మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి లైబ్రరీ

బెంగళూరు నగర శివార్లు దాటాక, నందీ హిల్స్ వెళ్ళే మార్గం లో ముద్దెనహళ్ళి అన్న గ్రామం ఉంది. అది విఖ్యాత ఇంజినీరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మస్థలం. అక్కడ ఇప్పుడు వారి వస్తువులతో కూడిన మ్యూజియం ఒకటి ఉంది. అందులో ఆయన భారతరత్న పట్టాతో సహా అనేక అపురూప వస్తువులున్నాయి. వీటన్నింటితోపాటు, ఆయన గ్రంథాలయంలోని పుస్తకాలను కొన్నింటిని కూడా అక్కడ పొందుపరిచారు.

ఆయన జీవిత కాలం – 1860-1962. అసలు ఆయనేం చదివారు? అన్న కుతూహలం ఒకటైతే, ఆ కాలంలో ఎలాంటి పుస్తకాలు ఎక్కువగా చదివేవారు? అన్న కుతూహలం మరొకటి. అలా ఆ పుస్తకాలు చూస్తూ ఉంటే, వాటి పేర్లను అందరితోనూ పంచుకోవాలనిపించింది. అక్కడ ఫొటోలకు అనుమతివ్వలేదు కనుక, ఫోను లో టైప్ చేసుకున్నవి కొన్ని, ఆ సమయంలో ఫోన్ చేసిన వేరొకరికి ఫోన్ లో డిక్టేట్ చేసి మెయిల్ పంపించుకున్నవి కొన్ని 🙂

Made in Japan – Gunter Stein (ఓహో, అప్పట్లో మరో మేడ్ ఇన్ జపాన్ పుస్తకం ఉండేదన్నమాట!)
Don’t be Tired – Peter Schimdt
Memoirs of My Working Life – Sir Mokshagundam Visveswarayya
Herbert N.Casson రాసిన బిజినెస్, మేనేజ్మెంట్ పుస్తకాలు మూణ్ణాలుగు కనబడ్డాయి.
Charles Waters అన్న ఆయన మోక్షగుండం గారికి 1881లో ఇచ్చిన నిఘంటువు. (చాలా పెద్దదిగా ఉంది.)..ఇది విశ్వేశ్వరయ్య గారు ఆయన మరణించే వరకూ..అంటే 1961-62 వరకూ ఉపయోగించారట!!
Tom sawyer abroad – Mark Twain
Stray birds – Tagore
Lectures and addresses-Tagore
The wreck-Tagore
Physiology of Faith and Fear – Sadler
Poems of Kabir
Promotion of general happiness – Macmilan
District development scheme -Mokshagundam Visveswaraih
Unemployment as a world problem- Keynes &co

రచయిత పేరు అదీ కొన్ని పుస్తకాలపై సరిగ్గా కనబడలేదు. ఈ పుస్తకాలు షోకేసులో మూలల్లో పెట్టి, ఆ గదికి మంచి లైటింగ్ అవసరమన్నా పట్టించుకోనందువల్ల వచ్చిన తంటా ఏమో! అవి –

Leather industry in india
Developing executive ability
Organizing a business for profit
Management
5 goodwills
Commonsense business leadership
Public speaking for businessmen

-ఇంకా ఉన్నాయి కానీ, అప్పటికే మ్యూజియం మూసే వేళైనందున కుదర్లేదు. అయితే, దాదాపు వందేళ్ళ క్రితమే ఆయన మేనేజ్మెంట్, బిజినెస్, సెల్ఫ్ హెల్ప్ వంటి విషయాల మీద ఇన్ని పుస్తకాలు చదివారంటే మాత్రం ఆశ్చర్యంగా ఉంది.

You Might Also Like

9 Comments

  1. పుస్తకం » Blog Archive » తిక్కన భారతం రాసిన చోటు..

    […] మ్యూజియం గా మార్చిన విషయం ఇదివరలో పుస్తకం.నెట్ లో కూడా రాసాను. ఏదో నేను థ్రిల్లైపోతాను […]

  2. pramila

    రాజాగారికి, నమస్తే.
    చాలా చాల థాంక్స్ అండి.
    చాల సంతోషంగా వుంది. అయన గురించి బుక్స్ దొరికింది అంటే.
    నా email id;; cf6pearls@gmail.com .
    ప్రమీల.

  3. hemanth

    Dear sir
    I have gone through the information.pl.let me have the copy of the book written by Sir Mokshagundam visveswarayya garu. my e mail. id ;;judgehemanth@gmail. Every citizen of our country has to know about this grate personolity.@gks raja:

  4. gks raja

    అసుర్యం పశ్య గారూ! మోక్షగుండం వంటి మహనీయులగురించి వ్రాశారు. చాలా సంతోషం. వారి సొంత ఊరు వెళ్లి ఆయనకు సంబంధించిన ప్రదర్శనను తిలకించడం మీ అదృష్టం. ఇటువంటి వారి గురించి భావితరాలకు తెలియజెయ్యడం అవసరం. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.
    ప్రమీలగారు! నా దగ్గర ఒకే పుస్తకం, మోక్షగుండం విశ్వేస్వరయ్యగారి గురించి, ఉంది. శ్రీ జానమద్ది హనుమచ్చాస్త్రి గారు రచించిన ‘భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య-సంక్షిప్త జివితపరిచయం’ ఉంది.విశాలంధ్ర వారి ప్రచురణ. వెల:రూ:25/-. నా దగ్గర pdf ఫార్మాట్ లో ఒక పుస్తకం ఉంది. విశ్వేశ్వరయ్య గారు రచించిన “RECONSTRUCTING INDIA” 17 MB సైజు ఉంటుంది. మీకు కావాలంటే మీ ఇ మెయిలు ఐ.డి. ఇవ్వండి. పంపిస్తాను. మీ అభిరుచికి సంతోషం. రాజా.

    1. Dilip Reddy

      నాకు కూడా పంపిచగలరు
      dilipreddy113@gmail.com

    2. hari prasad r

      please send me also that pdf formate

    3. Madhu

      I will appreciate, if you can send me. Madhu
      My email ID. mdevineni@gmail.com

  5. pramila

    shri moksha gundam visweswarayya gaari gurinchi chaala samvatsaraala tharuvaata vintunnaanu. aayana gurinchi pustakaalu ekkada dorukutundi.
    british vaari daggara ayana pani chesetappudu ayanaku chaala marapu raani sanghatanalau jariginayi.ani maa taatagaru cheppevaaru. kathalu , kathalugaa cheppe vaaru.

    ippudu meeru ichchina list lo memories of my working life anna perutho pustakam choodagaane elaagayinaa aa pustakam chadavaali anna
    korika baleeyamavutunnaadi
    dayachesi meeku ganuka aa pustakam dorikindi ante naaku teluputaararani aasistunnanu.
    pramila.

Leave a Reply