మాటే మంత్రము
రాసిన వారు: లలిత జి
కొన్ని పుస్తకాలూ, కథలూ, పాఠాలూ చదివి ఏళ్ళైనా, పాఠాలు, పేర్లూ, వివరాలూ మర్చిపోయినా, కొన్ని మాటలు మాత్రం పదే పదే గుర్తుకు వస్తుంటాయి. ఇప్పుడు వెతికి చూస్తే కొన్ని సార్లు వివరాలు తప్పుగా గుర్తున్నాయని తెలుస్తుంటుంది. సందర్భం మారిందో, జ్ఞాపకమే తప్పో తెలియదు కాని, ఆ మాటల ప్రభావం మటుకు నిజం. మాలతి గారి “ఊసుపోక – చేపాటికర్ర” గుర్తుకు వస్తుంది అలాంటి సమయాల్లో. “అటో గంటూ ఇటో గంటూ పెట్టి విరవబోతే పుటుక్కున విరిగిపోయింది పెన్సిలంత తేలిగ్గా. అందుకే అంటున్నాను ఈ కర్రముక్క నాకు ప్రాణదాయకి కాకపోవచ్చు. కానీ అది ఇచ్చిన ధైర్యం మాత్రం అపారం.”
అటువంటి ఉదాహరణతోనే మొదలు పెడితే పోలేదూ? నాకు గుర్తున్నది ఇలా. Edmund Hillary ఒక సారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానంగా “Because it is there.” అని జవాబు చెప్పాననీ, ఐతే ఆ జవాబు తనకి సంతృప్తినివ్వలేదనీ, దాని గురించి ఆలోచించగా ఏమనిపించిందో వివరణ ఇస్తూ, పాఠ్యాంశంలో ఉన్న భాగంలో చివరికి “It is not the mountain we conquer but ourselves.” అన్న సారాంశంతో ముగుస్తుంది. ఈ వ్యాసం రాద్దామని కూర్చుని గూగులిస్తే ఇంతకీ “Because it is there” సమాధానం George Mallory ది అనీ తెలిసింది. ఐతే నాకు ఈ పాఠం గుర్తు ఉండి పోవడానికి కారణం, ఒక సారి ఒక మాట అనేశాక దానిని పట్టుకుని వేళ్ళాడక్కరలేదనీ, అన్న మాటలలోని తప్పొప్పులను విశ్లేషించుకోవచ్చనిన్నూ. మరి రవీంద్రనాథును మాటలలో, “Wrong cannot afford defeat but Right can.” కదా!
నాకు ఎప్పుడూ గుర్తుకి వచ్చే కథలలో ఇంకొకటి, “A wrong man in workers’ paradise”. రబీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ కథలో కొద్ది భాగం మా అన్నయ్య వాళ్ళకు పాఠ్యాంశంగా ఉండేది. అందులో ఈ మాటలు నాకు గుర్తు ఉండిపోయాయి, “A hustling girl went every day to a silent torrent (silent, since in the Workers’ Paradise even a torrent would not waste its energy singing) to fill her pitcher.” శ్రమ(ఇష్టపడే)జీవుల స్వర్గాన్ని రవీంద్రనాథుడు వర్ణించడం ఒక ఎత్తైతే, మా అన్నయ్య మాటలలో నా కళ్ళకు కట్టిన అనుభూతి నేను మర్చిపోలేనిది. కథ శీర్షిక మా అన్నయ్యని అడిగి తెలుసుకున్నాను ఈ మధ్యే. ఇంతకీ కథ ఉద్దేశం పేరులో తెలుస్తోంది కదా. ఒక కళాకారుడి గురించి. ఈ కథ ఇప్పటికీ పూర్తిగా ఐతే చదవలేదు కానీ, నన్ను usefulness గురించి (నాణానికి రెండు వైపులూ) తెగ ఆలోచింపచేస్తుంది. చదువుదామని మళ్ళీ గూగులమ్మని అడిగితే పాఠంలో ఉన్నంత మటుకే కనిపించింది. ఈ కథ ఈ పుస్తకంలో ఉందని తెలిసింది. కొనాలి మరి. దొరికినంత మటుకు చదివితేనే ప్రతి లైనూ ఎంతో బావుందనిపిస్తోంది. ఆ ఊహ, ఆ సునిశితమైన హాస్యం, judgment లేకపోవడమూ , ఆ వ్యక్తీకరణ ఎంత బావున్నాయో. అలా రాయగలిగితే ఎంత బావుంటుంది! అలాంటి పుస్తకాలు కదా నేను నా కలలలో ఎండాకాలం సెలవులలో చెట్టు కింద కూర్చుని చదవాలని కలలు కన్నది.
ఇప్పటికి ప్రస్తుతమైన విషయం గుర్తుకు వచ్చే ఒకటి రెండు సన్నివేశాలో, మాటలో, కనుక అలా ముందుకు వెళ్తే Pride and Prejudice నవలలో ఈ మాటలు. “In essentials, I believe, he is very much whatever he was.” ఇప్పుడు నా ముందు పుస్తకం ఉంది కనుక మొత్తం సంభాషణ రాయగలుగుతున్నాను:
Elizabeth: “But I think Mr. Darcy improves on acquaintance.”
“Indeed!” cried Wickham with a look which did not escape her. “And pray may I ask?” but checking himself, he added in a grayer tone, “Is it in address that he improves? Has he deigned to add ought of civility to his ordinary style?” for I dare not hope,” he continued in a lower and more serious tone, “that he is improved in essentials.”
“Oh, no!” said Elizabeth. “In essentials, I blieve, he is very much what he ever was.”
ఈ Mr.Darcy అతని aristocratic brought up వల్ల పైకి అలా కనిపిస్తాడు, మారవలసినది పై విషయాలే కానీ అంతర్గతంగా అతను ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు అని ఆమె ఉద్దేశం. జీవితంలో మనం మారుతాం, నేర్చుకుంటాం, కానీ ఎదగడమంటే మన intrinsic మంచి గుణాలని మార్చుకోవడం కాదని చెప్తూ ఉంటాయి నాకు ఈ మాటలు. అలాగే ఈ డార్సీ పాత్ర, తను మంచి, ఒప్పు ఏమిటో నేర్చుకున్నాను కానీ ఏది తప్పో, చెడో, నేర్చుకోలేదని చెప్తాడు. అది కూడా నన్ను ఆలోచింప చేస్తుంది. ఇంకో సందర్భంలో Elizabeth పాత్రకు, వాళ్ళ అక్క, allow for other person’s temparament అని చెప్తుంది. అందరి దృష్టికోణం ఒకటేలా ఉండదు,అని. భద్రత కోసం పెళ్ళి చేసుకునే అమ్మాయి గురించి ఆ సంభాషణ జరుగుతుంది. అందరూ ప్రేమ కోసమే చేసుకోనక్కర్లేదు, కొందరికి భద్రత ముఖ్యం అవ్వడంలో తప్పు లేదని చెప్పడం అన్న మాట. ఇది నన్ను చాలా ప్రభావితం చేసింది. ఐతే చాలా సార్లు అలా ఎదుటి వారినుంచీ ఆశించి, దెబ్బ తిని మళ్ళీ ఆ మాటలే ఇంకో కోణంలో చెప్పుకుని సమాధాన పడి నేర్చుకుంటున్నాను. మనం ఒకరికి benefit of doubt ఇస్తున్నామంటే వారూ మనకి ఆ బెనిఫిట్ ఇవ్వాలని లేదు. ఇస్తే అందరికీ బావుంటుంది. కానీ మనం ఆశిస్తే మాత్రం దెబ్బ గట్టిగా తగులుతుంది.
ఈ నవలను అర్థం చేసుకోవడానికి సాయం చేసింది మాత్రం మా టీచరు. “Improves on acquaintance” అన్నది సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అన్వయించుకోవచ్చు అనిపిస్తుంది.
ఈ నవలలో ఇంకో సన్నివేశం. తప్పు చేసిన Wickham తలెత్తుకుని తిరుగుతుంటే అతని చేష్టల వల్ల దెబ్బ తిన్న Darcy మాత్రం అతనినుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు. నాకు అది అర్థం అయ్యేది కాదు. కొన్ని జీవితానుభవాలు అది అర్థం అయ్యేలా చెశాయి. అదే అనుభవం The Pursuit of Happyness లో Chris Gardner కి కూడా అనుభవం అవుతుంది. అతని తల్లిని మాటలు అన్న అతని ఎదురుగా కూర్చుని తన ఇంట్లో తన ఆధ్వర్యంలో జరుగుతున్న విందు భోజనం ఆస్వాదించలేకపోతాడు. ఈ నవలలో నన్ను వెంటాడే quote ఒకటి ఇతనినీ వెంటాడుతుంటుంది. “Beware of what you wish for. It will come true.” అనే Chinese సామెత. మనం కావాలనుకున్నది మనకి దొరుకుతుంది. అప్పుడు కానీ మనకి తెలియదు మనకి నిజంగా కావల్సిందేమిటో. ఈ పుస్తకంలో ఎన్నో విషయాలున్నాయి. కానీ నాకు గుర్తుండిపోయేది మాత్రం చాలీ చాలని జీవితం గడుపుతున్న రోజుల్లో కూడా వారాంతంలో పిల్లాడు ఆడుకుంటుంటే చూసి స్వచ్ఛమైన ఆనందంతో ఆ తండ్రి తన మనసు నింపుకోవడం.
confession:
ఇవన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి. తెలుగులో విన్నవి ఎక్కువ. భాగ్యనగరం కావడం వల్ల తెలుగుకన్నా కూడా హిందీ విన్నది ఎక్కువేమో కూడా. ఇతర పుస్తకాలకన్నా పాఠ్యాంశాల వల్లే తెలుగుకన్నా కాస్త ఆంగ్లం ఎక్కువగా అబ్బిందనీ, ఆంగ్ల సాహిత్య పరిచయం తెలుగుకన్నా కాస్త ఎక్కువ అనీ నా సంజాయిషీ, నామోషీ కూడా.
లలిత (తెలుగు4కిడ్స్)
@విజయవర్ధన్: పోస్టు నచ్చినందుకు సంతోషం.
@మాలతి: మాలతి గారూ, మరో మంత్రం ఇచ్చారు కదా, “we breed what we read!” 🙂 ధన్యవాదాలు.@రవికిరణ్ తిమ్మిరెడ్డి: రవికిరణ్ గారూ, Thanks. ప్రయత్నించి చూస్తాను. దొరికితే ఆ విషయం తెలియచేస్తాను.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
లలిత గారు,
“A wrong man in workers’ paradise” అనే కథ ఠాగూరు గారి అనేక కథలతో పాటు కె.వి.ఆర్ గారు అనువాదం చేసి “కార్మిక స్వర్గంలో కళా ప్రియుడు” అనే పేరుతో ప్రచురించారు చాలా కాలం క్రితం. కొన్ని కథలయితే మరీ ఒక పేజీకన్నా తక్కువే. అంత తక్కువ నిడివిలో అంత గొప్ప కథ వ్రాయడం సాధ్యవా అనిపిస్తుంది. ఒక గొప్ప పుస్తకం. నా దగ్గర రెండు కాపీలు ఉండేవి. ఎవరో పుస్తకాలని సేకరించ దలచుకున్న వాళ్ళు (ఇతరుల దగ్గరనించి) నా దగ్గరనించి అవి సేకరించుకున్నారు. చిన్న పుస్తకం, మహా అంటే ఒక అరవై, డెబ్బై పేజీలుంటుందేవో అంతే. ప్రయత్నించి చూడండి, మీకు దొరికితే నాకూ చెప్పండి, ఎక్కడ దొరికిందో.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
మాలతి
లలితా, మంచి విషయం ప్రస్తావనకి తెచ్చారు. నాక్కూడా అలా గుర్తుండిపోయిన వాక్యాలు ఎన్నో.. మీరన్నట్టు ఎప్పుడు ఎక్కడ చదివేనో గుర్తు లేకపోయినా… ఒక పుస్తకం కానీ ఒక కథ కానీ సాధించే ప్రయోజనం అదేనేమో… అవి మళ్ళీ మనరచనల్లో కూడా కనిపిస్తాయి… we breed what we read!
విజయవర్ధన్
చాలా బాగుంది. Thank you for the post.