్య: “The day of work is done. Hide my face in your arms, Mother. Let me dream. ”
and i go and dream.
పూర్ణిమ: ఇప్పుడా? నేను గంట నుండీ చేస్తుంది అదే కదా?! 😛
************************************************************
అంతే, అక్కడికి ఆగిపోయింది….ఎందుకోగానీ. ఈ చర్చ పుస్తకం పాఠకులకి కూడా ఆసక్తి కలిగిస్తుందనిపించి ఇక్కడ పెట్టాము. మీ అభిప్రాయాలు తెలుపగలరు.
పుస్తకం » Blog Archive » నన్ను చదివే పుస్తకం..
[…] ఉన్నాను. ఒక రస్కిన్ బాండ్ లేదా టాగోర్, లేదా వివేకానంద. వీళ్ళెవ్వరూ కాకపోతే […]
కొత్త పాళీ
Very nice
పూర్ణిమ
యోగి: 🙂
బాబా గారు: “its ok” ఏంటి? రాయండి.. మీరు రాస్తున్నారు, నాకు తెల్సు. అబ్బా.. రాసేద్దురూ! 🙂
మాలతి గారు: థాంకులూ!
మాలతి
ఒక మహాకవికి ఒక అద్భుతనివాళి!
bollojubaba
you stole my thunder. waa. waa….
i wanted to post one on this. its ok 🙂
no doubt i can not write this much wonderfully. congrats
again a bit of name dropping. :-)) sorry i am not able to resist it.
stray birds can be read in telugu here
http://www.scribd.com/doc/9674265/Tagore-Stray-Birds-Telugu-Translation
bollojubaba
Yogi
If this is how you guys talk, I would like to buy your chat history!
quote your price. 🙂