Cardus on Cricket
జేమ్స్ థర్బర్ అనే ప్రఖ్యాత అమెరికన్ హాస్యరచయిత పుస్తకానికి పరిచయవ్యాసం ఇలా మొదలవుతుంది:
The book by James Thurber that you are about to read or re-read was published originally in 1933 – a date which in many ways seems to a lifetime ago and, indeed, in someways was a lifetime ago. Think for a moment of all the gifted writers who, since then, have come and gone, and with them their books that promised to endure and did not. Then turn to My Life and Hard Times, and observe that it has faded not at all – that, on contrary, it is as alive and wise and funny as it was when it was born.
This is, of course, another way of describing a classic – which is to say, a work that defies time and may even be enrinched by it.
పై రెండు పేరాల్లో రచయిత పేరును Cardus గానూ, పుస్తకం పేరును ఆయన రచనలతోనూ మారిస్తే ఆ వాక్యాల్లోని నిజం రవ్వంతైనా తగ్గదు!
పుస్తక పరిచయం:
ఇది Cardus తన జీవితకాలంలో చేసిన అనేక రచనల్లో నుండి తనకు నచ్చిన వ్యాసాలూ ఏరి ఒక చోట అందించడానికి Rupert Hart-Davis అనే ఆయన చేసిన ప్రయత్నం. మొదటి ప్రచురణ 1949లో. Cardus రాసిన Cricket, “Days in the Sun” (1924), “The Summer Game”(1929), “Good Days”(1934), “Australian Summer”(1937) వంటి రచనల నుండి నలభైకు పైగా వ్యాసాలు ఎంపికచేయబడ్డాయి. ఆయన ఇతరత్రా పత్రికలకు రాసిన వ్యాసాలూ ఒకటీ అరా ఉన్నాయి. మొదట్లో సంకలనకర్త Cardus గురించి రాసిన పరిచయవ్యాసం వల్ల ఆయనను గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి.
తన జీవితకాలంలో ప్రత్యక్షంగా (అప్పట్లో ప్రత్యక్షేతరంగా – అంటే రేడియోల్లో వినటం, టివీల్లో చూడ్డం – లేవు గనుక!) చూసిన క్రికెట్ మాచ్‍ల గురించి అప్పట్లో ఆడిన ఆటగాళ్ళూ, అంపైర్లూ, స్టేడియంలో చూసే ప్రేక్షకుల గురించి, అందాన్ని అవలీలగా గ్రహించి అంతే అందంగా విపులీకరించారు. ఆయన ఒక క్రికెట్ క్రిటిక్‍గా అభివర్ణించబడ్డా ఆయన వ్యాసాల్లో ఏ ఒక్కటి చదివినా ఆయనలోని క్రికెట్ అభిమాని మనతో జతకడతారు. ఆయన సామాన్య రచయిత కాదు. పేపర్‍లో తనకివ్వబడ్డ కాలమ్‍లో సరుకు నింపి ఊరుకునేంతటి రచయిత అసలే కాదు. ఆయన క్రికెట్ గురించి రాసినా అది ఒక కథలా, కవితలా అనిపిస్తుంది. ఈయన ఫిక్షన్ రాసేరో లేదో తెలీదు నాకు. రాయకుంటే ఆంగ్ల భాష ఓ గొప్ప కథకుడినో, నవలాకారుడినో మిస్స్ అయిందనే అని అనిపిస్తుంది నాకు.
కాలం భలే తమాషాగా పనిచేస్తుంది. కాలగర్భంలో కల్సిపోయిన కొందరిపై అనుచిత మమకారం చూపించి భావితరాల వారికి వాస్తవానికి దూరంగా ఉన్న మహాద్భుతాన్నేదో చూపిస్తుంది. కొందరి విషయంలోనేమో బహుశా, వారి గొప్పతనాన్ని భుజాన వేసుకొని తిరగలేక ఒట్టి రేఖాచిత్రాలను మాత్రమే చూపించగలుగుతుంది. బ్రాడ్‍మాన్ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేవి ఏమిటి? 99.94 అనే సంఖ్య. 29 సెంచరీలు. ప్రపంచపు అత్యుత్తమ బాట్స్ మెన్. ఆస్ట్రేలియన్లకు ఆరాధ్యుడు. మన సచిన్‍లో తనని తాను చూసుకొని మురిసిపోయినవాడు. అంతేనా? ఈ బ్రాడ్‍మాన్‍లో విలక్షణ లక్షణాలు ఏంటి? ఆటతీరు ఎలా ఉండేది? తన టీంని భుజాలపై ఎలా మోసేవాడు? అతని ఆటలో లోపాలేంటి? అసలు క్రికెట్ ఆటను అతడెలా భావించేవాడు? అతడి ఆటను ప్రత్యక్షంగా చూసిన వారిలో ఎలాంటి అనుభూతిని అందించేవాడు? ఇవ్వన్నీ ఇప్పటి మనకి ఎలా తెలుస్తాయి?
బ్రాడ్‍మాన్ గురించి ఆ మాత్రం అన్నా తెల్సు. మరి W.G.Grace? Patsy? George Gunn? మన “రంజీ” ట్రోఫీని ఎవరి పేరు మీద పెట్టారో.. ఆయన గురించి?
అలా తెలియాలంటేనే ఒక కార్‍దస్ ఉండాలి. ఆయన వెళ్ళితి-చూసితి-రాసితి అన్నట్టుగా రాయలేదు. తన మనోనేత్రం అనే కెమరాలో బంధించబడిన వీడియోకి తన ఆత్మ నుండి వెలువడే ఆడియోను జతపరచి భద్రపరిచారు. ’ఆంగ్ల భాష చదవడం’ అనే తాళం చెవి ఉంటే చాలు, ఆ వీడియో తెరుచుకుంటుంది. తెరుచుకొని క్రికెట్ పసితనాన్ని, తప్పటడుగులని, ఒడిదుడుకులను, అల్లరి చేష్టలను మనకి పరిచయం చేస్తారు. కాదు. కాదు. ఆయన అనుభవాలతో మనం పరోక్షంగా అనుభవింపజేస్తారు. తేలిగ్గా చెప్పాలంటే మీ ఊర్లో, మీ వీధి చివర్న బడ్డీ కొట్టువాడు వేసే పుల్లట్ల వాసనను తన అక్షరాల్లో మళ్ళీ వాసనచూపించగల దిట్ట ఆయన.*
(*ఆయనగాని మీ ఊర్లో, మీ వీధి చివర్న బడ్డీ కొట్టువాడు వేసే పుల్లట్ల వాసన చూసుంటే, అది ఆయనకు నచ్చుంటే..)
అన్నట్టు కార్దస్ హాస్యప్రియులు. ఆయనకు కార్టూన్స్ గీయడంలో కూడా ప్రవేశం ఉందట. ఆయన వచనంలో కూడా తమాషా వ్యాఖ్యలకు కొదవుండదు.
పుస్తకం – నా అనుభవాలు:
ముప్పొద్దులా బిర్యాని తప్ప మరేం తిననివాడికి, మజ్జిగన్నం దొరికినట్లుగా, ఏసీల్లో మగ్గి మగ్గి ఉన్నవాడిని పిల్లగాలి తాకినట్టుగా, మండుటెండలో నడుస్తున్నవాడికి, కాసింత నీడ దొరికినట్టుగా, స్వస్థలంలోనే ఉంటూ స్వభాషను మర్చిపోయినవాడికి భాషను పరిచయం చేసినట్టుగా, ఏక్తా కపూర్ సీరియల్‍లో ఆడపిల్లను తీసుకొచ్చి, మేకప్ తుడిపించి, మొహం కడిగించి, ఇంత బొట్టు పెట్టి, “అమ్మాయే!” అని చూపించినట్టుగా.. ఈ పుస్తకం నన్ను ఆదుకుంది.
క్రికెట్, గ్లామర్ ఒకే నాణానికి రెండు వైపుల్లా తయారై, ఆట కన్నా ఆటేతర విషయాలే ఎక్కువగా కనిపిస్తూ ఆటలోని అందంకన్నా చుట్టూ ఉన్న అందాలవెంట పరుగులు తీయిస్తూ, సిక్స్-కాచ్ లాంటి సాంకేతిక పదాలు కూడా “డిఎల్‍ఎఫ్ మాగ్జిమమ్-కార్బన్ కమాల్ కాచ్”లుగా రూపాంతరం చెందుతూ, ఒక ఓవర్లో కీలకమైన ఆరో బంతిని నామమాత్రపు లాంఛనంగా పరిగణింపబడుతూ, గెలిస్తే వికటాట్టహాసాలూ, ఓడిపోతే మారణకాండలూ జరుపుతూ “అసలు క్రికెట్ ఎక్కడ?” అని వెతుక్కుంటున్న సమయంలో కార్‍దస్‍ను చదవటంలో ఉన్న హాయి అంతా ఇంతా కాదు. ఎందుకంటే, పైపై మెరుగులు ఎన్ని వచ్చి చేరినా క్రికెట్ అప్పటిలానే ఉంది అని వ్యాసాలు చదువుతున్నప్పుడు చాలా సార్లు అనిపించింది. అప్పటివారిలోనూ దారికి అడ్డంగా వెళ్ళి కొత్త పుంతలు తొక్కిన వారు ఉన్నారు. ఆ కాలం నుండీ ఆస్ట్రేలియా “విజయం” కోసమే ఆడుతుంది. అప్పటి నుండీ ఇంగ్లాండ్ తన mediocrity ని అంటిపెట్టుకొని ఉంది. అప్పట్లోనూ బ్రాడ్‍మాన్ “అంత గొప్పవాడు కాదు” అన్న చర్చలు తప్పలేదు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారినా ఇంకా చాలా అలానే మిగిలి ఉన్నట్టు అనిపిస్తుంది.
పదకొండు మంది మూర్ఖులు ఆడేటప్పుడు, పదకొండు వేల మంది చూడ్డమే, క్రికెట్ ఆటంటే అని అభివర్ణించారు, జె.బి.షా గారు. అక్షరలక్షలు. కాకపోతే, గమనింపవలసిన విషయమేమిటంటే, ఎప్పుడూ పదకొండు మూర్ఖులే ఆడలేదు. విశిష్ట వ్యక్తిత్వంగల వారూ, విస్మయం కలిగించే ప్రజ్ఞ కలిగేవారూ ఆడారు. ఆడుతున్నారు. అందుకే, ఒక శతాబ్దం నుండీ క్రికెట్ ఆట సజీవంగానే ఉంది. ఆ ప్రవాహాన్ని కొందరు మూర్ఖులు అడ్డుకుంటున్నా ఇంకా గెలుస్తూనే ఉంది.
ఒక బ్రాడ్‍మాన్ ఒక సచిన్‍లో తనని తాను చూసుకున్నాడు. ఒక సచిన్ తన ఆటతీరుతో చాలా దగ్గరపోలికలున్న ఒక సెహ్వాగ్‍తో దశాబ్ద కాలంగా ఆడుతున్నాడు. కాని ఒక కార్‍డస్ తర్వాత మరో Cardus ఎందుకు రాలేదు?! క్రికెట్‍కున్నంత అదృష్టం క్రికెట్ సాహిత్యానికి లేదనుకుంట. Sad!
క్రికెట్, పుస్తకపఠనం రెండూ మీ అభిరుచుల్లో ముందంజలో ఉంటే ఈ పుస్తకం తప్పక చదవండి. Fall for cricket, all over, yet again!
_______________________________________________________
సౌమ్య
ఇవ్వాళ్టి హిందూ లిటరరీ రివ్యూలో ఈ పుస్తకం పై నవతేజ్ సర్నా రాసిన వ్యాసం ఇదిగో.
http://www.thehindu.com/todays-paper/tp-features/tp-literaryreview/article2422357.ece
RK
Above RK is not me!
Rk
Though i have not read this book,heard a lot about Neville Cardus.
Any one from India rated similarly from that Era?
Now we have Ram Guha whose writings on cricket are highly enjoyable.
Similarly,Nirmal Shekhar in HINDU (some time earlier,if not now)on Tennis especially
Reminds me of few others (on cricket & otherwise )-
” Beyond the Boundary” – C.L.R.James
a highly rated social & cricketing commentary in WI.
( A similar kind of book with SriLankan background
is recently reviewed in Outlook.
(Vaguely remember seeing a small book by George Orwell.??)
Rk
Chowdary Jampala
పూర్ణిమ గారూ:
పరిచయం బాగుంది.
నేను క్రికెట్ గురించి కొత్తగా తెలుసుకొంటున్న రోజుల్లో ఇంటూరు లైబ్రరీలో Dom Moraes రాసిన Green is the grass అనే చిన్న పుస్తకం దొరికింది. ఈ పుస్తకం రాసినప్పుడు డాం మొరేస్ వయసులో బాగా చిన్నవాడు. (ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు సంపాదకుడిగా ప్రఖ్యాతిగాంచిన ఫ్రాంక్ మొరేస్ కుమారుడు. తరువాత కవిగా, పాత్రికేయుడిగా పేరు పొందాడు; అప్పటి అందాలరాణి, నటి లీలానాయుడుని పెళ్ళి చేసుకొన్నాడు; ఐదారేళ్ళ క్రితం చనిపోయాడు). క్రికెట్ మీద రాతలంటే ఇప్పటికీ నాకు ఆ పుస్తకమే గుర్తుకు వస్తుంది. స్వతంత్రానికి ముందు బొంబాయిలో జరుగుతుండే పంచముఖ (Pentangular) క్రికెట్ టూర్నమెంట్ గురించి, అప్పటి గొప్ప ఆటగాళ్ళ గురించి మంచి వ్యాసాలున్నాయని గుర్తు.
నేను కాలేజీలో ఉన్న రోజుల్లో Indian Expressలో ఎన్.ఎస్. రామస్వామి క్రికెట్ విలేఖరిగా ఉండేవాడు. అతని రిపోర్టులు చదవడానికి చాలా బాగుండేవి. ఆయనే Cancerian (?) అన్న పేరుతో మద్రాసు మూర్ మార్కెట్లో పాతపుస్తకాల షాపుల్లో దొరికే ఇంగ్లీషు పుస్తకాల గురించి ఆదివారం Sunday Standardలో రాస్తుండేవాడు. ఆయన్ని కార్డస్‌తో పోలుతుండేవారు తెలిసినవాళ్ళు.
Rediffలో రిపోర్టులు తప్పించి ఇప్పటి క్రికెట్ రాతలతో నాకంత పరిచయం లేదు.
అన్నట్లు, సి.కె.నాయుడు జీవిత కథ త్వరలో తెలుగులో రాబోతుందని విన్నాను.