Seeing. – Saramago
స్థూలంగా “సీయంగ్” అనే నవల కథాంశం ఇంతే! ప్రజలచే, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల పని(చేయని)తీరుని హైరానాలు పడకుండా నింపాదిగా విమర్శించటం జరుగుతుంది. ఎన్నుకోబడేంతవరకే మీరు మా దేవుళ్ళు, ఎన్నికైనాక మీకూ మాకూ సంబంధాలేం ఉండవన్నట్టు వ్యవహరించే ప్రభుత్వాల పరిపాలనలో ఉన్నవారికి “మన కథే!” అనిపించే గాథ. ఒక కీలక నిర్ణయానికి అవునో, కాదో చెప్పటానికి ’ఇంకీ, పింకీ, పాంకీ’ అంటూ ఆటలాడుతున్నట్టుండే ప్రజాప్రతినిధులతో వేగే ప్రజల జీవనచిత్రాలకు దగ్గరపోలికలున్న చిత్రవిచిత్రాలు ఇందులో బోలెడు. బానిసత్వానికన్నా దుర్భరమైనది, బహుశా, తమ వేలే తమని పొడిచిందని తెల్సి కూడా ఏం చేయలేకుండా ఉండిపోవడం అని నాకనిపిస్తుంది. ఇలాంటి భావోద్వేగాలెన్నింటినో రేగొట్టే పుస్తకం ఇది.
రెండో నవల, వ్యాధి మాయమైన నాలుగు సంవత్సరాలకు అదే దేశంలో మొదలవుతుంది. ఒక రోజున హోరున వాన పడి ఇళ్ళు కదిలే వీలులేకుండా ఉంటుంది. కాని, అదే రోజున ఎన్నికలు జరుగుతున్నాయి. వర్షాన్ని అధిగమించి ఓటు వేసే పౌరుడు కనిపించడు. సాయంత్రానికి తెరిపినివ్వటం వల్ల జనాలు తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేస్తారు. ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అనూహ్యంగా అన్ని పార్టీలకు వచ్చిన ఓట్ల సంఖ్య కన్నా ఎక్కువగా “బ్లాంక్ ఓట్లు” ఉంటాయి. అది గమనించి, ఏదో మతలబు జరిగిందని గ్రహించి, మళ్ళీ ఎన్నికలు పెడతారు. ఈసారి ముందు కన్నా ఎక్కువ బ్లాంక్ ఓట్స్ వేయబడతాయి. ప్రజానాయకులకు మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇదెలా జరిగిందో కనుక్కోమని ఓటర్ల పై నేరుగా వత్తిడి తీసుకొస్తారు. అది పనిజేయకపోవడంతో అలా ఓట్లేసిన ప్రాంతం నుండి ప్రభుత్వాన్ని తప్పించి, కనీస సదుపాయలను కూడా కల్పించకుండా ఆ ప్రాంత ప్రజలను ఆ ప్రాంతంలోనే బంధించినట్టు చేస్తారు. దాని వల్లా ఈ కుట్రకు మూలమేమిటో తెలీదు. అప్పుడు, ఆలోచనలకు అందని విధివిధానాలను అనుసరించిన రాజకీయ నాయకుల పుణ్యామా అని నేరం, బ్లైండ్‍నెస్ నవల్లో అంధత్వం సోకని మహిళను చుట్టుకుంటుంది. అధికారులకు ఆమెది తప్పులేదని తెల్సు? మరి కాపాడగలిగారా? లేదా ఆమె తప్పుందా? ఇంతకీ ఏమయ్యింది? – ఇవ్వన్నీ ఈ నవలను పూర్తిచేస్తాయి.
మాజిక్ రియలిజమ్ అంటే ముందుగా వినిపించే పేరు మార్క్వెజ్. ఇక పై నా జాబితాలో మొట్టమొదటుండే పేరు: సరమాగో!
తమ సిద్ధాంతాలను పాఠకుల మీదకు రుద్దడం కోసమో, ఈ లోకం నచ్చకనో, మెచ్చకనో, కనీసం పుస్తకాల్లో అయినా అవధుల్లేని ఆనందాలని అందించాలనో కాల్పనిక సాహిత్యాన్ని చేపట్టే రచయితలు చాలా మంది. కాని, చెహొవ్ అన్నట్టు మన జీవితాలెంతటి దుర్భరమైనవో, మన బతుకులనెట్లా ఈసడించుకుంటూ ఈడ్చుకొస్తున్నామో తెలియజేయటానికి ఊహాశక్తికి పదునుపెట్టి, మాటల ఉలితో చెక్కి మనోహరమైన రచనలు సృష్టించే అరుదైన జాతికి చెందిన రచయిత సరమాగో! ఈయన రచనలు చేయడం సాహిత్యలోకపు అదృష్టం.
Madhu
Very good. Feel like reading it after reading this brief introduction.
Purnima
My bad. Corrected now. I meant, మించని. Saramago is subtle with his humour and sarcasm.
Pardon me for the typos.
Ramesh
మరొక మంచి పరిచయం, పుస్తకం చదవాలనిపించేలా.
@అవసరమైన చోట్ల మోతాదు మించిన హాస్యం ఎటూ ఉంటుంది.
అవసరమైన చోట్ల, మోతాదు మించిన, ఎటూ – ఎంటో, ఇవి ఒక వాక్యం లో ఉంటే అర్ధం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉందండి.