And then what happened, Paul Revere?

రాసిన వారు: జి.లలిత
************
అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి ప్రదాత. “తెలుగు వీర లేవరా!” అంటూ ఆయన పేరు మీద తీసిన సినిమాలోని పాట పోరాట పటిమను మేల్కొలుపుతుంది. పాఠ్య పుస్తకాలలో అతని కథను చదువుకుంటాము. ఇప్పుడు నేను ప్రస్తావించే పుస్తకం చదివితే నాకు అల్లూరి సీతా రామరాజు గుర్తుకు వచ్చాడు.

ఈ పుస్తకం నేను ఎందుకు చదివాను? ఇది మా పెద్దబ్బాయి పరిశోధనాంశం కోసం చదవవలసిన పుస్తకాలలో ఒకటి. ఇదే పుస్తకం అనుకోకుండా మా చిన్నబ్బాయి బడిలో పుస్తకాల పోటీకి చదవ వలసిన పుస్తకాలలో ఒకటి. పెద్దవాడు పుస్తకాల పురుగు. చిన్నవాడికి చదవడానికి తోడు కావాలి. అందుకని వాడితో పాటు నేనూ చదివాను ఈ పుస్తకాన్ని. అందువల్ల నాకూ లాభం దొరికింది. మంచి విషయాలు తెలిశాయి.

పాల్ రివియర్ ఎన్నో పనులు చేశాడు. అన్నిటిలోకీ బాగా గుర్తుండిపోయినది, “Big Ride”. American revolutionary war లో సందేశాలు త్వరితంగా పంపడానికి పాల్ రివియర్ మీద ఆధారపడే వారట. అత్యంత వేగంగా గుర్రాన్ని నడిపించి గమ్యానికి చేరి సందేశం అందించి అలుపెరగకుండా తర్వాతి పనికి సిద్ధమయ్యే వాడట.

ఈ పుస్తకంలో అతని గురించిన కథనం ఎంతో రసవత్తరంగా సాగుతుంది. అలాగని అతని వల్ల జరిగిన కొన్ని పొరపాట్లూ, అతనకి కలిగిన ఆటంకాలూ, అదే సమయంలో ముఖ్య పాత్ర వహించిన ఇంకొందరి ప్రస్తావనా వదిలిపెట్టలేదు కూడా. పాల్ రివియర్ చేసిన పనులన్నీ గురించి కూడా శ్రద్ధగా వ్రాశారు, అతని కుటుంబం గురించి కూడా ఉంది.

పాల్ రివియర్ తన మనుమలకి తన Big Ride కథని చెప్పేవాడని, వారు, “తర్వాత ఏమయ్యింది?” అని అడుగుతూ కథను ముందుకి నడిపే వారు అనీ చెప్పడంతో ముగుస్తుంది పుస్తకం. పుస్తకంలో కూడా, ముఖ్యమైన ఘట్టాల గురించి చెప్పేటప్పుడు, “And then what happened” అంటూ నడుస్తుంది కథనం.

ఈ పుస్తకం నాకు ఎందుకు నచ్చింది?

ఒకటి, కథనం gripping గా ఉంది. రెండు, American Revolutionary war గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఆ ప్రతిఘటన ఎంత organised గా జరిగిందో అని అనిపించింది. ఏదైనా మార్పు కావాలనుకున్నప్పుడు, పోరాటం జరపాలనుకున్నప్పుడు ఉత్సాహానికి organisation తోడైతే ఎలా ఉంటుందో కళ్ళెదుట కనిపించినట్లనిపించింది.

అన్నిటికన్నా నన్ను ఆకర్షించినది, పిల్లల కోసం, పిల్లలకు అర్థం అయ్యేలా, ఉత్సాహం కలిగించేలా (ఆవేశం కాదు) రాయడం. అతిశయోక్తులు లేకుండా, ఇబ్బందులూ పొరపాట్లు వంటి వాటి మీద ముసుగు కప్పకుండా super hero అనదగ్గ మనిషిని ఒక “మనిషిగా” పరిచయం చెయ్యడం.
ఇటువంటి పుస్తకం అల్లూరి సీతారామరాజు గురించి ఉన్నట్లు ఎవరికైనా తెలుసా? తెలిస్తే పరిచయం చెయ్యగలరు. ఇప్పటి వరకూ ఇటువంటి పుస్తకం లేకుంటే తగిన పరిశోధన చేసి మనమే తయరు చెయ్యాలి. అలాగే తెలుసుకోదగ్గ వారిని అందరి గురించి కూడా.

************
పుస్తకం వివరాలు:
And Then What Happened, Paul Revere?
రచన: Jean Fritz
బొమ్మలు: Margot Tomes
వెల: 335

అమేజాన్ కొనుగోలు లంకె ఇక్కడ.

ఫ్లిప్కార్ట్ లంకె ఇక్కడ.

You Might Also Like

One Comment

  1. prasanth

    పరిచయం ఇంకాస్త వివరంగా సాగితే బాగున్ను.

Leave a Reply