Ignited Minds – Unleashing the Power Within India

రాసిన వారు: శ్రావ్య
**********
ఈ పుస్తకాన్ని అబ్దుల్ కలాం ఒక 12 క్లాస్ చదువుతున్న పాపకి అంకితం ఇస్తున్నట్టుగా ముందు మాట లో చెప్పారు.కలాం గారు ఒకసారి ఒక స్కూల్ లో ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు మాటల మధ్యలో మన శత్రువు ఎవరు అని రాగా, ఆ పాప, మన శత్రువు పేదరికం అని చెప్పిందిట.

తన ఇతర పుస్తకాల్లో రాసినట్టుగానే తన ఆలోచనల పరంపర ఈ బుక్ లో కూడా రాస్తునట్టుగా ముందుమాటలో రాస్తూ ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ గా మారాలి అంటే, ముఖ్యంగా యంగ్ మైండ్స్ ని ఇగ్నైట్ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. అలాగే ఎన్నో చోట్ల పుస్తకంలో ఆయన స్టూడెంట్స్ తో ఆయనకి జరిగిన సంభాషణలు ప్రస్తావించారు. మన దేశం లో ఎంతో మంది తెలివైన వాళ్ళు ఉన్నప్పటికీ ఎన్నో వనరులు ఉన్నప్పటికీ ఎందుకు సవ్యం గా ఉపయోగించుకోలేకపోతున్నాం? ఎన్నో సంవత్సరాల నుంచి భారత దేశాని డెవలపింగ్ కంట్రీ అనే అంటున్నాం కాని డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం? ఎక్కడ మార్పు రావాలి? అనేదాని మీద రాస్తూనే ఇండియా అంటే ఏదో చీప్ లేబర్ ని, ముడిపదార్థాలని వేరే దేశాలకి సప్లయి చేసే దేశం అని కాకుండా, మన ధోరణిని, ముఖ్యం గా మన యంగర్ జెనెరేషన్ లో మార్పు ఎలా తేవాలి అన్నది వివరించారు.

కలాం గారు ఇందులో కొన్ని చోట్ల హిందూ పురాణాల్లో విషయాలు కూడా ఉదాహరణలు ఇచ్చారు. కలలు కంటే సరిపోదు, ఆ కలల్ని ఆలోచనలుగా మార్చుకుని, వాటి కార్యసిద్దికి క్రియారూపం దాల్చాలి తనకి వచ్చిన ఒక కల గురించి, ఆ కల ఆయనకి ఏ పరిస్థితుల్లో వచ్చింది,దాని గురించి ఆలోచించి, దానికి పర్యావసానంగా ఈ బుక్ ఆయన రాయడం గురించి, తన జీవితంలో ఆయన phases అన్నీ Dr.Wayne W.Dyer రాసిన పుస్తకం “Manifest your own destiny” లో phases తో పోలుస్తూ చెప్పారు.తెలిసో తెలీకో చిన్నపటినుంచి ప్రతి ఒక్కళ్ళకి ఒక రోల్ మోడల్ అంటూ ఉంటారు , ముఖ్యం గా తల్లితండ్రులనుంచి ,ఉపాధ్యాయుల నుంచి పిల్లలకి ఇంఫ్లుయన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బాధ్యత మరో సారి ఆయన గుర్తు చేశారు. చిన్న పిల్లలను కలవడానికి ఆయన ఎందుకు ఇష్టపడతారో, వారి నుంచి ఆయనకి కొన్ని సార్లు వచ్చిన ప్రశ్నలకి ఎంత ఆశ్చర్యపోయారో చాలా instances రాశారు.

ఇండియా లో జన్మించిన ఎంతో మంది సైంటిస్ట్స్ గురించి మహానుభావుల గురించి రాస్తూ వాళ్ళ పేర్లని మన సాటిలైట్స్ కి పెట్టడం, కొంత మంది వ్యక్తులతో ఆయన పరిచయం, వాళ్ళతో పని చేసిన ఆయన అనుభవాలు ఎంతో ఆసక్తికరం గా అనిపించాయి. ఇంత మంది మహానుభావులు మరి మన దేశంలోనే కదా పుట్టారు పెరిగారు, మరొక రామానుజన్ ని మరి స్కూళ్ళల్లో ఎందుకు చూడలేకపోతున్నాం అంటూ ఆయన ప్రశ్న మరి ఆలోచింపజేస్తుంది. ఓ రకం గా చెప్పలంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు మన యువత కి ఉన్న resources ఎక్కువే మరి. నేటి యువత కి అసలు నా దృష్టిలో distractions కూడా చాలా ఎక్కువ. ఒకప్పుడు ఉన్న values మరి ఇప్పుడు లేవేమో.దీని గురించి కూడా ఆయన స్పిరిచ్యుల్ గా కూడా చిన్నప్పటి నుంచి మంచి విలువలు పిల్లల్లో కలగచేయాలి అంటూ రాశారు.మరి దీన్లో తల్లితండ్రులకి, ఉపాధ్యాయులకి చాల పెద్ద పాత్ర ఉంది.కనీసం పిల్లలకి పదిహేనేళ్ళ దాక మంచి values వాళ్ళ మనసుల్లో నాటలి అని ఆయన అభిప్రాయం అన్నారు.మన దేశ పెద్ద strength మనకి ఉన్న spiritual wisdom.ఎన్నో attacks కూడా మనం తట్టుకుని నిలబడ్డగలిగాం కాని మొత్తానికి మన లక్ష్యాలని, మన మీద మనకి ఉన్న expectations ని తగ్గించుకోకుండా ప్రయత్నించాలి అంటూ రాసిన ఆయన అభిప్రాయాలు మరి చాల మటుకు నిజమే గా అనిపిస్తాయి.

Patriotism beyond Politics and Religion అనే చాప్టర్ లో ఆయన రాసిన ఈ వాక్యం, “The greatest danger to our sense of unity and our sense of purpose comes from those ideologists who seek to divide the people.” చూడగానే ఎందుకనో ఏవో అనవసరమైన గొడవల్లో తలదూర్చే నేటి స్టూడెంట్సే గుర్తొచ్చారు నాకు.

మొత్తానికి ప్రతి చాప్టర్ ముందరా ఒక సెలబ్రిటీ quote తో మొదలు పెడుతూ బుక్ అంతా కూడా చాల మోటివేటింగ్ గా సరళమైన భాషలో చక్కగా రాశారు అనిపించింది. పుస్తకం ఎవరైన చదివి ఉండకపోతే తప్పకుండా దీన్ని పరిచయం చేయాలి అనుకుంటూ ఇక్కడ కూడా కొద్దిగా రాద్దాం అని ఈ పరిచయం. ఎలా ఐనా కొన్ని పుస్తకాలు మొత్తం తమకి తాముగా చదివి ఆ essence ని feel అవ్వాలి ఏమో అనిపిస్తుంది. ఒక్కోసారి ఎవరైన మనతో మాట్లాడుతున్నప్పుడు, ఎలా ఐతే రియాక్ట్ ఔతామో , కొన్ని బుక్స్ చదువుతుంటే కూడా అలానే అనిపిస్తుంది కదా, అలా , “Yeah, I agree”/ “So true, Can’t agree more” అని నేను అనుకున్నవి చాలా ఉన్నాయి ఈ బుక్ లో చాల మటుకు. ఆయన జీవితం లో సక్సెసెస్, ఆయన ఫెయిల్యూర్స్ నుంచి ఆయన నేర్చుకున్నవి, ఆయన vision for our country, for our younger generation, మన సైంటిస్ట్స్ గురించి ఆయన రాసినవి, మన మిస్సైల్ టెక్నాలజీ ,satellite launching లో మన దేశం సాధించిన విజయాలు, ఆ విజయాల గురించి ఎప్పట్నుంచో vision ఉండి ఆ దిశ గా ఎలా అనుకున్నవి సాధించారో ఆ లీడర్షిప్, ఆ కమిట్మెంట్ గురించి చాల ఇన్స్పైరింగ్ పుస్తకం. పాఠ్యాంశం గా ఈ పుస్తకాన్ని ప్రవేశపెడితే బాగుండు. ఆల్రెడీ ఉందేమో మరి నాకు తెలీదు.

అమేజాన్ లంకె ఇక్కడ.

Buy Ignited Minds: Unleashing The Power Within India from Flipkart.com

You Might Also Like

5 Comments

  1. పుస్తకం » Blog Archive » గడచిన సంవత్సరం, చదివిన పుస్తకాలు, పెరిగిన పరిచయాలు

    […] కొంచెం చదివి వదిలేశాను. Ignited minds గురించి పుస్తకం.నెట్ లో వ్యాసం రావడం నాకు సంతోషం కలిగించింది. నా […]

  2. telugu4kids

    పుస్తకం వారు (అంటే ఇక్కడ రాసే వారు కుడా) నా ఆలోచనలు చదువుతున్నారా ఏంటి?
    ఈ పుస్తకం గురించి ఎవరైనా రాయగలరా అని ఆదుగుదామని తటపటాయించాను.
    ఇంతలోనే ఈ వ్యాసం ప్రత్యక్షం.
    ఈ పుస్తకం ఇప్పుడు చదువుతున్నాను నేను.
    Thank you.
    అలాగే Wings of Fire గురించి కూడా ఎవరైనా రాయగలరా?

  3. సౌమ్య

    ఈపుస్తకం – పదహారు పదిహేడేళ్ళ వయసు వారిలో బాగా స్పూర్తిని రగిలించగలదు. అసలు నా ఉద్దేశ్యంలో అది వారికోసమే రాయబడ్డ పుస్తకం. మందాకిని గారు అన్నట్లు – ఆ వయసువారికి పాఠ్యాంశంగా పెట్టాలేమో… అప్పటికి గానీ చదవరనుకుంటా 😉

  4. మందాకిని

    ఈ పుస్తకం నేనూ చదివానండీ! చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
    తమంత తాముగా ఎన్నుకుని పిల్లలు చదువుతారో, లేదో కానీ ఇంటర్మీడియేట్ స్థాయిలో తప్పనిసరిగా పాఠ్యాంశంగా పెట్టాల్సి ఉంది.

  5. భాస్కర్ రామరాజు

    >>మన శత్రువు పేదరికం
    >>యంగ్ మైండ్స్ ని ఇగ్నైట్ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది
    >>కలలు కంటే సరిపోదు, ఆ కలల్ని ఆలోచనలుగా మార్చుకుని, వాటి కార్యసిద్దికి క్రియారూపం దాల్చాలి
    అత్భుతంగా పరిచయం చేసారు. మా మామయ్య నాకోసారి, ఒక విజేత ఆత్మకధ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ పుస్తకాన్ని, ఎప్పుడైన సమస్యలు వచ్చినప్పుడు, మనసు బాగోలెనప్పుడు, మనసు డస్సిపోయినప్పుడు, జీవితం పరీక్షలకి లోనౌతున్నప్పుడు, ఏ సందర్భంలోనైనా తప్పనిసరిగా చదువుకోరా అని చెప్పాడు. నిజం!! ఎంత స్పూర్తిదాయకంగా ఉందో ఆ పుస్తకం.

    మీ పరిచయం ఈ పుస్తకంపై ఆశక్తిని రేకెత్తించేదిలా ఉంది.

    ధన్యవాదాలు

Leave a Reply