Meeting Akella Raghavendra and Yandamoori Veerendranath

రాసిన వారు: ప్రియాంక
*************
ఏప్రిల్ నెల లో ఆకెళ్ళ రాఘవేంద్ర గారు EveningHour మీట్-ది-ఆధర్ ఈవెంట్ కి విచ్చేశారు. ఆకెళ్ళ గారు ఎంతో ఓపిక తో మరియు ఇంకెంతో ఇంట్రెస్ట్ తో తన గురించి చెప్పి, శోభన్ జీవిత చరిత్ర అనే పుస్తకం ఎలా మొదలు పెట్టారు, ఎవరిని కలిసారు, ఎలా వ్రాసారు లాంటి సంగతులతో పాటు, శోభన్ బాబు జీవితం గురించి, ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్పారు. విచ్చేసిన శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ రాముల వారిలో మంచి గుణాల గురించి, మనము రోజు పంతాలకు పట్టింపులకు పోయి ఎలా మనస్సులను పాడుచేసుకుంటాము అని చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పారు.

ఆకెళ్ళ గారు చెప్పిన ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్తాను. రాముల వారు “పూర్వ భాషి” అని అన్నారు. అనగా ఆయనే వెళ్లి ముందుగా పలకరిస్తారు అంట ఎవరిని అయినా. అదే కలి యుగం లో ఎలా చేస్తున్నారు అని ఇలా చెప్పారు. ఒకాయన పెళ్లి కి వెళ్ళారు. అక్కడ ఎన్నో సంవత్సారాలుగా చూడని స్నేహితుడు కనపడుతాడు. ఈయన మనస్సులో అనుకుంటారు “చూడు నా వైపు చూడటం లేదు. చూస్తాను వెళ్ళే లోపుగా పలకరిస్తాడో లేదో అని”, అని అలా రెండు గంటలు కానీ రోజు అంతా కానీ అలా నే ఊరుకుంటాడు ఈ పెద్దమనిషి. చివరగా వెళ్ళిపోతున్నప్పుడు “చూసావా ఎంత పొగరో, ఎలా మారిపోయాడో, ఇంత సేపు అయినా ఒక్క సారి కూడా పలకరించాలి అని అనిపించలేదు” అని మనస్సులో తిట్టుకుని వెళ్ళిపోతాడు!! ఇది ఉదహరిస్తూ రాములవారి గురించి “పూర్వ భాషి” అని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో రాముల వారే వెళ్లి ముందుగా పలకరించేవారట. అవతలి వారు పలకరించలేదు అని అనుకుని మనం ఊరుకునే కంటే మనమే వెళ్లి పలకరించేస్తే సరిపోతుంది. మనకే మనస్సులో హాయిగా ఉంటుంది. ఇలా ఆ సాయంత్రం డబ్బు గురించి, క్షమించటం గురించి, చదవటం గురించి ఇలా ఎన్నెన్నో విషయాల మీద రెండు మూడు గంటలే తర్కించుకున్నాము. ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. అంత చేసి ఇంత సింపుల్ గా ఉండగలమా అని ఎంతో అనిపించింది.

ఇలా ఆ సాయంత్రం గడిపిన తరువాత ఈ సారి మీట్-ది-ఆధర్ ఈవెంట్ కి ఎవరిని రమ్మని అడిగితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నపుడు మా టీం లో అందరు యండమూరి గారి ని అడగండి అని అన్నారు. యండమూరి గారి లాంటి వారిని ఎలా కలవాలి, తెలిసిన వాళ్ళు ఎవరు లేరే అని అంటే తెలిసిన వాళ్ళు చెప్పారు ఆయన అందరితో కలుస్తారు మీరే డైరెక్ట్ గా మాట్లాడండి అని సలహా చెప్పారు. సరే అని గూగుల్ సెర్చ్ చేసి ఆయన వెబ్సైటు పట్టుకుంటే, దాంట్లో ఆయన ఫోన్ నెంబర్, ఈమెయిలు అడ్రస్ మరియు ఇంటి అడ్రస్ కూడా ఉంది. దానితో కొంచెం ధైర్యం తెచ్చుకుని ఫోన్ చేసాను. ఎవరో ఫోన్ ఎత్తుకుంటే సెక్రటరీ ఎవరో అయ్యుంటారు అనుకుని ఎవరండి మాట్లాడేది అని అడిగాను. అవతల నుంచి “వీరేంద్రనాథ్” అని అన్నారు. అంతే. అస్సలు వెంటనే ఏమి మాట్లాడాలో ఒక సెకండ్ అర్ధం కాలేదు. అంత పెద్ద ఆయన ఆయనే ఫోన్ తీస్తారు అని అస్సలు ఊహించలేదు. తేరుకుని వెంటనే ఈవెనింగ్ ఆవర్ గురించి, మీట్-ది-ఆధర్ ఈవెంట్ గురించి చెప్పి మిమ్మల్ని కలవచ్చా అని అడిగాను. “రేపు ఊరు వెళ్తున్నాను, ఇవాళ సాయంత్రం వచ్చేయగలరా, మీకు కుదురుతుందా” అని అడిగారు. ఎగిరి గంతు వేసినంత పని చేసి, తప్పకుండా వస్తాము అని చెప్పి ఆరోజు సాయంత్రం వీరేంద్రనాథ్ గారి ఇంటికి వెళ్ళాము మా నాన్నగారు, నేను.

వీరేంద్రనాథ్ గారు చాలా సేపు మేము చెప్పినది అంతా విన్నారు, తనకి తెలిసిన వారితో మాట్లాడి EveningHour లైబ్రరీ మరియు బుక్ స్టోర్ కి సంభందించి సలహాలు చెప్పారు, కొంతమందితో పరిచయాలు కూడా చేసారు. చివరగా మే అంత బిజీ అని చెప్పి, జూన్ లో తప్పకుండా వచ్చి మీ మెంబెర్స్ ని కలుస్తాను అని చెప్పారు. ఎంతో ఉత్సాహంతో యండమూరి గారికి ఎన్నో ధన్యవాదాలు చెప్పి మేము తిరిగి వచ్చాము.

Special Note to Yandamoori Fans: If you are not an existing member of EveningHour but would still like to meet Yandamoori, contact us for details at 040-65873003 or admin@eveninghour.com

You Might Also Like

One Comment

  1. varaprasaad.k

    చాలా సంతోషం మా మీ అభిమాన యండమూరి గురించి నాలుగు మంచి మాటలు రాసినందుకు, అలానే శోభన్బాబు గురించి మొదలుపెట్టి ఆపేసారు,కనీసం పుస్తకం దొరికే లింక్ ఇవ్వలేదు.సో లింక్ పబ్లిష్ చెయ్యండి,

Leave a Reply