వీక్షణం-7

తెలుగు అంతర్జాలం:

“‘అకవిని’ ‘కవి’గా భ్రమింపజేస్తాయేమోగాని, అకవిత్వాన్ని కవిత్వంగా నిరూపించ జాలవు.” అంటున్న “రచన రక్తదానం లాంటిది” వ్యాసం, అట్టాడ అప్పల్నాయుడు రచనల గురించి వి.ప్రతిమ వ్యాసం, “అవును ఆదికవి పాల్కురికే!”-సంగిశెట్టి శ్రీనివాస్ వ్యాసం -అంధ్రజ్యోతి వివిధ పేజీల్లో వచ్చిన వ్యాసాలు. “సాహిత్య రంగంలో ప్రతిభా మూర్తులు”, “కుజుడి కోసం”, “మునిపల్లె రాజు అత్యుత్తమ కథాకృతులు” ఇత్యాది ఇటీవలి పుస్తకాల గురించిన పరిచయాలు ఆదివారం అనుబంధంలో చూడవచ్చు.

“అధూరె” కథల గురించి వెల్లుండి శ్రీధర్ వ్యాసం, వేదుల సత్యనారాయణ రాసిన “గురజాడ అపండితుడా?”, “రచయితల దురలవాట్లతో పనేముంది?” అన్న నూతి సత్యానంద్ వ్యాసం – గతవారాల్లో ఆంధ్రభూమిలో వచ్చిన వ్యాసాలకి స్పందనలు, “కథల రారాజు.. మునిపల్లె రాజు!” వాసిలి వసంతకుమార్ వ్యాసం, “టీచర్-కథాకమామిషు” పుస్తకంపై కె.పి.అశోక్‌కుమార్ వ్యాసం, “అక్షర” పేజీల్లో కొన్ని కొత్త పుస్తకాలు-వాటి పరిచయాల లంకెలు – ఆంధ్రభూమి పత్రికలో విశేషాలు.

కోటం చంద్రశేఖర్‌ కవిత్వం గురించి ఎస్.ఆర్.పృథ్వి వ్యాసం, అభినవ సత్యభామ ‘వేదాంతం’ – గుండు నారాయణ వ్యాసం, “తెలుగు భాషా వికాసం – వాస్తవిక దృక్పథం” – చర్చ – ప్రజాశక్తి పత్రికలో చూడవచ్చు.

వచ్చేనెల్లో ప్రపంచ తెలుగుమహాసభలు ప్రారంభం కనున్న నేపథ్యంలో “అమ్మ భాష …అరణ్యఘోష” ఎ.బి.కె.ప్రసాద్ వ్యాసం, పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు హెమ్మింగ్వే “Old man and the sea” గురించి రాసిన వ్యాసం, “మట్టితీగలు – కథ ఎందుకు రాశాను” బమ్మిడి జగదీశ్వరరావు వ్యాసం, ఇటీవలే జరిగిన “కథాయానాం” గురించి మధునామూర్తి వ్యాసం, “అలివేణీ ఆణిముత్యమా… (మహిళా స్ఫూర్తి కథనాలు)”
పుస్తక పరిచయం -సాక్షి పత్రికలో వచ్చిన విశేషాలు. కొత్త పుస్తకాల గురించి సాక్షి ఆదివారంలో ఇక్కడ.

“అస్తిత్వ ఉద్యమ సాహిత్యానికి అస్తిత్వమేది?” – మద్దిరాల సిద్ధార్థ వ్యాసం, “తెలంగాణ వెతలే కథలై” సంకలనంపై పెద్దింటి అశోక్ కుమార్ వ్యాసం, వేదాంతం సత్యనారాయణశర్మ గారి గురించి నివాళి వ్యాసం – సూర్య పత్రికలో విశేషాలు.

“కులవృత్తుల విధ్వంసం ! ఆగ్రహించిన కవిత్వం !!” – డాక్టర్ రాధేయ వ్యాసం, ముల్కరాజ్‌ ఆనంద్‌ గురించి మంతెన సూర్యనారాయణరాజు వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

సి.యస్.రావు నవలల సంకలనం గురించి కె.రామలక్ష్మి గారి పరిచయ వ్యాసం ఇక్కడ.

అక్టోబర్లో హైదరాబాదులో జరిగిన కార్టూన్ ఉత్సవ్ 2012 గురించి కార్టూనిస్టు సరసి గారి వ్యాసం, సాల్మన్ రష్డీ “మిడ్నైట్స్ చిల్డ్రన్” గురించి ముక్తవరం పార్థసారథి వ్యాసం, “కథ సమకాలీన చరిత్రను రికార్డు చేసే పనిముట్టు” అంటూ సాగిన దా. వి.చంద్రశేఖరరావు అనుభవాలు, గద్దర్ పాటల గురించి పాపినేని శివశంకర్ వ్యాసం – నవ్య వారపత్రిక విశేషాలు.

“డియర్ ప్రొఫెసర్ ఐన్‌స్టీన్” పుస్తకం గురించి పరిచయం ఇక్కడ.

ప్రెస్ అకాడమీ ఆర్కైవులలో నుండి సేకరించిన ఇండెక్సు ను మాగంటి వంశీ గారి బ్లాగులో ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం:

చైనాకు చెందిన, ఇటీవలే నోబెల్ పొందిన రచయిత మోయాన్ రచన Bull నుండి ఒక భాగం ఇక్కడ.

“Poets Mourning Poets” – ప్యారిస్ రివ్యూ పత్రిక వ్యాసం ఇక్కడ.

కిండిల్ లో చదువుతూ పుస్తకాలని రివ్యూ చేయడంలో ఉన్న ఇబ్బందుల గురించి రాన్ చార్లెస్ అభిప్రాయాలు ఇక్కడ.

పాత Asterix ప్రకటనల గురించి TLS వారి బ్లాగులో ఇక్కడ చూడవచ్చు.

కన్నడ రచయిత భైరప్ప రాసిన పర్వ నవల సంస్కృత అనువాదం ఆవిష్కరణ సందర్భంగా ఒక వార్తా కథనం ఇక్కడ.

“They may not read classics, they may read books that aren’t bound in paper, but youngsters these days are definitely reading something” – అంటూ సాగిన నీతి సర్కార్ వ్యాసం ఇక్కడ.

పిల్లల్లో భాషాభివృద్ధి, పఠనాసక్తీ పెంపొందించడానికి మొదలైన A book of international fame గురించి ఒక కథనం ఇక్కడ.

మదురైలో నలభై ఏళ్ళ క్రితం మొదలైన ప్రివేట్ లైబ్రరీ, దాని ప్రస్తుత నిర్వహకురాలి గురించిన విశేషాలను ఇక్కడ చదవవచ్చు.

“1 PHILOSOPHER + 1 OBJECT + 1 MINUTE = 1 CARTOON” అంటూ, వివిధ తత్వవేత్తలు తమ సిద్ధాంతాల ప్రకారం ఒక వస్తువును చూసి ఎలా స్పందిస్తారో – ఆసక్తికరమైన కార్టూన్ వీడియోలు చూడాలంటే ఇక్కడికి వెళ్ళండి.

తమిళ రచయిత J.M. Sali గారు National Arts Council, Singapore వారి ‘Cultural Medallion 2012’ అందుకున్న సందర్భంగా హిందూపత్రికలో ఆయన గురించిన వ్యాసం ఇక్కడ.

2010 లో వచ్చిన Immortals of Meluha పుస్తకం తెలుగులోకి అనువాదం అయిన సందర్భంగా ఒక వార్తా కథనం ఇక్కడ. (రచయితతో కొంతకాలం క్రితం పుస్తకం.నెట్ జరిపిన ఇంటర్యూ ఇక్కడ.)

“Housefull: The Golden age of Hindi Cinema” – Ziya us Salam సంపాదకత్వంలో వెలువడ్డ పుస్తకంలోని కొన్ని భాగాలు ఇక్కడ చదవొచ్చు.

“What should children read?” వ్యాసం ఇక్కడ.

బ్రిటన్ కు చెందిన రచయిత, మేధావి అయిన Philip Spratt తో సెలెక్ట్ బుక్ షాప్ కు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ సెలెక్ట్ యజమాని కె.కె.ఎస్.మూర్తి గారి వ్యాసం (Spratt and a bookshop), మూర్తి గారి గురించి ఒక చిన్న పరిచయం (Bibliophile’s Mecca) ఫ్రంట్లైన్ పత్రికలో చూడవచ్చు.

రెండువారాల క్రితం Han Suyin మరణవార్త గురించి వీక్షణం-5 లో ప్రస్తావించిన విషయం కొంతమందికైనా గుర్తుండి ఉంటుంది. ఆవిడతో 1985లో ఫ్రంట్ లైన్ పత్రిక చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు.

నైజీరియన్ రచయిత Ben Okri తో ప్రస్తుత ఫ్రంట్లైన్ సంచికలో Painter of secrets పేరిట వచ్చిన ఇంటర్వ్యూ ఇదిగో.

“Discussing classics” సచ్చిదానందన్ వ్యాసం ఇక్కడ.

జాబితాలు:

“Drawn From History and Imagination” అంటూ వివిధ కథాంశాలతో వచ్చిన గ్రాఫిక్ పుస్తకాల గురించి చిన్న పరిచయాలు ఈ వ్యాసంలో చూడవచ్చు.

బాగా ఖరీదైన పుస్తకాలు కానుకలుగా ఇవ్వాలనుకుంటే, న్యూయార్క్ టైంస్ వారి – Heavyweights for the holidays – A roundup of holiday coffeetable books చూడండిక్కడ.

గత యాభై ఏళ్ళలో అమెరికన్ రచయిత Tom Wolfe రాసిన పుస్తకాలన్నీ వరుసగా పేర్చుకున్నారు ఇక్కడొకరు.

ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్టు పుస్తకాలలో ఎంపిక చేసిన కొన్నింటి గురించి న్యూయార్క్ టైంస్ వ్యాసం ఇక్కడ.

కొన్ని క్రైం, థ్రిల్లర్ కథలు-నవలల గురించి లారా విల్సన్ రౌండప్ వ్యాసం ఇక్కడ.

కొన్ని ఆడియో పుస్తకాల గురించి William Grimes వ్యాసం ఇక్కడ, Marilyn Stasio వ్యాసం ఇక్కడ. ఆడియో పుస్తకాల గురించే మరొక వ్యాసం “sound check” ఇక్కడ.

తల్లీ-పిల్లలు కలిసి రాసిన కొన్ని పుస్తకాలు, ఆ రచనానుభవాల గురించి Robin Marantz Henig, Samantha Henig ల వ్యాసం ఇక్కడ.

“Books of the year 2012: authors choose their favourites” – వివిధ రచయితల ప్రకారం ఈ ఏటి మేటి పుస్తకాల జాబితా ఇక్కడ.

ఇంటర్వ్యూలు:

బ్రిటన్ కు చెందిన ఇలస్ట్రేటర్ Marcia Williams తో అవుట్లుక్ పత్రిక ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.

మరణాలు:

ప్రముఖ జర్నలిస్టు, architecture critic అయిన Jane Holtz Kay ఈ వారంలో మరణించారు. న్యూయార్క్ టైంస్ వార్త ఇక్కడ.

ఆస్ట్రేలియన్ రచయిత Bryce Courtenay మరణించారు. హిందూపత్రిక వార్తాకథనం ఇక్కడ, న్యూయార్క్టైంస్ కథనం ఇక్కడ.

William Faulkner జీవిత చరిత్ర రాసిన Joseph Blotner మరణించారు. ఆయన గురించిన ఒక నివాళి వ్యాసం ఇక్కడ.

ప్రముఖ నటి, శ్రవణ పుస్తకాలు వెలువరించడంలో ప్రసిద్ధి చెందిన Deborah Raffin మరణించారు. ఆవిడ గురించి ఒక వ్యాసం ఇక్కడ.

సైన్స్ ఫిక్షన్ కథాంశాలతో సోవియట్ జీవితాన్ని విమర్శించిన Boris Strugatsky మరణించారు. న్యూయార్క్ టైంస్ వ్యాసం ఇక్కడ. గార్డియన్ పత్రిక వ్యాసం ఇక్కడ.

మరికొన్ని పుస్తకాల పరిచయాలు:

* The Better Angels of Our Nature – స్టీవెన్ పింకర్ పుస్తకంపై ఒక పరిచయం
* “Modernism and the art of Muslim South Asia” పుస్తక పరిచయం ఇక్కడ.
* Desi Dreams- Indian Immigrant Women build Lives across two worlds – పుస్తక పరిచయం ఇక్కడ.
* “Crossing the Bay of Bengal: The Furies of Nature and the Fortunes of Migrants” – 2013లో రాబోయే ఈ పుస్తకం గురించి రచయిత అమితవ ఘోష్ అభిప్రాయాలు ఇక్కడ.
* “A History of Britain in 36 Postage Stamps” పుస్తకం గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* కొంతకాలం క్రితం జంపాల చౌదరి గారు పరిచయం చేసిన “Moonwalking with Einstein” పుస్తకం గురించి గార్డియన్ పత్రికలో వచ్చిన వ్యాసం ఇక్కడ.
* “Antifragile: How to live in a world we don’t understand” – పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.
* Kasab: Face Of 26/11 పుస్తకం గురించి Ziya us Salam వ్యాసం ఇక్కడ.
* The Story of My Assassins by Tarun J Tejpal పుస్తకం గురించి గార్డియన్ పత్రికలో వచ్చిన వ్యాసం ఇక్కడ.
* “Cruel Britannia: A Secret History of Torture” పుస్తకం గురించి వ్యాసం ఇదిగో.
* The Raj on the move: story of the Dak Bungalow పుస్తకం గురించి అవుట్లుక్ పత్రిక వ్యాసం ఇక్కడ.
* నయనతార సెహగల్ పుస్తకం Indira Gandhi: Tryst with power గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* The Oldman and the sea గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* “My Beautiful Genome Exposing Our Genetic Future, One Quirk at a Time” పుస్తకం గురించి ఒక పరిచయం.
* “Shakespeare’s Restless World” పుస్తకం గురించి ఒక పరిచయం.
* “The Great Charles Dickens Scandal” పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.
* “A Working theory of love” పుస్తక పరిచయం ఇక్కడ.
* మార్లిన్ మన్రో గురించిన ఒక పుస్తకంపై ” Blonde on blonde: a new biography of the many Marilyn Monroes ” – జై అర్జున సింగ్ బ్లాగుటపా ఇక్కడ.
* Salman Rushdie రాసిన Joseph Anton పుస్తకం గురించి ఒక సమీక్ష ఇక్కడ.
* Hilary Mantel – Bring up the bodies పుస్తకం గురించి ఒక సమీక్ష ఇక్కడ.

****
(కొన్ని వ్యాసాల గురించి సమాచారం అందజేసిన పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

You Might Also Like

One Comment

  1. దార్ల

    ఇది చాలా శ్రమతో కూడిన పని. మిమ్మల్ని అభినందిస్తున్నాను.

Leave a Reply