ఐదు చార్వాకాశ్రమం పుస్తకాలు

ఇటీవలి కాలం లో చార్వాకాశ్రమం పుస్తకాలు కొన్ని చదివాను. వాటిని చదువుతున్నప్పుడు, చదివాక, నాకు తోచిన అభిప్రాయాలూ ఇవి. ఆశ్రమం తాలూకా మనుషులు నాపై దావా వేసేంత సంకుచితులు అయ్యి ఉండరని ఊహిస్తూ, ఈ వ్యాసం రాస్తున్నాను.

ముందుగా, పుస్తకాలు:

౧) చార్వాకం
౨) బాల రావణాయణం
౩) ప్రజాకవి వేమన
౪) మతమంటే ఏమిటి?
౫) నాస్తికత్వం

అన్ని పుస్తకాలూ రాసిన రచయిత: బి.రామకృష్ణ (ఈయన గురించి ఏమన్నా వివారాలు తెలిస్తే ఇక్కడ ఒక వ్యాఖ్య రాయండి. ఇన్ని పుస్తకాల్లోనూ ఎక్కడా వారి గురించి పెద్దగా ఏమీ రాసిలేదు. ఇప్పుడు జీవించి లేరు అన్న ఒక్క సంగతి తప్ప.) వీటిల్లో కొన్ని పుస్తకాలు పలుముద్రణలు కూడా పొందాయి. కనుక, ఈ చార్వాక ఆశ్రమం వెనుక ఏదో చరిత్ర ఉండే ఉంటుందని అనిపించింది.

మొదటి పుస్తకం “చార్వాకం” చదవడం మొదలుపెట్టినప్పుడు నాకు ఒకే ఒక కారణం ఉండింది – చార్వాకం అంటే ఏమిటి? అని వివరంగా తెలుసుకోవాలి అన్న కుతూహలం. మన సంప్రదాయంలో ఇలా నాస్తికవాదం ఒకటి ఉందని మొదటిసారి తెలుసుకున్నప్పటి నుంచి నాకు మహా కుతూహలంగా ఉండింది వివరాలు తెలుసుకోవడం కోసం. అయితే, మామూలు మనుషులకి అర్థమయ్యే భాషలో ఉండే పుస్తకాలు ఉండవులే అనుకుని వదిలేసా. అలా, ఈ పుస్తకం చూడగానే, ఎంతో ఆశగా చదవడం మొదలుపెడితే, ఇంతా చేసి, పుస్తకం అంతా పూర్తయ్యాక కూడా చార్వాకం లో ఏముందో అర్థం కాలేదు! ఈ పుస్తకం నిండా హిందూ మాట గ్రంథాల్లో భౌతికవాదానికి దగ్గరగా ఉన్న శ్లోకాలని ఏరి, హిందూ మతాన్ని, దాని తాలూకా గురువుల్నీ తిట్టడమే ఉంది!

రెండవ పుస్తకం – “బాల రావణాయణం” అన్న టైటిల్ చూసి, కుతూహలం కొద్దీ చదవడం మొదలుపెట్టాను. ఈ పుస్తకానిది మరో కథ! ఎన్టీఅర్ రావణుడి వేషం వేసిన సినిమాల్లో ఈ పుస్తకం కంటే బాగా చూపించారు రావణుడిని. ఈ పుస్తకంలో రావణుడిని అడ్డం పెట్టుకుని రాముడిని తిట్టడమే అసలు ఉద్దేశ్యం అనిపించింది.

ఇక మూడవ పుస్తకం – “ప్రజాకవి వేమన“. టైటిల్ చూసి, వేమన జీవిత చరిత్ర గానీ, వేమన పద్యాల గురించిన వ్యాసాలు కానీ అని అనుకున్నాను. కానీ, ఈ పుస్తకం “వేమన నాస్తికుడు” అని నిరూపించడానికి రాసిన గ్రంథం అన్నారు ముందుమాటలో. కానీ, అసలుకి అది కూడా కాదు. వేమనని అడ్డం పెట్టుకుని, మతాన్ని తిట్టడం.

ఈసరికే నాకు ఈ రచయిత వరస అర్థమయిపోయింది కానీ, దుగ్ధ కొద్దీ తక్కిన పుస్తకాలు కూడా చదవడం మొదలుపెట్టాను.

నాలుగవ పుస్తకం: మతమంటే ఏమిటి?ఇంగెర్సాల్ లెక్చర్ల ఆధారంగా రాసిన పుస్తకం అని చెప్పుకున్నారు. ఇంగార్సాల్ గురించి వినడమే కానీ, ఎప్పుడూ ఆయన వ్యాసాలు చదవలేదు. కానీ, ఊరికే మతం తప్పు అని చెప్పడం – “మతమంటే ఏమిటి?” అన్న ప్రశ్నకు జవాబు కాదు అని నా అభిప్రాయం. ఆయన వ్యాసాలు “ఆధారం” చేసుకుని, కావలసినంత వక్రీకరించారు అని నా అనుమానం.

ఐదవ పుస్తకం: నాస్తికత్వ సిద్ధాంతంజోసెఫ్ లూయీస్ అన్న ఆయన రాసిన “ఎన్ ఎతీస్ట్ మేనిఫెస్టో” అన్న పుస్తకం ఆధారంగా రాసిన పుస్తకమట. తక్కిన నాలుగింటితో పోలిస్తే, ఎంతో కొంత విషయం ఉన్న పుస్తకం ఇదొక్కటే (నా అభిప్రాయంలో!). పైన ఇంగార్సాల్ వ్యాసాలను ఆధారంగా సొంత ఊహలు జోడిన్చేసుకున్నట్లు ఈ పుస్తకంలో కూడా చేసారు కానీ, చాలా తక్కువ. ఈ ఐదింటిలోనూ కాస్త “బ్యాలెన్స్డ్” గా రాయబడ్డ పుస్తకం ఇదొక్కటే. అయినప్పటికీ, మూలానికి కట్టుబడి ఉన్నారో లేదో నాకు తెలీదు.

ప్రధానంగా, ఈ పుస్తకాల సిరీస్ లో నన్ను కలవరపెట్టిన అంశాలు కొన్ని ఉన్నాయి:
౧) రచయిత తానేదో శాస్త్రీయంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కానీ, ఎక్కడా ఒక్కటంటే ఒక్క రిఫరెన్సు కూడా ఇవ్వరు. ప్రతి చోట, తనమానాన తను కథ అల్లేసుకుంటూ వెళతాడు. ఒక్కోచోట, వ్యాసమా? నవలా? అనుకోవాల్సి వచ్చేంత సృజనాత్మకత కనిపిస్తుంది.
౨) అసలుకి నాస్తికత్వం అంటే మతాన్ని తిట్టడమే – అన్న అభిప్రాయం కలిగిస్తుంది చదువరులకి ఈ పుస్తకం. ఆట్టే మతవిశ్వాసాలు లేని నాకే చిరాకు పుట్టించింది అంటే ఇక ఆస్తికుల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ లెక్కన ఈ పుస్తకాలు ఎవరిని ఒప్పించడానికో!!
౪) ఈయన భౌతికవాదం అని మొత్తుకున్నా, మతవిశ్వాసాలలో లాజిక్ లేదని తిట్టుకున్నా కూడా, తన వ్యాసాల్లోనే లాజిక్ లేకుండా పోవడాన్ని గమనించలేదే! అనిపించింది
౫) నాస్తికత్వం గురించి గానీ, చార్వాకం గురించి గానీ, భౌతిక వాదం గురించి గానీ చెప్పాలంటే – ఎందుకు మతాన్ని తిట్టి ఆపేయడం? అసలు “నీ గురించి చెప్పు” అంటే, నా గురించి చెప్పుకుంటే అర్థం ఉంది కానీ, పక్క వాడిలో లోపాలన్నీ ఏకరువు పెట్టడం వల్ల నేనెవరో తెలుస్తుందా??
౬) అసలు నాస్తికత్వం అంటే ఏమిటి? దాని ఆలోచనా విధానం ఏమిటి? ఫిలాసఫీ ఏమిటి? ఇలాంటి విషయాలు చెప్పే పుస్తకాలే లేవా ఇంతకీ తెలుగులో??

మొత్తానికి, ఐదు పుస్తకాలయ్యాక కూడా నాకు వీళ్ళు ఈ పుస్తకాలని ఇంత ఖర్చు పెట్టుకుని ముద్రిస్తున్నది ఎందుకో? వీటి పరమార్థం ఏమిటో? అర్థం కావడం లేదు.
పుస్తకాలన్నీ కినిగె.కాం లో లభ్యం.

You Might Also Like

12 Comments

  1. c bhaskara rao

    soumya garu, to know about the writer, pl.read the book “sidhantham-aacharanr-jeevitham–charvaka ramakrishna” written by his daughter Aruna.
    u may buy it from Mytri Book House, Karl Marx Road, Vijayawada.

    for a better insight in to naasthikavaadam, one has to read LOKAYATHAM penned by Devi Prasad Chattopadhya.will be available in the libraries of older Indian universities. prof. N Anjaiah of Sri Acharya Nagarjuna Univ. may have.

  2. KOTARI MOHAN RAO

    let us read all the books, n analyse what is good n bad, if u resrict to one ism one may not know the right.

  3. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

    శ్రీరంగం నారాయణబాబు గారికి,ఆయన మిత్రుడొకాయనకీ అసలు చార్వాకం,లోకాయతం వగైరా నాస్తిక దర్శనాల గురించిన్ సందేహనివౄత్తి కోసం విజయనగరంలోని ఒక ఉద్దండపిండ పండితులొకాయన దగ్గరికి వెళ్ళితే ఆపేర్లు వింటేనే అసహ్యం అని వీళ్ళని వెళ్ళగొట్టగా చివరకు ఆదిభట్లనారాయణ దాసు గారు సందేహనివౄత్తి చేసారని ఎక్కడో చదివాను.
    ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి గారి రచనలు చదవండి.చార్వాకం గురించి సూచ్యంగా,సున్నితంగా వివరిస్తారు.
    ఇంగర్ సాల్ రచనలను ఆధారంగా చేసుకుని తెలుగులో వ్యాసాలు వచ్చినట్టు నాకు తెలీదు,కానీ ఆయన్ని ఇంగ్లీషులోనే చదవటం ఉత్తమం.

  4. సతీష్ బాబు చిగురుపాటి

    మొత్తానికి ఏదో ఒక చర్చ నడిచింది. చార్యాకం గురించి, నాస్తికత్వం గురించి తెలియని నాబోటి వాండ్లకు ఎంతో కొంత, ఎక్కడ చదవాలి? ఎవరి పుస్తకాలు మరిత సమాచారం కోసం రిఫర్ చేయాలి? వంటి విషయాలు… విషయాన్ని చర్చించటం, తిట్టటం వంటి వాటికి మద్య చాలా వ్యత్యాసం వుందనే అనుకుంటున్నాను. ఎదుటి దానిలో వున్న చెడుగును, అనవసరతను చెప్పడమే ఒక అవసరం, సందర్భం అయిన కాలంలో వచ్చిన విషయాలను ఇప్పుడు పరిచయం చేసుకునేటప్పుడు ఎంతో ఎదిగిపోయామని భావించే మనబోటి వాళ్ళకు కొంచె ఇబ్బందిగా, సమయ వృథా కార్యక్రమంగా అనిపిస్తుంది. మొత్తం మీద చర్చనడిచినందుకు అయితే నాకు ఆనందగా వుంది. ఆచర్చ నుంచి ఎంతమంది అసలు చార్వాకం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు? చివరికి ఈ పుస్తకాలని పరిచయం చేసిన వ్యక్తితో సహా. తెలియాలంటే తెలుసుకున్న వారు వాటిని తిరిగి చర్చకు పెడితే బాగుంటుందేమో? ఆలోచించమని మనవి.

  5. venu

    BODDU.RAMA KRISHNA IS MY GRAND FATHER.I CAN TELL YOU ABOUT HIM.YOU CAN CONTACT ME AT venuavireni@gmail.com

  6. కొత్త పాళీ

    విశ్వనాథ చిట్లీచిట్లని గాజులు నవలికలో చార్వాకమతాన్ని గురించి కావలసినంత వివరమున్నది.

  7. కొత్త పాళీ

    మీకు చార్వాకం అంటే ఏవిటని తెలుసుకోవాలి అని ఉంటే విశ్వనాథ నవలలు కొన్నిటిలో చాలా విశదంగా చర్చిస్తారు, సరళమైన భాషలోనే. ముఖ్యంగా నేపాల రాజవంశ నవలల సిరీస్‌లో. నవలల పేర్లు చూసి చెప్తాను.

  8. Murty

    Thanks sowmya Garu, chala mandi pustapriyula samayanne save chesinanduku.

  9. narasimharao mallina

    చదివినప్పుడు మీకే సంతృప్తిని కలిగించని పుస్తకాలని గుఱించి ఎందుకు పరిచయం చేసారండీ బాబూ! మీ పరిచయం చదివిన తర్వాత పొరపాటున కూడా ఆ పుస్తకాలను చదవకూడదనే అభిప్రాయమే నాకు కలిగింది.

    1. సౌమ్య

      పుస్తకం నచ్చితేనే దాని గురించి రాయాలి అనేం లేదు కదండీ!

    2. Halley

      You may consider this one http://en.wikipedia.org/wiki/Debiprasad_Chattopadhyaya#Lokayata_.281959.29

      General tip: Esp if it is about Indian schools of philosophy be careful about the author’s credentials 😀 Lot of books like the one you mentioned exist in the market i think 🙂

Leave a Reply