పుస్తకం
All about booksపుస్తకలోకం

August 3, 2011

అదే “మో” , కానీ …

More articles by »
Written by: అతిథి
Tags: ,

రాసిన వారు: చంద్రలత

****************

“ రేగడి విత్తులు రాశారంటే , సరే.  కానీ , నార్ల వారి నవలికను పూరించే సాహసం ఎలా చేసారు ? ఇది నాకిప్పటికీ అర్ధం కాలేదు.” ఒక నిండైన వ్యక్తి ఆకస్మాత్తుగా ఎదురై , పసిపిల్లాడిలా ఆశ్చర్యంగా అడిగారు.

“అది సాహసమని అప్పుడు తెలియదు కాబట్టే ననుకొంటానండి.” సన్నగా నవ్వుతూ అన్నాను నేను.

“అనుకొన్న దానికన్నా  మీరు చిన్న వారు. మా అమ్మాయి వయస్సుంటుందేమో.  అచ్చం నార్ల గారి వచనంలానే రాశారు. బాగా కుదిరింది.”

ఎలా స్పందించాలో తెలియని ఒక మొహమాటం తో సిగ్గుపడుతూ నిలుచున్నా.

“వారెవరో తెలుసు కదా?  మో  గారు ! “

అదే మొదటిసారి మో గారిని కలవడం.

అదీ తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం కారిడార్ లో.

ఆ వేళ నార్ల వారి సమగ్ర సాహిత్యం ఆవిష్కరించ  బడింది. ఆ వేదిక పైననే , నార్ల వారి పుస్తకాల సెట్ నాకు అందించారు. అలా “మో”  గారు నన్ను గుర్తించారన్నమాట. పలకరించారన్న మాట !

తెలుగు కవిగా, ఆంగ్లోపాధ్యాకుడిగా వారి గురించి ఎన్నో విన్నాన్నేను. సర్రియలిజం తెలుగు నాట పూయించిన ఆయన కలం సౌరభం తెలుసుననే అనుకొనే వాళ్ళలో నేనూ ఒకరిని. విరివిగా వారి కవితల్లోకి ప్రవహించే సుదూర ఉపమానాలపై చెణుకులూ చెవిన బడ్డాయి.

ఆ ఉపమానాలపై  వారిచ్చే  సుధీర్ఘ సవివరణలూ నేనూ చదవ ప్రయత్నించాను.

ప్రపంచసాహిత్యంతో ఆలోచనల్తో వారికున్న సన్నిహిత పరిచయం  అర్ధమయ్యీ అవ్వక మునుపే … మో గారి  మరో కొత్త పుస్తకం  మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ..విస్మయ పరుస్తూనే ఉంది.

అవును కదా …ఒక రచయిత కు ప్రపంచ సాహిత్యంతో దృక్పథాలతో ఎంత అవగాహన ఉండాలి … తెలుసుకోవాలన్న తపన ఎంతుండాలి..తెలుసుకోవడానికి కృషీ ఎంత చేయాలి..అన్న ఒక సత్యం  బోధ పడింది.

ఈనాడు మనలో కలుగుతోన్న అనేక సంశయాలకు సందేహాలకు మునెపెన్నడో .. ఆలోచన సాగింది. ఈ మానవ భావనలకు స్పందనలకు  భాషాసరిహద్దులు లేవు. అందరి ఆలోచనలు అనుభూతులు ఒకటే.  అంతేనేమో ?

అయితే , విపులాచ పృధ్వీ . ఈ అనంత విశ్వంలోని వైవిధ్యాన్ని అర్ధం చేసుకొంటూ ,ఏకత్వాన్ని  అవగాన చేసుకొంటూ జీవిస్తూ పోవడమే.

అబ్బ, నేర్వ వలసిన విషయాలు ఎన్ని ఉన్నాయి కదా!

మో గారి పరిచయం నాటికి వారు ద్రావిడ విశ్వవిద్యాలయంలో అనువాద విభాగానికి డైరక్టర్ గా ఉన్నారు.మహీధర నవల అనువాదం పూర్తయ్యి Oxford వారికి అందచేశారు.నవలానువాదం వారికి ఒక ఒరవడిని ఇచ్చింది. ఆ నేపధ్యంలోనే , రేగడి విత్తులను వారి ఆంగ్లీకరిచేందుకు పూనుకొన్నారు.ఎంత శ్రద్ధగా పట్టుదలగా నియమంగా చేసేవారో.

ఒక చాప్టర్ అవ్వగానే ,DTP చేయించి పంపేవారు. నా స్పందనల కోసం చిన్న పిల్లవాడి లా ఎదురు చూసే వారు.కొన్ని పదాలు, వాక్యాలు అర్ధాల కోసం…ఇద్దరం మాట్లాడుకొంటూ ఉండే వారం. ఎప్పుడైనా. అప్పుడు కూడా అనువాదం గురించి తక్కువ గానూ, రిషీవ్యాలీ పిల్లలతో  వర్క్ షాపుల గురించి , ESOL లో నేర్పే ఇంగ్లీషు పాఠాల బాగోగుల గురించి మాట్లాడుకోవడమే ఎక్కువ.

వారేమో పెద్ద వారు . ఎన్నో తెలిసిన వారు.

అయినప్పటికీ ఆ అనువాదక్రమంలో మూల రచయితగా నాకు ఎంతటి స్వేచ్చను ప్రాధాన్యతను ఇచ్చారో . అదీ ఎంతో సహజం గా.

ప్రతి పదం నాకు నచ్చేలా ఉండాలని వారు శ్రద్ధ తీసుకొన్నారు.ఒక్కో చాప్టర్ పై

నా అభిప్రాయలను పరీక్షాఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థిలా ఎదురుచూసేవారు.. ఆ అవిశ్రాంత అధ్యాపకుడు !

రెండో అధ్యాయం  అనువాదం అయిందో లేదో , వారి ముంజేతి ఫ్రాక్చర్ అయ్యింది. అందులోను కుడి చేయి.

అప్పుడు వారెంతో బాధ పడ్డారు. ఎంత వత్తిడి పడ్డారో.

పరవాలేదు కొన్నాళ్ళాగి చేసుకోవచు లెమ్మన్నా వారూరుకోలేదు. అందులోను. కవిగా వారి అనుభవం..రాయడయం మొదలెట్టాక.. ఆ టెంపో ..కొనసాగాలే కానీ ..ఆగ కూడదు.ఆప కూడదు. మొదలు పెట్టిన వ్యవహరం అర్ధాంతరంగా ఆగిపోతుందేమో నని…వారు ఆందోళన చెందారు.

సమయానికి ,వారి స్నేహితుడు ,ప్రముఖ అనువాదకులు , MV చలపతి రావు గారి “చేదోడు” అంది రావడం అనుకున్న పని పూర్తి చేసేసారు. సెలవలతో పాటు.

అదే మో ,కానీ…

అది ఇంకా అచ్చు కావలసి ఉంది.

వారు నాతో మాట్లాడిన ఆఖరి ఫోను ఆ విషయమే.

ప్రచురణ కర్తల నుంచి కబురేమైనా వచ్చిందా అంటూ.

అదేమీ రాలేదు. ఆ మాటే చెప్పా.

ఇంతలో భరణి గారు తలపెట్టిన “మో”గారి సన్మాన వార్త.

ఆ పై వినకూడని విషాదం.

***

అదేమో కానీ, తరుచు  పొరపాటు పడుతూఉంటాను.

తెలుగు వారికి శరత్ సాహిత్యాన్ని పరిచయం చేసిన,”దేశి కవితా మండలి”  బొందలపాటి శకుంతలా దేవి ,శివరామ కృష్ణ గార్ల ఆబ్బాయే మో గారని. వారు కవి కావడం వల్లేనేమో..అనుకుంటారేమో..  అంతే కాదు.అంతకు మించి, వారింటి అల్లుడు గారే, మో. మో గారి సతీమణి సుజాత గారు బొందలపాటి వారి అమ్మాయి. మో గారు తెలుగు కవిగా, ఆంగ్ల అధ్యపకుడిగా, అనువాదకుడిగా, అనువాదవిభాగపు డైరెక్టరు గా అనేక రకాలుగా తమ ప్రజ్ఞను వ్యక్త పరుచుకోవడంలో సుజాతగారి నిశ్శబ్ద నేపధ్యాన్ని మనం సగౌరవంగా గుర్తించాలి. వారికిది తీరని లోటు.మో గారే తీర్చ గలిగిన లోటు.

మనికిన్ని అక్షరాలిచ్చి ,

సుజాత గారికి ,వారమ్మాయికి ,ఆమె కుటుంబానికి, గుప్పెడు కన్నీళ్ళిచ్చి ,

మౌనంగా ఆసుపత్రి పడకపై ఒదిగిన ..మో ..

తిరిగి తిరుగాడేది ఆ అక్షరాల్లోనే నే”మో !”

***

మహీధర “రథ చక్రాలు” మో ఆంగ్లీకరణతో మన ముందుకు వచ్చే  రోజు దగ్గరలో నే ఉందని భావిస్తూ , ఈ లోగా, వారి అనువాద శైలిని మీరు ఆస్వాదించండి .

మో గారికి గౌరవంతో .

అభిమానం తో.

వారీ అనువాదాన్ని  ఏనాటికీ అచ్చులో చూడలేరు కదా అన్న దుఃఖం తో.

********************************************************

SEEDS  OF  BLACK  SOIL

(A Telugu Novel)

By CHANDRALATA

CHAPTER – 1

“Ah! Poor me, what can I do –

How can I save the crop

With the clouds so dark

With the soil so bubbling –

White millet sown

In black cotton soil…”

Latchumamma had been singing to herself sitting in sunshine, chewing an areca nut alternating it from one cheek to the other of her toothless mouth. At the sight of some people approaching, she had narrowed her eyes and mumbled to her self, “Who could they be…? Supporting her waist with the right hand and holding the left one as a shield to the sunlight, she walked upto them.

“Avva! Is Balaiah mama at home?” one of them said. She sized them up from top to toe in silence. One of the faces seemed to be rather familiar… but who could be the other one…?

Tall and well built , in Khadi dhoti and lalchie, an upper cloth well folded and placed neatly on the right shoulder; short hair cut; and a smile on the face…She became very curious.

What could it be that brought him here? What had he come for at this time of the day into a large house bristling with the young and the old, flourishing with children and cattle?

“No…No. Balaiah is not at home, how would my son be home now? He has gone to the field”. Having said it emphatically, she regretted the blurt, after all.

“Look! Avva!! Isn’t that upper cloth on the pial Balaiah mama’s? Just find out… if he is in, by any chance,” said the first person taking liberty.

“See!  Avva has started chatting with somebody already…!” Balaiah had shown up coming from the terrace. Thus Avva’s trial to hide him thus had been of no avail. He went on with welcoming hands to the second person.

“Come, please sit down. Dastagiri! You come and sit here”. He made them sit on the blanket that was spread over the pial.

Now that there seemed to be no reason to worry, latchumamma had gone back to where she was sitting.

“Let it be, Avva! Won’t you please continue the song?”

Happy that they had liked her song, she picked up

“What can I do –

How can I save the crop

With white millets sown-

In black cotton soil!

Just as they have sprouted,

A monkey came and plucked some.

Angry as I am with the monkey

A squirrel in full speed came and

Plucked some more.

While Ramanatham was bemused, she continued the song more vigorously.

“Angry as I am with this squirrel

A big pig rolling like a ball came and

Plucked some more.”

Meanwhile, Balaiah came from out of the house with a laugh. “Mother! Looks like you won’t let them visit us again.”

“Not at all … The song is fine. We must listen to the full song today. Mother, please go on…” Ramanatham enthused her.

Dastagiri put on a wry face. The old woman’s voice, coming from a toothless mouth was rather hoarse and ear-shattering.

Balaiah had offered them some stuffed sweet meat and savoury in a brass plate. He is a little confused and flurried in his hospitality as Narayanamma his wife was away from the house.

“Eat, children, eat. My daughter-in-law’s savouries are quite tasty” she said in a tone of appreciation.

“You have no teeth to bite and you still say they are crunchy!”  Dastagiri  started teasing her.

“An old woman tastes with the nose, my son” she laughed.

At the request of Ramanatham once more, she started the song in full throated ease. Gigling, she started moving her hands. Her dangling ear rings studded with crocodile heads were dancing as if to some background music.

“Sad as I am with the pig

A cow and a calf came and ate.

Begging or borrowing

I had some cattle

But they all had gone away before

I could clear the loan-

The Karanam and the Munsif

Come for taxes

And beat me up

For not paying.”

Oh, poor me, what can I do

How can I save the crop?”

Everyone laughed at the way she put her hands quite dramatically on her head.

Balaiah added as if in refrain – “That is how agriculture is now-a-days. It’s like grazing the goats in a leafless forest, isn’t it? Sweat and toil wasted on the village officers”.

“Yet, I tell you

Sow white millet

In black cotton soil

And reap

Sixty putties of Jowar”.

Concluding the song, she tittered once more. Dastagiri made fun of her optimism, “Avva! How ingeniously you say”

“Why not bidda! Nadakachiri is born in our Nadigadda only. Goddess of wealth Siri Latchmi enters the house of the one who holds a plough!”

Balaiah, rather vexed with her said, “we will lose track of time if we go on with her like this. Let’s go”.

Taking leave of her, Ramantham promised her to come again and listen to her songs.

(From Regadi vittulu, chapter 1, Translated by Mo.)

 

(మో”నిషాదం” గురించి ఇటీవలే పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం లంకె ఇదిగో. మో ఎవరు? అంటూ అనిల్ అట్లూరి గారు ఇటీవలే జరిగిన మో సన్మాన సభ గురించి రాసిన వ్యాసం ఇక్కడ. విశాలాంధ్ర పత్రికలో వచ్చిన “మో” మరణవార్త ఇక్కడ.)About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.7 Comments


 1. రవిబాబు గారికి,
  నమస్కారం.
  “కొల్లాయిగట్టితేనేమి ?”

  Swarajyam
  Mahidhara Ramamohanarao
  c.384 pages | 215x140mm
  978-0-19-807737-4 | Hardback | March 2012 (estimated)
  Oxford University Press

  పొరపాటును సూచించినందుకు ధన్యవాదాలు.
  సరిచేసాను.
  అలాగే , లింక్ ను కూడా చూడగలరు.

  http://ukcatalogue.oup.com/product/9780198077374.do

  చంద్రలత


 2. ravibabu,kothapalli

  I heard that Mo translated into English Mahidhara’s Kollayi gattiehe yemi? but not Radhachakralu, as mentioned by you. i have to verify.


 3. […] 1) చంద్రలత గారు రాసిన “అదే ‘మో’..కానీ…” […]


 4. momu chandurudu alege velladu e lokanne vadale


 5. ‘మో’ ఒక నిర్లిప్తసంధ్య
  సంధిగ్ధసాయంకాలం
  స్పష్టాతీత స్పష్టం
  అందుకే మాష్టారంటే నాకిష్టం..


 6. Srinivas Nagulapalli

  అక్షరాలతో సాహిత్యసేవ చేసి,
  అవయవాలిచ్చి మానవసేవ అక్షరాలా
  చేస్తూ ఉన్న సాహితీవేత్తకు సహృదయశీలికి నివాళి.
  ======
  విధేయుడు
  -శ్రీనివాస్


 7. మో మరణవార్త చదవగానే బాధగా అనిపించింది.

  జ్ఞానపీఠ్ అవార్డు కు అర్హమైన అతికొద్దిమంది తెలుగు కవులలొ ఒకరిని కొల్పోయాం.

  May his soul rest in peace

  bollojubaba  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
కవి సంధ్య – ‘మో’ కవితా వీక్షణం

కవి సంధ్య – ‘మో’ కవితా వీక్షణం

వేగుంట మోహనప్రసాద్ పేరు మొదట విన్నప్పుడే ఒకింత ఉత్సుకత. మా అమ్మమ్మ వేగుంటవారి ఆడపడు...
by Jampala Chowdary
0

 
 

తనికెళ్ళ భరణి పురస్కార స్వీకార పత్రం : మో

ప్రముఖ కవి స్వర్గీయ “మో” జులై లో తనికెళ్ల భరణి సాహితీ పురస్కారాన్ని అందుకున్న సమ...
by పుస్తకం.నెట్
2

 
 
‘మో’ నిర్నిద్ర నిషాదం

‘మో’ నిర్నిద్ర నిషాదం

రాసిన వారు: నరేష్ నున్నా (ఈ వ్యాసం జులై పదకొండున సాక్షిలో వచ్చిన వ్యాసానికి పూర్తి పా...
by అతిథి
5