వృక్ష మహిమ
రాసిన వారు: కాదంబరి
**************************
మన హిందూ జ్యోతిష్యశాస్త్రానికీ, ఖగోళశాస్త్రానికీ అవినాభావ సంబంధం ఉన్నది. అలాగే ఆయుర్వేద వైద్య విధానానికీ,ప్రకృతికీ కూడా! ఈ సంప్రదాయమే “అహింసా విధానానికి” మూలస్తంభం గా నిలిచినది. అందువలననే దేవాలయాలలో హిందూదేవ, దేవతా మూర్తులకు,
అనుసంధానంగా వాహనము బొమ్మ, అలాగే ప్రతి గుడిలోనూ కనీసం ఒక చెట్టు- స్థల వృక్షము సిద్ధాంత నిబంధనలతో ఉంటూన్నవి. చెట్లు కొట్టేస్తూ, అడవులకు చేటు తెస్తూన్న మానవుని స్వార్ధపరత్వం పర్యావరణానికి కలిగిస్తూన్న అపకారం ఎంతో- అంచనాలకు అందనిదని,
అటు ప్రకృతిప్రేమికులూ, ఇటు వాతావరణ సైంటిస్టులూ ఘోష పెడ్తూనేఉన్నారు. “వృక్షో రక్షతి రక్షితః” – ధరణీ ప్రేమికులందరూ జపిస్తూనే ఉన్న ఈ “వృక్షో రక్షతి రక్షితః” గొప్ప మంత్రము.
**********************************
స్థలములకూ, జాగాలకూ అపరిమిత డిమాండు ఏర్పడింది. అందునా ఆంధ్ర ప్రదేశ్ రాజధానిలో మిన్ను తాకే ధరలు!!!!! ఇలాటి పరిస్థితులలో మేడ్చల్ లో సాయిగీత ఆశ్రమము స్థాపించబడింది. ఇక్కడ ఆయుర్వేద, ఖగోళ, చాంద్రమాన మూలసూత్రాలను ప్రాతిపదికగా తీసుకుని వృక్షాలను పెంచుతున్నారు. అవి కల్పవృక్షములు, దేవతావృక్షములు. వీనిని “ధన్వంతరీ వృక్షములు” అని పిలుస్తున్నారు. ఆశ్రమ నిర్వాహకులు “వృక్ష మహిమ” అనే పుస్తకమును అచ్చు వేసారు. ఆశ్రమ సిద్ధాంతములు, ధ్యేయ, లక్ష్య, నియమాదులను
యావన్మందీ తెలుసుకోవడానికి ఈ పొత్తము ఉపకరిస్తుంది.
**********************************
“వృక్ష మహిమ” 203 పేజీలతో, కన్నులకు ఏ మాత్రమూ శ్రమ లేకుండా చదివేటట్లుగా చక్కని ముద్రణతో వెలువడింది. ఇందులో ఉన్న అనేక వివరములు (విషయసూచిక) :-
సాయిగీత ఆశ్రమము స్థాపన
ప్రకృతిలో చెట్లు, వాటి మహిమ
మహిమాన్విత వృక్షాలు
భక్తుల అనుభవాలు
పుట్టిన వారం అనుసరించి
ప్రత్యేక చెట్టును పూజించే వివరములు
వృక్షదేవతల నామావళి
శ్రీ సాయి నామావళి
శ్రీ వినాయక (విఘ్నేశ్వర) నామావళి
శ్రీ ఆంజనేయ; శ్రీ గరుడ నామావళి
అభయ మూర్తుల క్షేత్రము
గరుడ క్షేత్రము
ఆశ్రమ వైద్య కార్యకలాపాలు
ఆశ్రమములో జరిగే పండుగలు
ఆశ్రమ ప్రచురణలు
ఇలాగ అనేక వివరములతో పాటు “పూజ్య సద్గురుగారి దివ్యవాక్కులు” భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నవి.
**********************************
” శివానంద లహరి”లో అయస్కాంతము చెట్టు ను గురించి 61 శ్లోకమును ఈ పుస్తమునకు (వృక్ష మహిమ) మొదటి పుటలలో స్వీకరించారు. ఆ శ్లోకము:-
అంకోలం నిజ బీజ సంతతిః – అయస్కాంతో ఫలం సూచికా |
సాధ్వీ నైజ విభుం, లతాక్షతిరూహం, సింధుస్సరి ద్వల్లభమ్|
ప్రాప్నోతీహ యధా తధా పశుపతేః పాదారవిందద్వయమ్|
చేతోవృత్తిః రూప్యేత్యతిష్ఠతి సదా సా భక్తిరుచ్యతే|
తాత్పర్య భావము:- మనోవృత్తి పరమాత్మను వదలకుండినచో అదే “భక్తి” అని వక్కాణము.
అమోఘ ప్రతిభాశాలి శ్రీ ఆది శంకరాచార్య రచించిన “శివానంద లహరి” లోని 61 వ శ్లోకం ఇది. అంకోలం విత్తనములు తన మాతృ వృక్షమునకు అతుక్కుంటాయి. ఆ వృక్షమునకు గల ఇనుము వంటి గుణము కల ఆ చెట్టు ముళ్ళకు అయస్కాంతము పట్ల ఆకర్షిత గుణమును కలిగి ఉన్నాయి లతలు/ తీగ- పాదపము యొక్క మ్రాను చుట్టూతా పెనవేసుకుంటుంది. నది సముద్రములో కలుస్తుంది. పశుపతి నాధుని, మహేశుని చరణ పద్మములకు భక్తి భావనలు లీనమౌతాయి.” అంటూ శ్రీ కంచి పీఠాధిపతి ఈ మహత్తర శ్లోకానికి వివరణను ఇచ్చారు.
ఇలాగ – ఊడుగ చెట్టు అనగా అంకోలం తరువును గురించిన ప్రస్తావన ఉన్నది. ” Eranzhil tree / azhinjil (Tamil) / అంకోలం చెట్టు Kanchi Mahaperiyavar, Sri Chandrasekharendra Sarasvathi Swami:
భక్తి మార్గము యొక్క విశిష్టతను ” శివానంద లహరి”లోని 61వ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని చేసిన వర్ణన ఆణి ముత్యమే కదా! తమిళ నాడులో “అంకోల గణపతి దేవళము” ఉన్నది. స్వయం భూ గణపతి అంకోల పాదపము వద్ద వెలసెను; అందు చేత ఆ సైకత వినాయకుడు – అంకోల గణపతి గా వాసి కెక్కెను. తెలుగులో అనేక వ్యవహార నామాలు కలవు;
*********************************************************;
“వృక్ష మహిమ” అనే వారి పుస్తకము 2001 సంవత్సరమునాటి నుండి 5 ముద్రణలు పొందినది.
“వృక్ష మహిమ”
ధర: రూ. 30.00
కాపీలకు:-
సాయిగీతా ఆశ్రమము,
వయా బోయిన్ పల్లి,
మేడ్చల్ రోడ్,
కండ్లకోయ బస్ స్టాప్ ఎదురు రోడ్ లో;
మేడ్చల్ తాలూకా, రంగారెడ్డి జిల్లా;
ఫోను:(040)27500127;
(040)27500694;
(08418)248247)
e-mail: saigeethaashram@yahoo.com
swww.saigeethaashram.org
http://sgashram.org/index.html
[custom_author=కాదంబరి]
gksraja
వృక్ష మహిమ పేరుతో ఆశ్రమాన్ని ప్రొమోట్ చేసుకున్నట్టు ఉండొచ్చు ఈ పుస్తకం. మీరిచ్చిన విషయసూచికను బట్టి అది తెలుస్తోంది. వృక్షాల గురించి- వృక్షశాస్త్ర పుస్తకాలు, మానవత గురించి — రామకృష్ణ మఠం నుండి బోలెడన్ని పుస్తకాలు ఉన్నాయి. వ్యక్తి పూజలు, అయ్యవారి పుట్టినరోజులు, వాటికి రోడ్లపై కట్టే ప్లాస్టిక్ బానర్లు మానుకుంటే వృక్షమహిమను గమనించినట్టే!
ghantasala srinivasa rao
వేరి వేరి గుడ్ బుక్స్