పుస్తకం
All about booksపుస్తకభాష

January 5, 2009

The Davinci Code

More articles by »
Written by: అసూర్యంపశ్య
Tags:

“డావిన్సీ కోడ్” – ఇప్పుడు కూడా ఈ పేరు వినగానే మూడు-నాలుగేళ్ళ క్రితంలాగా “ఓహ్! ఆ పుస్తకమా!” అన్న familiarity తో కూడిన ఆసక్తి కలగలసిన అభిమానం ఎంతమందిలో కలుగుతుందో నాకు తెలీదు కానీ, 2004 లో నేను ఇంకా ఇంజినీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు ఈ పుస్తకం ఓ సంచలనం. ఇది చదవలేదు అని ఎవరన్నా అంటే – “ఇది చదవలేదా నువ్వు? ఈ పుస్తకం? నిజం?” అని అనుమానంతో ఎదుటివారు ప్రశ్నిస్తే ఇబ్బందిగా మొహాలు పెట్టిన వారిని చాలా మందిని చూసాను నేను. నా అదృష్టం కొద్దీ ఇది హైదరాబాద్ కాలేజీల్లో అంత వీర పాపులర్ కాక ముందే నేను చదవడంతో ఇలాంటి ప్రశ్నల్నీ, అటు వంటి మొహం పెట్టడాన్నీ తప్పించుకోగలిగాను. ఈ పుస్తకం కథాపరంగా అప్పట్లో చాలా వివాదాస్పదమైంది. కొన్ని చోట్ల దీన్ని నిషేధించారు కూడా. 2006 లో ఈ పుస్తకాన్ని సినిమాగా కూడా తీశారు. సినిమా పుస్తకమంత పేరు తెచ్చుకోలేకపోయింది. అది అంత గొప్పగా కూడా ఏమీ తీయలేదనుకోండి, అది వేరే విషయం. ఈ పుస్తకం ఎంత ప్రాచుర్యం పొందిందంటే – డావిన్సీ కోడ్ వీడియో గేములు, డావిన్సి కోడ్ పజిళ్ళు,  ఇలా ఈ పుస్తకం ఆధారంగా ఓ కొత్త ప్రపంచమే ఆవిష్కరించబడింది వెబ్ దునియా లో.  ఇక ఈ పుస్తకాన్ని విమర్శించే సైట్లూ, సమర్థించేవీ సరేసరి! “Since its debut to glowing reviews, it has sold more than 40 million copies in at least 44 languages” – ఈ వాక్యం తో దీని ప్రాచుర్యం అర్థం చేసుకోవచ్చు.

కథ: ప్యారిస్ లోని ప్రఖ్యాతి చెందిన Louvre మ్యూజియంలోని క్యురేటర్ హత్య చేయబడడంతో కథ మొదలౌతుంది. అతను చివరిసారిగా హార్వర్డ్ ప్రొఫెసర్ రాబర్ట్ లాంగ్డెన్ తో సంభాషించినందుకు పోలీసులు అతన్ని సంప్రదిస్తారు. క్యురేటర్ శరీరం డావిన్సీ చిత్రం –  “Vitruvian man” తరహాలో ఉండి, పక్కనే ఓ రహస్య సందేశం ఏదో రాసి ఉంటుంది. డావిన్సీ చిత్రాలలో దాగిఉన్నట్లుగా భావిస్తున్న రహస్య సందేశాలతోనూ, క్యురేటర్ రాసిన సందేశాన్ని అర్థం చేసుకుని ఆ దిశగా ప్రయాణం సాగిస్తారు – లాంగ్డెన్ మరియు క్యురేటర్ మనవరాలు, పోలీసు అధికారీ అయిన సోఫియా. ఇందులో డావిన్సీ రహస్యాలే కాక, ప్రయరీ ఆఫ్ సయన్ – రహస్య సమాజం కార్యకలాపాలు, మత సంస్థ అయిన ఓపస్ డెయ్ చేసే పనులు, ఎన్నో మిస్టరీలు ఇమిడి ఉంటాయి. కథ అంతా holy grail ఎక్కడుందో కనిపెట్టడం అన్న లక్ష్యంతో ముడిపడి ఉంటుంది కథ చివరిదాకా.

ఈ పుస్తకం కోసం చాలా విస్తృతంగా పరిశోధన చేసి ఉంటారన్న విషయం పుస్తకం చదివిన వారికెవరికన్నా ఇట్టే అర్థమౌతుంది.  పుస్తకం వచ్చిన కొతల్లో రచయిత డాన్ బ్రౌన్ సైటుకూడా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకం తాలూకా చర్చలూ, క్విజ్ లూ – ఇలా ఎక్కడ చూసినా కనిపించేవి. బ్రౌన్ ఈ పుస్తకానికి ముందు Angels and Demons రాసారు. అది దీనికంటే వివాదాస్పదమైనది. వాటికన్ స్వయంగా నిషేధించింది దానినైతే. Dan brown ఇది కాక “Deception point”, “Digital Fortress” అన్న రెండు పుస్తకాలు రచించారు. కానీ, డావిన్సీ కోడ్ అంత సంచనాత్మకమైన సేల్స్ ఈ పుస్తకాలేవీ అందుకోలేదనుకుంటాను. ప్రస్తుతం The Solomon key అన్న పుస్తకం రాస్తున్నారని విన్నాను.

ఈ పుస్తకం గురించి ఆన్లైన్ లో విరివిగా సమాచారం దొరుకుతుంది. ఆసక్తిగలవారి కోసం ఈ సమాచారంలో కొంత మొత్తానికి ఇక్కడినుంచి లంకెలు ఇస్తున్నాను:

* డావిన్సీ కోడ్ ప్రభావం:
1. ఇది మిషనరీలలో సృష్టించిన కలకలానికి నిదర్శనం న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన వ్యాసం: Defenders of Christianity Rebut ‘The Da Vinci Code’
2. ఈ పుస్తకం లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఓపస్ డెయ్ వారి వెబ్సైటులో దీనిపై వ్యాసం : Opus Dei’s response to Davinci code
3. అధికారిక డావిన్సీ కోడ్ వెబ్సైటు
4. చదివిన వారి అభిప్రాయాలు

* ఈ పుస్తకంపై విమర్శలు
1. ఈ పుస్తకంలోని తప్పుల్ని ఎత్తి చూపించే వ్యాసం: How ‘The Da Vinci Code’ Doesn’t Work
2. డావిన్సీ కోడ్ లో చెప్పబడిన విషయాలని బైబిల్ తో పోలుస్తూ రాసిన వ్యాసం : Davinci code : A bibilical response
3. The Davinci code debunked
4. Deciphering the davinci code
5. “The Da Vinci Code” – the hoax behind the code
6. History Vs the Davinci code
7. The Da Vinci Code’s Shaky Foundation: Gnostic Texts by Dr James Hitchcock
8. ఈ పుస్తకంలోని తప్పుల్ని ఎత్తి చూపుతూ రాసిన పుస్తకం: The Davinci Hoax

* సమీక్షలు:
1. న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన సమీక్ష: BOOKS OF THE TIMES; Spinning a Thriller From a Gallery at the Louvre
2. The Dan Brown code
3. The Davinci code: secret hidden truth? by Alex Williams
4.  John Jalsevac అనే విద్యార్థి రాసిన వ్యాసం: The Da Vinci Code: Hoodwinking the World

* Davinci code FAQ:
http://www.markdroberts.com/htmfiles/resources/davincifaq.htm
http://www.cesnur.org/2005/mi_02_03d.htm
http://www.sparknotes.com/lit/davincicode

* Davinci code resources:
డావిన్సీ కోడ్‌కు సంబంధించిన వ్యాసాలను గురించి వివరాలు తెలిపే పేజీ.
అలాంటిదే మరో పేజీ

Flipkart.com :About the Author(s)

అసూర్యంపశ్య18 Comments


 1. ఈ పుస్తకం ఇంతగా ప్రాచుర్యం పొందడానికి గల కారణాలు.
  పుస్తకం ఆద్యంతం సస్పెన్సుతో కూడి వదలకుండా చదివిస్తుంది.
  మనం చిన్నప్పుడు చదువుకున్న బాల నాగమ్మ, చందమామ కథల్లా చిత్ర విచిత్రమైన పజిల్సు, ఏదొ పద్యంలో రహస్యాలు ఇమిడి వుండడం, దానికి తోడు చారిత్రక రహస్యాలు ఆద్యంతం ఉత్కంఠని కలిగిస్తాయి.
  మాగ్డలెన్ మరియ జీసస్ భార్య అయివుండ వచ్చన్న వాదన రచయిత అశ్చర్యం కలిగించే అధారాలు చూపించాడు.
  పుస్తకం మొత్తంలోనూ రచయిత శ్రమ కనిపిస్తుంది.
  అయితే నాకు దీనికన్నా Angels and Demon బాగా నచ్చింది. కానీ ఎందుకో దానికి ఈ పుస్తకానికి వచ్చిన ప్రాచుర్యం రాలేదు.


 2. Sathish

  babu ….
  Please send that electronic link to me … urgent.


 3. […] ఆంగ్ల పుస్తకాల పరిచయాలు (The God Delusion, The Davinci Code, Books Vs Cigarettes, Leaving Microsoft to change the world, Letters of Swami Vivekananda). UK […]


 4. chandramouli

  పైరసీ గురించి..

  పుస్తకాల పైరసీ తప్పేమో గానివ్వండీ…. మ్యూసిక్ పైరసీ,సినిమాల పైరసీకి నేను నావంతు కృషి చేస్తుంటాను… ఎందుకని కోపం తెచ్చుకుంటారేమో….

  మోరల్స్ లేని, అవసరం లేని పరమ చెత్తనంతా జన బాహుళ్యానికి అమ్మే వాళ్ళూ వాళ్ళ్ కు నష్టం వచ్చినప్పుడూ మోరల్స్ గురించి మాట్లాడుతారు… సమాజానికి ఇది అవసరమా అవసరమాలేదా అని లేకుండా…. డబ్బులు వాస్తాయికదా అని… వాళ్ళా లాభంకోసం చేస్తూ కూడా.. నంగనాచుల్లాగా … మాట్లాడటం వాళ్ళకు నష్టమెస్తున్నప్పుడు నీతులు చెప్పడం నచ్చక… నాకు పైరసీ తప్పులేదు…ఎవరి బెనిఫిట్స్ వాడివి …ఎవరి రక్షక భాధ్యలు వాడివి.

  ఇకపోతే ..పీడియప్ లో పుస్తకం చదివితే …. ఆ పుస్తకం ఇవ్వాల్సిన కిక్కు పూర్తిగా ఇవ్వదు…. కాని రిఫేరెస్న్ రీసెర్చ్కోసం అయితే పిడీయప్ కన్నా మంచి సాధనం లేదు …. రీసెర్స్కోసం అయితే…పిడియఫ్ పైరసీదయిన ఫర్వాలేదు….(సమయాభావం కొద్ది) కనుక పుసకాల పైరసీ కూడా ఆమోదయోగ్యమే….

  మీకు ఏ పీడియఫ్ పుస్తకాలు కావాలన్నా…

  http://www.esnips.com లోకి వెళ్ళీ…పుస్తకం పేరు తో సెర్చ్ చేయ్యండి…. అన్ని ఫేమస్ పుస్తకాలు ఉన్నాయి….ప్రస్తుతానికి నాదగ్గర… 2GB పిడియప్ పుస్తక సాహిత్యం ఉంది అంటే అర్ధం చేసుకోండి…. సైటు ఎంత పెద్దదో…


 5. chavakiran

  నాకయితే ఈ పుస్తకం తెగ నచ్చింది.

  తరువాత తరువాత ఎందుకు అంతగనంగ నచ్చిందా అని ఆలోచిస్తే తేలిందేమిటంటే,

  నాకు ఇందులోని కాన్స్పిరసీ థీయరీలు కొత్త, అంతకు ముందు వాటితో డీల్ చేస్ పుస్తకాలు చదవలేదు.

  కానీ తరువాత ఇదే థీయరీలతో , ఇదే ఎండింగులతో వచ్చిన పుస్తకాలు చూశాక వార్నీ అనుకున్నా.


 6. @అసూర్యంపశ్య:

  >> “సినిమా పుస్తకమంత పేరు తెచ్చుకోలేకపోయింది”

  పేరేమో కానీ డబ్బులు మాత్రం దండిగానే తెచ్చుకుంది. ఆ ఏడాది సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాల్లో ఇదొకటి. రెందొందల మిలియన్ డాలర్లకి పైగా వసూలు చేసింది.

  టామ్ హ్యాంక్స్ పోషించిన అతి చెత్త పాత్రల్లో ఈ సినిమాలోని రాబర్ట్ లాంగ్‌డన్ పాత్ర ఒకటి. నటించటానికి ఏమాత్రమూ అవకాశం లేని ఆ పాత్రని ఏడాదికో రెండేళ్లకో ఆచి తూచి ఓ సినిమా చేసే హ్యాంక్స్ ఎందుకు ఒప్పుకున్నాడో నాకస్సలు అర్ధమవలా. 2009 మే నెల్లో ‘ఏంజెల్స్ అండ్ డీమన్స్’ కూడా సినిమాగా విడుదలవబోతుంది. అందులోనూ లాంగ్డన్ పాత్ర టామ్ హ్యాంక్సే వేస్తున్నాడు. ఈసారన్నా అతన్ని సరిగా ఉపయోగించుకుంటారేమో చూడాలి.

  @KumarN

  >> “ప్రైమరీ గా, ఇదో ఫిక్షన్. అందులోనూ POORLY WRITTEN ఫిక్షన్”

  మీరన్నది నూరు శాతం నిజం. చాలా కాలం తర్వాత ఫిక్షన్ సాహిత్యం చదువుదామని కొని చదివితే నన్ను పూర్తిగా నిరాశపరిచిందీ పుస్తకం. ముప్పై పేజీల్లో చెప్పాల్సిన కధని రెండొందల పేజీలకి సాగదీశాడు రచయిత. పైగా, డాన్ బ్రౌన్ చెప్పిన ‘కధకి కీలకమైన’ పాయింట్లు కూడా Holy Blood, Holy Grail నుండి ఎత్తేసినవే. ఇక సినిమా సంగతి సరే సరి. హ్యాంక్స్ కోసం వెళ్లి బుక్కైపోయాను.

  >> “క్రిస్టియన్ కమ్యూనిటీస్ అనవసరంగా దీన్ని పట్టించుకున్నాయి. ఇదో ఫిక్షన్ కథ అని లైట్ తీసుకొని ఇగ్నోర్ చేసుంటే బావుండేది”

  మీకు వింతగా ఉండొచ్చుగానీ, నాకు తెలిసిన కొందరు తెల్ల క్రిస్టియన్ జనులు అందులో రాసిన విషయాలు మొత్తం నిజమే అని నమ్మారు! ఆ రకంగా, డాన్ బ్రౌన్ చాలా మందిని బుట్టలో పడేసినట్లే. బహుశా వాటికన్ దీనిమీద విరుచుకుపడటం ఇందువల్లే కావచ్చు. రాముడికి రెండో పెళ్లామున్నట్లు ఫిక్షన్ కధలు రాస్తే ఇండియాలో ఏమవుద్దో ఓ సారి ఊహించుకోండి.


 7. @All: ఈ-కాపీ ఎంత విరివిగా దొరికినా ఇలా పంచడం సరైన పద్ధతి కాదు కదా. పబ్లిక్ గా పైరసీ కి ప్రచారం చేసినట్లే అవుతుంది అది. మనం పైరేటెడ్ స్టఫ్ వాడుతామా లేదా అన్నది పక్కన పెడితే, ఈ సైటుని అలాంటివి పంచడానికి వేదిక చేసుకుంటే సైటుకి ఇబ్బందేమో.


 8. Naresh

  Please think before you gave the link to any book. I don’t think the PDF version of this book is free. It may be a pirated copy(against copy right). Even if you buy the electronic version, it’s illegal to distribute it. I am saying this because I like this site very much. Some book are available in net without any Copy Rights. You can give links to those books. You can any book PDF version in the net if you don’t care about copy rights.


 9. Sarath

  నేను ఈ పుస్తకమూ చదివాను, స్క్రీన్ ప్లే చదివాను, సినిమానూ చూసాను. పుస్తకం అంతా వదలకుండా చదివాను. స్క్రీన్ ప్లే పుస్తకం అంతగా నచ్చకపోయినా మంచి మంచి బొమ్మలు వున్నాయి కదా అని కష్టపడి అంతా చూసాను. సినిమా పది నిముషాలు చూసాక నచ్చక తీసేవేసాను. పుస్తకం చదవకుండా సినిమా చూస్తే ఎలా వుంటుందో కానీ పుస్తకం చదివాక ఆ సినిమా చూడలేమనుకుంటా.

  ఆ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు తెలిసిన ఒక నటశిక్షణా సంస్థకి స్క్రీన్ ప్లే పుస్తకం ఇచ్చివచ్చాను.


 10. KumarN

  వారినీ, తెలుగు/హిందీ సినిమాలే అనుకున్నా, పుస్తకాలు కూడానా? ఇప్పుడే వింటున్నా, ఎలక్ట్రానిక్ వర్షన్ ఉచితంగా ఉందీ అని..హ్మ్మ్.

  2004 లో నేను క్లయింట్ దగ్గర పని ముగించుకోని, డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ కు వెళ్తూంటే, నా స్నేహితుడు దారి పొడుగునా దీని గురించి వాయించిన వాయింపుడు ఎఫ్ఫెక్ట్ కు, ఫ్లైట్ ఎక్కే ముందే కొనేసానీ పుస్తకం. అప్పుడు చదువుతూంటే, అస్సలు క్రింద పెట్టకుండా చదివించేసిందీ కానీ…

  ప్రైమరీ గా, ఇదో ఫిక్షన్. అందులోనూ POORLY WRITTEN ఫిక్షన్. మనలో ప్రతి ఒక్కరూ ఇంతకన్నా పకడ్భందీగా రాసిన మిస్టరీలని చదివి ఉంటారు. కాకపోతే, జీసస్ క్రైస్ట్, మేరీ మెగ్డలీన్, సీక్రెట్ సోసైటీస్ అంతా కలిపి జనాలకి మత్తెక్కించేసాయి.

  నా ఉద్దేశంలో, క్రిస్టియన్ కమ్యూనిటీస్ అనవసరంగా దీన్ని పట్టించుకున్నాయి. ఇదో ఫిక్షన్ కథ అని లైట్ తీసుకొని ఇగ్నోర్ చేసుంటే బావుండేది అని నేననుకున్నా.

  Kumar N


 11. ధ్రిల్లర్ల లకు ఎప్పుడూ ఆ ఆదరణ ఉంది.తెలుగు లో ఒకప్పుడు క్షుద్ర శక్తులపై వచ్చిన నవలల కాలం లొ రెండోవెవి చదివే వారు కాదు.ప్రస్తుత హారీ పాటర్ సీరీస్ కూడా అదే రకం నవలలు ,అదే ఆదరణ కాదంటారా?


 12. @చావా కిరణ్:రచయితలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి తెలుగు పుస్తకాలవరకూ మీ సలహాను ఆమోదిస్తాను.మార్కెటింగ్ రీత్యా ఇంగ్లీషుకు మినహాయింపు ఉందని మీకు తెలిసీ ఈ సలహాను వర్తింపుచెయ్యడం భావ్యం కాదనుకుంటాను.

  నవతరంగం స్పూర్తితో ఏదో ఆవేశంతో పుస్తకం షేర్ చేసుకునే offer చేసాను. ఈ సైట్ ఇందుకోసం ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నారు కాబట్టి ఇంతటితో…ఇంతే సంగతులూ చిత్తగించవలెను.


 13. chavakiran

  Please do not use this site to share illegal copies of books.

  We want people to buy books and let books / authors Live a better life. OK, atleast this is my opinion.


 14. ఈ పుస్తకం పీడీఎఫ్ నా దగ్గరా ఉంది. రవి.ఇఎన్వీ@జీమెయిలు కి వేగండి…నేనింకా చదవలేదు. ఇంగ్లీషు నవల్లు చదివేంత సీను లేదు కాబట్టి..


 15. ఈ పుస్తకం ఎలక్ట్రానిక్ వర్షన్ నాదగ్గరుంది. కావాలంటే ఎవరికైనా పంపగలను.


 16. ఈ పుస్తకం చదివిన తరువాత ఏ థ్రిల్లర్ పుస్తకాలు కూడా, దీనంత కిక్కు ఇవ్వడం లేదు 🙂
  నిన్నే అనుకున్నా, ఈ పుస్తకం మీద వ్రాద్దామని… అంతలో మీరే వ్రాసేసారు..
  మీ పరిచయం బావుంది…
  మహేష్ గారన్నట్లు, ఆ పుస్తకం లింక్ కూడా ఇస్తే బావుండేది..


 17. ఈ మధ్యకాలంలో ఈ పుస్తకం ఎలక్ట్రానిక్ వర్షన్ విరివిగా దొరుకుతోంది. అదీ పెట్టుంటే ఒక పనైపోయేదిగా!  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
Lost Symbol: Dan Brown

Lost Symbol: Dan Brown

వ్యాసం రాసిపంపినవారు: మలక్‍పేట రౌడీ నేను ముందే చెప్పాను – ఏం చెప్పానంటే “ఇప్పటిదా...
by అతిథి
21