పుస్తకం
All about booksపుస్తకాలు

November 8, 2009

జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య

More articles by »
Written by: అతిథి
Tags:

రాసిన వారు: నెల్లుట్ల వేణుగోపాల్
(ఈ నెలలో అఫ్సర్ గారి నాలుగో కవితా సంకలనం ‘ఊరిచివర’ వెలువడబోతోంది. ఈ పుస్తకానికి ముందుమాటగా వేణుగోపాల్ గారు రాసిన వ్యాసం ఇది. ఈ వ్యాసాన్ని పుస్తకం.నెట్ లో ప్రచురించేందుకు అనుమతించిన అఫ్సర్ గారికి, వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
***************************************************************************
రెండున్నర దశాబ్దాల మిత్రుడు, ఆత్మీయుడు అఫ్సర్ తన కొత్త కవితా సంపుటానికి నాలుగు మాటలు రాయమని అడగడం నాకు అరుదయిన గౌరవమే. అలా అడిగి కొన్ని వారాలు గడిచాయి. నాకు పుస్తకం అందిన నాటినుంచీ చదువుతూ నెమరు వేసుకుంటూ చదువుతూ పొరలుపొరలుగా విచ్చుకుంటున్న అర్థాలను మననం చేసుకుంటూ ఆ అద్భుతానికి ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఒక సందర్భంలో ఇంత సంకీర్ణమయిన కవిత్వానికి నేనేమయినా న్యాయం చేయగలనా అని కూడ అనుకున్నాను. ఈలోగా వంతెనలకింద చాల ప్రకృతి కన్నీరు మాత్రమే కాదు, మనుషుల కన్నీరూ నెత్తురూ కూడ ప్రవహించింది. ఈ ‘గడచిన దినాల తలపోత బరువు’ ఎంత విషాద బీభత్సమైనదంటే ఇక నేనీ మాటలు రాయలేనేమో అనీ అనుకున్నాను. అఫ్సర్ పట్టుబట్టాడు. జ్ఞాపకమూ కవిత్వమూ, కన్నీరూ ఉత్సవమూ, అభిమానమూ ద్వేషమూ, గతమూ వర్తమానమూ కలగలసిన ఈ జీవన రసాయనిక ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఇదీ తగిన సందర్భమే అనిపించింది.

ఆంధ్రజ్యోతి సాహిత్యవేదికలో 1983లో అచ్చయిన కవిత ఒకటి చదివి లోలోపలి నుంచి కదిలిపోయి, ఆ తర్వాత బెజవాడ వెళ్లినప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెతుక్కుంటూ వెళ్లి కవి అఫ్సర్ ను కలుసుకున్నాను. ‘అంతిమస్పర్శ’ అనే ఆ కవిత ప్రతిభావంతుడైన హిందీకవి సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా మరణవార్త విని, ఆయన చనిపోయేటప్పటికి గుండెలమీద తెరిచిన పుస్తకం ఉన్నదని విని రాసినది.

ఆ నాటినుంచీ అఫ్సర్ నూ, అఫ్సర్ కవిత్వాన్నీ చాల సన్నిహితంగానూ, ప్రేమతోనూ, ఒక్కోసారి నిర్మమకారమైన దూరం నుంచీ చూస్తూ వస్తున్నాను. ఆనాడు బందరు రోడ్డు మీద మూడేళ్లు (మూడేళ్ల ఇరవైఒకటి కాదు, నిజంగా పసితనపు మూడేళ్లే) నిండని కవికుమారుడు అఫ్సర్ ఎలా ఉన్నాడో, ఎలా మాట్లాడాడో, ఎలా కవిత్వం రాశాడో ఇరవై ఆరేళ్ళ తర్వాత ఇవాళ కూడ అలాగే ఉన్నాడు. ఆ పసితనంలోనే, పసితనంతోనే ఉన్నాడు. అభివ్యక్తిలో అసాధారణమైన ప్రజ్ఞనూ పరిణతినీ కనబరుస్తూనే వ్యక్తిత్వంలో అమాయకత్వాన్నీ పసితనాన్నీ కాపాడుకుంటున్నాడు. ఈ ఇరవైఆరేళ్లలో నేను తనతో తీవ్రంగా విభేదించిన సందర్భాలూ ఉన్నాయి గాని చెక్కుచెదరని స్నేహబంధం గత జ్ఞాపకంగా మారిపోలేదు. ఎప్పటికీ వెలిసిపోని పాత వర్ణచిత్రంలా తాజాగానే ఉంది.

తెలుగు కవిత్వంలోకి 1980లలో దూసుకొచ్చిన కొత్తతరం కవులలో భాగమైన అఫ్సర్ కు ఆ తరంతో పోలికా ఉంది, కొన్ని అదనపు లక్షణాలూ ఉన్నాయి. చాలమంది 1980ల కవుల్లో ఉన్న నిర్దిష్టత, కొత్త కవితావస్తువుల కోసం నిరంతర అన్వేషణ, పదచిత్రాల అల్లిక మీద, కొత్త అభివ్యక్తి మీద శ్రద్ధ వంటి లక్షణాలతోపాటు అఫ్సర్ సాధించిన మరొక లక్షణం ఉంది. అది కవిత్వానికి తప్పకుండా ఉండవలసిన పొరలు పొరలుగా విచ్చుకునే లక్షణం. అది ఒనగూరాలంటే కవి బహుముఖ, బహుళార్థ బోధక, సంకీర్ణ ప్రతీకలను ఉపయోగించాలి, దృశ్యాలను రూపొందించాలి. పదచిత్రాలను చిత్రిక పట్టాలి. ఒక కవితను చదివిన ప్రతిసారీ పాఠకులకు కొత్తలోతులు స్ఫురణకు వచ్చేలా చెక్కుతూ ఉండాలి. బహుశా ‘శక్తిమంతమయిన ఉద్వేగాల తక్షణ విస్ఫోటనం’లో అది సాధ్యం కాకపోవచ్చు. ‘ప్రశాంతంగా గుర్తుతెచ్చుకున్న ఉద్వేగం’ అన్నప్పుడే అది సాధ్యం కావచ్చు.

ఆ ఇంగ్లీషు సాహిత్యవిమర్శ ఇచ్చిన కవిత్వ నిర్వచనం మాత్రమే కాదు, మన సమాజపు శ్రమజీవుల వేలసంవత్సరాల ఆచరణ కూడ ఆ చిత్రికను నేర్పుతున్నది. ‘చిత్రిక పట్టని/ ఒకే వొక్క గరుకు పదం కోసం చూస్తున్నా’ అనీ ‘అలంకారాలన్నీ వొలుచుకున్న మాటకోసం చూస్తున్నాను’ అనీ అఫ్సర్ అన్నప్పటికీ చిత్రిక మీద, అలంకారం మీద అఫ్సర్ శ్రద్ధ అపారమైనది. ఒకరకంగా చిత్రిక గురించీ, అలంకారం గురించీ తెలియకుండానే, మాటలు చెప్పకుండానే అద్భుతమైన చిత్రికనూ అలంకారాన్నీ సాధించిన ఈ దేశంలోని సహస్రవృత్తుల శ్రమజీవుల ఆచరణ లాంటిదిది. ఈ చిత్రిక పట్టడంలో వచ్చే కొత్త అర్థాలు బైటి ప్రపంచంలోని మార్పులవల్ల కూడ స్ఫురించవచ్చు గాని వస్తువులోనే, కవితానిర్మాణంలోనే అందుకు అవకాశాలు కల్పించడం అసాధారణమైన నేర్పు. సాధన మీద, శిల్ప నిర్మాణం మీద శ్రద్ధ పెట్టడం వల్ల మాత్రమే సాధ్యమయ్యే ప్రక్రియ అది.

ఏ లోహాన్నయినా బంగారంగా మార్చే రసవిద్య ఉన్నదో లేదో, అసలు బంగారానికి అంత విలువ ఇవ్వడం అవసరమో లేదో అనుమానించవచ్చుగాని, ఏ వస్తువునయినా కవిత్వంగా మార్చగలగడం మాత్రం రసవిద్యే. అందులోనూ జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చడం తప్పనిసరిగా రసవిద్యే. ఆ విద్యలో నిష్ణాతుడినయ్యానని అఫ్సర్ ఈ సంపుటంలో నిరూపించుకుంటున్నాడు.

కవిత్వానికి ఎన్నెన్ని నిర్వచనాలున్నాయో, అవన్నీ ఏదో ఒక సందర్భంలో ఎంత నిజమనిపిస్తాయో, ఎంత నిజం కాదనిపిస్తాయో తెలియదుగాని, ఇక్కడ అఫ్సర్ సంకలించిన మూడుపదుల కవితలను మళ్లీ మళ్లీ చదివినకొద్దీ ఇక్కడ జ్ఞాపకమే కవిత్వమయినట్టు కనబడుతోంది. ప్రతి కవితలోనూ, ప్రతి పదచిత్రంలోనూ, ప్రతి అక్షరంలోనూ అఫ్సర్ ఒక జ్ఞాపకాన్ని, తలపోతను ప్రకటిస్తున్నాడు. అది తన వ్యక్తిగత అనుభవపు జ్ఞాపకమే కానక్కరలేదు. తరతరాల సామూహిక జ్ఞాపకం ఐన పురాస్మృతీ కావచ్చు. తక్షణ జ్ఞాపకమూ సుదూర జ్ఞాపకమూ కలగలిసి చేతనలోనో, అంతశ్చేతనలోనో భాగమై కవిత్వంగా పెల్లుబుకుతున్న జ్ఞాపకం కావచ్చు. ఒక్కక్షణం కింద అనుభవంలోకి వచ్చి మెదడు అట్టడుగుపొరల్లోకి జారిపోతున్న ఇంకా తడి ఆరని, ఇంకా పొగలు చల్లారని జ్ఞాపకం కావచ్చు. వేల ఏళ్లకింద తన పూర్వీకులెవరో అనుభవించి, రక్తంలోకీ, ఆలోచనలలోకీ ఇంకి ఇంకా అక్కడ మిగిలిపోయి ప్రవహిస్తూ వస్తున్న ఆత్మవిశ్వాసమో, అవమానభారమో కావచ్చు. ‘వందేళ్లక్రితం కన్నుమూసీ ఆ రాళ్లలోంచి మళ్లీ కళ్లు తెరుచుకుంటున్న’ సూఫీ ముని పాతకాలపు అరబ్బీ పుస్తకం జ్ఞాపకం కావచ్చు. ‘నా చరిత్ర అంతా వొకానొక కలత కల’ అనిపించే విషాద జ్ఞాపకమూ కావచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు ‘ఆ కుండమీద కూర్చోబెట్టి కోసిన’ ఆ తెగిన ముక్క రాల్చిన నెత్తుటి జ్ఞాపకం కావచ్చు. లేదా నిన్నటికి నిన్న తన కాళ్లకింద కదిలిపోయిన కొలరాడో నది మిగిల్చిన తడీ కావచ్చు. ఆ తడి జ్ఞాపకం శరీరానికంటినదీ కావచ్చు, మనసుకంటినదీ కావచ్చు. అది ప్రకృతిదీ కావచ్చు, సమాజానిదీ కావచ్చు. జ్ఞాపకమంటే గతమే కానక్కరలేదు, గతం వర్తమానంలోకీ, వర్తమానం గతంలోకీ అటూ ఇటూ నిరంతరం ప్రవహిస్తున్న చోట, పరిభ్రమిస్తున్న వేళ జ్ఞాపకమే జీవితం. జ్ఞాపకమే కవిత్వం.

 
 


About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.64 Comments


 
 

 1. Arnavam

  I am trying to imagine the essence of the book that was so inspirational for such an amazing review.

  I am feeling bad that i have missed it all these days.

  THanks to Venugopal garu for the review and Afsar garu for such a lovely book. to be simple, i could atleast partly read the book through this review.

  telugulo raayalani vunna rayaleka pothunnandhuku khamistharani aasisthu


 2. desha raju

  rakhi garu kai kai antu chala linkulu itcharu. A nesthaniki andhariki kaada?


 3. అఫ్సర్

  ఆ ముందు మాట గురించీ…. ఆ పుస్తకం గురించీ ఇంకో మాట!

  http://amtaryaanam.blogspot.com/2010/02/blog-post_24.html


 4. Ramana

  అఫ్సర్ “ఊరి చివర” ఇప్పుడు అందుబాటులో వుందని విన్నాను. హైదరాబాద్ కి దూరంగా వున్నాను. చదివిన వారు ఈ పుస్తకం ఎలా వుందో చెప్పగలరా?

  రమణ మూర్తి


 5. ప్రియ నేస్తం!
  నా బ్లాగ్స్ వీక్షించడానికి ఇదే నా ఆహ్వానం!!
  http://www.raki9-4u.blogspot.com. . naa sweeya geethaalakai..(lyrics)
  http://www.rakigita9-4u.blogspot.com naa sweeya naanaalakai…
  http://www.raki-4u. blogspot.com naa sweeya vachana kavithalakai..
  సదా మీ
  స్నేహాభిలాషి
  రాఖీ..


 6. gudipati

  HI Friends,

  Eee charcha lo palgonnanduku andariki Thanks.

  Thanks to everybody.

  afsar poetry book december 10 naatiki market loki vastundi.

  Poetry chadavandi.enjoy cheyandi. then you respond.

  Gudipati
  Palapittabooks@gmail.com


 7. కొత్త సినిమా విడుదలకు ముందు జరిగే వివాదంలా, గలటాల అనిపిస్తుంది అన్ని కామెంట్లు చదువుతుంటే.. అఫ్సర్ గారికి అబినందనలు… కవిత్వం విడుదలకు ముందే మంచి పబ్లిసిటి పొందుతున్నారు…
  చాల సంతోషం.. తెలుగు సాహిత్యం నెట్ లో కూడ ప్రాచుర్యం పొందుతున్నదని… కామెంట్ లు చూసి భావిస్తున్నాను. ఇలాగే సా……………….గాలని.. కొరుకుంటున్నాను.


 8. హెచ్చార్కె

  ఆయ్ బాబోయ్, ఈ బ్లాగ్‍వ్యూహంలో గిలగిల్లాడి నాకు నేను కాకుండా పోయినట్లున్నాను. లేకుంటే, నా కామెంటులో ఏమిటా వచనం. ఒక్కో వాక్యంలో అన్నన్ని కామాలు. ఆపైన, ‘…గనుక’, ‘…పాటు” అంటూ ముగింపులు. ఈ చలిమిడి పిండి వాక్యాలు చదువుకుంటే నాకే భయంకరంగా వుంది. మితృలకెంత తిట్టాలనిపిస్తోందో?! భాష ఒక్కటే కాదు. భా‍వాలు ఆట్టాగే వున్నాయి. ‘జ్ఙాపకాలు-ఖాళీలు’ అంటూ వేణు మాట్లాడింది నాకు నిజంగా అర్థమయిందా? అర్ధమే (సగమే) అయ్యింది. అసలు కాలేదో. తన మాటలు సగం సగం అర్థం చేసుకుని, ‘అనుభవాలు-ఖాళీలు’ అంటూ నసిగాను. ఘరానా నసుగుడు! చదువరులకు ఇది సగం కూడా అర్థమై వుండదు. లేకుంటే, ఇంకేదో అర్థమయ్యుంటుంది. వేణు రాసినవన్నీ నేను చదువలేదని, తన గురించి సమగ్ర అంచనాకు రావడానికి నా చదువు చాలదని నా వుద్దేశం. ఆ మాటే సుబ్బరంగా ఒప్పేసుకోలసింది. సారీ.


 9. Malakpet Rowdy

  Ahhaa! would the 54th comment be mine? :))


 10. kvrn

  కామెంట్ అంటే వ్యాఖ్య లేదా చిన్న వ్యాఖ్యానం. కామెంటు నెట్లొ వుంచిన ముందుమాట గురించీ మాత్రమే, కాని ఆఫ్సర్ గారి రచన గురించి కాదు.
  శ్రీ వేనుగోపాల్ గారి ముందుమాట చాలా చర్చకు వేదిక అయ్యింది.
  వారు యేమి వ్రాయ దలిచారు, యెంతవరకు క్రుతక్రుత్యులయ్యారు.యెంతవరకు వారి భావనలు చదువర్లకు అందించగలిగారు ?

  బొల్లొజూ బాబా గారు ఒక దగ్గిర, వచనం గురించి అన్నారు.

  ఈ వ్యాస హెడ్డింగే అది కనుక వ్యాసకర్త ఈ అంశాన్ని వివరించటానికి చేసిన ప్రయత్నాన్ని గమనించాలి. ఈ ప్రయత్నంలో కొన్ని చోట్ల గందరగోళంగా ఉందన్న విమర్శలో కొంత నిజం లేకపోలేదు.

  వేనుగోపాల్ గారు మరికొంత సరళంగా వ్రాసి వుండవ…. (వ్యాఖ్య అసంపూర్ణం – అడ్మిన్)


 11. హెచ్చార్కె

  గుర్తుందా, వేణూ! సృజనలో ఆ వ్యాసం చదివి, చాల ఇష్టపడి, కొమరయ్య ఎవరో తెలుసుకోవాలనిపించి, పొయి పొయి మిమ్మల్నే అడిగాను, ఆనాడు మీరు సాహితీ మితృలలో వున్నారు గనుక. ‘నేనే, ఆ పేరుతో రాస్తున్న’ అని మీరు అన్నారని నాకు జ్ఙాపకం. నా మాటల్లో ‘వ్యాసాన్ని’ అనే బదులు వ్యాసాల్ని అని దొర్లడానికి ఈ జ్ఙాపకమే కారణం. ఇక ‘రైలుబడి’ అనువాదం మొదట మా అమ్మాయికి, తన ద్వారా నాకు అంది, శాన్నాళ్లు మాకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటిగా వుంది, ‘కళ్యాణ మంజీరాలు’,”ఛెంగిజ్‍ ఖాన్‍’, ‘ఏడు తరాలు’ తో పాటు. అలా నాకు నిర్దిష్టంగా గుర్తొచ్చినవి అదాటుగా పేర్కొన్నానే గాని, అవి మాత్రమే మీ మంచి రచనలని చెప్పడం కాదు. ఇందులో గాని, మరెందులో గాని, జ్ఙాపకం-ఖాళీల సమస్య లేదు. ఉద్దేశపూర్వక ఖాళీల సమస్య అసలే లేదు. గత ‘అనుభవాల్లోని ఖాళీలే’ అప్పుడప్పడిలా ‘జ్ఙాపకం-ఖాళీలు’గా కనిపించవచ్చు. వెంకట్‍ తన ‘పదాల విన్యాసం’తో స్ఫరింపజేయజూసినట్లు, మరో చోట నేను రాసిన వ్యాఖ్య మిమ్మల్ని వుద్దేశించి చేసింది కాదు. అలాంటి వుద్దేశం వుండి వుంటే నేరుగా పేర్కొనే వాడిని. నేను మరీ అంత భయస్థుడిని కాదు. అందులో నేను వుద్దేశించింది ‘జనరల్‍’ పరిస్థిని మాత్రమే.


 12. ఎన్ వేణుగోపాల్

  క్షమించాలి. ఎవరి అభిప్రాయాలు (దురభిప్రాయాలూ అపోహలూ అపార్థాలూ పాతపగలూ కూడ కలిసి) వారి సొంత ఆస్తి అని నా ప్రగాఢ అభిప్రాయం. కనుక ఇక్కడ తమ అభిప్రాయాలు ప్రకటించిన వారెవరితోనూ నాకు పేచీ లేదు. ‘వాస్తవాలు పవిత్రం, అభిప్రాయాలు స్వేచ్ఛాయుతం’ అని ఎవరో పెద్దమనిషి అన్నారని ఇ ఎచ్ కార్ ఎక్కడో రాశారు. ఈ చర్చలో చాల వాస్తవాలు స్వేచ్ఛగా మారిపోయాయి. కాని చిరకాల మిత్రుడు హెచ్చార్కె గారు పేర్కొన్న ఒక అంశంలో వాస్తవమేమిటో చెపుదామని మాత్రం అనిపిస్తోంది. ‘సృజనలో కొమరయ్య గా రాసిన వ్యాసాల్ని, అందులో అందమైన వచనాన్ని ఇష్టపడ్డాను’ అని ఆయన నాగురించి మెచ్చుకోలుగా రాశారు. ధన్యవాదాలు. కాని, కొమరయ్య అనే కలం పేరుతో సృజనలో నేను రాసినది ఒకేఒక్క వ్యాసం. అది అచ్చయినది అక్టోబర్ 1982 సంచికలో. అప్పటికి నేను రాయడం మొదలుపెట్టి ఒకటి రెండు సంవత్సరాలే అయింది గనుక అప్పటికి అందమో, వికారమో అసలు ఒక వచనశైలి ఏర్పడిందనే నేననుకోను. కాని ఇరవై ఏడేళ్లకింది వ్యాసాన్నీ, దానిలో ఆయన ఇష్టపడిన అందమైన వచనాన్నీ గుర్తుంచుకుని ప్రస్తావించినందుకు, ప్రస్తుత ‘పిశాచ నారికేళ పాకం’ మీద తన విసుగు తెలిపినందుకు ధన్యవాదాలు. సాధారణంగా మన మాటలకన్న ఖాళీలకే ఎక్కువ అర్థం ఉంటుందని, జ్ఞాపకాలు కూడ మనం గుర్తుండమన్నట్టే (గుర్తుంచుకోదలచుకున్నట్టే) ఉంటాయని మరొకసారి అర్థం చేయించినందుకు కూడ ధన్యవాదాలు.


 13. బండ్ల మాధవరావు

  హెచార్కె గారి మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నను. ముఖ్యంగా ఇది ముందు మాట అనే విషయం గుర్తుంచుకోవాలి. ముందు మాటకుండే పరిచయాలు, పరిధులు పరిగణనలోకి తీసుకోవాలి. మాటల్లో బుకాయించడం కంటే కవిత్వాన్ని ముందేసుకొని చీల్చి చెండాడితే బాగుంటుందనేది నా అభిప్రాయం.


 14. venkat r

  రమణీ సర్పవరపూ,

  అమ్మా, బాబా ఓపికగా రాసిన పెద్ద కామెంట్ మరో సారి శ్రద్ధగా చదవండి. మంచి వ్యాసం ఎలా వుండాలో తెలుస్తుంది.

  వేణు వచన రచనకి ఇప్పుడు నా యోగ్యతా పత్రం అక్కరలేదు. అతని మిగిలిన రచనలు సంపాదించి చదువుకొండి, మీకు అంత ఆసక్తి వుంటే.

  అవును, మంచి వచన రచయితలు ఇప్పుడు మనకి కొద్ది మందే వున్నారు. అది ముమ్మాటికీ నిజం. ఆ జాబితాలో మీరో, భూషణం గారో లేరు అని ప్రస్తుతానికి చెప్పగలను. మీకు మరీ అంత సరదాగా వుంటే,రంగ నాయకమ్మ, వెల్చేరు, వేలూరి, జయప్రభ, గుడిపాటి,ఆరి సీతరామయ్య లాంటి వారి రచనలు బడి పిల్ల మాదిరి కుశాలగా చదువుకొండి.


 15. Malakpet Rowdy

  కమాన్! మరో ఆరు కామేంట్లు మాత్రమే! ఈ పోస్టు పుస్తకం సైటు లోనే అగ్రస్థానానికి ఎగబ్రాకుతుంది కామెంట్లపరంగా!


 16. హెచ్చార్కె

  వెంకట్‍ గారూ!
  పేరు పెట్టి అడిగారు గనుక చెప్పక తప్పదు. వేణు వచనం నాకు నచ్చ లేదు. కారణం కేవలం ఇంగ్లిష్ పలుకుబడులను తెలుగు చేసి వాడడం ఒక్కటే కాదు. అసలు విషయం… ఆయన వుపయోగించే డొంక తిరుగుడు వాక్యాలు. ఉదాహరణకు, ‘ఆనాడు బందరు రోడ్డు మీద మూడేళ్లు (మూడేళ్ల ఇరవైఒకటి కాదు, నిజంగా పసితనపు మూడేళ్లే) నిండని కవికుమారుడు అఫ్సర్ ఎలా ఉన్నాడో, ఎలా మాట్లాడాడో, ఎలా కవిత్వం రాశాడో ఇరవై ఆరేళ్ళ తర్వాత ఇవాళ కూడ అలాగే ఉన్నాడు. ఆ పసితనంలోనే, పసితనంతోనే ఉన్నాడు.’ వేణునో ఆయనకు దగ్గరగా వుండే మరెవరినో అడగకుండా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోడం సులభం కాదు.
  వేణు వ్యాసంలో నన్ను ఆకట్టుకున్న విశేషలేమీ లేవు గాని విషయ పరంగా పేచీ కూడా లేదు. ఇంతా చేసి ఇది ఒక కవికి ఆయన మితృడు ఆప్యాయంగా రాసి ఇచ్చిన ముందు మాట కావడం వల్ల, వాక్యాల బాగోగులు తూర్పార బడుతూ వ్యాఖ్యానించాలనిపించలేదు. అందుకే, చివరి వరకు ఆ విషయం మాట్లాడకుండా వుంటానికి ప్రయత్నించాను. అలా వుండడం అసాధ్యం చేశారు మీరు.
  ‘వేణు వంటి…..’ అని మీరు వుటంకించిన వాక్యం నాది కాదు. నేను మరొక చోట మరొక సందర్భంలో వాడిన కొన్ని పదాలు మీ వాక్యంలో వున్నాయి. అది నా వాక్యం కాదు. వేణు రాజకీయార్థిక విషయాలపై వ్యాసాలు రాయడం నాకు తెలుసు. ఆయన ఒక జర్నలిస్టు, రచయిత అని కూడా తెలుసు. ఆయన ‘రాజకీయార్థిక నిపుణుడు’ అనే విషయం అనే నాకు తెలియదు. కనుక మీరు నాదిగా వుటంకించిన వాక్యం నాది అయ్యే అవకాశం లేదు. దాన్ని నాదిగా తీసుకోడానికి నిరాకరిస్తున్నాను.
  వేణు వ్యాసంలో వచనం ఏమాత్రం బాగో లేదు. చాల తొందరపాటుగా రాశారని నేను భావిస్తున్నాను. సృజనలో ‘కొమరయ్య’గా రాసిన వ్యాసాల్ని, అందులో అందమైన వచనాన్ని నేను ఇష్టపడ్డాను. ‘రైలుబడి’, మరి కొన్ని అనువాదాలు వేణూ చాల బాగా చేశాడు. ఇప్పుడెందుకీ పిశాచ నారికేళ పాకం? తొందరపాటుగా రాయడమే దీనికి కారణం అనుకుంటున్నాను. ఇప్పటికైనా ముందు మాటను తిరుగ రాయడం అవసరమని నా అభిప్రాయం. మొత్తం మీద వేణు వ్యాసంలో వచనం మీద భూషణ్‍ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆ అభిప్రాయాన్నే ‘వట్టిపోయిన ఆవుల’ వంటి సూటిపోటి మాటలు లేకుండా సూటిగా చెప్పాల్సిందని చెప్పడానికి ప్రయత్నించాను. జ్ఙాపకం- కవిత్వం’ విషయంలో భూషణ్‍ అభిప్రాయాలతో నేను విభేదిస్తాను. రాయబడిన ప్రతి వాక్యం నిమిషం కిందటిదో, ఏడాది కిందటిదో, ఒక యుగం కిందటిదో జ్ఙాపకం మీద ఆధారపడే వుంటుంది. జ్ఙాపకం లోని వివిధ విషయాల్ని కొత్త కొత్తగా విడదీసి, కలిపే రూపంలోనే ఊహలు, కల్పనలు పుడతాయి. జ్ఙాపకంతో పని లేని ఊహలు, కల్పనలు వుండవు. నా జ్ఙాపకంలో మత్స్యం, కన్య వుంటేనే మత్స్యకన్య అనే వూహ నాకు సాధ్యమవుతుంది. సో, విషయ పరంగా నాకు వేణుతో పేదీ లేదు. ఉంటే గింటే భూషణ్‍తోనే.
  నా బాధేమిటో ఇప్పుడ మీకు వివరంగా చెప్పగలిగాననే అనుకుంటున్నాను.


 17. సర్పవరపు రమణి.

  “తెలుగులో మంచి వచనం రాసే అతి కొద్ది మందిలో ఆయన ఒకరు” -వెంకట r
  నాయనా వెంకటా మీ బేతాళ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు మీరు ప్రతిపాదించిన విషయాన్ని నిరూపించ వలసి ఉంటుంది.

  ౧.మీ దృష్టిలో మంచి వచనం అనగా ఏమిటి ? ఆ ఉత్తమ వచన లక్షణాలు తెలపండి.
  ౨.మీరు చెప్పే ఉత్తమ లక్షణాలు వేణుగోపాల్ గారి ముందుమాటలో తప్పక
  ఉండాలి ,విడమర్చి చెప్పండి .
  ౩.వేణుగోపాల్ గారు కాక మంచి వచనం రాసే అతికొద్దిమంది ఎవరో చెబితే మేము
  పోల్చుకొని చదివి ఆనందిస్తాము.


 18. Malakpet Rowdy

  ఏమీ లేదు వెంకట్ గారూ,

  మొదటి వాక్యం “మంచి వ్యాసాన్ని చదవడానికి శ్రమించడంలో అర్థం ఉంది” అన్న వాక్యంలో నా కోడి బుర్రకి అర్ధమయ్యింది – “మంచి వ్యాసాలు కానివాటిని చదవడంలో అర్ధంలేదు” అని. మరి ఒక మూల “మంచి వ్యాసం కాదు – పరమ చెత్త” అంటునే దానిని ఒకటికి పది సార్లు చదవడమెందుకో అర్ధం కాలేదు. ఒకవేళ చెత్త వ్యాసాలని పదే పదే చదవడంలో కూడా అర్ధం ఉంది అంటే మరి మొదటి స్టెట్‌మెంట్ ఎందుకో అర్ధం కావట్లేదు. May be I’ll have to improve my IQ multifold to understand these critics!


 19. venkat r

  ఈ సాహిత్య చర్చలో కొందరు బెత్తాలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారో, కొందరు ఆ బెత్తం మాస్టారులకి విధేయులుగా ఎందుకు వుంటున్నారో తెలియదు.

  మమతగారూ, మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారండీ! ఆరు నెలల పాపాయికి సాహిత్య విమర్స పుస్తకాలు చదివి వినిపించారా? పాపం, ఆ పాప!

  భూషణం మాస్టారూ, మీరు ఇచ్చినట్టి లింకులతో మీ వ్యాసాలు చదివాను. మీ మాటే నెగ్గాలని, కవిత్వం గురించి మీరు చెప్పిందే వేదం ఎందుకు కావాలి?

  హెచ్చార్కె గారు ఇంతకూ మీ బాధ ఏమిటి? మీ మనసులో ఏముందో చెప్పరాదా? వేణు లాంటి రాజకీయ ఆర్ధిక నిపుణుల లంబా చౌడా కవిత్వ వ్యాసాలు మీకు నచ్చినట్టా? లేదా?

  అమ్మా, రమణీ సర్పవరపు గారూ, మీ బెత్తాలకు ఎవరు దారికి రావాలి? ఎందుకు రావాలి?

  రౌడీ గారూ: మీ ఒంగోలు గిత్త రెవ్యూ బెదిరింపు…ఆవులతోనే చస్తున్నాం, మళ్ళీ ఈ గిత్తల గొడవేమిటి? మీ పారడాక్స్ థియరీ కొంచెం తేట గా చెప్పండి.


 20. సర్పవరపు రమణి.

  మరి బెత్తం ఉపయోగించినా దారికి రాని వారి సంగతి ఆలోచించినట్టులేరు!
  వారికి పాత కమ్యూనిస్టుల బెత్తందారి సరిపోక పోవచ్చని నా అభిప్రాయం.

  సర్పవరపు రమణి.


 21. హెచ్చార్కె

  ‘ఇంత కన్నా తెలుసుకోవల్సింది ఏమీ లేదు, చెప్పవల్సింది కూడా ఏమీ లేదు.’ బహుశా ఇది కీలక వాక్యం.
  సరే, పవన్, మీరు మీ ‘బెత్తందారీ’ పద్ధతినే కొనసాగించండి. ఆల్ ది బ బెస్ట్.


 22. Malakpet Rowdy

  “మంచి వ్యాసాన్ని చదవడానికి శ్రమించడంలో అర్థం ఉంది”

  Hmmm, okiez!

  “ఒక వ్యాసం బాగోగులు చర్చిస్తున్నామంటే దాన్ని ఒకటికి పది సార్లు చదివామనే అర్థం”

  So, it has been read 10 times even though it’s “supposed to be bad!”

  Am I the only one seeing a Paradox here?

  Newayz itz nice to see these mafia elements, oops! sorry, self proclaimed literary critics, of course excessively elated with their own so called achievements!


 23. గరికపాటి పవన్ కుమార్

  అయినా, భూషణ్‍ మాటలు అన్నిటితో ఏకీభవిస్తున్నానని నేను అనలేదు. నిజానికి ఆ విషయాల మీద జరగాల్సిన చర్చ జరక్కుండా పోయింది. కారణం వాక్‍‍-పారుష్యమే
  -హెచ్చార్కె
  ———————————

  నిండు మనంబు నవ్య నవనీత సమంబు
  పల్కు దారుణ శస్త్ర ఖండనా తుల్యంబు

  ఇది నన్నయ్య శలవిచ్చిన పండిత లక్షణం, పండితుడి/విమర్శకుడి మనసు వెన్న ముద్దైనా పలుకు వజ్రాయుధమే. వజ్రాయుధం లోని కాఠిన్యం చూసి బెదెరే వారు హృదయాన్ని అర్థం చేసుకోలేరు. ఇదొక విరోధాభాస (paradox) దీనికి వ్యతిరేకంగా నన్నయ్య చెప్పినట్టు పలుకు మృదువుగా ఉన్నా హృదయం బండరాయి. జీవితం నిండా విరోధాభాసలే అని అనుభవజ్ఞులకి చెప్పవల్సిన పని లేదు. విషయైక దృష్టి(objective perspective) లేనివాడు సత్యార్ధి కాలేడు. విసుర్లనే నెమరు వేస్తూ కాలం గడుపుతాడు. Truth is beauty, beauty is Truth (సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం)అన్న కీట్స్ వాణి తలకెక్కదు.

  ఇంత కన్నా తెలుసుకోవల్సింది ఏమీ లేదు, చెప్పవల్సింది కూడా ఏమీ లేదు.

  సర్వేజనా సుఖినో భవన్‌తు.

  గరికపాటి పవన్ కుమార్


 24. mamatha

  I couldn’t read Venu’s article properly and could not understand the essence of some sentences. It would have made a huge difference if the sentences were simpler.. A person like me who is hanging between two worlds of ‘Telugu’ and ‘English’, and hungrily stealing few minutes (from a busy world of running a home, a project and taking care of an infant) to catch up with Telugu literature, it is very had to digest such articles just because of complexity in sentences.. it could get really frustrating when the topic of the article is as attractive/interesting as this one.

  By the way.. When I was a kid, one of my teachers scolded me harshly when I did something wrong.. I only remember her meanness, her harsh voice.. but I don’t remember what she was telling me to correct.. korada jhulipisthe.. aa julipinchadame gurtuntundi kaani, maata gurtundadu. At any rate, I read and liked Bhooshan’s book(I read it to my 6 month old daughter and she enjoyed it. With her bright eyes she kept staring into my eyes and the book while I read an entire article to her).. Memories of reading that book will stay with me forever not only because of my daughter but because I was/am inspired by the book.. but I don’t think it made so much difference in Telugu literature, not at least as much as you are portraying.. I think it would have made more difference if the words used were a little less blunt.. Even in this series, I am amazed at Bhushan’s guts and I do understand and agree with what he is saying.. but if I were the writer of the article, his words wouldn’t have reached me .. I would only be upset with him or with his bluntness.

  Sorry for writing my opinion in English(however bad it is), I grabbed few minutes of downtime to write this and didn’t have time to install telugu fonts.. may be next time!!


 25. హెచ్చార్కె

  పవన్, కటువుగా చెప్పడం వేరు, సూటిగా చెప్పడం వేరు. సూటిగా చెబితే అర్థం కానిది కటువుగా చెప్పినా అర్థం కాదు. కాఠిన్యం వల్ల సూటితనం తగ్గి పోతుంది. దృష్టి విషయం మీది నుంచి కాఠిన్యం మీదికి, విసుర్ల మీదికి పోతుంది. విమర్శలో విషయ బలం వున్నా వ్యర్థమవుతుందని అందుకే అన్నాను.
  ‘బుద్ధి చెప్పువాడు…’ అనే వేమన మాటను సాధారణంగా… బెత్తం వుయోగించే టీచర్లకు, పిల్లలను కొట్టి ‘బుద్ధి’ మాటలు చెప్పే తలిదండ్రులకు… సమర్థనగా వాడుతుంటారు. మా అయ్యవారు బెత్తం వుపయోగించినంత కాలం నాకు చదువు రాలేదు. మా నాన్న చర్నాకోల వుపయోగించినంత కాలం లోక రీతులు అర్థం కాలేదు.’మొద్దు’, ‘తిక్కోడు’ అనిపించుకున్నాను. బెత్తం, చర్నాకోల కనుమరుగయ్యాకే ఏ కొంచెమైనా చదువుకున్నాను, అర్థం చేసుకున్నాను. ‘బెత్తం, చర్నాకోలల బహిష్కరణ ఉద్యమానికి’ మీ మద్దతు వుంటుందనుకుంటాను :).
  అయినా, భూషణ్‍ మాటలు అన్నిటితో ఏకీభవిస్తున్నానని నేను అనలేదు. నిజానికి ఆ విషయాల మీద జరగాల్సిన చర్చ జరక్కుండా పోయింది. కారణం వాక్‍‍-పారుష్యమే.


 26. usha

  naaku oka chinna sandedham
  pina vunna garikapaki pavan kumar garu ante GVR projects.. executive director gare naa.


 27. Malakpet Rowdy

  అందరిమీదా రాళ్ళేసేవాళ్ళేకే ‘కుండ బద్దలు కొట్టే’ లెవెలుంటే మరి రౌడీలకి కనీసం బుర్ర బద్దలకొట్టే లెవెలయినా ఉండాలికదా :))


 
   Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0