గుత్తొంకాయ కూర – మానవసంబంధాలు: శ్రీ రమణ
ఫలనా రచయితగారు బాగా రాస్తారు అని తెల్సుకున్న తర్వాత ఏదైనా ఓ పుస్తకాల కొట్టు ఆయనవి పుస్తకం చేతిలోకి తీసుకోగానే “అదో” ఫీలింగ్! ( “అదో” ఫీలింగ్ = ఓ మనిషిని గురించి చాలా విని ఉండి, ఆ మనిషి మన ఎదురుపడే సరికి కాస్త తెల్సినట్టుగానూ, చాలా అయోమయంగా ఉన్నట్టన్నమాట!) అలా శ్రీరమణ గారి గురించి తెల్సాక నేను చూసిన మొదటి పుస్తకం “గుత్తొంకాయ కూర – మానవసంబంధాలు”. టైటిల్ కాస్త వింతగా ఉండేసరికి వెనక్కి తిప్పి చూస్తే, ఈ వాక్యం కళ్ళబడింది. “దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక కవితా సంపుటిని ఆవిష్కరిస్తూ – “మనం జాగ్రత్తగా పరిశీలించినట్లైతే ఈ కవిగారి రచనలలో అక్కడక్కడ కవిత్వం కూడా కనిపిస్తుంది” అని స్పష్టం చేశారు. అలాగే మీరు ఈ పుస్తకంలో వ్యాస పరంపరను శ్రద్ధగా చదివినట్లయితే, అక్కడక్కడ హాస్యం కూడా తగులుతుందని మనవి చేస్తున్నాను.” ఇది చదవడమూ – ఫక్కుమని నవ్వడమూ- అంతా నాకేసి చూడ్డమూ- నేనీ పుస్తకం కొనేయడమూ ఎంత త్వరత్వరగా జరిగిపోయాయో, ఈ పుస్తకం చదవడం కూడా అంతే త్వరగా జరిగిపోయింది.
హాస్య వ్యంగ్య సంపుటిగా వెలువడిన ఈ పుస్తకంలో మొత్తంగా అరవై ఆయిదు వ్యాసాలున్నాయి. ప్రపంచంలో ఉన్న చాలా వాటితో “మానవసంబంధాల” ఎలా ఉంటాయన్న దాని మీద రాయబడ్డ వ్యాసాలు. “అసలు మానవ సంబంధాలంటే ఏంటి?” – మానవ సంబంధాలన్న మాట అని సవివరంగా వివరిస్తూ మొదలవుతుందీ పుస్తకం. నేను వేరే పుస్తకంలో చదివిన ఈ వాక్యాలను ఆధారంగా చేసుకున్నట్టే ఉంటాయి ప్రతీ వ్యాసం:
“The truth is, we each of us have an inborn conviction that the whole world, with everybody and everything in it, was created as a sort of necessary appendage to ourselves. Our fellow men and women were made to admire us and to minister to our various requirements. You and I, dear reader, are each the center of the universe in our respective opinions.”
ఈ పుస్తకం శ్రద్ధగా చదవితే నవ్వుకోవడం మాట అటుంచి (సరే.. నవ్వుకున్నాకే) గుర్తుపెట్టుకోగలితే ఇందులో కొన్ని చమక్కులు యద్ధేచ్చగా వాడుకోవచ్చును. “ఏంత పేద్ద చెఫ్ చూపించే వంటకంలోనైనా “సాల్ట్ ఆస్ పర్ టేస్ట్” అంటారే కానీ, ఇంత అని ఖచ్చితంగా ఎందుకు చెప్పరంటే, “ఉప్పు” వంట మొత్తానికీ రుచి. “ఆ ఒక్కట్టీ” చెప్పేస్తే ఎలా మరి?” అని అంటారు “ఉప్పు” వ్యాసంలో! అలాంటివే మరి కొన్ని:
“మహిమల గురించి మాట్లాడే వాళ్ళు లేకపోతే దేవుడు కూడా మరుగునపడిపోతాడు.”
“వక్తకి శ్రోతలు జారిపడిన అక్షరాల్లా కనిపిస్తే, శ్రోతలకి వక్త అక్షరాలతో చేసిన ముద్ద ద్యోతకంలా అవుతాడు.”
“పుస్తకాలు కొనడమా?! బార్బేరియస్.. బుక్స్ ఆర్ ది బెస్ట్ కండెక్టర్స్!” అని ఒక ఇంజనీరు గారు అన్నార్ట! (పుస్తకాలే లేకపోతే ప్రేమలేఖలెలా అటు నుండి ఇటు చేతులు మారుతాయి అన్న ఉద్దేశ్యంలో)
వ్యాసాలన్నీ ఏ త్రివిక్రమ్ సినిమాలోలా “పంచ్”ల మీద “పంచ్”లతో నిండిపోయుందనుకుంటే పొరపాటే! పురాణాల కథలనుండి, వారి బాల్యంలో కథలూ, స్వానుభవాలైన కథలూ, ఎక్కడెక్కడో విన్న కథలు చాలానే ఉంటాయి. ఈ వ్యాసాలు రాసేటప్పుడు లోకంలో ప్రాచుర్యం పొందిన కథలూ, పత్రికలు వాళ్ళు రాసి నమ్మించిన వాటి గురించీ ప్రస్తావన ఉంటుంది. మానవసంబంధాల మీద వేసిన చెణుకుల్లో కూడా చాలా జ్ఞానం ఉండనే ఉంటుంది. కాకపోతే ఇవి ఏవో పత్రికలో వచ్చిన వ్యాసాలు కనుక ఆ తారీఖులుండుంటే రచనా కాలంతో పాటు, అప్పటి రాజకీయ సామాజిక పరిస్థితులూ తెల్సుకునే వీలుండేది. అలా లేకపోవటం వల్ల “ఇప్పుడు మన వాళ్ళు”, “మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశం” అన్న చోటల్లా, “ఎప్పుడయ్యుంటుంబ్బా!” అని కాసేపు ఆలోచించుకునే అవకాశం ఉంది.
“ఏదో రాసేమా?” అంటే “రాసామూ” అనుకోవడానికి పై పేరాల్లో ఏదో రాసేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు అసలు విషయం. ఇలాంటి పుస్తకాలకి పరిచయాలూ, సమీక్షలూ, గోంగూరలూ అనవసరం. పుస్తకం కనిపిస్తే కొనేసి, బుద్ధిగా చదివేసుకోవాలి నవ్వుకుంటూ.. అంతే! ఒకసారి చదువుకున్నాక, చేతికందేంత దగ్గర్లో పెట్టుకుంటే విసుగు, చిరాకు, దిగులు లాంటి విసిటర్స్ వచ్చినప్పుడు “ట్రీట్” చేయడానికి ఉపయోగపడుతుంది. మీరీ పుస్తకం కొని చదువుకోండి. సన్నిహితులకూ ఆప్తులకూ కొని ఇవ్వండీ.
*******************************************************************************************************************
పుస్తకం: గుత్తొంకాయ కూర – మానవసంబంధాలు. (Guttonkaya Kura, Manava Sambandhalu)
రచన: శ్రీ రమణ (Sree ramana)
వెల: రూ|| 75
అన్ని విశాలాంధ్ర కేంద్రాల్లో లభ్యం
Krishna chaitanya
Purnima gaaru mee reviews chala baavunnayandi..Meeru emi anukoka pothe mimmalni oka favour adugudamanukuntunnanandi..nenu canada lo MS student ni..naaku baagaa telugu books chadive alavatu..but ikkada kudaradam ledu..meeru konni books suggest cheste ee saari india vachinappudu konukkuntaanandi..Bapu&Ramana gaari kothi kommachi laanti books cheppandi plz..your suggestion will be highly appreciated..
Purnima
I’ve drafted an article on similar lines, my recommendations in telugu literature. Would post that as soon as possible.
శివ బండారు
నేను పుస్తకాలను పెద్దగా చదవను గాని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో రమణగారి వ్యాసాలు చూసేవాడిని. చక్కని హాస్యంతో ఆకట్టుకుంటాయి .
Sowmya
Thanks Ramya. Will checkout.
ramya
soumya photo pampincanu . spam ki vellindemo coodandi.
సౌమ్య
@Ramya: ఇవ్వండి.
ramya
నా దగ్గరా ఉందీ పుస్తకం 🙂
ఎక్కడనుండైనా మొదలెట్టి చదుకోగల పుస్తకాలు కొన్నుంటాయి వాటికోవలోకి చెందిందే ఇదీ.
అన్నట్టు పుస్తకం పొటో పెట్టలేదు! నేను తీసి ఇవ్వనా?
Praveen Rangineni
మీరు “అప్రస్తుత ప్రసంగాలు” చదివారా? శంకర నారాయణ గారిది…భలే ఉంటది అది కూడా!
AVKF వారి booklink లో లభ్యమవుతుంది.
mahender
hello naku elani blags ante chala estem meeku na yokka hrydhaya purvaka shubakanxalu namaskaramu byeee
Yogi
మీరు చదివిన ఆ వేరే పుస్తకం Idle thoughts of an Idle fellow. వ్రాసినది జెరోమ్ కె జెరోమ్. మీకు తెలిసినా, ఇది చదవబోయే మిగతావారి కోసం దాని లంకె ఇస్తా 🙂
http://en.wikisource.org/wiki/Idle_Thoughts_of_an_Idle_Fellow
భమిడిపాటి ఫణిబాబు
మీరు చెప్పినది అక్షరాలా నిజం. శ్రీరమణ గారివి కానీ, ముళ్ళపూడి వారివి కానీ కొనేసి మనకి అందుబాటులో ఉండేటట్లుగా ఉంచుకోవాలి. ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు చదువుకోవడానికి !! ఎవ్వరికీ ఇచ్చేయకూడదు.