పుస్తకం
All about booksపుస్తకలోకం

January 28, 2012

నడిచే విజ్ఞానసర్వస్వం ఎన్నెస్కే

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

రోజుకు పదిపేజీలు చదవండి…నాలుగు పేజీలు రాయండి. నాలుగు పేరాలు ఉపయోగపడుతుంది…రేపటికి నాలుగు లైన్లైనా నిలబడుతుంది.
-ఇవి యువతను, సాహిత్యకారులను నిత్యం ప్రోత్సహించే వ్యక్తి వాక్కులు. వెన్నుతట్టడమే కాదు, నిజానికి వారే విజ్ఞానగని, నడిచే విజ్ఞాన సర్వస్వం. వారిని చదువగలిగితే నెల్లూరు జిల్లా చరిత్రను సమగ్రంగా ఆకళింపు చేసుకున్నట్లే. ఆయనే నేలనూతల శ్రీకృష్ణమూర్తి. ఎన్నెస్కేగా నాటి జిల్లావాసులకు సుపరిచితులు. చరిత్రకారులుగా చిరస్మరణీయులు. విక్రమసింహపురి మండల సర్వస్వం గ్రంథం నెల్లూరు చరిత్రకు వారి చిరునామాగా నిలిచింది. ప్రముఖ చరిత్రకారులు ఒంగోలు వెంకటరంగయ్య శిష్యరికం చేసారు. సంస్కృత గ్రంథాలు, నాట్యశాస్త్రాలపై ఆరాధనతో పరిశోధనలపై మక్కువ చూపారు. నాట్యశాస్త్రంలో వారికి ఎంత ఆసక్తో అంతే ప్రాధాన్యత ఇస్తారనేదానికి – ’డాన్స్ స్కల్ప్చర్స్ ఇన్ ఆంధ్ర’ అనే ఆంగ్ల గ్రంథం ఒక తార్కాణం. చారిత్రక అంశాలపై ఉన్న ఆసక్తితో న్యాయవాద వృత్తిని వదిలి 1965లో వీఆర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా చేరారు.

1910 ఏప్రిల్ 10వ తేదీన అప్పటి నెల్లూరు జిల్లాలోని అద్దంకి గ్రామంలో ఆయన జన్మించారు. 1927-29 నెల్లూరు వీఆర్ కళాశాలలో ఇంటర్, 1932 చిదంబరంలోని అన్నామలై యూనవర్సిటీలో బీఏ, 1936 లో మద్రాసు న్యాయకళాశాలలో లా పరీక్షలు పూర్తి చేసి పట్టా పొందారు. త్యాగరాజు నాటకాలను, 1948లో కుమార స్వామి జీవితచరిత్ర, 1963లో విక్రమసింహపురి మండల సర్వస్వాన్ని వెలువరించారు. 1970 లో స్పెసస్ అండ్ ఎసెన్స్ ఆఫ్ సి.ఆర్.రెడ్డి గ్రంథానికి సంపాదకులలో ఒకరిగా, 1976లో వ్యాసరచనల సూచి తయారుచేసి సాహితీవేత్తలకు దిక్సూచిగా నిలిచారు. సుప్రసిద్ధమైన తులసీరామాయణాన్ని తెలుగులోనికి అనువదించారు. 1951-52లో ఉత్తర భారతావని పర్యటించి అక్కడివారికి నెల్లూరు సాహితీ సువాసనలను అందించారు.About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు మణిహారం – ఆముద్రిత గ్రంథ చింతామణి

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
7

 
 

27తరాల వెంకటగిరి రాజుల చరిత్ర

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
0

 
 

దువ్వూరు శతకాన్ని నిషేధించిన ఆంగ్లేయులు

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
0

 

 

పెన్నాతీరం – ఈతకోట సుబ్బారావు

ఈపుస్తకం కొన్నాళ్ళ క్రితం ’ఆంధ్రజ్యోతి’ లో వారంవారం ఇదేపేరుతో వచ్చిన వ్యాసాల సంకల...
by సౌమ్య
3

 
 

నూరేళ్ళుగా ఉత్సవాలు – కవిత్రయ జయంతులు

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
1

 
 

బాస్‍వెల్ మాన్యువల్

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
1