పుస్తకం
All about booksపుస్తకలోకం

October 23, 2010

బెంగళూరు పుస్తకప్రదర్శన, విశాలాంధ్ర వారి పుస్తకశాల

More articles by »
Written by: రవి

గత యేడాదిలాగే ఈసారి బెంగళూరులో పుస్తకప్రదర్శన, పుస్తకాభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రదర్శన నవంబరు 12 నుండీ 21 వరకూ బెంగళూరు పాలస్ గ్రవుండ్స్ లో (గతయేడాది జరిగిన చోటనే) జరుగనుంది.

తెలుగు పుస్తకాలకు సంబంధించి ప్రధానంగా విశాలాంధ్ర (అనంతపురం) వారు తమ స్టాలు నెలకొల్పనున్నారు. ఇది నవకర్ణాటక పుస్తక శాలకు పక్కనే ఉండబోతున్నదని అని తెలియజేశారు. గతయేడాది కొన్ని పుస్తకాలకు అనూహ్యంగా డిమాండు ఏర్పడడంతో – ప్రదర్శన జరిగే రోజుల్లో అనంతపురం నుండీ పుస్తకాలను తరలించారట.

ఈ సారి ఏవైనా ప్రత్యేక విభాగానికి కానీ, ప్రత్యేకంగా ఎవరైనా ప్రముఖ రచయిత(త్రి)కి చెందిన పుస్తకాలను కానీ అభ్యర్థించదలుచుకుంటే – ఈ వ్యాసం క్రింద వ్యాఖ్యగా పెడితే, వాటిని విశాలాంధ్ర పుస్తకశాల మేనేజరు, శ్రీ చెట్ల ఈరన్న గారికి ఈ వ్యాసరచయిత ద్వారా తెలియజేయబడుతుంది.

పుస్తకాల మీద 10% రాయితీ ఉండబోతున్నది. విశాలాంధ్ర వారి కార్డు తీసుకుంటే – విశాలాంధ్ర వారి పుస్తకాలలో 20 శాతం, మిగిలిన పుస్తకాలలో 10 శాతం రాయితీ లభిస్తుంది. కార్డు ఖరీదు 50 రుపాయలు (అనుకుంటాను).

ఈ ప్రదర్శన వివరాలు ఈ క్రింది వెబ్ సైటులో.

http://bbpabangalore.org/events.htmlAbout the Author(s)

రవి11 Comments


 1. చాలా రోజుల తర్వాత పుస్తకం .నెట్ కి వచ్చిన నేను ఏదో కొత్త వీధిలోకి వచ్చి పాత ఇల్లు వెతుక్కున్న వాడిలా ఫీల్ అయ్యేను.

  ఇంతకీ నేను చెప్పదలచుకున్నది ఏమంటే , నిన్న నవంబర్ 18 న బెంగుళూరు లో 2011 బుక్ ఫెస్టివల్ మొదలయ్యింది . నవంబర్ 27 దాకా జరిగే ఈ ఉత్సవాల్లో ఒక ముఖ్య విశేషం ఏమంటే.. తెలుగు వాళ్లకి కడుపు నిదిపోయేటన్ని పుస్తకాలు దొరికేయి. ఈ సారి రోహిణి వారు, విశాలాంధ్ర వారు, హైదరాబాద్ బుక్ షాప్ వారు ఇలా చాల మంది తెలుగు పబ్లిషర్స్ , షాప్స్ వాళ్ళు కూడా వచ్చేరు. డిసెంబర్ లో హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి అనుకుంటున్న నాకు ఇంక పండగే పండగ.!

  1.) పోతన గారి రామాయణం (2 ) మునిమాణిక్యం వారి “నేనూ -కాంతం” (౩ ) సహవాసి – పంచతంత్రం ( 4 ) రోహిణి వారి పెద్ద బాల శిక్ష (5 ) శ్రీ మర్యాద రామన్న తీర్పు కధలు (6 ) రోహిణి వారి భట్టి విక్రమార్క కధలు ( 7 ) ఇంగ్లీష్ నారాయణీయం (8 )శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి “రామాయణం” (9 ) శ్యామప్రియ గారి కంచి పరమాచార్య

  ఇందులో విశేషమైనవి (1 ) పోతన గారి రామాయణం మరియు (2) శ్రీపాద వారి రామాయణం.

  పోతన గారి పేరు చెప్పగానే మనకి గుర్తు వచ్చేది వారి భాగవతం . కానీ పోతన గారి రామాయణం ఏమిటా అనిపిస్తుంది. కానీ బ్రాకెట్ లో శ్రీ మహాభాగవతం నుంచి అని వుంది). చదివేక వివరాలు రాస్తాను.

  అలాగే వడ్లగింజలు లాంటి ఎన్నో గొప్ప కథలు రాసిన శ్రీ పాద వారి “ఆనుభవాలు – జ్ఞాపకాలు ” చదివిన వాళ్లకి ఆయన రచనా పాటిమ , ప్రవాహం తెలిసే వుంటుంది. ఆయన రచనా స్రవంతి లో రామాయణం ఎలా వుంటుందో అర్జెంట్ గా చదివెయ్యాలని వుంది. ఇది కూడా చదివేక వివరాలు రాస్తాను.

  పుస్తకం లో ఈ ఎగ్జిబిషన్ గురించి పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను.

  alaage “Chatu padya mani manjari ” ane pustakam yekkada dorukutundo (Hyd ayina parvaledu), yevari daggaraina vunte ivvagalaremo cheppandi, pleazzzzeee.


  • Chandrahas

   Dr.మూర్తి రేమిళ్ళ గారు చాటుపద్య మంజరి గురించి వాకబు చేశారు. నా దగ్గర దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి సంపాదకత్వంలో వెలువడిన “చాటుపద్య రత్నాకరము” వుంది. దాన్ని 2009లో హైదరాబాదు తెలుగు అకాడమి వారు ప్రచురించారు.


 2. రమణ

  కృతజ్ఞతలు సౌమ్య గారూ..


 3. రమణ

  బెంగళూరు పుస్తక ప్రదర్శనశాలలో విశాలాంధ్ర వారి స్టాలులో నేను పైన రాసిన పుస్తకాలు లేవు రవి గారు. బహుశా అనంతపురం బ్రాంచి వారి దగ్గర ఆ పుస్తకాలు ఉండకపోవచ్చు. ఎవరికైనా ‘వాహినీ బుక్ ట్రస్ట్’ వారి ఫోన్ నంబరు లేదా పుస్తకాలు తెప్పించుకొనే మార్గం తెలిస్తే, వ్యాఖ్య ఇక్కడ రాయగలరు.


 4. రాజా పిడూరి

  కొడవటి గంటి కుటుంబ రావు గారి సినిమా వ్యాసాలు (2 భాగాలు) పుస్తకం పెడిథే బాగుండును


 5. రామ కృష్ణ

  నేను గడిచిన ౭ సంవత్సరాల నుండి ఈ పుస్తక ప్రదర్సన కు వెళ్తూ వున్నాను.

  వేయి పడగలు-విశ్వనాథ సత్యనారాయణ
  విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు-శ్రి విశ్వనాథ సత్యనారాయణ
  యోగ వైశిష్ట్యం

  Thanks for the valuable information.


 6. padma

  illeramma kathalu by soraju susheela,
  illali muchhatlu by puranam sita,
  anbhavalu- jnapakalu by sripada


 7. రమణ

  కృతజ్ఞతలు.

  కాశీభట్ల వేణుగోపాల్ – కధలు, నవలలు.
  విరాట్ – పునుగోటి కృష్ణారెడ్డి


 8. ratna

  jalandhara gari books kosam chustunnanu.


 9. karthik

  కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టివ్ నవలలు పెట్టగలరేమో చూడండి..  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

శతపత్రము – గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ

వ్యాసకర్త: Halley *************** ఈ వ్యాసం గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ “శతపత్రం” గురించి. ...
by అతిథి
0

 
 

Fantastic night and other stories – Stefan Zweig

వ్యాసకర్త: Nagini Kandala ********* Stefan Zweig.. ఈ మధ్యే మొదలైన కొత్త ప్రేమ. అసలీ పుస్తకం కళ్ళపడే వరకూ ఈయన గు...
by అతిథి
0

 
 

Ants among elephants

“Ants Among Elephants: An Untouchable Family And The Making Of Modern India” అన్న పుస్తకం గురించి ఆమధ్య మొదట న్యూయార్క్ టైమ్స్ ...
by అసూర్యంపశ్య
0

 

 

ఆడెనమ్మా! శివుఁడు!!! పాడెనమ్మా! భవుఁడు!!!

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** షుమారు 103 సంవత్సరాల క్ర...
by అతిథి
1

 
 

పథేర్ పాంచాలీ – బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్

వ్యాసకర్త: Sujata Manipatruni పథేర్ పాంచాలీ – బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ (1894-1950) అనువాదం : మద్దిపట్...
by అతిథి
0

 
 

భాష కూడా యుద్ధ క్షేత్రమే

వ్యాసకర్త : ఎ.కె. ప్రభాకర్  కాళోజీ జయంతి సందర్భంగా (తెలంగాణా భాషాదినోత్సవం సెప్టెంబర...
by అతిథి
0