పుస్తకావిష్కరణ : Captive Imagination
వరవరరావు గారు 1988-89లో జైలు నుంచి రాసిన లేఖలు (అప్పుడే ఆంధ్రప్రభలోనూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోనూ వచ్చాయి) 1990లో సహచరులు పేరుతో పుస్తకంగా వచ్చాయి. ఆ పుస్తకాన్ని ఇప్పుడు పెంగ్విన్ – అక్షర బుక్స్ – ఇంగ్లిషులో “కాప్టివ్ ఇమాజినేషన్” పేరుతో పుస్తకంగా తెస్తున్నారు. దానికి నవలా రచయిత గూగీ వా థియోంగో ముందుమాట రాశారు.
ఈ పుస్తకం గురించి కొంత చరిత్ర : వరవరరావు గారు జైల్లో ఉన్నప్పుడు అరుణ్ శౌరీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకుడిగా జైలుకు వచ్చి కలిసి, జైలులో పూల మీద, పక్షుల మీద, ఆకాశంమీద, మనుషుల మీద — అంటే జైలులో సహచరుల మీద – ఒక సిరీస్ రాయమని అడిగారు. వరవరరావుగారు తెలుగులో పదమూడు వ్యాసాలు రాశారు. అవి ఎప్పటికప్పుడు వారం వారం ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చాయి. వాటిని అప్పుడే వసంత కన్నబిరాన్ , ఎంటి ఖాన్, నెల్లుట్ల వేణుగోపాల్, కే.బాలగోపాల్ తదితరులు ఆంగ్లం లోకి అనువాదం చేశారు. ఎక్స్ ప్రెస్ లో పదిహేను రోజులకొకటి చొప్పున వేయడం మొదలు పెట్టారు. కాని ఐదువ్యాసాలు అచ్చు కాగానే వరవరరావు గారు విడుదల కావడంతో అది ఆగిపోయింది. ఆ ఇంగ్లిషు ప్రతి అప్పటి నుంచి ఇద్దరు ముగ్గురు స్వతంత్ర, వ్యక్తిగత పబ్లిషర్లు వేయబోయి, ఆగిపోయి, ఇపుడు విడుదలౌతోంది.
విడుదల తేదీ: ఏప్రిల్ పది, సాయంత్రం ఆరింటికి
స్థలం: ప్రెస్ క్లబ్, హైదరాబాదు
ప్రకటన వివరాలు ఇదిగో:
(ప్రకటనతో పాటు ఈ పుస్తకం వెనుకున్న కథను కూడా తెలిపిన నెల్లుట్ల వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు.)
Buy Captive Imagination : Letters From Prison from Flipkart.com
సౌమ్య
Interesting!