వెల్కం టు డుబ్రోవ్నిక్…అను స్వగతం
నేను ఒక వారం రోజుల ట్రెయినింగ్ కోర్సు కోసం క్రొయేషియా దేశంలోని డుబ్రోవ్నిక్ నగరానికి వెళ్ళాను. ఇది పర్యాటకానికి బాగా ప్రసిద్ధి పొందిన నగరం. మా డార్మిటరీ గదుల్లో రకరకాల టూరిస్టు మేగజీన్లు పెట్టారు. వీటిల్లో ఒక “వెల్కం” సంచిక పై “Ruder Boskovic” అన్న శాస్త్రవేత్త బొమ్మ ఉంది. ఇదే బొమ్మ ఊర్లో ప్రతి చోటా చూడ్డం వల్ల, అసలిందులో ఏముందో అని సంచిక చదవడం మొదలుపెట్టాను. చదువుతూ ఉంటే, వీళ్ళ చరిత్ర గురించి ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారో! అని ముచ్చటేసినా, చూడబోతే చాలా కథ ఉన్నట్లుంది, ఒక్క రచయిత గురించి కూడా మనకి తెలీదే! అని కూడా అనిపించింది (మన రచయితల గురించి వాళ్ళకీ తెలిసుండకపోవచ్చు అనుకోండి, అది వేరే సంగతి!) ఆ సంచిక, అలాగే ఈ ఊరిలో పుస్తకాల గురించి గమనించిన కొన్ని అంశాలను పంచుకోవడం ఈ వ్యాసం ఉద్దేశ్యం. పుస్తకా ప్రపంచానికి సంబంధించిన వ్యాసమే కనుక, “అనుభవాలు-జ్ఞాపకాలు” అంటూ…మొదలుపెడుతున్నాను. (నేను చదివిన సంచికని ఆన్లైన్ లో ఇక్కడ చూడవచ్చు)
1) బోస్కోవిచ్ అన్న ఈ శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, తత్వవేత్తా, రచయితా (ఇంకెన్నో) – పుట్టి ఈ ఏటితో మూడొందల సంవత్సరాలు నిండుతాయట. కనుక, డుబ్రోవ్నిక్ నగరంలో ఆ సందర్భాన్ని ఒక పండుగ లాగా చేసుకుంటూ, అలాగే అతని తాలూకా వస్తువలను గురించిన ప్రదర్శనలూ, పోగొట్టుకున్న వాటి గురించి అన్వేషణలూ… అన్నీ చూస్తూ ఉంటే, చాలా ముచ్చటేసింది. తెలుగు దేశంలో ఇలా ఘనంగా (అంటే, నిజం అభిమానంతో…) జరిగిన సందర్భాల గురించి ఎవరన్నా చెబితే వినాలనుంది.
2) ఈ నగరానికి చెందిన “Matica Hrvatska” అన్న ప్రచురణ సంస్థ పిల్లల కోసం “Cvijeta” అన్న సిరీస్ పుస్తకాలు విడుదల చేయడం మొదలుపెట్టిందట. ఈ శీర్షికలో వెలువరిస్తున్న పుస్తకాల ఉద్దేశ్యం పిల్లలకి తమ సంస్కృతి గురించి, అందులో పుట్టిన గొప్ప వ్యక్తుల గురించీ తెలుపడమట. ఇప్పటి దాకా, ఇలా మూడు బొమ్మల పుస్తకాలు వెలువరించారట (క్రొయేషియన్ భాషలో!). మొదటిది ఇక్కడి ప్రముఖ నావికుడు “Miho Pracat” గురించి, ఒకటి ఇక్కడి ప్రముఖ రచయిత, నాటకకర్త అయిన “Marin Držić” గురించీ, చివరిది “Ruđer Josip Bošković” గురించీ.
-నా మట్టుకు నాకు ఆలోచన చాలా నచ్చింది. ఇలా మన వాళ్ళు కూడా ఏదన్నా మొదలుపెట్టాలి అనిపించింది. ఈమధ్యనే కినిగె.కాం సైట్లో బ్నిం గారు రాసిన “మరపురాని మాణిక్యాలు” పుస్తకం ఈ దిశలో తొలి ప్రయత్నం అని ఆశిద్దాం. మంచి పుస్తకం వారు కొన్ని బొమ్మల పుస్తకాలు ఎడమపక్క తెలుగు, కుడిపక్క ఆంగ్లం – ఇలాంటి పద్ధతిలో ముద్రించారనుకుంటాను. బహుశా, ఇలా కొంతమంది తెలుగు ప్రముఖుల గురించి కూడా పుస్తకాలు రూపొందించవచ్చేమో! (కినిగె.కాం లోనే “బాలరావణాయణం” అని ఒక పుస్తకం చదివాను…చార్వాకాశ్రమం వారిది. పుస్తకం నాకంత నచ్చలేదు కానీ, అలా బొమ్మల కథలు వేయడం వల్ల పిల్లల చేత చదివించవచ్చేమో!) నా చిన్నప్పుడు ఇలా నెహ్రూ గురించి, బోస్ గురించీ ఉన్న బొమ్మల కథల పుస్తకాలు మా ఇంట్ళో ఉండేవి. అజ్ఞానంలో మేము వాటికి చిత్ర విచిత్రపు రంగులేయడం, కాగితాలు చింపడం చేశామనుకోండి, అది వేరే సంగతి!!
3)పైన చెప్పిన “Marin Drzic” అన్న రచయిత శిలా విగ్రహం ఒకటి ఈ నగర కూడలిలో ఉంది. ఆ శిలావిగ్రహం చూసింది మొదలు, ఆయన కొన్ని హాస్య రచనలు చేసాడని ఎవరో గైడు ఒక గుంపుకి చెబుతూ ఉంటే విన్నది మొదలు – ఆయన రచనలేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండింది నాకు. కానీ, ఆన్లైన్ లో అయితే దొరకలేదు. ఈ పర్యాటక శాఖ వారి పనుల్లో భాగంగానే, మా డార్మిటరీ భవనం రిసెప్షన్ లో కొన్ని పుస్తకాలు పెట్టి ఉంటే, ఏమిటా? అని చూస్తున్నప్పుడు, ఇతని గురించిన చిన్న జీవిత చరిత్ర కనబడ్డది. ఇంకా చరిత్ర పుస్తకాలు అవీ పేట్టి ఉన్నాయి కానీ, ఇవన్నీ పత్రికలు కావు. విడిగా ముద్రించిన పుస్తకాల్లా ఉన్నాయి. సరిగ్గా నేను బయలుదేరబోతూండగా కనబడ్డది. ఏం చేయాలో తోచక, వెంటనే భవనం మేనేజర్ గదిలోకి వెళ్ళి, ఈ పుస్తకం కొనాలంటే ఎక్కడ దొరుకుతుంది? నాకు ఇక్కడ కూర్చుని చదివే వ్యవధి లేదు…అని అడిగాను. ఆయన రెండు క్షణాలు చూసి, దీన్ని తీసేస్కో, పర్వాలేదు అని నవ్వాడు. ఇవ్విధముగా అతని జీవిత చరిత్ర దొరికింది కానీ, రచనల తాలూకా ఆంగ్లానువాదాల గురించి తెలియలేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి.
4) ఒక సాయంకాలం వీథుల్లో నడుస్తూ, స్నేహితుల “సీ ఫుడ్” వేట నుండి పక్కకొచ్చి “సీ బుక్స్” వేటలో పడ్డా :). ఒక పుస్తకాల షాపులోకి వెళ్ళి ఇక్కడి రచయితల ఆంగ్లానువాదాలు కానీ, ఆంగ్ల రచనలు కానీ ఉన్నాయా మీ షాపులో? అని అడిగాను. అతగాడు వెంటనే నన్ను ఒక వైపుకి తీసుకెళ్ళి ఏ అరలో ఎలాంటి పుస్తకాలున్నాయో (అనువాదాలు, నేరుగా ఆంగ్లంలో రాసినవి, కథలు, నవలలు, వ్యాసాలు వగైరా)…మొత్తం వివరించి వెళ్ళాడు!! ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నా అంటే; బెంగళూరు వెళ్ళిన కొత్తల్లో ఒక కన్నడ పుస్తకాల షాపుకి వెళ్ళి ఇదే ప్రశ్న వేస్తే, కన్నడ రచయితల ఆంగ్లానువాదాలు గానీ, ఆంగ్ల రచనలు కానీ తమ వద్ద దొరకవు అనేశాడు :(. ఇంతకీ, క్రొయేషియన్ రచయితల గురించి నాకేం తెలీదు కానీ, అక్కడ చాలా రచనలు ఉన్నాయి. చాలా మట్టుకు యుద్ధాల నేపథ్యంలో వచ్చిన రచనల్లాగా అనిపించాయి. ఒక నవల కొని చదవడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకూ అయితే, బానే ప్రభావం చూపుతోంది. పూర్తి చేశాక దాని గురించి పరిచయం చేస్తాను.
5) వీళ్ళ ఊరు గురించిన ముఖ్య విశేషాలు తెలియజెప్పడానికి వీళ్ళు పర్యాటకులకు ఉచితంగా ఇచ్చే పత్రికలు బోలెడు నడుపుతున్నారు. “డుబ్రోనిక్ టైంస్” అని ఒక దినపత్రిక, “వెల్కం” అని బహుశా ఏడాదికోసారో, రెండుసార్లో వెలువడే పత్రికా, “టూరిస్ట్ న్యూస్” అని ఇంకోటీ చూశాను. ఇంత తరుచుగా, ఇంత శ్రద్ధ తీసుకుని పత్రికలు వెలువరించడం చూసి ఆశ్చర్యపోయాను. అన్నింటిలోనూ ఆసక్తి కరమైన వార్తలే అని అనను కానీ, కనీసం, సమాచారం కోరుకునే వారికి కావల్సినంత సమాచారం అందుబాటులో ఉంది. మన దగ్గర “ఫ్రీ” గా ఇవ్వడం కుదరదు కానీ, కొనడానికన్నా, ఇలా శ్రద్ధగా రాసిన “స్థానిక చరిత్ర” పుస్తకాలు (మామూలు మనుషుల కోసం రాసినవి-చరిత్రకారులకోసం కాదు), ఉంటే, కాస్త ఇక్కడ వివరంగా వ్యాఖ్య రాయగలరు)
చివరగా: బాల్కన్ రచయితల పుస్తకాలు చదివిన వారెవరైనా, ఎక్కడ మొదలుపెట్టాలో సూచనలు ఇవ్వగలరు.
RK
Your concern seem well placed.
More than the lack of books on Scientists in Telugu,
it is more of a general lack of interest in books / reading
(and too much to expect of any historical sense)
But i dont think we lack books ( in telugu) on scientists.
For a start, i read a an excellent bio ( in telugu) on Dr.Nayudamma
pub by CP Brown Academy.
Btw,his memory is being perpetuated by many of his friends / followers / students at many places in AP / India.
At least i know one place,Tenali – where they organize an annual lecture by eminent scientists of india.
One rural center is working in a village near to Tenali.
(One more – NKC – A Nayudamma Knowledge Center is coming up in another small town)
About translations – Vargehese Kurien ( AMUL)
Though he is not considered a scientist inspite of his basic Q in sceince /engineering and is more rated as an administrator,
His recent bio translated into telugu is well worth the Read.
Regarding the statues i have some reservations.
( birds may not have any problems)
See this article by Ranganayakamma on the demand of Chalam’s followers to safeguard his cemetry.
Btw, i too was in Drubnovik, said to be the oldest city,continuously inhabited.
And they have the statue of the famed scientist’s Nicholas Tesla too in a city nearby. ( Edison may differ)
Regarding the Balkans & their wars though i’m not an expert, but can well say that it is too complicated and if you want to start may have to go all the way in to their past.
As some one said, start at the beginning. 🙂
RK
sagar
meeru rasina article chala bagaunadhi .