పుస్తకం
All about booksపుస్తకభాష

August 24, 2017

Reservoir 13 – Jon McGregor

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: Nagini Kandala
************
Jon McGregor రచనల గురించి గార్డియన్ పత్రికలో వచ్చిన కథనాల వల్ల దాదాపు రెండేళ్లుగా ‘To read’ లిస్టులో ఉంచిన రచయిత. ఇటీవల మాన్ బుకర్ లాంగ్ లిస్ట్ లో ఈయన పుస్తకం ఉండడంతో మళ్ళీ ఇంతకాలానికి గుర్తొచ్చి చదవడం జరిగింది.

న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోడానికి ఇంగ్లాండు లోని Gladstone అనే గ్రామానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఒక పదమూడేళ్ల అమ్మాయి రెబెక్కా షా అదృశ్యమవుతుంది. ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్న గ్రామస్థులు, పోలీస్ వారు, మౌంటైన్ రెస్క్యూ టీంలు అని ఒక సస్పెన్స్ తో నవల మొదలవుతుంది. ఈ మిస్టరీ మధ్య ఆ లోయలోని కమ్యూనిటీని మనకు పరిచయం చేస్తారు రచయిత. ముందుగా ఆ గ్రామానికి చెందిన Jackson’s boys గురించి, తరువాత తప్పిపోయిన అమ్మాయి కుటుంబం బస చేసిన హంటర్ ప్లేస్ గురించి, ఆ తరువాత ఆ కమ్యూనిటీలో స్కూల్ ప్రిన్సిపాల్ Mrs Simpson గురించి, స్కూల్ పిల్లలు Liam, James ,Deepak, Sophie and Lynsey గురించీ ఇలా ఒక్కొక్కరిగా ఆ గ్రామస్థులను మనకు పరిచయం చెయ్యడం మొదలు పెడతారు. నేను అగాధా క్రిస్టీ ‘And then there were none’ తొలి వాక్యాలను తలుచుకుంటూ సహజంగానే అవి ప్రధాన పాత్రలేమో అనుకుని ఆ పేర్లు, రచయిత చెప్తున్న వివరాలను మెల్లిగా మెదడులో రిజిస్టర్ చేసుకోవడం మొదలుపెట్టాను. దోషి ఎవరో రచయిత చెప్పేలోపే ముందే తెలుసుకుని నా ఇంటలిజెన్స్ ని నిరూపించుకోవాలని పెద్ద డిటెక్టివ్ లా ఆ స్థలాలను, నోట్ చేసుకుంటూ చదవడం మొదలుపెట్టాను.

అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. పాఠకులు కథలోని ఒక పాత్రకి హలో చెప్పేలోపు మరో పాత్ర తెరమీదకి వచ్చేస్తుంది. ఒక పాత్రతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాం అనుకునే లోపు మరో పాత్ర మధ్యలో వచ్చి చెయ్యి పట్టుకుని లాక్కెళ్లిపోతుంది. అలా ఆ కమ్యూనిటీ అంతా కేవలం మనకు పరిచయస్థులుగానే మిగిలిపోతారు. అలా ఆ కమ్యూనిటీలో సుమారు ఒక వందమందుంటే ఆ మంద మంది పేర్లు ఇందులో రచయిత చాలా ఓపిగ్గా ప్రస్తావించారు. అయితే పేర్లు, ముఖాలూ అస్సలు గుర్తుండని నాలాంటి వాళ్లకి పుస్తకం సగానికి వచ్చేసరికి అసలీయన ఎవరి గురించి చెప్తున్నారు అని బుర్రగోక్కోవడం మాత్రం తప్పదు.

సరే వీళ్లందరి గురించీ మనకెందుకు ‘అసలు రెబెక్కా ఏమైంది? ఆ రిజర్వాయర్లలో ఎందులోనైనా ప్రమాదవశాత్తూ పడిపోయిందా, లేక ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేశారా,లే క తల్లిదండ్రులే దోషులా’ అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ముందా మిస్టరీని విడదీయాలని మనం కూడా ఓపిగ్గా పేజీలు తిప్పుతుంటాం. ఆమె ఆనవాళ్ళేవీ కూడా లభ్యంకాకపోవడంతో రెబెక్కా ఎక్కడో బ్రతికే ఉందనీ,ఎ ప్పటికైనా తిరిగిస్తుందనీ ఆమె తల్లిదండ్రులతో సహా ఆ కమ్యూనిటీలో అందరూ నమ్ముతుంటారు..ప్రతి సంవత్సరం ఆమెను స్మరిస్తూ కమ్యూనిటీ హాల్ లో ఒక సభ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలా ఒక సంవత్సరం గడుస్తుంది. తరువాత రెండు, మూడు, నాలుగు, ఇలా ప్రతి న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ తో క్యాలెండరు లో ఇరవై సంవత్సరాలు తిరిగిపోతాయి. కానీ Gladstone లోని మనుషుల జీవితాల్లోంచి మాత్రం రెబెక్కా వెళ్ళదు. మరి రెబెక్కా ఆచూకీ అప్పుడైనా దొరికిందా అంటే పుస్తకం చదివి తెలుసుకోవాల్సిందే.

People just wanted to open their mouths and talk, and they didn’t much mind what came out.

It had been more than six months and still there was nothing. No footprints, no clothing, no persons of interest, no sightings on any CCTV. It was as though the ground had just opened up and swallowed her whole. Journalists used this phrase by way of metaphor or hyperbole; people in the village knew it as a thing that could happen.

There were dreams about her walking home. Walking beside the motorway, walking across the moor, walking up out of one of the reservoirs, rising from the dark grey water with her hair streaming and her clothes draped with long green weeds.

They had wanted to find her. They had wanted to know she was safe. They had felt involved, although they barely knew her.

నేను సహజంగా ప్రకృతి, ప్రదేశాలను గురించిన వర్ణనలు చదవడం అంటే అస్సలు ఇష్టపడను. కానీ నాకు మొదట్నుంచీ బ్రిటిష్ రూరల్ లైఫ్ అంటే ఉన్న ఒక అబ్సెషన్ కారణంగా ఇందులో బ్రిటన్ కంట్రీ సైడ్ వర్ణనలు కట్టిపడేశాయి. దానితోపాటు అక్కడి రూరల్ కమ్యూనిటీ సంస్కృతిలో భాగమైన Harvest festival, Mischief night, Spring dance,Bonfire party ల్లాంటి విషయ, విశేషాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. రచయిత పదాల్లో ఆయనపై అక్కడి కమ్యూనిటీ ప్రభావం ప్రతి వాక్యంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. రూరల్ కమ్యూనిటీల్లో సహజంగానే ఉండే భయాలూ, గాసిప్స్, అభిమానాలు, తోడ్పాటు స్వభావం లాంటి వాటి గురించిన వర్ణనలు ఒకప్పుడు చూసిన Cranford బీబీసీ సిరీస్, Hope లాంటి సినిమాలను తలపించాయి. ఈ ఫేస్బుక్ కాలంలో అక్కడ కూడా కంప్యూటర్ అంటే అదేదో బ్రహ్మపదార్థమని భయపడేవాళ్ళు మనకు తారసపడతారు.

ఒక వ్యక్తి ఇరవయ్యేళ్ళుగా ఆచూకీ లేకుండా పోవడం అంత సుదీర్ఘ కాలంపాటు ఒక కమ్యూనిటీ మొత్తాన్నీ ప్రభావితం చెయ్యడం అవాస్తవికంగా అనిపించింది. ప్రకృతి వర్ణనలు ఇష్టపడేవాళ్ళు తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది. అలా కాకుండా కథ, కథనం ఇలా ఉండాలి, పాత్రల్లో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి, మంచి పేజ్ టర్నర్ అవ్వాలి అని నిర్దిష్టమైన అభిరుచులు ఉన్నవాళ్ళు దీని దరిదాపుల్లోకి కూడా వెళ్ళొద్దు. నాకు ఈ పుస్తకం తొలి 100 పేజీలు రెండ్రోజుల్లో చదివి, మిగతా 200 పేజీలు నెలరోజుల్లో చదివిన రికార్డును సాధించిపెట్టింది. ఇక ఈ పుస్తకానికి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో ఆ రచయిత కనిపిస్తే ఒకసారి ఆయన్ని అడగాలని కుతూహలంగా ఉంది. మొత్తానికి ఈ Reservoir 13 నా సహనానికి పరీక్ష. Man Booker లాంగ్ లిస్ట్ లో Lincoln in the Bardo తప్ప మిగతావేవీ ఇంకా చదవకపోయినా George Saunders బరిలో ఉండగా ఈ రచనతో ఆయనకు గట్టి పోటీ ఇవ్వడం కష్టమే.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

When freedom is outlawed only the outlaws will be free, he said.

Loose lips sink ships.

He sat on a bench and read the Valley Echo while the whippet drank. He knew all the names of the people in the Echo but there were plenty he couldn’t place if they walked by. They didn’t tend to socialise.

On the reservoirs the water was whipped up into whitecaps. It was a decade now the girl had been missing, and although little talked about she was still in people’s thoughts. Her name was Rebecca, or Becky, or Bex. She’d been wearing a white hooded top with a navy-blue body-warmer. She would be twenty-three years old by now. She had been seen in the beech wood, climbing a tree. She had been seen at the railway station. She had been seen by the side of the road. She had been looked for, everywhere. She could have arranged to meet somebody, and been driven safely away. She could have fallen down a hole. She could have been hurt by her parents in some terrible mistake. She could have gone away because she’d chosen to, or because she had no choice. People still wanted to know.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.One Comment


  1. Desu Chandranaga Srinivasa Rao

    This article on the novel ‘Reservoir 13’ has really described well the contents.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Unforbidden Pleasures – Adam Phillips

వ్యాసకర్త: Nagini Kandala ************* ఆ మధ్య ఇంతియాజ్ అలీ సినిమా ‘తమాషా’ అని ఒకటొచ్చింది. ఎంత త్వర...
by అతిథి
0

 
 

We Are What We Pretend To Be – Kurt Vonnegut

వ్యాసకర్త: Naagini Kandala ********************** ఒక ప్రక్కన వేరే పుస్తకాలు చదువుతున్నా,’మరి నేను రాసిన కథల...
by అతిథి
0

 
 

Uncommon Type: Some Stories – Tom Hanks

వ్యాసకర్త:Naagini Kandala *************** టామ్ హాంక్స్.. సుమారు పదేళ్ళ క్రిందట ఎప్పుడో చూసిన Cast Away సినిమాత...
by అతిథి
1

 

 

Hillbilly Elegy: A Memoir of a Family and Culture in Crisis – J.D.Vance

వ్యాసకర్త: Naagini Kandala ***************** అమెరికాలోని మారుమూల Appalachia ప్రాంతాలకు చెందిన వారిని హిల్ల్బిల...
by అతిథి
0

 
 

Stiff: The Curious Lives of Human Cadavers – Mary Roach

వ్యాసకర్త: Naagini Kandala ****************** Stiff: The Curious Lives of Human Cadavers, అమెరికన్ రచయిత్రి మేరీ రోచ్ 2003లో రాసిన పుస్త...
by అతిథి
1

 
 

Fantastic night and other stories – Stefan Zweig

వ్యాసకర్త: Nagini Kandala ********* Stefan Zweig.. ఈ మధ్యే మొదలైన కొత్త ప్రేమ. అసలీ పుస్తకం కళ్ళపడే వరకూ ఈయన గు...
by అతిథి
0