పుస్తకం
All about booksపుస్తకంప్లస్

July 16, 2009

మీ పుస్తకం మీరే ప్రచురించుకోండి

More articles by »
Written by: chavakiran

రాసి పంపిన వారు: వరూధిని కాట్రగడ్డ

ఒకప్పుడు అచ్చులో పేరు చూసుకోవటం అంటే ఎంతో గొప్పగా ఉండేది. అదేదో మహామహా సాహితీవేత్తలకే పరిమితం అన్న భావన ఉండేది. కొంతమందికి ఈ అచ్చులో పేరు చూసుకోవటం అనే కోరిక ఎంతగా ఉండేదంటే దినపత్రికలకి, వార్తా పత్రికలకి ఎడా పెడా ఉత్తరాలు వ్రాసేసి అందులో ఒకటో రెండో అచ్చయితే వాటిని అందరికి చూపెట్టి కత్తిరించి దాచుకుని ఏదో సాధించేసాం అని బోలెడు ఆనందపడిపోయేవాళ్లు.

అలాంటిది ఇప్పుడు బ్లాగుల పుణ్యమా అని నా బోంట్లు కూడా వ్రాతలు వ్రాయటం ఏదో అంతర్జాలంలో అయినా అచ్చులో పేరు చూసుకుని మురిసిపోవటం చేస్తున్నాం. ఆ రాతలు ఏవో పుస్తకం రూపంలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాని మన వ్రాతలు పుస్తకంగా వేసేది ఎవరు? ఒకవేళ మన చేతి చమురు వదిలించుకుని ఓ వంద పుస్తకాలు అచ్చు వేయించి ఊరికే ఇస్తామన్నా తీసుకునేవాళ్లు ఉండాలి కదా! అలా అని మన ముచ్చట కోసం ఒకటి అరా అచ్చు వేయమంటే ఎవరు వేస్తారు?

ఇక ఇప్పుడు ఆ బాధ లేదు. మనం వ్రాసిన వ్రాతలు ఎంచక్కా మనమే అచ్చు వేసుకోవచ్చు. ప్రచురణకర్తల వెనకాల పడాల్సిన అవసరం లేదు. ఎన్ని కాపీలు కావాలంటే అన్నే వేసుకోవచ్చు. ఒక్క పుస్తకం అయినా అచ్చు వేసుకోవచ్చు. పుస్తకం అట్ట ఎలా ఉండాలి, లోపలి పేజీలు ఎలా ఉండాలి, అక్షరాలు ఎలా ఉండాలి ఇలా ప్రతిది మనకి మనమే ఎంపిక చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో నుండి కాలు బయటపెట్టకుండానే మన చేతుల్లోకి చక్కటి పుస్తకం వచ్చేస్తుంది.

క్రియేట్ స్పేస్, పోతి – అనే రెండు సైటుల ద్వారా మనం మన పుస్తకాలు ప్రచురించుకోవచ్చు.

ఇంతకుముందు మాలతి గారు ఇలా ఒక పుస్తకం ప్రచురించారు. కొద్దికాలం క్రితం చావా కిరణ్ “నేనొక నిరంతర విహారిని” అన్న కవితా సంపుటి, “తొలిరేయి” అన్న ఓ నవలని ప్రచురించుకున్నాడు. ఇలా ప్రచురితమయిన తొలి తెలుగు పుస్తకం చావాదేనేమో! చావా గారి స్పూర్తితో ఈ మధ్య సత్యసాయి గారు కూడా ఓ పుస్తకం అచ్చువేయించారు.

మన బ్లాగర్లలో మంచి మంచి కథలు, కవితలు, పద్యాలు, స్వగతాలు, జ్ఞాపకాలు, ఇతరత్రా విషయాల మీద మంచి ఆసక్తికరంగా వ్రాసే వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా తమ తమ రచనలని ఎంచక్కా పుస్తకాలుగా అచ్చేసుకోవచ్చు. ఖర్చు కూడా పెద్ద ఎక్కువేమి కాదు.

ఇక ‘తొలిరేయి’ నవల విషయానికి వస్తే…..

ఈ సీరియల్ నవల తొలుత కిరణ్ తన బ్లాగులో పెట్టిందే. మంచి తమాషా నవల. దీనికి మాతృక ఇంగ్లీషులో వచ్చిన “నైట్ ఫాల్” అనే కథ అట.. నేనయితే ఇంగ్లీషు పుస్తకం చదవలేదు. ఇందులో పాత్రల పేర్లు మాత్రం చాలా వెరయిటీగా ఉన్నాయి.tolireyi_cover

“నేనొక బొమ్మను గీసి
దానికో మనసునిచ్చి
ఇహ ఆడు అంటే
అది నా మాట విన్లేదు……”

ఈ పుస్తకంలో పాత్రలు కూడ కిరణ్ మాట వినకుండా వాటి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించాయట:)

ప్రతి 2500 సంవత్సరాలకి ఒకసారి మన నాగరికతలు నాశనం అయిపోతుంటాయి, అది కూడా అగ్నిప్రమాదాల కారణంగా… అన్న ఓ థియరీ మీద అధారపడి వ్రాసిన కథ ఇది. అలా ఎందుకు జరుగుతుందో కనుక్కోవాలనుకునే శాస్త్రవేత్తలు ఒక వైపు, ఈ కారణంగా జనాల్ని భయపెట్టి అదికారం చేజిక్కించుకోవాలనుకునే ఓ స్వాముల వారు ఒక వైపు……చివరికి ఏమయింది……ముప్పు తప్పిందా అన్న విషయం ప్రధానంశంగా వ్రాసిన నవల ఇది.

ఆస్ట్రాలజీ, అంత్రోపాలజి, దొంగ స్వాములు…….ఇలా మూడు రంగాలని కలగలిపి గుదిగుచ్చిన కథ ఇది. ఈ మూడిటి మధ్య అనుసంధానం అక్కడక్కడ అంతగా కుదరక కథలో ఫ్లో లోపించినట్లు అనిపిస్తుంది. కానీ మొత్తం మీద పుస్తకం చదువుతుంటే బాగానే అనిపిస్తుంది. ఓ సైంటిఫిక్ త్రిల్లర్ చదువుతున్నట్టు ఉంటుంది.

పుస్తకం సైజు, పేపరు క్వాలిటీ, అక్షరాల సైజు అన్నీ బాగున్నాయి. భాష మీద కొంచం శ్రద్ద పెట్టి ఇంకొంచం కృషి చేస్తే కిరణ్ మంచి రచయిత అవుతాడు. తనలో మంచి కథకుడున్నాడు. అక్కడక్కడ కాస్త ఎడిటింగు దోషాలు కూడా ఉన్నాయి. పదాల మధ్య ఖాళీలు, అచ్చు తప్పులు, ……..’ల’ కి ‘ళ’ కి……. ‘శ’ కి ‘స’ కి తేడాలు లాంటివి కాస్త చూసుకుంటే బాగుంటుంది.

కిరణ్ ప్రచురించిన కవితల పుస్తకం గురించి చెప్పేంత కవితా పాండిత్యం నాకు లేదు కాబట్టి ఆ సాహసం చేయటం లేదు.

—–

ఈ పుస్తకం హోం పేజీ కూడా ఉంది. http://tolireyi.com/About the Author(s)

chavakiran

చావాకిరణ్ కినిగె వ్యవస్థాపకుల్లో ఒకడు, ప్రస్తుతం కినిగె డైరెక్టర్, ప్రోగ్రాం మేనేజర్. గతంలో ఏడేళ్లు మైక్రోసాప్ట్ - హైదరాబాద్లో , అంతకు ముందు ఒక వర్షం హెచ్ పీ బెంగుళూరులోనూ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారు. పుస్తక పఠనం, కవితలు, కథలు, నవలలు వ్రాయప్రయత్నించటం హాబీలు. - http://chavakiran.com9 Comments


 1. […] pothi.com వెబ్సైటులో వీరి పనితీరు గురించి మరింత సమాచారం పొందవచ్చు. ఇదివరలో పోతి గురించి పుస్తకం లో వరూధిని గారు కూడా పరిచయం చేశారు. (లంకె ఇక్కడ) […]


 2. “We are competing with them! ”
  – great! All the best.Wish you a huge success.

  Thank you.


 3. Rayraj,

  Most of the books worldwide are still sold in book-stores. In India almost all of the books are sold in book-stores only.

  Advantages of POD:
  1. You can publish atleast one book and keep in your shelf 🙂
  2. You don’t need to spend hell a lot of money.
  3. A very quick process , with in a week u can get a book in hand!

  Disadvantages:
  1. Price is high! almost four times higher than normal ones.

  In case you really confident to sell 100 books in an year, better publish it outside. 🙂

  >> ఆ మాత్రం ఖర్చు పెట్టేటప్పుడు, ఇంకా చాలా మంచి బుక్సున్నాయి.ఇంగ్లీషులో
  We are competing with them!

  >> కిరణ్ గారూ!మీరే మొదలుకదా!ఇక్కడ.చెప్పెయ్యండి బాబూ! రహస్యం ఐతే నిగూఢంగా చెప్పండి, ఏ దన్నా క్లూ ఇవ్వండి
  అర్థం కాలేదు. In case you are asking how much money an author can make with each book – that is authors wish; depending upon his selection the price of book will go up. For tolireyi I choose 30/- 🙂


 4. ముద్రణలో లేని పాత పుస్తకాలు మీ దగ్గరే ఉంటే, ఓపిగ్గా కొన్ని ముక్కలు టైపు చేసి బ్లాగుల్లో పెట్టుకుంటున్నారు.వాళ్ళు మొత్తం అంతా టైపు చేసేసి, అలా అమ్మకానికి కూడా పెట్టుకోవచ్చేమో! కాపీరైటు సంగతి ఓ సారి చూసుకోండి.ఐనా,మీరు పెద్దగా లాభపడుతున్నారు అని తెలిసి ఎవరో వచ్చి మిమ్మల్ని ఆపేదాకా మీరు దాని సంగతి పట్టిచ్చుకోనక్కర్లేదేమో!అంతగా ఎవరన్నా వచ్చి ఆపితే, అప్పుడే వాళ్లకి అందులో భాగం ఇచ్చేస్తే, ఏ కేసు ఉండదు! ఆలోగా కాస్త పుణ్యం పురుషార్ధం రెండు కలిసొస్తాయి.ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళే ఇలా ఉద్యోగం కల్పించేసుకోవచ్చేమో! :p


 5. ya..as usual, i was slow. Actually one visit to pothi helped to resolve it. Ofcourse Kiran can clarify it still,if it was that simple.

  That indian english pothi was easier, to grasp things faster! what to do? my brain is కరెప్టెడ్! 🙂

  అక్కడో రెండు ఐడియాలున్నాయి. కొద్దిగా అచ్చేసి,షాపుల్లో పెట్టి చూసి, ఆర్డర్లు వేలల్లో వస్తే,హాయిగా ఆఫ్సెట్ ప్రింటింగ్ చేసుకోవచ్చు మళ్ళీ! పబ్లిషర్స్ కూడా, ఇలా మార్కెట్ టెస్ట్ చేసుకోవచ్చు.


 6. థాంక్సండి. క్లుప్తంగా కొద్దిగా తెలిసింది.ఆ తెలుగు లింకులు కూడా చదివాను.
  ఏ తెలుగు సైటు ఇలాంటి పని ఎందుకు చేయలేదనుకుంటున్నారో ఎవరన్నా చెప్తే బావుండును.సైటువాళ్ళ సాధకబాధలు తెలుసుకోవచ్చు కదా అని! అలాగే, తెలుగు పబ్లిషర్స్ కూడా ఎవరన్నా వాళ్ళ విషయాలు రాస్తే బావుండును. ఎవరన్నా రాసినవి ఉంటే, ఆ లింకులిచ్చినా పర్లేదు.

  ఇంకొక్కటి చెప్పగలరేమో చూడండి:
  ఒకవేళ ఈ రకమైన పబ్లిషింగ్లో , రెండొందల పీజీల పుస్తకానికి – రెండొదల ఖరీదైతే – అచ్చేసేవాడికి మిగిలేది లేదు.రాసినవాడికొచ్చేది లేదు కదా అని అనిపిస్తోంది.(అచ్చేసేవాడికి పేజీకి రూపాయికంటే తక్కువ పడాలంటే,మినిమమ్ ప్రింట్లు కావాలి కదా! అదీ నా బుర్రకి ఎక్కని విషయం.నాకు తెలిసి రూపాయి ఇరవై పైసాన్నా పడుతోంది కదా)

  కిరణ్ గారూ!మీరే మొదలుకదా!ఇక్కడ.చెప్పెయ్యండి బాబూ! రహస్యం ఐతే నిగూఢంగా చెప్పండి, ఏ దన్నా క్లూ ఇవ్వండి 🙂


 7. 🙂 మనదేశంలో ఇంకా ఎందుకు రాలేదా అనుకున్నాను ఇంతకాలం. వచ్చిందన్నమాట సెల్ప్ పబ్లిషింగ్. మరి మార్కెటింగ్ మాటేమిటి?
  వరూధినిగారు మంచిటైములో నాకు అందించేరు సమాచారం. సంతోషం.
  మాలతి


 8. వరూధిని

  రేరాజు గారూ, మంచి ప్రశ్నే అడిగారు. ఈ వెబ్ పబ్లిషింగ్ ముఖ్యంగా తాము వ్రాసినవి పుస్తక రూపంలో చూసుకోవాలనే కోరిక ఉన్నా పబ్లిషర్సు వెంట తిరగలెని వారికి ఉపయోగపడుతుంది. ఇక 200 రూపాయలకి మంచి పుస్తకాలే దొరుకుతాయి నిజమే కాని అవి మనం వ్రాసినవి కాదుగా :). మన పుస్తకం బాగుంటే అందులో సరుకు ఉంటే కొనుక్కునేవాళ్లు కూడా బాగానే ఉంటారు కదండి.

  ఇంతవరకు తెలుగు సైటులలో అయితే ఈ అవకాశం లేదు, ఎవరయినా చేస్తే బాగానే ఉంటుంది.

  ఇక పుస్తకం ఎలా ప్రచురించుకోవాలి?
  http://pothi.com/pothi/publishingatpothi లో అయితే మీరు ప్రచురించాలనుకుంటున్న దాన్ని రెండు సాఫ్టు కాపీలు వాళ్లకి పంపాలి. దానితో పాటు పుస్తకం ఏ సైజులో ఉండాలి, ఏ క్వాలిటీ పేపరు కావాలి, అట్ట ఎలా ఉండాలి, ఎలాంటి బైండింగు కావాలి, మరియు పుస్తకం అమ్మకాలలో మీకెంత మార్జిన్ కావాలి అన్న వివరాలు పంపాలి. మీరు ఒకసారి సైటు చూడండి. మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే కిరణ్ ని అడగవచ్చు.

  పుస్తకాల ప్రచురణలో రచయితలకు ఉండే ఈతిబాధలు తెలుసుకోవాలంటే రచయిత్రి మాలతి గారి బ్లాగులోని కింది పోస్టులు ఒకసారి చూడండి.
  http://tethulika.wordpress.com/2008/07/16/%E0%B0%8A%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8B%E0%B0%95-%E0%B0%85%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%87-%E0%B0%85%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A/

  http://tethulika.wordpress.com/2008/09/12/%E0%B0%85%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%82-%E0%B0%B0%E0%B1%86/

  ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం వెబ్ పబ్లిషింగు గురించి తెలియచేయటమే.


 9. ఇది చదివితే తొలిరేయి స్టోరీ లైన్ తెలిసింది కానీ, మా పుస్తకం ఎలా అచ్చేసుకోవలా మాకు తెలీలేదు. మళ్ళీ వివరించ గలరని ఆశిస్తాను. ఇంగ్లీషొచ్చుకా, చదువుకోమంటే సరే!

  ౧.అమెరికాలో పది డాలర్లు విదిలిస్తారేమో గానీ, ఇక్కడ 400 వదలకొట్టుకోరు! చదివే వాళ్ళున్నా – అమెరికన్ స్పెండింగ్ ఇక్కడ రాదు. దానికి చాలా కారణాలున్నాయి.
  ౨.పోనీ 200+ Shipping అన్నా ఎక్కువే!
  ౩.ఆ మాత్రం ఖర్చు పెట్టేటప్పుడు, ఇంకా చాలా మంచి బుక్సున్నాయి.ఇంగ్లీషులో! పనికొచ్చేవి. (చావా కిరణ్ గారు-ఇది మీ పుస్తకాన్ని లక్ష్యంగా చెప్పటం లేదు. ఇది జెనిరిక్ సమస్యగా నేను చూస్తున్న విషయం అని మీకు గుర్తుండే ఉంటుంది)

  కాక, తెలుగు సైట్లేవి ఇలా అచ్చేసుకునే సౌకర్యం ఇవ్వలేదా! ఎందుకివ్వలేకుండా ఉన్నాయి?
  నా పుస్తకాన్ని యాభై రూపాయలలోపు కొనటానికి వంద మంది – ఓ సంవత్సరంలో దొరకచ్చు. అంటే,నా పుస్తకం మీద నాకు, ఐదివేలు రావచ్చు. హిట్టైతే, లెక్కేలేదనుకోండి. ఇప్పుడు చెప్పండి – నా పుస్తకం ఎలా అచ్చేసుకోవచ్చు?  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0