వ్యాసం రాసి పంపినవారు: సింధు
“అక్కా, చలం ‘మైదానం’ movie గా వచ్చిందా?”
అక్క : లేదనుకుంటా..
నే : సరే.
అక్క : ఐనా ‘మైదానం’ తీస్తే movie మొత్తం censor ఐపోతుంది.
నే : నిజమే..
అక్క అన్నది అక్షరాలా నిజం.
“గుడిపాటి వెంకటాచలం”, ‘అచలం’ అంటే “స్థిరమైనది” అని అర్థం. ఇష్టం లేకపోతే “స్పందన లేనిది” అని కూడా అనొచ్చు. బహుశా ఆ అవకాశం ఇవ్వటం ఇష్టం లేకే చలం గారు ‘అ’కారాన్ని పక్కనపెట్టారేమో. చలం ప్రతి రచనా, ఆయన “స్పందించే మనసు”కి అద్దం. ప్రతి కథలోని వర్ణనా చెబుతుంది, ఆ మస్తిష్కం ప్రకృతి చిత్తరువుల కాన్వాసులకు అడ్డా.
చలం రాతలకీ, ఊహల చిత్రాలకీ, censor లేదు. అసలు sense యే లేదనేవాళ్ళున్నారు. కానీ ఆ విమర్శ, ఆయన కథలకీ, కథనానికీ మాత్రమే వర్తిస్తుంది. వాటి మూలమైన “faith in womanhood” కి కాదు. రంగనాయకమ్మ గారు అన్నట్టు, చలం కథలని, అవి పుట్టటానికి కారణమైన ఆనాటి సాంఘిక అచారాలు, పరిస్తితుల దృష్టిలోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
భారతదేశం ఉష్ణప్రాంతం, బహుశా భవిష్యత్‌లో జనాభా మరియు నేర నియంత్రణలో భాగంగా పుస్తకాలని కూడా censor చేయాల్సి రావొచ్చు. ఇప్పటికే cinemaలకి ఉన్నాయి. central లో ఒకటి మళ్ళీ! movieలో hero, heroineలు కొత్తకొత్త తిట్లు తిట్టుకుంటుంటే వినలేక చెవులు మూసుకుని cut చెయ్యటం మర్చిపోతూంటారు. కథకి అవసరం కాకపోయినా, ఆకర్షణకి అవసరం ఐతే ఏదైనా Ok…
గొప్ప విషయం ఏంటంటే, ‘విధి’కి మాత్రమే censor లేదు. కానీ దాన్ననుసరించి నడిచే ప్రపంచం మాత్రం censor కావాలనుకుంది. సభ్యసమాజానికి అన్నీ అవసరమే.. బహుశా విధికి censor ఉండుంటే, “‘మైదానం’ సంభవమే” అని చచ్చినా నమ్మేదాన్ని కాదు. నేను చూసిన మైదానం రాజేశ్వరిది కాదు. ఐనా రాజేశ్వరి అనే అనుకుందాం. చాలామందిలాగే, తల్లిదండ్రులతో జీవించే చలాకీ అమ్మాయి. ఊళ్ళోకి ఎవడో వచ్చాడు. వామనుడు మూడడుగుల నేల అడిగినట్టు, ఇంటి వసారా చాలు పడుకోవటానికన్నాడు, వ్యాపారం చేసుకుంటూ, రాజి కుటుంబానికి తల్లో నాలుకయ్యాడు. రాజి తల్లి అతన్ని “అన్న” అంది, అతనూ అంగీకరించి రాజీకి మావయ్య అయ్యాడు. అచ్చంగా మైదానం మావయ్యలానే వక్రబుద్ధివాడు అని తెలుసుకునేసరికి, కుటుంబం పరువు అతని చేతుల్లోకి వెళ్ళిపోయింది. తన తల్లితో అతనికి అక్రమసంబంధం, చేతకాని తండ్రి, ఊళ్ళో ఇదొక open secret.. మింగలేని, కక్కలేని పరిస్థితి. తను పెద్దదయ్యేసరికి మామగారి కొడుకొకడు దిగాడు. వ్యాపారం చేసుకోవటానికి వచ్చాడనుకున్నారు అందరూ. ఉన్నట్టుండి, తనకి అతనితో పెళ్ళి చేయాలనుకుంటున్నారని తెలిసి, అర్థరాత్రి గోడ దూకి పారిపోబోయి దొరికిపోయింది. అవమానకరంగా మావయ్య, కాబోయే భర్త, చేయిచేసుకున్నారు. తల్లీ తండ్రీ నోరెత్తితే ఆ కాస్త పరువూ మిగలని పరిస్థితి. కానీ వీధిలో అన్నయ్యావాళ్ళు దేవుళ్ళలాగా కర్రలతో మీదకి ఉరికి తండ్రీ కొడుకుల్ని చావచితక్కొట్టారు. ఆవాళ్టికి గొడవ సద్దుమణిగింది కానీ ఆ రాజీ తలరాత మారలేదు. అతనితోనే పెళ్ళయింది, చేసేదేమీ లేక కాపురం చేసి, పిల్లల్ని కని, సాకింది.. పై సంఘటన జరిగే నాటికి నాకు ఆరేళ్ళు. అంటే దాదాపు 17 సం||లు క్రితంది. ఈ పదిహేడో సంవత్సరం మళ్ళీ తన పేరు విన్నాను. తన “అమీర్”ని తీసుకుని ఊరువదిలి వెళ్ళిపోయింది. ఆ ఫలానా “అమీర్”, చిన్నప్పుడు చాలామందితోపాతు నన్ను ఎత్తుకుని ఆడించిన ఒక అన్నయ్య. అందుకే వినగానే బాధపడ్డాను.
అమ్మ గుడికి వెళితే అమ్మాయ్ వాళ్ళ నాన్న కనిపించి, “పిల్లల్ని వదిలేసి పోయిందమ్మా” అన్నాడట. ” ఇష్టంలేదు మొర్రో అని ఊరంతా వినపడేలా తెగేసి చెప్పినా ఈ చెవిటిసంత వినలేదు ఆవాళ. ఇన్నాళ్ళు ఓపికపట్టి, ఇప్పుడు ఆ వ్యభిచారాన్ని వదిలించుకుంది. అసలు ఇన్నాళ్ళుండటమే తన తప్పు. ఐనా పిల్లల తండ్రేం చావలేదుగా, ఎందుకంట అంత బెంగ” అనేశాను high speedగా.
అమ్మ shock!!
నేను మాట్లాడింది న్యాయం కాదని నాకు తెలుసు. sympathy చూపించటానికి ఆ అమ్మాయేమీ అన్యాయమైపోలేదిప్పుడు. తన సుఖం తాను చూసుకుంది. కానీ ఇష్టం లేని పెళ్ళి చేసినవాళ్ళని విమర్శించటం నా target. ఎవరి జాగ్రత్త వాళ్ళది!
చలం “మైదానం” మొదటిసారిగా 1981లో ముద్రించబడిది [నేను చదివిన పుస్తకం ప్రకారం], ఆనక దశాబ్దం ముగిశాక అంటే 1991-92లో అమ్మాయ్ జీవితంలో మొదటి సంఘటన జరిగింది, ఆ తర్వాత పదిహేడు సంవత్సరాలకి మలుపు తిరిగింది. ఐతే ఇక్కడ “మీరా” అనే పాత్రే లేదు. దీనికి సమకాలీనంగా జరిగిన మరో అమ్మయి కథ చప్తాను. ఐతే, ఇవి వాస్తవంగా జరిగాయి, వక్రీకరణ కానీ, అభూతకల్పన కానీ ఏమీ లేదు.
ఈ అమ్మాయిది, తల్లిదండ్రులు కుదిర్చిన, ఇష్టపడి చేసుకున్న వివాహం, మధ్యతరగతి జీవనం, ఆడ సంతానం, పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, అంతా happy.. ఇంతలో భర్త ఆరోగ్యం చెడింది, వెనకేసుకున్న సొమ్ము కరిగిపోయింది, ఆనక అతని ప్రాణం పోయింది. తన కాళ్ళపై తను నిలదొక్కుకునే ప్రయత్నం చేసి, గెలిచింది. కొన్నాళ్ళకి చిత్తం చలించి, bank డబ్బులన్నీ draw చేసుకుని వెళ్ళిపోయింది తనని మార్చిన అతనితో..
భర్త లేని లోటు, కుటుంబ భారం, ఇలా కారణాలు అనేకం కనిపిస్తాయి. బంధువులు తన ఆచూకీ తెలుసుకుని వచ్చి, “పిల్లల” గురించి నిలదీశారు. “ఇష్టమైతే పెంచండి, లేకపోతే చంపేయండి” అంది.
ఇప్పుడు చెప్పిన రెంటిలో.. అమ్మాయిల తప్పు ఖచ్చితంగా ఉంది. చలం గారి రాజేశ్వరికి సంతానం లేదు, వీళ్ళకి సంతానం ఉంది, అంతే తేడా. రంగనాయకమ్మగారు ” చలం స్త్రీవాదం” లో ” ఒకవేళ అలా వెళ్ళిపోయిన స్త్రీకి పిల్లలు ఉంటే వాళ్ళ బాధ్యత ఆమే తీసుకోవాలి” అన్నారు. భర్త మీద అనాసక్తి వల్లో, ప్రియుడికి ఆకర్షితురాలయ్యో. రాజేశ్వరి అమీర్ తో వెళ్ళిపోయింది, అయినా, తన వల్ల గర్భవతి అయితేనే, అమీర్ తన sadism ప్రదర్శించాడు. అలాంటిది, రాజేశ్వరికే సంతానం ఉండి ఉంటే, అమీర్ దగ్గర వాళ్ళ గతేం కాను?? అయినా, ప్రియుడి కోసం, సంతానాన్ని మట్టుబెడుతున్న వార్తలు ఎన్ని చూడటం లేదు. కాబట్టి అది ప్రమాదకరం.
చలం మైదానంలో ప్రకృతి నచ్చినా కథ, పాత్రలు, ప్రవర్తన, ఎంతమాత్రం నచ్చవు. ఇప్పటిదాకా నేను చెప్పింది అసంభవం కాదు అని మాత్రమే, సమర్థనీయం అని కాదు. అందులోని పాత్రలది వట్టి చపలత్వం, శారీరక సుఖాన్వేషణలా సాగుతుంది కథ. ఆమె అతడిని ఎంత ముద్దు చేసినా, వాడెంత గారాలు పోయినా, అతడు మరో స్త్రీకి ఆకర్షితుడై తన బుద్ధి చూపించుకుంటే, అతనికి సాయపడి ఆమె తన దౌర్బల్యాన్ని ప్రదర్శించింది. “దీదీ” అని పిలుస్తూనే తనని ఆకర్షించిన మీరా కి లొంగిపోయి, తన చపలత్వాన్ని మరోసారి నిరూపించుకుంది.
చచ్చినంత మాత్రాన “అమీర్” acceptable కాదు.
నేరం మీదేసుకున్నంత మాత్రాన “రాజేశ్వరి” అజరామర ప్రేమికా కాదు.
ఐతే, ఇది ఒక ఆవేశంలో, స్పందన లేని భర్తలకి ఊడిగం చేస్తూ బానిసత్వం నెరుపుతూ, పాతివ్రత్యమని మురిసిపోయే సమాజాన్ని గట్టి దెబ్బ కొట్టటానికి చలం చేసిన ప్రయత్నం. నేను అనుకోవటం, అప్పటికే ఇలాంటి “వెళ్ళిపోవటాలు” ఎన్నో చూసి, వాళ్ళ సంతోషాన్ని ఊహిస్తూ చేసిన రచన కావచ్చు. అయితే, కథా గమనం మాత్రం పరమ అస్థవ్యస్థం.
srinu.kudupudi
పెద్దగా “లోక జ్ఞానం” లేనివాడిని .ఇది చదివి నా మనసులో లో ఏదో చెప్పలనిపించి.. చెప్పేసాను అంతే !!
తప్పు గా అనిపిస్తే క్షమించండి !!
srinu.kudupudi
సింధు గారు !వర్ధమాన రచయిత్రి గా మీరు చేసిన సాహసం అభినందనీయం !!
కానీ మీరు చెప్పినట్టు పుస్తకాలను సెన్సార్ చెయ్య వలసి వస్తే ..వాత్సయునుడి “కామ సూత్ర” ని ఏమి చేయాలి ?!హిందువులు పవిత్రం గా భావించే దేవాలయాలమీద “శృంగార శిల్పాలని ” ఏమి చేయాలి ?!
అందరూ వాటిని పవిత్ర భావం తో చూడలేరు కదా ?!కొంత మంది ఆకతాయి లు కుడా ఉంటారు-సమాజం లో .
అందుకోసం ,సృష్టి రహస్యాలని విశిదీకరించే సాహిత్యాన్ని ,శిల్ప కళల ని ఎలా తప్పు పడతాం?!
అలానే సమాజం లో జరిగే కొన్ని సంఘటనల్ని “నవల ” గా రాస్తే చలం గారి తప్పు ఏమిటి ?!
ఆయన కథ లలో కొన్ని పాత్రలు ద్వారా “స్త్రీ “మనసు లో కొన్ని కోణాలని ఆవిష్కరించారే తప్ప , మొత్తం “స్త్రీ” ని కాదు కదా !సమాజం లో అందరూ మీ రాజి లా ఉండరు కదా ,అలాంటి వాళ్ళను చూసి చలం గారి ని తప్పు పట్టడం సమంజసం కాదు !వేరే ప్రియుడు తో వెళ్ళిపోయినా కన్న బిడ్డలని కడుపులో పెట్టుకొని చూసుకొనే కన్న తల్లులు ఎంతమంది లేరు ఈ సమాజం లో !
Marthanda
నేను ప్రేక్షకుడినని ఎవరు చెప్పారు? విజయనగరం జిల్లాలో ఉండే మా మామయ్య గారి అమ్మాయిని నేను పెళ్ళి చేసుకోను అని చెప్పానని ఆమెని ఆమె మేనమామ(నా బాబాయి)కి ఇచ్చి పెళ్ళి చెయ్యాలనుకున్నారు. కొడుకుకి వరసైన అమ్మాయి బాబాయికి వరస ఎలా అవుతుంది అని నేను అడిగితే పెద్ద వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. మేనరిక వివాహాల గురించి మహేష్ గారి బ్లాగ్ లో కూడా చర్చ జరిగింది. యూరోప్ లో ఎవరూ మేనరిక వివాహాలు చేసుకోరు. ఇండియా, పాకిస్తాన్, కొరియా లాంటి దేశాలలోనే ఇలాంటి వివాహాలు చేసుకుంటారు. ఈ విషయం పెద్ద వాళ్ళకి చెపితే ఎవరి ఆచారాలు వాళ్ళవి అంటూ సమర్థించుకున్నారు.
సింధు
@ marthanda,
you are right,, ” కొన్ని ఘటనల ఆధారంగా సమాజం ఇలాగే ఉంటుందనుకోవడం అవగాహణ రాహిత్యం అవుతుంది. ” deenivalla naku avagana rahityam ledu ani tetatellamayindi. endukante.. “samajam ilane undi” ani nenu ekkada cheppaledu. chetikunna aidu velle okarakamga undanappudu, samajamantha oka rakamga ela untundi? ikapote, fabricated story ani meeru anukunte, danni defend cheyalsina avasaram naku entamatram ledu, karanam, intakante, nirdaakshinyaalu mee chuttoo jarugutunna, kallaki gantalu kattukuni “abbe ala ledule, idanta bhranti” anukune hypocracy meelo anuvanuvuna jeerninchukupoyindani ardhamavutundi. bidda kosam manam pogottukunna “sundaramma” nu nammevallu kooda, tama santosham kosam biddalni nissahaayulanu cheyatam maatram angeekarincharanta. samajam annnaka meeku nacchinatte undadu, manassu kaalchese akrutyaalu enni jarugutunna, avannee meeku fabricated stories lage kanipistaayi.
bharta chanipoyina streelaku mallee pelli cheyatam memoo choosam, balavantamga gundu geeyinchataalu memu kuda chusam. pelli chesinavallani abhinandinchaam, protsahinchaam. balavantam ga jeevitaanni nasanam chesevallani pratighatinchaam, prasninchaam. meerem chesaaru, “ila jarugutondi” ani chodyam choosaaru. adi mee maatallone telustondi. “maa oollo police station venakala boothu cinema theatre undi, danni evaru prasninchaledu” ani nissigguga badhapadina meeru, daanni pratighatinchaara? asalu aa disaga prayatninchaara??
పుస్తకం » Blog Archive » BACK TO SCHOOL - వ్యాఖ్యలు దిద్దబడతాయి ఇకపై
[…] (”చంచలం మైదానం” పోస్టులో వచ్చిన వ్యాఖ్యలు ఒక పబ్లిక్ ఫోర్ంలో వచ్చినవే అయినా, అందులో పుస్తకం.నెట్ నిర్వాహకులుగా మా ప్రమేయం ఏమీ లేకపోయినా, ఈ సైటు బాధ్యత మా మీద ఉంది కావున, రభస మా కళ్ళ ముందు జరిగింది కనుకా, కలిగిన అసౌకర్యానికి చింతుస్తున్నాం! ఖండిస్తున్నాం!) […]
Marthanda
మీరు వ్రాసిన స్టోరీ ఫాబ్రికేటెడ్ స్టోరీ లాగే ఉంది. తల్లి పిల్లలని వదిలేస్తుందంటే ఎవరు నమ్ముతారు? కొన్ని ఇన్సిడెంట్స్ చూపించి సమాజం ఇలాగే ఉంటుందని చెప్పలేము. భర్త చనిపోయిన స్త్రీలకి మళ్ళీ పెళ్ళి చేసేవాళ్ళని చూసాను, బలవంతంగా గుండు గియ్యించి తెల్ల చీర కట్టేవాళ్ళని కూడా చూశాను. కొన్ని ఘటనల ఆధారంగా సమాజం ఇలాగే ఉంటుందనుకోవడం అవగాహణ రాహిత్యం అవుతుంది.
సింధు
@ rayraj
క్షమించాలి, రెండవ విషయం.. చలం గారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు, ఒక సగటు పాఠకురాలిగా, ఆయన పుస్తకాన్ని చదవటం, దానికి సంబంధించిన కొన్ని అంశాలని గమనించటం వలన, కేవలం నాయొక్క అంచనాను వ్యక్తపరిచాను.
మొదటి విషయం మాత్రం, నా పరిధిలోనిది కాబట్టి, ఖచ్చితంగా నిజాన్ని రాయగలిగాను.
rayraj
-కానీ ఇష్టం లేని పెళ్ళి చేసినవాళ్ళని విమర్శించటం నా target. ఎవరి జాగ్రత్త వాళ్ళది!
– నేను అనుకోవటం, అప్పటికే ఇలాంటి “వెళ్ళిపోవటాలు” ఎన్నో చూసి, వాళ్ళ సంతోషాన్ని ఊహిస్తూ చేసిన రచన కావచ్చు
ఈ రెండు వాక్యాలు, ఆలోచనలు భలేగా ఉన్నాయి. మొదటిది నిజంగా నిజం. రెండోది – నాకు తెలీదుగానీ, అయ్యుండొచ్చు.
Marthanda
An atheist Tolstoyan introduces about Tolstoy’s peace prophecy while introducing about Tolstoy. He\she has no specific need to bother much about Tolstoy’s views on christianity. Even an atheist who is the fan of Chalam doesn’t bother much about Chalam’s views on Ramana Maharishi. Religion is secondary matter while compared to many issues.
Vijay
వామ్మో. ఇంతకంటే మూర్ఖుడిని నేను ఇప్పటి దాకా చూడలేదు. ఈ వ్యాసంలో అభ్యంతరకరమైన విషయాలు వాకైతే ఏమీ కనిపించలేదు. రంగనాయకమ్మ కి “బ్రాండ్ అంబాసిడర్” గారికి మాత్రమే కనపడుతాయేమో. చలంగారు ఇలాంటి వాటి గురించే కాదు మాస్టారు. భగవాన్ రమణ మహర్షి గురించి కూడా వ్రాసారు. తమరు ఏ రొజు దాని గురించి మాట్లాడినట్టు లేరు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు అన్నీ consider చెయ్యాలి మరి. ఎవరి భావాలు వారికి ఉంటాయి అనే ఇంగిత ఙానం కూడా లేదు తమరి విప్లవ భావ జాలానికి పాపం.
-విజయ్
సింధు
mr. marthanda, as i dont want to waste any space in pustakam anymore, i replied to your mail. you can respond there.
Marthanda
మైత్రేయి గారు వ్రాసినది మళ్ళీ చదవండి. కొన్ని ఘటనలు చూసి కాలం మారిపోయిందనుకోవడం హాస్యాస్పదం. భర్త చనిపోయిన స్త్రీలకి మళ్ళీ పెళ్ళి చేసేవాళ్ళని చూసాను, బలవంతంగా గుండు గియ్యించి తెల్ల చీర కట్టేవాళ్ళని కూడా చూశాను. కొన్ని ఘటనల ఆధారంగా సమాజం ఇలాగే ఉంటుందని అనలేము.
Marthanda
You intended to discourage remarriages of women by writing stories of women killing children. పిల్లలు ఉన్న స్త్రీని పెళ్ళి చేసుకుని ఆమె పిల్లలని పెంచిన వాళ్ళని నా రియల్ లైఫ్ లో చూసాను. మీ ఊరిలో జరిగిన స్టోరీ (real or fabricated) చెప్పి స్త్రీలు రెండవ భర్త/ప్రియుడు కోసం ఆలోచించకూడదు అనడం మీ సంకుచితత్వాన్నే బయట పెడుతుంది.
సింధు
you have to say, in my writings, where did you find me saying chalam advocated to desert childeren. meeku telugu chadavatam kuda problem aite i cant help it. nenu ranganayakamma gari visleshana lo maidanam, sasirekha novels gurinchi cheptoo avida ” okavela pellaina tavata ala vellipoina stree ki pillalu unte, vari badhyata aa streene sveekarinchaali” ani rasinadanni visleshinchanu, adi ee novel ki kooda sambandhinchindi kaabatti. “enno cases lo priyudi pai premato pillalni mattubettinavalla kathalu” nenu chadivaanu, tv llo chusanu. danni gurinche cheptoo, “ranganayakamma garu ichina option correct kadani na abhiprayam” rasanu. dont try to dig anything out of nothing. nenu rayanidanni rasanu antam its not a good comment at all. meeru chadvakapoyina, comment cheyakapoyina evarikee nashtam ledu. sagam sagam chadivi mee pandityam pradarsinchatam bhavyam kadu brothr. its disgusting man. and meeru anavasaram ga arguments chestunnaru. many of the people personally mailed me advising not to respond your comments as they do. so, this wud b my last one. plz share views, dont argue, atleast wid me..
Marthanda
@Sindhu
Chalam didn’t advocate to desert children. Why did you bring such story here? I don’t think that the story of desertion of children did really happen. It might be a fabricated story created by you. No mother on the earth deserts her children voluntarily.
vinay chakravarthi
ame book chadi kaaledu ame tanku alaa anipinchi chesindi…….ippudu manalanti vaallu vuntaaru kada ee book chadivina vaallu…..so ee book valla alochanalaki koncham inka ekkuvagaa support chestundi……
elavundante kushbu premarital sex gurinchi cheppina tarvata ok manchi ammayi chala manchidi first boy friend ki no ani cheppina ammayi tana comments to compramise ayyi mosapovatam naaku telusu.
okati gurtu pettukondi nenu kashtallo vunnanu ani illu vadlali vellipoye magadini and ladies ni evaru goppa anukoru.family kosam tanu kashta padi vallani piki teesukochhe enta mandi ni (especially ladies ni ) ento abhimanistaaro observe cheyandi……..alanti vallu meeku edurayye vuntaaru koncham gurtu techhukondi vaalllu goppa veellu goppa vallu manaki inspiration ga vundali gaani rajesvari gaaru kaadu(evaro annaru tanau manki balam ani)
I AGREE WITH MEHAR
సింధు
I would like to request all the readers to be consious about your language while posting comments, comments should not lead to contraversies. and I request you to read completely to understand and then react if you feel like. I just mentioned the incidents which resemble “maidanam”.. I never mentioned that they are happened out of its inspiration. please dont manipulate the ideas expressed, into your own words.
మైత్రేయి
సింధు గారు,
వ్యక్తిగత విమర్శలు వదిలేసి, అసలు విషయానికి వస్తే, మీరు ఉదహరించిన అమ్మాయి మైదానం చదివి ఇన్స్పిరేషన్ పొంది అలా చెయ్యలేదు. ఆమెను సమాజం నెట్టి వేసిన పరిస్తితుల్లోనించి బయట పడ టానికి అదే మార్గం గా ఆమెకు తోచింది. పిల్లల్ని అనాధలు చేసిన ఈ తప్పు మీరే ఆ వ్యాసం లో చెప్పినట్లు చుట్టూ ఉన్న వాళ్ళదే కాని ఆమెది కాదు.
నేను చెప్పదలుచు కొన్నది కూడా అదే, చలం మైదానం సమాజం లో అలాంటి వారిని చూసి సమర్ధిస్తూ రాసాడు కాని, ఆయన రాసిన తర్వాత మాత్రమే సమాజం లో కొత్తగా అలాంటివి జరగ లేదు.
మీరు ఇచ్చిన ఉదాహరణ చలం కాలం లో కాదు ఇప్పుడు జరిగింది కనుక ఇప్పుడు సమాజం అంతా మారిపోయింది, ఆయన బుక్స్ ఇప్పుడు కాల దోషం పట్టాయి అని దైర్య పడ టానికి లేదు.
ఈ సమస్యకు పరిష్కారం బాలికలను ఇంకా అణిచి పెంచటం కాదు, వారి పట్ల మన దృక్పదం విశాలం అవ్వాలని మాత్రమే ఆయన ఘోషించింది.
venu
Comment Has been deleted by pustakam.net admin.
వ్యాఖ్యల్లో సంయమనం పాటిస్తూ, అమర్యాదకరమైన భాష వాడకుండా ఉండమని పుస్తకం.నెట్ పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
The Road to Proletarian & Women’s Revolution » Blog Archive » చలం గారి పై విషం కక్కిన సింధూర పుష్పం
[…] సమస్యగా చూపించేవాళ్ళు ఉన్నారు. http://pustakam.net/?p=1220 లో సింధు చేసిన వాదన కూడా అలాంటిదే. […]
కె.మహేష్ కుమార్
@సింధు: పాఠకుల్లో సీనియారిటీలు ఉండవు. మీ interpretation కు ఎంత విలువుందో రంగనాయకమ్మ రాసినా అంతే విలువుంటుంది. ఎందుకంటే when you read a work of art, you are making your own meaning out of it. కాబట్టి మీ స్వీయానువాదాన్ని తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు. కేవలం మరో కోణంలో చూసే అవకాశం ఉందని చెప్పడమే నా వ్యాఖ్య లక్ష్యం.
సర్రియల్ కోణం గురించి చెప్పింది నేనే కాబట్టి దానికి కొనసాగింపుగా మీకు కొంత సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
పురుషశక్తికి అమీర్ ప్రతీక: పునరుత్పత్తి పరిధిలో పురుషుడు బీజం. క్షేత్రం లాగా బీజానికి స్థాయిత్వం ఉండదు. మగాడికీ ఒక ఆడదానితో మనసు/శరీరం నిండదు. కాబట్టి అమీర్ మరొక స్త్రీని కాంక్షించడం పెద్ద ఆశ్చర్యమైన విషయం కాదు. రాజేశ్వరి దాన్ని అంగీకరించడం త్యాగమా? దౌర్భల్యమా? ఆత్మవంచనా? కాదు. అత్యున్నతమైన “అంగీకారానికి” చిహ్నం. పురుషశక్తిని సంపుర్ణంగా అర్థం చేసుకున్న స్త్రీశక్తికి ఛాయారూపం రాజేశ్వరి. She has reached an ultimate “womanhood” by doing that.
“ప్రేయసి గర్భవతి అంటే, కోపంతో కాలితో డొక్కలో తన్నటం” ఆ చర్య పైచాచికంగా కనిపించినా అందులో ప్రేమను మరొక జీవితో పంచుకోలేని ప్రేమోన్మాదం కనిపించదా! ఆ వెనువెంఠనే అమీర్ స్పందన మీకు గుర్తుకు రాలేదా? కేవలం ఒక భాగం చూస్తే ఎలా! Man is weakest when it comes to love. ఏంచేయ్యాలో తెలీనప్పుడు ‘కోపం’ వస్తుందంటారు. అమీర్ అలాంటి పరిస్థితిలో ఉన్నాడప్పుడు.
మీరా ‘దీదీ’ అంటూ ప్రేమించడం: ఈడిప్లస్ కాంప్లెక్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? మీ కుటుంబంలో ఎవరైనా ఐదారేళ్ళ మగపిల్లాడున్నాడా?
మగపిల్లలు ఎప్పుడూ తల్లి పట్ల చాలా పొసెసివ్ ప్రవర్తిస్తారు. తండ్రి తల్లి పక్కన చేరడాన్ని సహించలేరు. తల్లి స్పర్శకోసం, ప్రేమకోసం తండ్రితో పోరాడతారు.(మీరు దాన్ని కామించటం, శారీరకంగా లొంగదీసుకోవటం అన్నారు) తండ్రి నుంచీ తల్లిని కాపాడాలనుకుంటాడు. మీరా అలాంటి వాడు. మీరా రాజేశ్వరిలోని మాతృత్వానికి ప్రతీక మీరా. అందుకే “మీరా రాజేశ్వరికి కొడుకు,తమ్ముడు, ప్రేమికుడు, ఆరాధకుడు,రక్షకుడు.” అన్నాను. He is a creature out of the world.
చలాన్నీ చలం రచనల్నీ విమర్శించాల్సిందే. వీలైతే తగలబెట్టెయ్యాల్సిందే. ఆ వెలుగు వేడిలోగానీ మన శరీరాలు ఆత్మలకు స్పందించవు.
సింధు
స్పందనకు ధన్యవాదాలు.
నా అభిప్రాయాలను సవివరంగా ఇక్కడ చదవొచ్చు :
http://sindhuvu.wordpress.com/2009/06/17/122/
Marthanda
చలం గారి సాహిత్యం అసలు చదవకుండానే అతన్ని విమర్శించేవాళ్ళని కూడా చూశాను. అరుంధతి లాంటి నిజం బూతు తెలుగు సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్లు వచ్చాయి. అలాంటి సినిమాలని వదిలేసి చలం గారి సాహిత్యంలో నిజం బూతు ఉందని విమర్శించడం హాస్యాస్పదం.
sai
nenu kuda chalam gari midanam gurunchi entho vini kada viluvalini ekkdiko tesuku vellaru ane matalu vini vini a pustakam koni mari chadavatni try chesanu . entha chadivina a pustakam lo naku goppadanam emi kani pincha ledhu o third rate book laga ani pinchindhi .nenu a pustakannni vadili vesi malli asalu enduku rasada ani malli chadvi chadivi chi chi anu koni finish chesanu
naku a book nacha ledhu
Marthanda
సమాజంలో ఎక్కువ మంది ఏది నమ్మితే అదే నిజం అనుకోవడం prejudice అవుతుందే కానీ మరొకటి కాదు. సింధుకి రంగనాయకమ్మ గారి సాహిత్యం కూడా అర్థమైనట్టు లేదు. రంగనాయకమ్మ గారి సాహిత్యం అర్థమైతే చలం గారి సాహిత్యం అర్థం చేసుకోవడం కష్టం కాదు. భర్త చనిపోయిన తరువాత రెండవ పెళ్ళి చేసుకుని పిల్లలతో కలిసి రెండవ భర్త దగ్గరకి వెళ్ళి సుఖంగా ఉన్న వాళ్ళని నేను చూసాను. మీ ఊరి అమ్మాయి పిల్లలని వదిలేసి ప్రియుడితో లేచిపోయిందని చెప్పి భర్త చనిపోయిన వాళ్ళందరూ అదే పని చేస్తారంటే మీకు చలం గారే కాదు, వీరేశలింగం గారు కూడా అర్థం కారు.
Bhaavana
సింధు ముందు మీరు మైదానాన్ని ఒక ప్రిజుడిస్ అలోచనలతో కాకుండా చదవండి నిజానిజాలను విచారించటానికి సాధ్య పడుతుంది.. మహేష్ అన్నట్లు మైదానం ఎప్పటికి విశాలమవుతూనే వుంటుంది… మార్తాండ గారన్నట్లు చలం ఎప్పుడూ ప్రేమని సమర్ధించారు.. ఇది నాకెప్పుడు అర్ధం కాదు చలాన్ని విమర్శిస్తున్నమనే వాళ్ళందరు ఆయన పలానా పరిస్తితులలలో అలా రాసి వుంటారు కాని ఆ కధ మాత్రం చెత్త… అంటారు? అంటే????? రాజేశ్వరి కి పిల్లలుంటే, మా ఇంటి వెనుకమ్మాయి లా చేసేదా కాదా అనే ఆలోచనతోనో … లేదా మా ఇంటి వెనుకమ్మాయి అలా చేయటం తప్పు కాబట్టి చలం మైదానం తప్పు అని రాసినట్లు వుంది మీ వ్యాసం…
Marthanda
ఆడవాళ్ళలో కూడా స్త్రీవాదాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు. ఈ విషయం చలం గారు “విషాదం” పుస్తకంలో వ్రాసారు. http://viplavatarangam.net/2009/06/16/32
కె.మహేష్ కుమార్
మైదానం విషయంలో చలం కు ఎవరి సమర్ధనా అక్కరలేదు. చలంని defend చెయ్యాల్సిన అవసరమూ లేదు. నా మొదటి వ్యాఖ్య ఉద్దేశం అది ఎంతమాత్రం కాదు. ఎందుకంటే చలం ను మీరి అస్తిత్వాన్ని తెచ్చుకున్న అన్ని రచనల్లాగే మైదానంకు కూడా ఒక అస్తిత్వముంది.నిజానికి ఒక ప్రత్యేకమైన అస్తిత్వముంది.
మైదానం అనైతికం అని గర్హించినా. అద్భుతం అని పొగిడినా. నిజంగా అలా జరుగుతుందా? అని ప్రశ్నించినా. అది నిజం కాదు కల్పన అని వివరించినా మైదానం కొచ్చే నష్టం ఏమాత్రం లేదు.
తరాలు చదివారు. తరాలు విభేధించారు. తరాలు ఆరాధించారు. ఇంకా చదువుతారు. మళ్ళీ అవే చేస్తారు. ఇలా మైదానం విశాలపడుతూనే ఉంటుంది. రాజేశ్వరి సమాజాన్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది.
Marthanda
సింధు రంగనాయకమ్మ గారి వ్యాసం కూడా సరిగా చదవలేదు. “చలం గారు ఒక స్త్రీ – ఒక పురుషుడు కలిసి ఉండాలనే మోనోగమీ కాన్సెప్ట్ నే సమర్థించారు” అని రంగనాయకమ్మ గారు కూడా ఒప్పుకున్నారు. ఓల్గా అనువదించిన “మూడు తరాల రష్యన్ల కథ”ని విమర్శించడం చేతకాదు కానీ చలం గారి మీద అనవసరమైన విమర్శలు చెయ్యడం చేతనయ్యింది.
Marthanda
చలం గారు ఒక స్త్రీ – ఒక పురుషుడు కలిసి ఉండాలనే మోనోగమీ కాన్సెప్ట్ నే సమర్థించారు కానీ విచ్చవిడి తిరుగుళ్ళని సమర్థించలేదు. మన సమాజంలో సెక్స్ గురించి మాట్లాడడం నిషిద్ధమే కానీ భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య రహస్య సంబంధాలు పెట్టుకోవడం నిషిద్ధ పరిస్థితులలో కూడా జరుగుతోంది. చలం గారు స్త్రీ-పురుషల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండాలని కోరుకున్నారు కానీ అక్రమ సంబంధాలనీ, వ్యభిచారాన్నీ ఎన్నడూ సమర్థించలేదు.
ఈ విషయం నేను ఇంతకు ముందు ఒక వ్యాసంలో వ్రాసాను.
ఈ వ్యాసం లింక్: http://viplavatarangam.net/2009/05/27/17
maitreyi
My sympathy to both Chalam’s Rajeswari and your village Rajeswari.
If she gets loving husband and good family like you and me she might not have done that.
http://telugu-chalam-quotes.blogspot.com/2009/06/blog-post.html
Marthanda
గాంధేయవాదం లాంటి వైరాగ్య వేదాంతాలు నమ్మేవాళ్ళ లాగా మాట్లాడుతున్నారు. చలం గారి కాలం నాటికీ, ఇప్పటికీ స్త్రీల పరిస్థితిలో గొప్ప మార్పేమీ రాలేదనే విషయం గుర్తుంచుకోండి. శారద గారి బ్లాగ్ చదివినా ఈ విషయం అర్థమవుతుంది. URL: http://sarada4u.blogspot.com
మెహెర్
బాగుంది.
“మైదానం” నాకూ నచ్చదు. అందులో నైతిక వాతావరణమూ నచ్చదు. రాసిన తీరూ నచ్చదు. అందులో నాకెక్కడా రాజేశ్వరి సొంత గొంతుతో మాట్లాడుతున్నట్టు అనిపించదు. ఆమె చలానికి మౌత్‌పీసులా కనిపిస్తుందంతే.
మీరన్నట్టు ఇది అప్పటి సమాజాన్ని గట్టి దెబ్బ కొట్టడానికి రాసిన నవలే. ఇకపోతే ఇంకా ఫ్రాయిడియన్ ఫ్రాడ్‌ని నమ్ముతూ, దాన్ని చలానికి అన్వయింపజూసే వాళ్ళని పట్టించుకోనక్కర్లేదని నా భావన. పుస్తకాల్లో సింబల్స్ వెతుక్కోవడం ఒక జాడ్యం. ఒకసారి అది పట్టిందంటే, రచయిత నిర్దేశించని సవాలక్ష అర్థం పర్థం లేని సంగతుల్ని పుస్తకంలో చూసుకుంటాడు సదరు పాఠక-రోగి. చలం పుస్తకాల్లో—”ఓ పువ్వు పూసింది” లాంటి ఏవో కొన్ని తప్ప—దాదాపు అన్నీ ఫేస్‌వాల్యూతో తీసుకోవాల్సిన రచనలే. ముఖ్యంగా “మైదానం”.
Sowmya
నేను ప్రయత్నించి పూర్తిగా చదవలేక వదిలేసాను మైదానాన్ని 🙂
ఆ తర్వాత మా అమ్మకి అదే విషయం చెప్తూ ఉంటే, “నేనూ చదవలేకపోయాను” అనడం తో శాంతించాను…హమ్మయ్య! మనలాంటోళ్ళు ఉన్నార్లే అని.
That was a nice post… Keep writing!
కె.మహేష్ కుమార్
ఈ కోణంలోంచీ మైదానాన్ని ఒకసారి చూడండి….
“మైదానం – ఒక సర్రియల్ (surreal ) నవల:
Surrealism was a means of reuniting conscious and unconscious realms of experience so completely, that the world of dream and fantasy would be joined to the everyday rational world in “an absolute reality, a surreality.”
– The Surrealist Manifesto, André Breton,1924
మైదానం నవల్లో ఏది నిజం, ఏది కల్పన, ఏది కల, ఏది ఆలోచన,ఏది అపోహ అనేవి ప్రశ్నార్థకాలు. కానీ, అన్నీ మనకు తెలిసిన లోకంలో జరుగుతున్నట్లుగానే భ్రమింపజేస్తాయి. ఈ కారణంగా కథలో జరుగుతున్న “కాల్పనిక వాస్తవాన్ని” భౌతికనిజంగా పరిగణించి, చలం పంధా బరితెగించిన పంధా అని అప్పటికే నిర్ణయించేసిన చాలా మంది పాఠకులు, ప్రతిస్పందించండం మొదలుపెడతాం. ఒకసారి ప్రతికూల ప్రతిస్పందన మొదలైతే, రసస్పందనకు మిగిలింది అభాసుపాలే.అందుకే,ఈ సాహితీప్రక్రియ మూలాల్ని లేక ఉద్దేశాల్ని గ్రహించకుండా ఈ నవలను సాధించడం అపోహల్ని కలిగిస్తుందేతప్ప ఆర్ధ్రతను కాదు.
ఈ నవల, నాయిక రాజేశ్వరి మానసిక చేతన(conscious),ఉపచేతన(subconscious),అచేతన (unconscious)ల అభివ్యక్తి. రాజేశ్వరి అమీర్ తో నివసించే మైదానం అణచివేయబడ్డ శారీరక,మానసిక వాంఛల ఫలసిద్ధికి సాక్షాత్కరించిన మాయాలోకం . అదొక ప్రతీక.అదొక బలీయమైన కోరిక. అదొక కాల్పనికవాస్తవం.అమీర్, మీరాలు రాజేశ్వరి మనోజనిత కాంక్షలు.
ఒక స్త్రీగా రాజేశ్వరి లోని శారీరక చైతన్యానికి సరిదూగే పురుషశక్తికి అమీర్ ప్రతీకైతే, మీరా స్త్రీలోని మాతృహృదయ పరిపూర్తికి చిహ్నం. స్త్రీలోని మూలభావనలైన (basic instincts) ప్రేమవాంఛ, మాతృకాంక్షల కథ మైదానం.
రాజేశ్వరి-అమీర్ ల కలయిక, సంసారం-దాంపత్యం- నాగరికత మాటున అణవేయబడుతున్న శారీరక చైతన్యాన్ని అందుకోవడానికి, హిపోక్రటిక్ సామాజిక విలువల కూర్పుని కాలదన్ని, కేవలం ప్రాధమిక (rudimentary) కాంక్షల్ని ఆకాంక్షించే విప్లవానికి సంకేతం. మీరా తో రాజేశ్వరి ప్రేమ, తన వంచిత మాతృకాంక్షను ఆవిష్కరించే ప్రయత్నం. మీరా రాజేశ్వరికి కొడుకు,తమ్ముడు, ప్రేమికుడు, ఆరాధకుడు,రక్షకుడు. అమీర్ – మీరా- రాజేశ్వరిల మధ్యజరిగే ప్రేమ-ద్వేషం-మళ్ళీ ప్రేమలను అర్థం చేసుకోవాలంటే ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ ( psychoanalysis ) సహాయం తీసుకోకతప్పదు.
చలం ఇందులో స్త్రీస్వేఛ్ఛని ప్రబోధించలేదు. ఎవర్నీ ఇలా సంసారాలు వదిలి కాల్పనిక మైదానాల కోసం పరిగెత్తమని చెప్పలేదు. అణగదొక్కబడిన స్త్రీత్వం సాక్షిగా, ఒకధీటైన సమాంతర ప్రపంచాన్ని సృష్టించి అందులో ఆ స్త్రీని సంతుష్టురాల్ని చేసే ప్రయత్నం చేసాడు. సంసారాలూ,దాంపత్యాలూ ఇలా ఏడిస్తే, స్త్రీలో జరిగే మానసిక విచ్ఛిన్నతి (fragmented consciousness)ని ఆవిష్కరించి, సమాజానికి ఒక హెచ్చరిక జారీచేసాడు.
ఈ సిద్ధాంతాలనూ, సాహితీప్రక్రియలనూ,ఆలోచనా విధానాలనూ నేపధ్యంగా తీసుకోకుండా మైదానాన్ని చదివి అర్థం చేసుకోవడం కష్టమయితే, అస్వాదించి, అనుభవించడం అసంభవం. చలం రచనల మీదున్న అపోహని ప్రాతిపదికగా తీసుకుని లేక “సామాజిక సృహ” అనే మరొక హిపోక్రటిక్ టూల్ ని ప్రమాణంగా తీసుకుని మైదానాన్ని బేరీజు చెయ్యాలని చూసినా మిగిలేది అనుభవం కాదు అపభ్రంశమైన మానసిక సంతులన.”