చం’చలం’-మైదానం
వ్యాసం రాసి పంపినవారు: సింధు
“అక్కా, చలం ‘మైదానం’ movie గా వచ్చిందా?”
అక్క : లేదనుకుంటా..
నే : సరే.
అక్క : ఐనా ‘మైదానం’ తీస్తే movie మొత్తం censor ఐపోతుంది.
నే : నిజమే..
అమ్మ shock!!
భర్త లేని లోటు, కుటుంబ భారం, ఇలా కారణాలు అనేకం కనిపిస్తాయి. బంధువులు తన ఆచూకీ తెలుసుకుని వచ్చి, “పిల్లల” గురించి నిలదీశారు. “ఇష్టమైతే పెంచండి, లేకపోతే చంపేయండి” అంది.
ఇప్పుడు చెప్పిన రెంటిలో.. అమ్మాయిల తప్పు ఖచ్చితంగా ఉంది. చలం గారి రాజేశ్వరికి సంతానం లేదు, వీళ్ళకి సంతానం ఉంది, అంతే తేడా. రంగనాయకమ్మగారు ” చలం స్త్రీవాదం” లో ” ఒకవేళ అలా వెళ్ళిపోయిన స్త్రీకి పిల్లలు ఉంటే వాళ్ళ బాధ్యత ఆమే తీసుకోవాలి” అన్నారు. భర్త మీద అనాసక్తి వల్లో, ప్రియుడికి ఆకర్షితురాలయ్యో. రాజేశ్వరి అమీర్ తో వెళ్ళిపోయింది, అయినా, తన వల్ల గర్భవతి అయితేనే, అమీర్ తన sadism ప్రదర్శించాడు. అలాంటిది, రాజేశ్వరికే సంతానం ఉండి ఉంటే, అమీర్ దగ్గర వాళ్ళ గతేం కాను?? అయినా, ప్రియుడి కోసం, సంతానాన్ని మట్టుబెడుతున్న వార్తలు ఎన్ని చూడటం లేదు. కాబట్టి అది ప్రమాదకరం.
చలం మైదానంలో ప్రకృతి నచ్చినా కథ, పాత్రలు, ప్రవర్తన, ఎంతమాత్రం నచ్చవు. ఇప్పటిదాకా నేను చెప్పింది అసంభవం కాదు అని మాత్రమే, సమర్థనీయం అని కాదు. అందులోని పాత్రలది వట్టి చపలత్వం, శారీరక సుఖాన్వేషణలా సాగుతుంది కథ. ఆమె అతడిని ఎంత ముద్దు చేసినా, వాడెంత గారాలు పోయినా, అతడు మరో స్త్రీకి ఆకర్షితుడై తన బుద్ధి చూపించుకుంటే, అతనికి సాయపడి ఆమె తన దౌర్బల్యాన్ని ప్రదర్శించింది. “దీదీ” అని పిలుస్తూనే తనని ఆకర్షించిన మీరా కి లొంగిపోయి, తన చపలత్వాన్ని మరోసారి నిరూపించుకుంది.
చచ్చినంత మాత్రాన “అమీర్” acceptable కాదు.
నేరం మీదేసుకున్నంత మాత్రాన “రాజేశ్వరి” అజరామర ప్రేమికా కాదు.
ఐతే, ఇది ఒక ఆవేశంలో, స్పందన లేని భర్తలకి ఊడిగం చేస్తూ బానిసత్వం నెరుపుతూ, పాతివ్రత్యమని మురిసిపోయే సమాజాన్ని గట్టి దెబ్బ కొట్టటానికి చలం చేసిన ప్రయత్నం. నేను అనుకోవటం, అప్పటికే ఇలాంటి “వెళ్ళిపోవటాలు” ఎన్నో చూసి, వాళ్ళ సంతోషాన్ని ఊహిస్తూ చేసిన రచన కావచ్చు. అయితే, కథా గమనం మాత్రం పరమ అస్థవ్యస్థం.
శ్రీకాంత్
http://bhava-nikshipta.blogspot.com/search?updated-max=2009-06-22T17%3A54%3A00%2B05%3A30&max-results=4
Naa samiksha
sindhu
mee abhinandanalaku naa dhanyavaadaalu, vatsayanudi “kamasutra” nenu chadavaledandi, kanee, pustakalaki censor anatame ooha, maximum jaragadu. okavela bhavishyat lo alanti board emaina erpatu ayite, prastutam cinema censoring unnanta adhvanam gane untundi ani naa bhaavana. censoring ante kevalam nirlajja poorvakamaina, vikruta bhasha pooritamaina sex rachanalu ani kadu naa uddesam.. paalakee neellakee teda teliyani teenage vayasu vallani influence chesi vaallapai dushprabhavam choopagaligedi dennaina, edaina jati leda vyavasthanu toolanaade content nu tolaginchatam censoring lo bhagame. mana kharma koddee adi sakramam ga jaragaka, kevalam censor aindi ante, oho boothu content teesesi untaaru ane alochanaki alavatu paddam, leda, alavatu chesaru {censor vaare!!}..
devalayala pai boothubommalenduku ani nenu prasninchaledu.. chalam gaare tappu ani nenu analedu, kaanee maidanam kathaa gamanaanni nirdvandvam ga vimarsinchaanu. naaku sambandhinchinantavaraku, stree purushulu prakriti lo samanam, vaariki samana hakkule untaayi, samaana baadhyatalu kuda untayi.. rajeswari chesina ade pani, mana kalla eduruga oka magavadu cheste appreciate chestama? nenayite cheyanandi.. kabatti, nenu alanti katha gamanaanni vyatirekinchatam jarigindi.
samajam lo manchi tallule leru, maatritvam chanipoyindi ani nenu analedu. nannu kooda oka maatrumoorte kannadi. ala anakundaane annaanu anatam amaanusham. samajam antha ilane undi ani nenu ekkada cheppane ledu. ila kooda jarigindi ani cheppaanu,. indulo generalization ekkadaa ledu.. maidanam ane ooha janita kathanaaniki vaastavamga jarigina sanghatanalakee polika cheppatam lo tappemee ledu.
satyam
చలం ఒక మహోన్నతమైన రచయిత .అంత తేలికగా అర్ధం కాదు ఆయన రచన.నాకు ‘ అరుణ’ అన్నిటికన్నా నచ్చిన పుస్తకం .అందులో ఎన్నో వాక్యాలు కొటేషన్స్ గా వాడవచ్చు .ఒక స్త్రీ జీవితం, ఆమె పురుషులకిచ్చే జాలి లాంటి కరుణ ,మెర్సీ,ఇంకా భూమాత ఈ మానవాళికి ఇచ్చే వరాలు ,వాన,పంటలు ,ఫలాలు,ఇవన్ని కలగలిపి ” అరుణ” ..
మరొక masterpiece “అమీనా”..
నేను ఎన్నిసార్లు చదివానో అన్ని సార్లు ఏడిచిన సందర్భాలు ఉనాయి.
ఇప్పటికి బజారులో బక్కచిక్కిన 10-12 ఏళ్ళ ఆడపిల్ల ల లో ameena కనిపించి కన్నీళ్లు వస్తాయి.
అమీనా లో, సమాజం లో మనకున్న కట్టుబాట్లు ,మధ్య నలిగే జీవితాలు, బీదరికంలో అగచాట్లు, ఆడపిల్లల నిస్సహాయత అన్ని
బాధామాయమయిన ప్రపంచం కన్నీళ్లు పెట్టిస్తాయి .
చలం అభిమానులు అందరు అరుణ,అమీనా తప్పక చదవాలి.
ఉంటాను, మిగతా మరోరోజు.